6 November 2016

ముస్లిమ్స్ మరియు దేశ విభజన పై అంబేద్కర్ భావాలు: అస్గర్ అలీ ఇంజినీర్ (Ambedkar, Muslims and Partition - By Asghar Ali Engineer)



సంఘ్ పరివార్ చాలా కాలం నుండి  కుల, మత సమస్యలను రేకేతిస్తునే ఉంది, గుజరాత్ మారణహోమం తర్వాత సంఘ్ పరివార్ ఇప్పుడు చరిత్ర ను వక్రీకరించి సరికొత్తగా అంబేద్కర్ ముస్లిం వ్యతిరేకి  మరియు పాకిస్తాన్ వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నది. దీనికి ఉదాహరణగా డాక్టర్ అంబేద్కర్ వ్రాసిన పుస్తకం “పార్టిషన్ అఫ్ పాకిస్తాన్” ను ఆధారంగా చూపుతున్నారు. నిజానికి Dr. అంబేద్కర్ ముస్లిం లేదా ఇస్లాం వ్యతిరేకి కాదు.  

పాకిస్తాన్ విభజన  పై అంబేద్కర్ వ్రాసిన పుస్తకం గొప్ప పాండిత్య ప్రతిభ గలది. దానిని అనేకులు అనేక రకాలుగా తమ స్వప్రయోజనాల నిమిత్తం వాడు కొనుచున్నారు. ముస్లింలు మరియు పాకిస్తాన్ పై అంబేద్కర్ భావాలను అర్థం చేసుకొనుటకు ముందు ఆ పుస్తకం ను నిష్పక్షపాతం గా మరియు సంపూర్ణం గా చదవాలి.

అంబేద్కర్ తన “పార్టిషన్ అఫ్ పాకిస్తాన్”పుస్తకం ను ఐదు భాగాలుగా విభజిoచినాడు. మొదటి భాగంలో "పాకిస్తాన్ కొరకు  ముస్లింవాదన”  ఉంది. రెండవ భాగం లో  "పాకిస్తాన్ కొరకు  హిందూ వాదన” ఉంది.మూడవ భాగం లో "వాట్ ఈఫ్ నాట్ పాకిస్థాన్”లేదా “పాకిస్తాన్ లేకపోతే” గురించి చర్చ ఉంది. నాలుగో భాగం లో “పాకిస్తాన్ అండ్ ది మలైజ్” అనగా పాకిస్తాన్ మరియు ఆశాంతి లేదా అనారోగ్యంమరియు ఐదవభాగంగా, "పాకిస్తాన్ ఉండాలి",“పాకిస్తాన్ యొక్క సమస్య” మరియు “ఎవరు నిర్ణయిస్తారు”?("Must there be Pakistan", "The Problem of Pakistan" and "Who can decide?") అనే ప్రశ్నల  మీద చర్చలు ఉన్నాయి.

డాక్టర్ అంబేద్కర్ మొదటి చాప్టర్ లో పాకిస్తాన్ పట్ల పూర్తిగా అనుకూల వైఖరి ప్రదర్శించినాడు.  రెండవ చాప్టర్ లో అంబేద్కర్ ముస్లిం వ్యతిరేకి గా కనిపిస్తాడు. ఇక్కడ మనం గ్రంధాన్ని నిశితం గా చదవాలి.  సంఘ్ పరివార్ వారు ఈ రెండో చాప్టర్ లో అంబేద్కర్ అభిప్రాయాలను ప్రధానంగా ఉదాహరిస్తున్నారు.

ఇక అంబేద్కర్ మూడవ చాప్టర్ లో మిస్టర్ సావర్కర్ మరియు మిస్టర్ జిన్నా ఒక దేశ సిద్ధాంతం కు వ్యతిరేకంగా రెండు దేశాల సిద్దాంతాన్ని బలపరుస్తున్నారని అభిప్రాయపడ్డాడు. ఇరువురు అంగీకరించటమే  కాదు రెండు దేశాల(ముస్లిం ఇండియా మరియు హిందూ ఇండియా)ఏర్పాటు కొరకు కృషి చేసారు అన్నాడు. ఇరుదేశాల ఏర్పాటు నిభందనల (TERMS AND CONDITIONS) విషయం లో మాత్రమే ఇరువరికి అభిప్రాయ బేధం ఉంది అని అన్నాడు. జిన్నా  భారతదేశం ను రెండుగా అనగా పాకిస్తాన్ మరియు హిందూస్తాన్ గా ఏర్పాటుచేయాలి అన్నాడు. సావర్కర్ రెండు దేశాలుగా విభజించకుండా రెండు అనగా పాకిస్తాన్ మరియు హిందూస్తాన్ ఒకే దేశంగా ఉంటూ హిందూస్తాన్ కి ప్రాధాన్యత ఇచ్చే రాజ్యాంగాన్ని మరియు పాకిస్తాన్ కు ద్వితీయ ప్రాధాన్యత ఇచ్చి, హిందూస్తాన్ తో కలిసి హిందూస్తాన్ ఆధిక్యత  ఉండే రాజ్యాంగాన్ని కలిగి ఉండాలని అన్నాడు. అంబేద్కర్ ఎ వర్గాన్ని సమర్ధించలేదని తెలుస్తుంది.

అంబేద్కర్ అభిప్రాయం లో ముస్లిమ్స్ జరిపిన అన్ని దండయాత్రలు నాస్తికుల పై లేదా ఒక్క భారత దేశం పై జరిపిన దండయత్రలుగా భావించ రాదు అని అన్నాడు అవి వారు అనగా ముస్లిమ్స్   తమలో తాము చేసుకొన్న దండయాత్రలుగా కూడా భావించవచ్చుఅని అన్నాడు.ఆ విషయం మరుగున పడింది. ఉదా: కు భారత దేశం పై తాతర్స్, అఫ్ఘన్స్,  మంగోలులు, దండయాత్ర చేసారు. గజని ముహమ్మద్ మరియు బాబర్ తాతర్స్,  తైమూర్ మంగోల్ మరియు నాదిర్ షా, అహ్మద్ షాఅబ్దాలీ మరియు ముహమ్మద్ ఘోరి ఆఫ్ఘన్ దేశస్తులు.

డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాదనప్రకారం  "భారతదేశంను  ఆక్రమించడం లో ఆఫ్ఘన్లు  టాతర్లను నాశనం మరియు మంగోలు  టాతర్లను మరియు  ఆఫ్ఘన్లను  నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకొన్నారు.  వారు ఇస్లామిక్ సోదర భావన కు కట్టబడిన వారు కాదు. వారు ఘోరమైన ప్రత్యర్థులు మరియు వారి యుద్ధాలు తరచుగా ఉభయ నిర్మూలన యుద్ధాలుగా  ఉన్నాయి.  వీరిలో అధికులు హిందూ పాలకుల ఆహ్వానం మీద భారత దేశాన్ని దండెత్త వచ్చారు. అంబేద్కర్ మొత్తం మీద ముస్లిం పాలకుల చరిత్రను అర్ధం చేసుకోటం లో నేర్పు ప్రదర్శించారు.

బ్రిటిష్ వారు   భారతదేశంను విడిచివెళ్ళాలని  ఆపై భారతీయులు తమలో తాము మతవిద్వేషాలు  మరియు ఇతర  సమస్యలను పరిష్కరించుకొంటారన్న  గాంధీ వాదనను డాక్టర్ అంబేద్కర్ అంగీకరించలేదు.  ఈ వాదన బ్రిటిష్  సామ్రాజ్య వాదన కు బదులు హిందూ మెజారిటీ వాదం కు దారితిస్తుంది మరియు మైనారిటిలు వారి దయ పై జీవించవలసి వస్తుంది. ఒక సామ్రాజ్య వాదం స్థానం లో ఇంకొక సామ్రాజ్యవాదం తలేత్తుతుంది అని అంబేద్కర్ అన్నాడు. బ్రిటిష్ వారు భారతదేశం వదిలి వెళ్ళే ముందు అంబేద్కర్ మైనారిటీ సమస్యను సత్వరమే పరిష్కరించాలి అన్నాడు. లేనియెడల మైనారిటీలు " మెజారిటీ" దయకు గురి అవ్వాలని భావించాడు.

అంబేద్కర్ తన మొదటి చాప్టర్ “పాకిస్తాన్ కొరకు ముస్లిం వాదన”  లో ముస్లిం లేదా ముస్లిం లీగ్ యొక్క వాదనను నిశితం గా పరిశీలన చేసాడు. అందులో అతను అంటాడు “ఇది నిజం కాదా! ముస్లింలు ప్రత్యెక వర్గం కాదా? వారికీ ఒక భావన(conscinous) ఉంది నిజం కాదా? తమ వర్గం పట్ల ముస్లింలకు ప్రత్యెక అభిమానo ఉండుట నిజం కాదా? అనే ప్రశ్నలు వేస్తాడు.ఇంకా ఈ ప్రశ్నలకు సమాధానం అవును అని వస్తే ఈ వివాదం ను ఇంతటితో ముగించి వారికి ప్రత్యెక రాజ్యం ఏర్పాటు చేయాలనీ అంటాడు.  ఇక్కద అంబేద్కర్ తన వాదనను కాక ముస్లిం లీగ్ వాదనను  వివరిస్తాడు. 

అంబేద్కర్ కు ముస్లింలు మరియు పాకిస్థాన్ పై తన సొంత అభిప్రాయాలు ఉన్నవి. అతను హిందూ రాజ్ అనే బావనకు పూర్తి వ్యతిరేకి. అతను " పాకిస్థాన్ ఉండాలి"Must There Be Pakistan" " అనే దాంట్లో హిందూ రాజ్యం ఏర్పడితే అది దేశానికి గొప్ప విపత్తు అంటాడు హిందూమతం స్వేచ్ఛ, సమానత్వం కు వ్యతిరేకం అంటాడు మరియు అది  ప్రజాస్వామ్యం కు అనుకూలంగా లేదు కాబట్టి  హిందూ రాజ్ ఎలా అయిన నివారించబడాలి అంటాడు.

అంబేద్కర్ విభజనను కోరుకోలేదు. అతను అంటాడు  " ఫ్రెంచ్, ఇంగ్లీష్, మరియు ఇటాలియన్లు తమ దేశంలో మెజారిటీ కమ్యూనిటీ రాజ్యం ఏర్పడకుండా చేసారు? ఎలా? విభజన ద్వారా కాదు. వారు తమ దేశం లో మతతత్వ పార్టిలను నిషేదించారు. కెనడా, సౌత్ ఆఫ్రికా లేదా స్విట్జర్లాండ్లో వివిధ కమ్యునిటిలు తమ సొంత  కమ్యూనిటీ పార్టిలను ఏర్పరచలేదు.

అంబేద్కర్ ఈ విషయంలో చాలా యుక్తమైన పాయింట్ చెప్పాడు మరియు భారతీయ ముస్లింలు దీనిని సావధానం గా ఆలోచించాలి. అంబేద్కర్ ప్రకారం  మైనారిటీ దేశాలు మత ప్రధాన పార్టీల ఏర్పాటును వ్యరేకించాలి. వారు మత ప్రధాన పార్టీ ఏర్పరుస్తే మెజారిటీ వర్గం వారు వారి పార్టి ని ఏర్పరుస్తారు దానితో మత రాజ్యం ఏర్పడుతుంది.  ఇది స్వీయ రక్షణ విష పద్ధతి అవుతుంది.

అందువలన అంబేద్కర్ ఖచ్చితంగా పాకిస్తాన్ అనుకూలవాది లేదా  ముస్లిం వ్యతిరేకవాది కాదు అనేది  చాలా స్పష్టంగా ఉంది. నిజానికి అతను భారతదేశం లో మైనారిటీ సమస్యకు న్యాయమైన పరిష్కారాన్ని కోరుకొన్నాడు. అతను తన పుస్తకం లోని 5చాప్టర్ పేజీ నంబర్ 359 లో అంటాడు “ఇది నిజం కాదా! అనేక ప్రావిన్స్లలో మాంటేగ్ ఛెమ్స్ఫర్డ్ సంస్కరణలలో, భాగంగా ముస్లింలు, బ్రాహ్మలు కాని వారు మరియు అణగారిన తరగతులవారు  ఏకం అయి ఒక టీం సభ్యులు లాగా 1920 నుండి 1937 వరకు సంస్కరణల కోసం  పని చేయలేదా? ఇది హిందువులు మరియు ముస్లింలు మధ్య సఖ్యతను  పెంచి హిందూ రాజ్ ను నాశనం చేయలేదా?మిస్టర్ జిన్నా సులభంగానే ఈ లైన్ ను అనుసరించాలి. అది అతనికి కష్టం అయిన మార్గం కూడా కాదు?” Mr. జిన్నా ఒక యునైటెడ్ మతతత్వరహిత పార్టీని ఏర్పాటు చేయుటకు ప్రయత్నింఛి ఉంటే అతని వైపు విజయం కు అన్ని అవకాశాలు ఉన్నాయి అతనికి  నిర్వహిణ సామర్థ్యం ఉంది. అతను ఖ్యాతి కలిగిన  జాతీయవాది" అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.

 అందువలన పాకిస్తాన్ ఏర్పాటు ప్రశ్నకు అంబేద్కర్ పై నిశిత అధ్యయనం ద్వారా అతను ముస్లిం వ్యతిరేకి కాడని  స్పష్టం అవుతుంది. అతను ముస్లిం ప్రశ్నపై  చాలా సమతుల్య వైఖరిని కలిగి నిర్మాణాత్మక మార్గంను సూచించాడు. స్వాతంత్రానికి పూర్వం భారతదేశం లో మతo పాత్ర  అన్న  ప్రశ్నకు అంబేద్కర్ వైఖరిని  అర్థం చేసుకొనుటకు పుస్తకం పూర్తి టెక్స్ట్ చదివి ఉండాలి. సంఘ్ పరివార్ వారికి  అంబేద్కర్ రచనలు సరిగా అర్ధం కావు  మరియు  అధ్యయనం చేయటం లో వారికి నిజాయితీలేదు. వారు కేవలం  రాజకీయ మైలేజ్ కోసం  హిందూ ఓట్ల గుత్తాధిపత్యం సాధించాలనుకుంటున్నారు.

-స్వేచ్చా అనువాదం సల్మాన్ హైదర్

 

 

కొసమెరుపు:


Ø ముస్లింలు మొదటి నుండి దళితుల సమస్యల పట్ల సానుభూతి ప్రదర్శించారు.లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మౌలానా మొహమ్మద్ అలీ జోహార్ మీద దళితుల సమస్యల మీద మౌనం వహించమని,ఇతర ముస్లింల సమస్యల మీద అంగీకారం తెలపమని  వత్తిడి వచ్చినప్పటికీ ఆయన దళితుల పక్షాన నిలబడినారు.
Ø 1946 సెంట్రల్ ఎన్నికలలో అంబేద్కర్ గెలవనప్పుడు అతని కోసం ముస్లిం లీగ్ ఒక స్థానం ఖాళి చేసింది. అప్పుడు జరిగిన ఉపఎన్నికల లో ఆ స్థానం నుండి అంబేద్కర్ గెలుపొందారు. ముస్లిం లీగ్ చేసిన ఆ సహాయం వలన అంబేద్కర్ రాజ్యాంగ సభ కు ఎన్నికై తరువాత భారత రాజ్యాంగం ను రచించి భారత రాజ్యంగపిత గా కీర్తిoచబడినారు.

 



No comments:

Post a Comment