.
పెరుగుదల మరియు
అభివృద్ధికి నిర్వహణ(మ్యానేజ్మెంట్) కీలకం. అది భౌతికoగా లేదా ఆధ్యాత్మికంగా కావచ్చు. సాధారణ పరిభాషలో, నిర్వహణ(మ్యానేజ్మెంట్)
అనగా కార్యసాధన కోసం కార్మిక శక్తిని గరిష్టంగా మరియు
సమర్థవంతంగా ఉపయోగించే సామర్ధ్యం అని చెప్పవచ్చు. దీనిని సమర్థవంతం గా
పరిపూర్ణంగా పనిని పూర్తి చేసే కళ అని కూడా చెప్పవచ్చు.
నిర్వహణ లో మూడు
“ఆర్” లు ఉన్నాయి, అవి గౌరవం, సంబంధం
మరియు బాధ్యత (respect, relationship and responsibility) మరియు ఇవి
అన్నిoటికీ వర్తించును. వేగంగా మారుతున్న వర్తమాన
ప్రపంచంలో, ఉత్పత్తి మరియు లాభం ఒక సంస్థ యొక్క ఏకైక విజయ మంత్రం అయినవి.
కార్పరేట్ ప్రపంచంలో భౌతికమైన అభిప్రాయాలకు విలువ ఇచ్చే వారు మానవ మరియు సామాజిక బాధ్యతల విలువలను తగ్గించారు.
ఒక సంస్థలో
నిర్వహణ యొక్క పాత్ర మానవ శరీరంలో మెదడు పాత్ర తో పోల్చవచ్చు.నిజమైన అర్థంలో మేనేజ్మెంట్
సూత్రాలను ఉపయోగించి సమాజం, కార్మిక శక్తీ మరియు పరిశ్రమల రూపురేఖలను ఏవిధంగా మార్చగలమో వివరించ వచ్చు.
ప్రవక్త
ముహమ్మద్ (స) జీవితం, హదీసులు మరియు పవిత్ర
ఖుర్ఆన్ గ్రంధం నుండి వివిధ రకాల నిర్వహణ
నైపుణ్యాలను మనం పొందవచ్చు ప్రవక్త ముహమ్మద్ (స) అనుసరించిన మ్యానేజ్మెంట్ నైపుణ్యాలను
తెలుసుకోవచ్చు. అన్ని రంగాలలోనూ మరియు
ప్రతి గోళంలోని ప్రజల జీవితాలను మార్చివేసేలా ఆయన తన మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని
ఎలా ఉపయోగించారో తెలుసుకోవచ్చు.స్వల్ప కాలం లో ప్రవక్త(స) ఎలా సమాజాన్ని విప్లవాత్మకంగా సమస్కరించారో
తెలుసుకోవచ్చు. ప్రవక్త(స) తన యొక్క నిర్వహణ పద్ధతులను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా మానవ సమాజ పూర్తి
పరివర్తనను సాదించారు.
నిర్వాహకులు
మరియు కార్యనిర్వాహకులు (managers
and executives) నిర్వహణ యొక్క సమర్థవంతమైన మార్గాలను కనుగొనటానికి ప్రవక్త
ముహమ్మద్ (స) జీవితం ఒక ఉదాహరణ, సూచన మరియు మార్గదర్శకత్వం. వ్యాపార గృహాలు, కార్యాలయాలు
మరియు పారిశ్రామిక విభాగాలు మరియు సామాజిక మరియు మత సంస్థలు మరింత ప్రణాళికబద్దం
గా మరియు వ్యవస్థీకృత పద్ధతిలో తమ కార్యనిర్వహణ సాదించడం కోసం ప్రవక్త(స) జీవితం ఒక
వనరు విషయం(source). సంక్షేమ రాజ్యం బాగా అభివృద్ధి చెందిన నిర్వహణ వ్యవస్థ
లేకుండా ఆర్థిక వృద్ధి మరియు సామాజిక న్యాయం అనే రెండు జంట లక్ష్యాలను సాదించలేదు.
ఇస్లాం ఒక జీవిత
మార్గంగా మరియు దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) బోధనలు మనకు జీవితం
యొక్క వివిధ కోణాల్లో మార్గదర్శకత్వం ఇస్తాయి. వివిధ కోణాల్లో నిర్వహణ యొక్క వివిధ
అంశాలు తెల్పుతాయి.ప్రవక్త(స) యొక్క జీవితాన్ని ఆధారంగా నిర్వహణ యొక్క అంశాలు
అందంగా వివరించవచ్చు, పనులను నిర్వహించడం, నిర్వహణా, దర్శకత్వం, నియంత్రణ, శిక్షణ, భావోద్వేగ
మేధస్సు, ఆధ్యాత్మిక ప్రజ్ఞ, మానవ
వనరుల అభివృద్ధి, సమూహ డైనమిక్స్, వ్యాపార నీతి, ప్రేరణ, వ్యక్తిత్వ
అభివృద్ధి, వ్యూహాత్మక నిర్వహణ, సామాజిక
బాధ్యత, కమ్యూనికేషన్, పరిహారం, వ్యక్తుల
ప్రవర్తన, ఒత్తిడి నిర్వహణ మొదలగు మరిన్ని అంశాలు తెలుసుకోవచ్చు.
వనరులను
సమర్థవంతంగా ఉపయోగించడం కోసం సమర్థవంతమైన
నిర్వహణ అవసరం. దీనికి మదీనాలో ప్రవక్త ముహమ్మద్ (స) నిర్మించిన మస్జిద్ ఉత్తమ
ఉదాహరణ. ఈ మసీదు సలాత్ (నమాజ్) నిర్వహించడానికి మాత్రమే కాకుండా ఇస్లామిక్
విశ్వవిద్యాలయం, హాస్పిటల్, ప్రతినిధుల కోసం
అతిథి గృహంగా, నిరాశ్రయుల కోసం ఒక షెల్టర్, సుప్రీం
కోర్ట్ మరియు పార్లమెంటుగా, స్వచ్ఛంద మరియు పని సంస్కృతిని ప్రోత్సహించడానికి
కేంద్రంగా ఉపయోగించబడింది. ప్రవక్త(స) ఒక గొర్రెల కాపరి (షెపర్డ్) గా పని చేశారు
మరియు మదీనాకు వలస వచ్చిన తరువాత నగరాన్ని స్థాపించడానికి నిర్వహణ కళను
నేర్చుకున్నారు.
ప్రవక్త (స)
వలసదారులు మరియు మదీనా ప్రజల మధ్య సహోదరత్వాన్ని స్థాపించారు, ఆజాన్ ప్రవేశపెట్టి, నగరంలో ఒక
మార్కెట్ను స్థాపించారు, అనేక యుద్ధాలు మరియు వివిధ కార్యకలాపాలను నిర్వహించాడు
మరియు ఒక ఇస్లామిక్ ఆదర్శ రాజ్యం గా మదీనా ను తిర్చిదిద్దారు. పోరాట సమయంలో
అసాధారణ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించారు మరియు మదీనా లో పటిష్టమైన విద్యా
వ్యవస్థ కూడా బాగా నిర్వహించబడింది.
"మీ క్రింద
ఉన్నవారి పట్ల మీ మంచి ప్రవర్తన అదృష్టాన్ని తెస్తుంది, చెడు ప్రవర్తన
దురదృష్టకరం తెస్తుంది." (అబూ దావూద్).
నేటి ప్రపంచంలో, లాభాలపై
కార్పొరేట్ మరియు వ్యాపార సంస్థలు ద్రుష్టి పెట్టినవి. నిర్వహణ లో వ్యక్తిత్వ అభివృద్ధి, వైఖరి
మరియు నిర్వహణ నైపుణ్యాలు ముఖ్య పాత్ర వహిస్థాయి. కాని ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తిత్వ అభివృద్ధి అనే పదం
పూర్తిగా తప్పుగా ఉంది. వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన వ్యక్తిత్వ
అభివృద్ధికి సూచిక గా పరిగణించబడుతుంది, కానీ ఇస్లాం వ్యక్తిత్వ అభివృద్ధిలో బాహ్య కంటే అంతర్గత అభివృద్ధి కి
ప్రాధాన్యత ఇస్తుంది. నిర్వహణ లో మానవ
వనరులు మరియు శిక్షణ మరొక ముఖ్య భాగం మరియు ప్రవక్త(స) తన శిక్షణ ద్వారా అబూ బకర్,
ఉమర్, ఉస్మాన్ మరియు అలీ
వంటి అసాధారణ నాయకులను సృష్టించారు. ప్రవక్త ముహమ్మద్ (స) బోధించిన ఈ రకమైన
శిక్షణకు మనం ఎలా మరువగలము!
సాంఘిక బాధ్యత అనే భావన స్వార్ధపరత్వం,దురాశ, మీతిమీరిన సంపద
మరియు ఆర్ధిక లాభాల వలన కనుమరుగు అవుతుంది. ఇస్లాం సామాజిక బాధ్యతకు మరింత
ప్రాముఖ్యతను ఇస్తుంది మరియు సమాజాలను మార్చడానికి మరియు ప్రజలకు సామాజిక బాధ్యత
కల్పించడానికి అల్లాహ్ ప్రవక్తలను పంపారు. ప్రవక్త ముహమ్మద్(స) అత్యంత సామాజిక
బాధ్యత కలిగి ఉన్నారు మరియు ఒక ముస్లిం సామాజిక బాధ్యత లేకుండా నిజమైన ముస్లింగా
మారలేడని చెప్పబడింది.
ఖలీఫా ఉమర్ జీవితం మరియు
ఇతర సహచరుల జీవితం నుండి నిర్వహణ యొక్క పాఠాలను నేర్చుకోవచ్చు. పరిశోధకులు, విద్యావేత్తలు, మరియు కార్పొరేట్
మరియు వ్యాపార సంస్థలు మరియు ప్రజలు వారి మంచి
భవిష్యత్ కొరకు మరియు దేశ/సమాజ, పురోగతి మరియు అభివృద్ధి కొరకు ప్రవక్త (స) ను ఆదర్శం
తీసుకోని అయన చూపిన నిర్వహణ పద్దతులను ఉపయోగించి దేశ మరియు సమాజ కళ్యాణం మరియు
ఆదర్శ సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడవచ్చు.
No comments:
Post a Comment