11 November 2016

షరియా అనగా నేమి?(What Is Shariʿah?)
చాలా మంది ప్రజలకు ముఖ్యం గా పాశ్చత్య దేశాల వారికి షరియా (Shari'ah) అనే పదం వినగానే భయం వేస్తుంది.  అంగచ్ఛేదం మరియు రాళ్ళతో కొట్టడం వంటి శిక్షలు గుర్తుకు వస్తాయి. కొందరు వ్యాఖ్యాతల ప్రకారం యూరోపియన్ మానవ హక్కుల కోర్ట్ షరియా లోని కొన్ని బావనలు అనగా బహుళత్వo మరియు ప్రజాస్వేచ్ఛ మొదలగునవి ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకం అని అభిప్రాయ పడింది.ఇంకా కొందరు షరియా స్థాపన ఇస్లామిక్ వ్యవస్థకు మొదటి మెట్టు అని భావిస్తున్నారు.
పై భావనలు షరియా పై దురభిప్రాయం కల్పిస్తున్నాయి. అసలు షరియా అనే పదమునకు రెండు అర్ధాలు కలవు. అత్యంత సాధారణ వాడుకలో షరియా (Shari'ah) ఇస్లామిక్ చట్టం ను సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాల లో వివాహం, విడాకులు, మరియు వారసత్వం వంటి  విషయాలలో  మత సూత్రాల  వ్యవహరించే షరియా (Shari'ah)కోర్టులు కలవు. సౌది అరేబియా మరియు పాకిస్తాన్ వంటి దేశాలలో,షరియా (Shari'ah) చట్టం యొక్క అధికార పరిధి నేర మరియు వాణిజ్య చట్టంకు కూడా విస్తరించింది. పై రెండు దేశాలు వారి చట్టపరమైన శిక్షాస్మృతి లోకి హుడుద్ (ḥudūd) శిక్షలు చేర్చారు. హుడుద్ (ḥudūd)శిక్షలు అనగా  వ్యభిచారం కు శిక్ష గా రాళ్ళతో కొట్టడం మరియు దొంగతనం కు చేతి యొక్క విచ్ఛేదనం చేయుట  మొదలగునవి. ఇవి ఇస్లాం యొక్క ప్రారంభ దినాలలో ప్రారంభించబడినవి మరియు తప్పనిసరి చేయబడ్డాయి. కొన్ని నేరాలకు శిక్షలు  న్యాయమూర్తి యొక్క అభీష్టానుసారం దండన మరియు పరిహారం ద్వారా విధించబడును. కొంతమంది ఇస్లామిక్ చట్టాలు స్థిరము మరియు తప్పనిసరి అని  భావిస్తారు. అదేవిధంగా యూరోపియన్ మానవ హక్కుల కోర్ట్ కూడా షరియా ను స్థిరమైనది మరియు మార్పు లేనిది అని భావించినది.
కానీ షరియా అనే పదం చాలా విస్తృత అర్ధాన్ని కలిగి ఉంది. ఇది ఇస్లాం యొక్క మూల విశ్వాసాలు,నమ్మకాలు అలవాట్లు మరియు దివ్య ఖురాన్, ప్రవక్త మహమ్మద్(స)సున్నత్ మూలాల నుండి తీసుకోబడినవి. మూల నమ్మకాలు మరియు విశ్వాసాలు స్థిరంగా ఉండగా, వాటి నుంచి సంక్రమిoచిన చట్టాలు కాలానుగుణంగా మార్పు మరియు  వైవిధ్యం ప్రదర్శించును. చాలా చట్టాలు దివ్య ఖుర్ఆన్ మరియు సున్నత్ మూలాల నుండి వ్యాఖ్యానించ బడినవి.  ఉదాహరణకు దివ్య ఖురాన్ లో  వారసత్వం యొక్క నిబందనలు వివరించబడినది. కొందరు ఆ వివరణలు దైవదత్తం మరియు మార్చలేనివి అని అభిప్రాయపడతారు. కానీ దివ్య ఖురాన్ లో  బోధనలు మానవ నైతిక మార్గదర్శకత్వం కలవి మరియు వాటికీ నిర్దిష్ట చట్టరూపం కల్పించుటకు మానవ ప్రయత్నం అవసరం.  దివ్య ఖుర్ఆన్ మరియు సున్నతుల చట్టపరమైన వివరాలను అర్ధం చేసుకోనే  మానవ ప్రయత్నం ను  ఫిక్ (అవగాహన) అంటారు.
ఫిక్ అనే పదం మానవ ప్రయత్నంతో కనిపెట్టబడిన  చట్టాలను  సూచించడానికి ఉపయోగిస్తారు. షరియా (Shari'ah) చట్టాలు దైవ మూలం అనే నమ్మకం ఉన్నవి అందువలన ఖచ్చితమైనవి  మరియు మార్పులేనివి. ఫిక్ చట్టాలు అనేవి  మానవ ఉత్పత్తులు మరియు అసంపూర్ణమైనవి మరియు పునర్విమర్శకు  లోబడి ఉండును. నిజానికి, ఇస్లామిక్ న్యాయం పద్నాలుగు శతాబ్దాల క్రిందట అభివృద్ధి చేయబడింది మరియు విభిన్న పరిస్థితులలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇస్లామిక్ చట్ట తార్కికం(thought) యొక్క ఐదు ప్రధాన పాఠశాలలు (schools) క్రింద అభివృద్ధి చెందినవి. ఇతర న్యాయ వ్యవస్థల  వలె కొన్ని చట్టాలు వాడుక రూపం లో మారాయి, కొన్ని వాడుకలో లేకుండా పోయినవి మరియు కొన్నికొత్తగా  రూపొందినవి. ఫిక్ అధికారిక "మూలాల"లో  ఒకటి మేధో కృషి (ijtihād). దీని ప్రయోజనం అవసరమైన పరిస్థితుల్లో చట్టాలు పున:భాష్యం చెప్పడానికి అనుమతించడo.
ఇస్లామిక్ చట్టం నిస్సందేహంగా సమకాలీన పాశ్చాత్య నిబంధన అంశాలను  కలిగి ఉండదు. నేడు  అనేక చట్టాలు ముఖ్యంగా   ప్రజాస్వామ్యం, బహుతావాదం మహిళలు మరియు అల్పసంఖ్యాకుల హక్కులు, మరియు సంప్రదాయ హుడుద్ (ḥudūd) శిక్షల స్థితి మొదలగునవి   చర్చనీయ అంశాలు అయినవి.
అనేక సమకాలీన ఇస్లామిక్ ఆలోచనాపరులు అందరు పౌరులకు పూర్తి సమానత్వం తో కూడిన బహుళత్వ భావనను  ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు ఈజిప్ట్ యొక్క ఫమ్హి హువయిడ్ (Fahmi' Huwaydi'), నాన్ ముస్లిం మైనారిటిలకు కూడా న్యాయం ప్రసాదించే ఇస్లామిక్ చట్టం ఆధారంగా సమాన హక్కుల కొరకు వాదిస్తున్నారు.  అతని ప్రకారం  నేటి ప్రపంచంలో న్యాయం సాధించడానికి ప్రజాస్వామ్యం అవసరం.
ప్రజాస్వామ్యం (డెమోక్రసీ) పాశ్చాత్య దేశాలలో  విజయవంతం అయినది మరియు సంప్రదింపుల (కన్సల్టేషన్ -షూరా) ద్వారా పరిపాలించాలి అనే దివ్య ఖురాన్ యొక్క ఆదేశం అమలు చేయడానికి అది అత్యంత ప్రభావవంతమైన మార్గం. షూరా చరిత్రలో అనేక విధాలుగా అమలు చేయబడినది కాని అది  నేడు పాలకుని ఎన్నుకొనే హక్కు ప్రజల అందరికి  ఉందని తెల్పుతుంది. ఈజిప్టు న్యాయ విద్వాంసుడు సలీం అల్-అవా మహిళలు మరియు ముస్లిమేతరులతో సహా అందరు ప్రజలకు సమాన హక్కులు ఉన్నాయని  ప్రజాస్వామ్యం కు అనుకూలంగా వాదించాడు.
 ప్రవాస టునీషియా ఆలోచనాపరుడు రాషిద్ ఘన్నుషి (Rachid Ghannouchi) దివ్య ఖురాన్ సూత్రాల మీద ఆధారపడిన ప్రాతినిద్య పాలన, కమ్యూనిటీ యొక్క అధికారం తో కూడిన షూరా తో ఏర్పడిన లౌకిక ప్రజాస్వామ్యం ను సమర్దిoచుతాడు. అతని ఉద్దేశం లో  ముస్లింలు "స్వాతంత్ర్యం, అభివృద్ధి, సామాజిక ఏకీభావం, పౌర స్వేచ్ఛ, మానవ హక్కులు, రాజకీయ బహుళత్వ, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛ, మసీదుస్వేచ్చ మరియు ఇస్లామిక్ కార్యక్రమాలు వంటి ఇస్లామిక్ లక్ష్యాలను” సాధించడానికి ఎవరి సహాయం అయిన తీసుకోవాలి.
ప్రముఖ యూరోపియన్ ముస్లిం పండితుడు తారిక్ రంజాన్ ఇస్లామిక్ నియమాలను అనుసరించే  ఏ ప్రభుత్వం అయిన  అందరు స్త్రీ-పురుషుల తో సహా కమ్యునిటీ సంప్రదింపులు జరపాలి అంటాడు దీనికి గాను ఎన్నికైన సభ్యులతో కూడిన  ఒక సంప్రదింపుల మండలి ఉండాలని అంటాడు. ప్రతినిధులను వంశపారంపర్యo గా కాక నిపుణత ఆధారం గా ఎన్నుకోవాలని అంటాడు. నిపుణత  లేదా ఇజ్తిహాడ్ (ijtihād) ప్రస్తుత ప్రపంచం లో ఇస్లామిక్ విలువలను సాధించడానికి తోడ్పడుతుంది.
ఇస్లాం మతరాజ్యం(theocracy) ను వ్యతిరేకిoచును. ఇస్లామిక్ ప్రభుత్వం లో సంప్రదింపులు మాత్రమే కాక మనస్సాక్షి స్వేచ్ఛ అవసరం. మతం విషయం లో నిర్భందం లేదు అన్నవిషయం ను  దివ్య ఖురాన్ స్పష్ట పరుస్తుంది:(2:256).ప్రవక్త (స) రూపొందించిన మదీనా రాజ్యాంగం ప్రకారం ప్రజలకు తమ నాయకులను  ఎంచుకోనే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, జీవించే  హక్కు మరియు చట్టం ప్రకారం  సమాన రక్షణహక్కు మొదలగునవి అన్ని కలవు.(స్త్రీ -పురుష మరియ ముస్లిమ్స్ మరియు నాన్-ముస్లింల తో సహా అందరికి ) ఇస్లామిక్ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలు "బహుళత్వo అమలు చేయడానికి ఒక వాకిలి  లాగా ఉండాలి."
రంజాన్ పండితుడు  హుడుద్ శిక్షల అమలు మీద నిషేధాలను సిఫార్సు చేసినాడు. ప్రత్యేకించి స్వధర్మమును విడవటం. దీనిని ఇతర విద్వాంసులు కూడా అంగీకరిస్తున్నారు ఉదాహరణకు, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి, డాక్టర్ ఎస్ ఎ రెహమాన్, స్వధర్మo విడవటం పై మరణ శిక్ష  విధించడం దివ్య ఖురాన్ లో చెప్పిన   మనస్సాక్షి స్వేచ్ఛ ను ఉల్లంఘించడం అని  వాదించాడు. ఈజిప్ట్ యొక్క గ్రాండ్ ముఫ్తీ  స్వధర్మ విరమణ కు మరణశిక్ష విధించడమును  తిరస్కరిoచాడు. అతని అభిప్రాయం ప్రకారం శిక్ష మరణాoతర జీవితం లో ఉంటుంది.
హుడుద్  శిక్షా  నియమాలను సరిగా అర్ధం చేసుకొని వ్యాఖ్యనిoచామా లేదా అనేది ఒక ప్రశ్న? టునీషియా చరిత్రకారుడు మొహమ్మద్ తలబి ప్రకారం స్వధర్మo విడుచుట అనే విషయం పై మరణశిక్ష విధించడం లో గందరగోళపడి (confusion) దానిని దేశ ద్రోహం గా అపోహ పడినారు.
ప్రముఖ అమెరికన్ ముస్లిం పండితుడు ప్రొఫెసర్ ఆలీ A. మజ్రు పద్నాలుగు శతాబ్దాల క్రిందట రూపొందిన శిక్ష నియమాల విషయం లో పునరాలోచన చేయాలి అన్నాడు. ఆ నియమాలు అప్పటి కాలంలో నేరం చేయడం అంటే బయపెట్టివి గా ఉన్నాయి మరి ఈ రోజులలో మెరుగైన విచారణ పద్దతులు, అపరాధం యొక్క పరిమితులు, మరియు శిక్షలను మరింత విస్తృత శ్రేణిలో విధించే అవకాశం ఉంది కాబట్టి హుడుద్ శిక్షల విషయం లో పునర్విచారం చేయాలి అని అన్నాడు."

ఎ చట్టాలు ఇజితిహాద్ (ijtihād) కు  లోబడి ఉండాలి అనే విషయం లో విబిన్న వాదనలు ఉన్నాయి. సంప్రదాయవాద పండితులు కొన్ని చట్టాలను షరియా లాగా సంరక్షించాలి మరియు వాటి విషయం లోఇజితిహాద్ (ijtihād) ఉండకూడదు అన్నారు. సంస్కరణవాదులు షరియా కు  మరియు ఫిక్ కు  మధ్య వ్యత్యాసం ఉందన్నారు. ఈ చర్చ చరిత్ర అంతటా ఇస్లామిక్ సంభాషణ(thought) యొక్క ఒక లక్షణం గా ఉంది.ప్రఖ్యాత న్యాయశాస్త్ర నిపుణుడు ఇబ్న్ తయ్మియః(Taymi'yah (d. 1328) షరియాను అల్లాహ్ యొక్క ఆదర్శ న్యాయపరమైన సంకేతాలు గా గ్రహించడం లో విఫలమై సాధారణ న్యాయసూత్రాలుగా భావించిన న్యాయమూర్తుల పట్ల జాగ్రత వహించాలి అన్నాడు. మఖసిద్ లక్ష్యం మానవహాక్కులు అనగా జీవించే హక్కు, మతం, కుటుంబం, ఆస్తి, మరియు హేతువు గా  నిర్వచిస్తారు. మానవ హక్కులు సంరక్షించ బడక పోతే  ఆ చట్టాల గురించి  మరో ఆలోచన చేయాలి.


ముస్లింలు  శాశ్వతత్వం,  సార్వత్రికమైన షరియా ను అంగీకరిస్తారు కాని దాని అర్ధం అన్ని ఇస్లామిక్ చట్టాలు మార్చబడవు మరియు అందరు వాటిచే పాలించబడుతారు అన్న నమ్మకం   నిజం కాదు. షరియా  విలువలు మరియు లక్ష్యాలు జీవితం యొక్క అన్ని అంశాలను కవర్ చేయడానికి ఉద్దేశించినవి అని  అర్థం.కొందరు పండితులు షరియా యొక్క లక్ష్యాలను పూర్తి చేసే ప్రకృతి లోని చట్టాలన్నీ వాటి పేరు ఏదైనా ఇస్లామిక్ చట్టాలే అని అంటున్నారు. ప్రపంచాన్ని మార్గనిర్దేశం చేయటానికి షరియా అవతరించినదని ముస్లిమ్స్ నమ్ముతారు.  ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి రాజకీయ స్థితి  కాదు.

No comments:

Post a Comment