4 September 2017

ముహమ్మద్ ప్రవక్త (స) – స్త్రీ హక్కుల సమర్ధకుడు



ముహమ్మద్ ప్రవక్త (స) తన సమకాలిన అరబ్ సమాజం లో ప్రబలిన   సాంఘిక దురాచారాల నిర్మూలనకు పాటుపడెను మరియు నాటి అరబ్ సమాజం లో సాంఘిక భద్రత, కుటుంబ నిర్మాణం, బానిసత్వ నిర్మూలనకు  మరియు స్త్రీల మరియు  ఇతర మైనారిటీల ప్రజల హక్కులు పరిరక్షణకు కృషి చేసెను.
ప్రముఖ ఆంగ్ల ఇస్లామిక్ పండితుడు బెర్నార్డ్ లెవిస్ ప్రకారం, ఇస్లాం " నాటి కులీనుల ప్రత్యక హక్కులను, అధికార క్రమాన్ని తిరస్కరించి ప్రతిభకు పట్టం కట్టినది”. మరొక పండితుడు జాన్ ఎస్పొసిటో  అభిప్రాయం ప్రకారం ముహమ్మద్ ప్రవక్త (స) నాటి సాంఘిక దురాచారాలు అయిన స్త్రీ  శిశుహత్య, పేదల దోపిడీ, వడ్డీ, హత్య, తప్పుడు ఒప్పందాలు మరియు దొంగతనం వంటి వాటిని ఖండించారు. బెర్నార్డ్ లెవిస్ “ఇస్లాం యొక్క సమతావాద స్వభావం "గ్రీకో-రోమన్ మరియు పురాతన పెర్షియన్ ప్రపంచం అలవాట్లు, సంప్రదాయాల  కన్నా  గణనీయమైన పురోభివృద్ధిని కనబరిచింది" అని నమ్మాడు. ముహమ్మద్ ప్రవక్త (స) దైవ వాణి లో(దివ్య ఖురాన్) అరబిక్ మరియు మొజాయిక్ చట్టాలు మరియు ఆచారాల ప్రస్తావన కలదు.  
మదీనా రాజ్యాంగం, మదీనా యొక్క చార్టర్ అని కూడా పిలువబడుతుంది, ఇది 622 లో ముహమ్మద్ ప్రవక్త(స) చే రచింపబడింది. ఇది ముహమ్మద్ ప్రవక్త (స) మరియు యాత్రిబ్ (తరువాత మదీనా గా పిలువ బడింది)లోని అన్ని తెగలు మరియు ప్రముఖ కుటుంబాలు (ముస్లింలు, యూదులు, మరియు పాగన్స్-ప్రకృతి ఆరాధకులు) కు మద్య జరిగింది. మదీనాలోని ఆక్స్ (ఆస్) మరియు ఖజ్రాజ్ల (Aws (Aus) and Khazraj)  వంశానికి మధ్య జరిగిన వివాదాస్పద పోరాటాన్ని ముగింపుకి తీసుకురావటానికి ఈ పత్రం రూపొందించబడింది. మదీనాలోని ముస్లిం, యూదు మరియు పాగన్  వర్గాలను ఉమ్మః (Ummah) అనే  ఒక సమాజం నీడలోకి తీసుకు వచ్చింది. హక్కులు మరియు బాధ్యతలను ఏర్పాటు చేసింది.
ఖైదీలు ఒక వ్యక్తి యొక్క కస్టడీలో ఉంటే, వారి  బాధ్యత ఆ  వ్యక్తిపై ఉంది. బానిసత్వం విషయం లో ఇస్లాం రెండు ప్రధాన మార్పులను తీసుకువచ్చిందని ఇస్లాం పండితుడు లూయిస్ పండితుడు పేర్కొన్నారు. "వీటిలో ఒకటి స్వేచ్ఛను ప్రతిపాదించింది, మరొకటి, ఖచ్చితంగా నిర్వచించిన పరిస్థితుల్లో తప్ప స్వేచ్ఛాయుత వ్యక్తులను  బానిసలను చేయడం పై  నిషేధం" అని లెవీస్ అంటాడు. ఇంకా అతని అభిప్రాయం లో అరేబియా లో బానిస యొక్క స్థానం "ఎంతో మెరుగుపడింది": అరేబియా బానిస "ఇప్పుడు కేవలం స్థిరాస్తి కాదు, ఒక నిర్దిష్ట మతాన్ని అవలబించే  మానవుడు. అతనికి కొన్ని కనీస చట్టపరమైన హక్కులతో ఒక సాంఘిక హోదా ఉంది."

మహిళల హక్కులలో సంస్కరణలు వివాహం, విడాకులు మరియు వారసత్వంపై ప్రభావం చూపాయని మరొక ఇస్లామిక్ ఆంగ్ల పoడితుడు ఎస్పొసిటో పేర్కొన్నాడు. కొన్ని శతాబ్దాల తర్వాత గాని  పశ్చిమ దేశాలు మరియు ఇతర సంస్కృతులలో మహిళలకు ఇటువంటి చట్టపరమైన హోదా ఇవ్వబడ లేదు. అరబ్ మహిళల హోదాలో సాధారణ అభివృద్ధి జరిగి మహిళల శిశుహత్యను నిషేధించడం మరియు మహిళల పూర్తి వ్యక్తిత్వాన్ని గుర్తిoచడం జరిగిందని  ఇస్లాం ఆక్స్ఫర్డ్ నిఘంటువు పేర్కొంది. "వరకట్నం, వదువు తండ్రికి చెల్లించిన వధువు-ధరగా గతంలో పరిగణించబడింది, ఇప్పుడు అది ఆమె వ్యక్తిగత ఆస్తిలో భాగంగా, భార్య పొందిన  వివాహ బహుమతిగా మారింది." ఇస్లామిక్ చట్టం ప్రకారం వివాహం "ఒప్పందం" గా పరిగణించబడి అందుకు  మహిళ యొక్క సమ్మతి అత్యవసరం అయినది.

ప్రముఖ ఆంగ్ల ఇస్లామిక్ పండితురాలు అన్నామారి షిమ్మెల్ (Annemarie Schimmel)మాటలలో “పితృస్వామ్య సమాజంలో మహిళలు మొదటి సారి వారసత్వ హక్కులను పొందారు, ఇంతకుముందు మగ బంధులకు మాత్రమె వారసత్వ హక్కులు  పరిమితం చేయబడినవి.   పూర్వ-ఇస్లామీయ స్థితి తో పోలిస్తే, మహిళల విషయం లో ఇస్లామిక్ చట్టాలు అపారమైన పురోగతిని సూచిస్తాయి, చట్ట ప్రకారం ఆమె కుటుంబంలోకి తెచ్చిన సంపదను నిర్వహించడం పై  మహిళ హక్కును కలిగి ఉంది.

విలియం మోంట్గోమెరి వాట్, అభిప్రాయం లో ముహమ్మద్ ప్రవక్త(స) తన కాలంలో మహిళల హక్కుల చాంపియన్ గా నిలచిన వ్యక్తి. వాట్ ప్రకారం : ఇస్లాం పూర్వపు రోజులలో మహిళల పరిస్థితులు భయంకరమైనవి – వారికి  ఆస్తి హక్కు లేదు, పురుషుని(కుటుంభ యజమాని) యొక్క ఆస్తిగా భావించబడ్డారు మరియు ఆ కుటుంభ యజమాని  చనిపోయినట్లయితే, ఆస్తి తో పాటు వారు అతని కుమారుల సొంతం గా పరిగణిoచ బడేవారు.

ముహమ్మద్ ప్రవక్త (స) ఆస్తి యాజమాన్యం, వారసత్వం, విద్య మరియు విడాకుల హక్కులను ఇవ్వడం ద్వారా మహిళలకు కొన్ని ప్రాథమిక రక్షణలు కల్పించినాడు. ప్రముఖ పండితులు  హద్దాద్ మరియు ఎస్పొసిటో (Haddad and Esposito)  ప్రకారం, "కుటుంబ జీవితం, వివాహం, విద్యలో ముహమ్మద్ ప్రవక్త (స) మహిళలకు  హక్కులు మరియు అధికారాలను మంజూరు చేసినాడు మరియు ఆర్థిక బద్రత, సమాజంలో మహిళల హోదాను మెరుగుపర్చడానికి సహాయపడే హక్కులు కల్పించినాడు".


 ప్రముఖ సోషియాలజిస్ట్ రాబర్ట్ బెల్లా ప్రకారం ఇస్లాం 7 వ శతాబ్దానికి చెందినది కాని స్త్రీ హక్కుల విషయం లో ఆధునికమైన పోకడలను ప్రదర్శించినది. ఇస్లాం మానవ సమానత్వంను నొక్కిచెప్పింది, నాయకత్వ స్థానాలు అందరికి తెరిచినది. డెల్ ఐకెల్మాన్ ప్రకారం తొలి ఇస్లామిక్ సమాజం, సామూహిక బాధ్యతకు వ్యతిరేకంగా వ్యక్తులపై ప్రత్యేక విలువను ఉంచుతుంది

No comments:

Post a Comment