8 September 2015

దివ్య ఖురాన్ ఆయతులలో లో వివరించిన పది మేలైన పర్యావరణ జీవన సత్యాలు





ముస్లింలకు దివ్య ఖురాన్ ఇస్లామిక్ విశ్వాసం లో అంతిమ ఆకుపచ్చ మార్గదర్శక గ్రంధం.అది అల్లాహ్ అన్ని రూపొందించినవాడు అన్న  నమ్మకం నుండి పర్యావరణం,మానవత్వం,దేవుని పట్ల నమ్మకం/విశ్వాసం ఉంచుతుంది. దివ్య ఖురాన్ఇస్లాం (తౌహీద్) లో నమ్మకం ఉంచటం తో పాటు ప్రకృతి అందు దయ చూపమంటుంది.దివ్య ఖురాన్ పైన ఉన్న స్వర్గం లాగా భూమి పై ప్రకృతి మరియు వన్యప్రాణులను క్రింద  స్వర్గం వలే  భావిస్తుంది.
ఇస్లాం లో నీతి  మరియు సమతుల్యత మరియు శాఖాహారం శాంతి (సలాం)   కి చిహ్నం .
ఇక్కడ పర్యావరణ ఇస్లాం ను తెలిపే దివ్య ఖురాన్ నుండి 10ముఖ్యమైన ఆయతులు  ఉన్నాయి
1. అవినీతి/అరాచకం నకు   పాల్పడరాదు.
“భూమిపై కల్లోలం సృష్టించకు; అల్లకల్లోలం సృష్టించేవారిని అల్లాహ్ ప్రేమించడు. ” దివ్య ఖురాన్ -28:77.
“ధరణి పై కల్లోలం రేకిస్తూ తిరగకండి” దివ్య ఖురాన్- 2:60.
“వారి కొన్ని చేష్టల(పలితం) ను వారికి చవి చూపటానికి, బహుశా  వారు తమను సమస్కరించుకొంటారేమో అని” దివ్య ఖురాన్- 30:41.
పై ఆయతుల ద్వార అల్లాహ్ భూమి పై అరాచకంను/అవినీతిని ని ప్రోత్సహించవద్దని అల్లాహ్ మానవులను అదేశిoచినాడు.
2. మానవులాగా ప్రవర్తించండి?
“మేము ఈ అమానతును ఆకాశాల ముందు, భూమి ముందు, పర్వతాల ముందు పెట్టాము. అవి దాన్ని మోయటానికి సిద్ద పడలేదు. దానికి భయపడ్డాయి. కానీ మానవుడు దాన్ని తనపై మోపుకొన్నాడు. నిస్సoహాదేహంగా, అతడు అన్యాయం చేసుకొన్నాడు,మూర్ఖుడు.-దివ్య ఖురాన్ -33:72  
“ ఆయనే మిమ్మల్లి భూమండలానికి ఖలిఫాలుగా చేసాడు, మీలో కొందరికి ఉన్నత స్థానాలను ప్రసాదించాడు, మీకు ఇచ్చిన దాని  తోనే మిమ్మల్లి పరిక్షిoచాలనినిస్సoహాదేహంగా,మీ ప్రభువు శిక్షించడoలో కుడా వడి గలవాడు, ఎక్కువగా మన్నిoచేవాడు, కరుణించేవాడు కూడా”. దివ్య ఖురాన్- 6:165.
పై ఆయతుల ద్వారా మనకు అల్లాహ్ మానవుని కి ఇచ్చిన గౌరవ ఉన్నత స్థానము, అతని పట్ల ప్రదర్శించిన ప్రేమ,దయ, కరుణ వేల్లడవుతున్నయి. మానవుడు అందుకు తగినట్లు గా ఇహాలోకం అందు ప్రవర్తిoచవలయును.
3. పేదరికo తొలగింపు.
పేదరికాన్ని తొలగించుటకు అనేక పద్దతులు అమలు లో ఉన్నవి. అందులో ఒకటి జకాత్. ఇస్లాం జకాత్ ప్రతి ముస్లిం విధి అంటుంది. తద్వారా ప్రపంచంలోని పేదరికాన్ని తొలగించవచ్చును. ప్రవక్త(స) ప్రకారం ఒక అనాధ కు సహాయం చేసే వారు  స్వర్గం లో అతని తో పాటు ఉంటారు.  ఇస్లాం ప్రకారం జకాత్ పై హక్కు అవసరం ఉన్నవారికి, ఇరుగు  పోరుగువారికి, సమీప బందువులకు ఉంది.జకాత్ ఆర్ధిక వికేద్రికరణకు తోడ్పడుతుంది.
దివ్య ఖురాన్   అల్లాహ్ మానవులను “మీరు అనాధనలను గౌరవంగా చూడరు, నిరుపేదలకు అన్నం పెట్టె విషయం లో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోరు, వారసత్వపు ఆస్తి మొతాన్ని పోగు చేసి తినేస్తారు” దివ్య ఖురాన్ -89:17 కాబట్టి అలా చేయవద్దని హెచ్చరించుతాడు.
4. నీటి ని పరిరక్షించడం:
దివ్య ఖురాన్ లో నీరు ప్రాణ రక్షణ చేస్తుందిఅని వివరించ బడింది. దివ్య ఖురాన్  దేవుని నీటి ద్వారా జీవిని ఎలా  సృష్టిoచాడో ప్రవాహాలు, నదులు మరియు సముద్రాలు ద్వారా ఇతర జంతు జాలం ను ఎలా సృష్టించాడో తెల్పుతుంది. .
"అల్లాహ్ ఆకాశం నుండి నీళ్ళను కురిపించాడు. నిర్జీవం గా పడిఉన్న భూమిలో ఒక్క సారిగా దాని ద్వార ప్రాణం పోసాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్సనం ఉంది.”-(దివ్య ఖురాన్-16:65)
ప్రవక్త ముహమ్మద్(స)ఒక రోజు ప్రజలు బంగారు నదుల నీటి  కోసం   యుద్ధo చేస్తారని చెప్పినాడు.
" ఆకాశం నుండి మేము శుభవంతమైన నీటిని అవతరింప జేశాము. తరువాత దాని ద్వార తోతలను, పంట దాన్యాలను, ఎంతో పొడుగైన ఖర్జురపు వృక్షాలను పుట్టిoచాము.” -(దివ్య ఖురాన్-50:9)
నీటి మరొక సహజ సృష్టి అని, అది దేవుని చెందినదిఅని ముస్లింల  నమ్మకం మరియు ఎవరూ దానిమీద  గుత్తాధిపత్యం చేయరాదు. భాగస్వామ్యo కోసం తగినంత నీరు ఉన్నది.
5. స్వర్గ లోకపు ఉద్యానవనాలు.
దివ్య ఖురాన్ లో ఉద్యానవన శాస్త్ర సమాచారం 90% కంటే ఎక్కువ ఉంది. ఇంజీల్  మరియు తోరా వంటి పురాతన గ్రంధాల వలే, దివ్య ఖుర్ఆన్ లో  మొక్కలు, మూలికల యొక్క ఔషధ లక్షణాలు వివరంగా పేర్కొన్నారు. దేవుడు తన సృజనాత్మక సృష్టి మరియు ఆరోగ్యకరమైన ఆహరం తినడానికి అందుబాటులో ఉన్నసహజ ఉత్పత్తుల గురించి వివరించినాడు:

"ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని  కురిపించారు. దాని ద్వారా సకల వృక్ష జాతులను ఉద్భవింప చేసాడు. ఇంకా పచ్చని పొలాలను పచ్చని  చెట్లను సృష్టించాడు. ఒకదావిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను  పండిoచాడు. ఖర్జురపు  పువ్వులనుంచి బరువు తో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూను,దానిమ్మ, తోటలను సృష్టించాడు. వాటి పండ్లు కాయటం, అవిపండటం – ఈ స్థితి ని మీరు కొoచం ఆలోచనా దృష్టి తో గమనించండి. విశ్వసించే వారికి వీటిలో సూచనలు ఉన్నాయి.”(దివ్యఖురాన్-6:99)

దివ్య ఖురాన్ లో చెప్పిన మొక్కలలో  వెల్లుల్లి, ద్రాక్ష, దానిమ్మ, మూలికలు, ఖర్జూరాలు , అల్లం, ఆలివ్, కాయధాన్యాలు, ఉల్లిపాయ, దోసకాయ, అత్తి, ఆవాలు, దేవదారుచెట్లు మరియు అకాసియా పుష్పం(theacacia flower) సహా వివిధ వృక్ష జాలం ఉన్నాయి.
మానవు ల ఉపయోగార్థం వివిధ ఫల,పుష్ప, ఔషద మొక్కలను, ఆహార పదార్ధలను అల్లాహ్ సర్వ మానవాళి కొరకు సృష్టించి నాడు. మానవుడు వాటిని జాగ్రతగా పరి రక్షించుకోవాలి.
6. భూత దయ కలిగి ఉండుట(Treating Animals With Dignity) :
"భూమి పై సంచరించే ఏ జంతువు నైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షి నైనా చూడండి. ఇవన్ని మీవంటి జివరాసులే. వాటి విదివ్రాత ఉన్న గ్రంధంలో మేము ఏ కోరత చేయలేదు. తరువాత ఇవన్ని తమ ప్రభువు వద్ద ప్రోగు చేయబడేవే."(దివ్య ఖురాన్- 6:38)
ఇస్లామిక్ చట్టం కింద అన్ని జంతువులు విష సర్పాలు మినహా, గౌరవంగా పెంచాలని ఉంది!
దివ్య ఖురాన్ లో ఒక మొత్తం అధ్యాయం తేనెటీగలకు  (దివ్య ఖురాన్ 16:68-69) అంకితం చేయబడినది. తేనే టీగ కడుపులో నుండి రంగురంగుల పానకం  తేనెగా మార్చివేసిన విధానం తెలప బడినది.
జాబిహా(Zabiha) జంతువులు:
ఇస్లామిక్ చట్టం అందు పశువులు మరియు కోళ్ళు వంటి జంతువులు తినడానికి అర్హులు. ఎందుకంటే  వారు ఆరోగ్యంగా ఉంటారు  మరియు వారు దేవునిచే తినడానికి కేటాయించ బడినారు. (చూడండిఅల్ మాయిద 5: 4).
 ఒక ఇస్లామిక్ వధ కోసం జంతువులు ఆరోగ్యకరమైన మేత,సున్నితత్వం,స్వేచ్ఛ గా మేత కోసం తిరుగుతాయి మరియుఅప్పుడు (zabiha) ఖుర్బానీ కోసం సిద్ధంకావాలి..
జాహిహా పద్ధతిలో  జంతువు యొక్క కళ్ళును మూసి మరియుదేవుని పేరు (తక్బీర్ను ) చదవడం జరుగుతుంటుంది.  మంచి ఆరోగ్య లేకుండాజంతువు జాబిహా  కావచ్చు కానీ అది తినడానికి హలాల్ కాదు.
ముస్లింలు మాంసం మాత్రమే తినమని  లేదు. ఇస్లామిక్ చట్టం లో శాకాహారo ఒక ఎంపికగా ఉంది మరియు తక్కువ మాంసం తినడం ఉత్తమ ఆహారం .

7. తగినంతగా ఆహరంను భుజి౦చుట:
అల్లాహ్ మీకు ప్రసాదించిన దానిని తినండి, త్రాగండి. కాని దరణి పై కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి.-దివ్య ఖురాన్ -2:60
ఆదంసంతానమా!తినండి,త్రాగండి,మితిమీరకండి. అల్లాహ్ మితిమీరిన వారిని ప్రేమించడు.”-దివ్య ఖురాన్ - 7:31.
వృదా ఖర్చు చేయకండి,వృధా ఖర్చు చేసేవారు సైతాను సోదరులు.దివ్య ఖురాన్ - 17:27
8. ఓజోన్ పొరను కాపాడటం:
ఇస్లాం 14 వందల ఏళ్ల పూర్వమే  వాతావరణ పరిరక్షణ(ఓజోన్ పొరను  కాపాడటం గురించి)  పేర్కొన్నది.:
"మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేసాము కాని వారేమో సృష్టి యొక్క ఈ సూచనల వైపునకు తమ దృష్టి నే మళ్ళించరు." (దివ్య ఖురాన్-21:32).

"మీ కొరకు భూమిని నివాస స్థలంగా చేసిన వాడు, పైని ఆకాశాన్ని కప్పుగా నిర్మించిన వాడు, మీ రూపాన్ని తీర్చి దిద్దిన వాడు, దానిని ఎంతో చక్కగా మలచిన   వాడు,  మీకు పరిశుబ్రమైన పదార్ధాలను ఆహారం గా ఇచ్చిన వాడు, అల్లాహ్ ఏ కదా! ఈ అల్లాహ్ ఏ మీప్రభువు"(దివ్యఖురాన్-40:64)
9. సృష్టిని అవగాహనా చేసుకోవడం :
" ఆయన భూమిలో పర్వతాలను మేకులను     పాతాడు. భూమి మిమ్మల్లి తీసుకోని దోర్లిపోకుండా ఉండాలని. అయన నదులను ప్రవహింప జేశాడు, సహజ మార్గాలను నిర్మించాడు.(దివ్య ఖురాన్, 16:15)
“ రెండు సముద్రాలూ ఒకదానితో ఒకటి కలిసిపోయేoదుకు అయన వాటిని వదిలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక తేర అడ్డంగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు (దివ్య ఖురాన్- 55:19-20)
ఆయనే మీ ముందు    మెరుపులను మేరిపిoపజేస్తున్నాడు.వాటిని చూసి మీలో భయాలు చెలరేగుతాయి, అసలు చిగురిస్తాయి.” (దివ్య ఖురాన్ -13:12)
అల్లాహ్ యే గాలులను పంపేవాడు, అవి మేఘాలను లేపుతాయి, తరువాత అయన ఆ మేఘాలను తన ఇష్టం ప్రకారం ఆకాశం లో వ్యాపింప జేస్తాడు. వాటిని ఖండికలు గా విబజిస్తడు, తరువాత మేఘం      లో నుండి వర్షపు బిందువులు కురియతాన్ని నీవు చూస్తావు. అయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించాగానే, వారు ఆనందంతో పొంగిపోతారు.” (దివ్య ఖురాన్ -30:48)
పై ఆయతులన్ని పర్యావరణ సంక్షేమo తెల్పుతున్నవి.ఈ ఆయతులను   చదవడం ద్వార ఇస్లాం మతం యొక్క మౌలిక భావనను తెలుసు కోవచ్చు. సామాజిక బాధ్యత మరియు శ్రేష్టమైన మానవులుగా జీవించడం దేవుని ఇస్లామిక్ ఆదేశాలలో  ఒకటి
10. సృష్టి కర్తను గౌరవించడం
“అల్లాహ్ అని అయినా పిలవండి. లేదా రెహమాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయిన పిలవండి. ఆయనకు గల పేర్లు అన్ని చక్కనివే.” –దివ్య ఖురాన్ -17:110.
పర్యావరణ  ముస్లిం యొక్క విధి అది పాడవకుండా దానిని కాపాడటం. నిశితముగా పరిసిలించిన ఈ పర్యావరణ 10 సూత్రములు మోసెస్ 10 ఆజ్ఞలను పోలి ఉన్నవి.
చివరగా, మీ విశ్వాసం తో  సంబంధం లేకుండా, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి: నేను నా జీవితం మరియు నా చుట్టూ ఉన్న  జీవితాలను మెరుగు పరిచానా అని ?

Top of Form
Bottom of Form
.



Top of Form

No comments:

Post a Comment