13 November 2016

భారతదేశం కు కావాలి ఒక నాణ్యతగల 3.0 విద్య

What India needs is an Education 3.0

గత ఆరు దశాబ్దాలుగా, విద్యారంగం లో భారతదేశం యొక్క ప్రాధాన్యత 100% ఎన్రోల్మెంట్  సాధించడంగా ఉంది. నాణ్యత పై ద్రుష్టి పెట్టి ఎన్రోల్ అయిన ప్రతి విద్యార్ధి అబ్యాసన  లక్ష్యాలను సాధించడంలో ముందు ఉండాలి.

ప్రపంచవ్యాప్తంగా నిరంతరం మారుతున్న  మానవ సమాజం యొక్క అవసరాలను తీర్చటానికి విద్య మరియు శిక్షణ తీరు ఉద్భవించాయి. బోధన యొక్క  తొలి నమోదు నమూనాలు – భారతదేశపు  గురుకులాల్లో లేదా గ్రీస్  అకాడమీల్లో లభించును.  నాటి సమాజం లోని ఉన్నత వర్గాలలోని చాలా పరిమితమైన  విద్యార్ధులకు మాత్రమే  విద్య లభించేది. నాడు ప్రతి విద్యార్థి యొక్క (లేదా వారి తల్లిదండ్రుల) అవసరాల కు తగినట్లు అనువైన బోధనా మరియు అనేక శాస్త్రాలను ఉదా; కు ఖగోళశాస్త్రం నుండి జంతుశాస్త్రం వరకు భోదించేవారు. ఈ విధంగా విద్య కొన్ని   శతాబ్దాలుగా కొందరికే పరిమితమైనది.

పారిశ్రామిక యుగం ప్రారంభం తో విద్య అందరకి అవసరమైనది. పారిశ్రామిక యుగ ఆవిష్కారణలను అమలు పరచడానికి విద్య ఆవశ్యకం అయినది. నిపుణుల అవసరం ఏర్పడినది. దీనితో ఆధునిక విద్య వ్యవస్థ  ఉద్భవించినది మరియు దాని పరిధి పెరిగింది.

నేటి విద్యా విధానం లో అనేక మంది కి   ఒకేసారి విద్యనందించవలసిన అవసరం ఏర్పడింది. భారతదేశం లో నేడు దాదాపు 200  మిలియన్ల కంటే ఎక్కువ మంది  విద్యార్థులకు విద్య నందించవలసిన అవసరం ఏర్పడినది.  విద్యకు  సంబంధించినంతవరకు ప్రాథమిక ప్రాధాన్యతలను ఏర్పరచుకొని మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాదించవలసిన అవసరం ఏర్పడినది.  
గత ఆరు దశాబ్దాలుగా, భారత విద్యా విధాన  ప్రాధాన్యత స్పష్టంగా 100%ఎన్రోల్మెంట్ సాదించడం మరియు డ్రాప్-అవుట్ రేట్ ను O% కు తగ్గించడం గా ఉంది. దేశ బడ్జెట్ లో అధిక శాతం డబ్బు తో (2005-2012 మధ్య రూ 99,100 వేల కోట్లు) ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, మిడ్ డే మీల్ కార్యక్రమం, మరియు సర్వ శిక్షా అభియాన్ ప్రారంభించారు.పలితంగా   జాతీయ అక్షరాస్యత రేటు 74.04% కు పెరిగింది (2011) మరియు యువజన అక్షరాస్యత (15-24 మధ్య వయస్సు గల వారి కోసం ) 90.2% గా (2015) ఉంది.  కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు 94% అక్షరాస్యత సాదించినవి. 86 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాధమిక విద్య ఒక నిర్భoధ ప్రాధమిక హక్కు గా మారింది. దీనిని మనము  విద్యా యొక్క2.0   సెకండ్ జనరేషన్ స్థాయి గా  భావించవచ్చు.
ఇప్పుడు మనము  నాణ్యత గల విద్య 3.0 థర్డ్ జనరేషన్  స్థాయి ని పరిశిలించుదాము.

ప్రతి విద్యార్థి వారి అభ్యాస లక్ష్యాలను ఉద్యోగ మార్గాలను స్వయంగా తెలుసుకోవలసిన అవశ్యకత ఏర్పడింది. ప్రభుత్వo నాణ్యత గల విద్య అందించుటకు అవసరమైన టేక్నోలాజికల్ ప్రాధమిక అవకల్పనల(technological innovations) ఏర్పాటు పై ద్రుష్టి పెట్టినది.  టాబ్లెట్ దేశంలో ప్రతి పాఠశాల మరియు కళాశాల లో ఉన్న  ప్రతి విద్యార్థికి అందించడం మరియు  అన్ని విద్యా సంస్థల్లో ఉచిత వైఫై(wifi) అందించడం, మరియు ఒక స్మార్ట్ పరికరంను  ప్రతి ఉపాద్యాయుడికి  మరియు పాఠశాల నిర్వాహకుడి అందించడం జరుగుతుంది. అధిక నాణ్యత గల విద్యా అభివృద్ధి కొరకు ప్రోత్సాహకాల ఏర్పాటు మరియు ఒక ఉచిత బహిరంగ నేషనల్ నాలెడ్జ్ బేస్ సృష్టించడం జరుగు తుంది మరియు  ఉపాధ్యాయుల పాత్ర విద్యాబోధన తో పాటు సమస్య పరిష్కారం కు సాయపడాలి.

స్మార్ట్ మరియు కనెక్ట్ పరికరాల ఏర్పాటు తో మనము ప్రపంచంలో నూతన విద్యా మొదటి సార్వత్రిక వేదికను  సృష్టించవచ్చు. సాధారణ విద్య విస్తరించేందుకు బోధనకు అవసరమైన సాంకేతిక నమూనాలను  అత్యంత వినూత్న కంపెనీల ద్వారా ప్రారంభించవచ్చు. వ్యక్తిగత మరియు సంయోజిత అభ్యాసo, బహుళ ఫార్మాట్ అనుకరణలు మరియు ఆచరణ వాతావరణాలలో మెరుగైన డేటా సహాయం తో నడిచే నిరంతర పరిశీలనలు, మరియు జీవితకాల అధ్యయనానికి, శిక్షణ కు తోడ్పడే  నమూనాల మీటలు మరింత సామర్థ్యం మరియు ఉత్పాదన  శ్రామికశక్తికి  దారి తీస్తుంది.

విద్య కొంతమంది కి పరిమితం గాక సార్వత్రకంగా అందరకు విస్తరించాలి. అందరికి నాణ్యతగల విద్య అందుబాటు లోనికి రావాలి.   భారత విద్యా విధానం 3.0 జనరేషన్ స్థాయి కి చేరటం జరగాలి. ప్రపంచ స్థాయిలో భారత దేశం ఆధునిక విద్య లో ముందు ఉండాలి మరియు నూతన టెక్నోలాజికల్ ఇన్నోవేషన్స్ సహాయం తో విద్యాభోధన జరగాలి.


No comments:

Post a Comment