7 September 2017

నార్త్ ఇండియన్ ముస్లింలు మరియు సౌత్ ఇండియన్ ముస్లింలు - విద్య మరియు వ్యాపార రంగం లో తులనాత్మక అధ్యయనం (North Indian Muslims Vs South Indian Muslims – A comparison of achievements in education and busine

Top of Form
Bottom of Form




ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశం ల  మధ్య బాష పరంగా, అభివ్రుద్ది పరం గా, సంస్కృతి  పరం గా భారీ వ్యత్యాసం ఉంది. అభివృద్ధి సూచికల ఆధారంగా ఉత్తర-దక్షణ భారత దేశాల మద్య అభివృద్ధి నమూనాను అధ్యయనం చేస్తే, ఉత్తర భారతదేశం తీవ్ర పేదరికం మరియు అభివృద్ధి క్షీణత తో  సబ్ సహారన్ ఆఫ్రికాతో పోలి ఉంటుంది.  దక్షిణ భారతదేశం సాపేక్షంగా పాక్షిక అభివృద్ధి చెందిన దేశాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు మాజీ సోవియట్ యూనియన్లో భాగం అయిన మరియు ప్రస్తతం యూరోపియన్ యూనియన్లో చేరేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తూర్పు ఐరోపా లోని కొన్ని రాజ్యాలను పొలి ఉంటాయి. అవి  తలసరి ఆదాయం పరంగా కాక పోయినా, ఖచ్చితంగా అభివృద్ధి సూచికలలో ఉన్నవి. దక్షిణాది రాష్ట్రాలు  ఇప్పటికీ ఆ శ్రేయస్సు స్థాయిని సాధించ లేక పోయినప్పటికీ, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సాపేక్షంగా మంచి ప్రాంతాల స్థాయిని సాధించడానికి  ముందుకు సాగుతున్నవి.

ఉత్తర మరియు దక్షిణ భారతదేశం మధ్య విభజన యొక్క అంతరo  విస్తృతo గా  తెలుసు కోవాలంటే, రెండు పెద్ద ఉత్తర మరియు దక్షిణ భారత రాష్ట్రాల ఆదాయం సరిపోల్చండి. ఉత్తరప్రదేశ్ దేశంలో కెల్లా అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం. దాని తలసరి ఆదాయం  48,520 లేదా సుమారు US $ 760 కలిగి ఉంది. కర్ణాటక వార్షిక తలసరి ఆదాయం రూ. 1,48,485 లేదా సుమారు US $ 2,300 గా ఉంది. భారతదేశంలో ఇంకో సరికొత్త రాష్ట్రమైన తెలంగాణ, కర్నాటక కంటే ఎంతో సంపన్నమైనది. దాని  తలసరి ఆదాయం రూ. 1,58,360 లేదా సుమారు US $ 2,500గా ఉంది.

QZ రిపోర్ట్ ప్రకారం ఇండియా లోని పది రాష్ట్రాలు (దక్షిణాది లోని నాలుగు రాష్ట్రాలతో సహా) పెద్ద హిందీ రాష్ట్రాల కన్నా హెల్త్ కేర్, అక్షరాస్యత, పిల్లల మనుగడ (infant survival) రేట్ విషయం లో మంచి ప్రగతిని సాదించినవి. భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.6 గా ఉంది అనగా అది   ప్రతి స్త్రీకి పుట్టిన పిల్లల సంఖ్య.  కానీ దక్షిణ రాష్ట్రాలలో రేటు రెండు కంటే తక్కువగా ఉంది. అది 2.1 స్థాయికి దిగువన ఉంది, అనగా జనాభా పెరగదు, తగ్గదు. కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) రాష్ట్రాల సంతానోత్పత్తి రేటు బ్రిటన్, స్వీడన్, నెదర్లాండ్స్, నార్వే దేశాలకు సమానంగా అనగా 1.7 నుంచి 1.9 వరకు ఉంది.

రెండు ప్రాంతాలలోని (ఉత్తర, దక్షిణ)  రాష్ట్రాలు భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా  ఉత్తర భారతదేశంలో మరియు దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల మధ్య వ్యత్యాసం కూడా పెద్దదిగా ఉంది. ఉత్తర భారతదేశంలో ముస్లింలు చాలా పేదలుగా ఉంటారు,తక్కువ  జీవనాధారంలో జీవిస్తున్నారు, తక్కువ ఆదాయం, ప్రబలమైన నిరక్షరాస్యత లేదా కేవలం కొద్దిపాటి అక్షరాస్యులు మాత్రమె, దక్షిణ భారతదేశంలో ముస్లింలు సాపేక్షంగా బాగానే ఉంటారు మరియు వారి హిందూ పొరుగువారి వలె విద్యావంతులై ఉంటారు.

విద్యాపరంగా ఉత్తర భారతీయ ముస్లింలు మరియు  సౌత్ ఇండియన్ ముస్లింలు (North Indian Muslims Vs South Indian Muslims Education)

ముస్లింలు వారి జనాభాకు అనుగుణంగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి.లు) మరియు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) కన్నా తక్కువ అభివృద్దిలో  ఉన్నారు. భారతదేశ జనాభాలో 14% మంది ముస్లింలు ఉన్నారు, అయితే 2014-15 సంవత్సరానికి ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే ప్రకారం, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్న విద్యార్థుల్లో ముస్లిమ్స్ 4.4% మంది ఉన్నారు.

ముస్లిం కమ్యూనిటి  యొక్క సాంఘిక, ఆర్థిక మరియు విద్యా పరిస్థితులను  పరిశీలించడానికి నియమించిన 2006 సచార్ కమిటీ ప్రకారం, గత 50 ఏళ్లలో  ముస్లిoల  పరిస్థితి మరింత దిగజారిపోయింది. యువ ఎస్సీ / ఎస్టీలలో (20 నుండి 30 ఏళ్ళ వయస్సు ఉన్నవారు) , పెద్ద వయస్సు ఎస్సీ / ఎస్టీలలో (51 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) గ్రాడ్యుయేట్ల నిష్పత్తి మూడుసార్లు ఉంది.  అయితే  ముస్లింలలో యువ గ్రాడ్యుయేట్ లు(20 నుండి 30 ఏళ్ళ వయస్సు ఉన్నవారు)  వృద్ద గ్రాడ్యుయేట్ల(51 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కన్నా రెండు రెట్లు మాత్రమే ఉన్నారు.  ఇతరులతో పోలిస్తే, ముస్లిం మగవారికి, మహిళల మధ్య విస్తృతస్థాయి వ్యత్యాసాలను కనుగొనవచ్చు అంతేయేగాదు ముస్లింలు ఎస్.సిలు / ఎస్టీలు, కన్నా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు.


ఉత్తర భారతదేశం ముస్లింలతో  పోలిస్తే, దక్షిణ రాష్ట్రాలలోని  ముస్లింలు అక్షరాస్యత విషయం లో ముందు ఉన్నారు. కర్నాటకలో ముస్లింల  అక్షరాస్యత రేటు 76.89% అది రాష్ట్ర సగటు మరియు జాతీయ సగటు 64.64% కంటే ఎక్కువగా ఉంది, ఇది ఆ ప్రాంతంలోని హిందువుల అక్షరాస్యత శాతం తో సమానం. ఉత్తర భారతదేశంలోని ఎక్కువ ముస్లింలు నగరాల్లో నివసిస్తుండగా, కర్ణాటకలో కూడా పట్టణ ప్రాంతాల్లో వారి సాంద్రత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ముస్లింలు చాలా తక్కువగా ఉన్నారు, ఇది సమీపంలో పాఠశాలలు ఉండటానికి  మరియు అధిక సంఖ్యలో అవగాహన  కు దారితీస్తుంది.

అక్షరాస్యత రేట్ అధికంగా ఉన్నప్పటికీ ఉన్నత విద్య విషయానికి వస్తే, ముస్లిమ్స్ లో డ్రాప్ అవుట్ రేటు ఎక్కువగా ఉంటుంది (18-20 ఏళ్ళ వయస్సులో 21-29 సంవత్సరాల వయస్సులో ఇది 61.2 శాతం మరియు 84 శాతం కంటే ఎక్కువగా ఉంది) మరియు ఉన్నత విద్య నమోదు శాతం  చాలా తక్కువగా ఉంటుంది. ముస్లిం విద్యార్థుల నమోదు పాఠశాల స్థాయిలో 11.5 p.c., కానీ అది ఇంటర్మీడియట్ స్థాయిలో సుమారు 5 p.c. గా ఉంది. అదేవిధంగా, బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ విషయం లో అతి తక్కువ (2014-15 లో ) అందులో అత్యధికం గా 10.85 p.c గా ఉంది.

విద్య విషయానికి వస్తే కేరళ స్కోర్లు చాలా ఎక్కువ. ముస్లింలు ప్రాథమిక స్థాయి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి మరియు పెద్ద సంఖ్యలో అనేక వృత్తిపరమైన  విద్యాసంస్థలను నడుపుతున్నారు.అవి ముస్లింలతో పాటు హిందువులు మరియు క్రైస్తవులకు విద్యను అందిస్తున్నవి.

విద్యా సంస్థలను నిర్వహిoచడం లో నార్త్ ఇండియన్ ముస్లింలు మరియు దక్షిణ భారత ముస్లింలు
(North Indian Muslims Vs South Indian Muslims run Educational Institutions)

కేవలం విద్యా విషయం లోనే కాదు, ముస్లింలు దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు, ఉత్తర భారతదేశంలోని ముస్లింలు ఈ విషయంలో శైశవదశలో ఉన్నారు.

తమిళనాడులోని ముస్లింలు రాష్ట్రంలో కేవలం ఆరు శాతం మంది ఉన్నారు. కానీ వారి స్థాపించిన విద్యాసంస్థలు  చాలా  ప్రగతిని సాధించారు. జనాభా లో  వారి సంఖ్య చిన్నదిగా  ఉన్నప్పటికీ, విద్యా రంగంలో వారి సేవలు అసమానంగా ఉన్నవి. స్వాతంత్ర్యం తరువాత, తమిళ ముస్లిం వ్యవస్థాపకులు పాఠశాలలు మరియు కళాశాలలను నిర్మించటం ప్రారంభించారు. తిరిచ్చి లోని జమాల్ ముహమ్మద్ కాలేజి, మధురైలోని వక్ఫ్ బోర్డ్ కాలేజీ, ఖాదీర్ మొహిద్దీన్ కాలేజ్, ఆదిరాంపట్టిణం, చెన్నై లోని న్యూ కాలేజీ, మరియు ఉతామపలయం లోని హాజీ కర్తా రౌథర్ హౌడియ కళాశాల వంటివి ప్రసిద్ధమైన తమిళ ముస్లిం కళాశాలలు.

1980 దశకం మధ్యలో, తమిళనాడులో  ముస్లిం సెల్ఫ్-ఫైనాన్షియల్ విద్యాసంస్థల స్థాపన ప్రారంభమైంది. క్రిసేంట్  ఇంజనీరింగ్ కళాశాల,  BS అబ్దుర్ రెహ్మాన్ యూనివర్శిటీగా అప్-గ్రేడ్  చేయబడింది. అక్షరాస్యతలో తమిళనాడు  సాధారణ అక్షరాస్యత స్థాయితో  పోలిస్తే తమిళ ముస్లింలు పాఠశాల విద్య విషయం  లో ముందు ఉన్నారు.  కానీ ఉన్నత  మరియు సాంకేతిక విద్యలో వెనుకబడి ఉన్నారు. ఇందుకు  వారికి పెర్షియన్ గల్ఫ్ మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలో వ్యవస్థాపక అవకాశాలు  మరియు ఉద్యోగాలు లబించుటయే.  ఇప్పుడు చిత్రం నెమ్మదిగా మారుతుంది. తమిళనాడులో 65 తమిళ ముస్లిం విద్యాసంస్థలు ఉన్నాయి.

కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ముస్లింలు ఇదే  పరిస్థితి లో ఉన్నారు.  కేవలం చెన్నైలోని ముస్లిం  ఉన్నత విద్య మరియు వృత్తిపరమైన విద్యా సంస్థల సంఖ్య ఉత్తరప్రదేశ్ ని మొత్తం ముస్లిం కళాశాలల సంఖ్యతో  సమానంగా ఉంటుంది, యూ.పి. లో సుమారు 4 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. హైదరాబాద్, పూణే, ముంబై, మలప్పురం, కొచ్చిన్, బెంగుళూరు  లో  కూడా ఇదే పరిస్థితి ఉంది. మంగుళూరు, గుల్బర్గా, బిదార్, ఔరంగాబాద్, కాలికట్ వంటి చిన్న నగరాలలో కూడా ముస్లింలు  ప్రాధమిక విద్య, సెకండరీ విద్యా, గ్రాడ్యుయేట్ స్థాయి ఉన్నత   విద్యాలయములు, ఆర్కిటెక్చర్ కాలేజీలు, మెడికల్, పారామెడికల్, లా అండ్ కాలేజీలతో సహా  ప్రొఫెషనల్ విద్యా సంస్థలు అనేకం  నడుపుతున్నారు.


ఈ రంగం లో ఉత్తర భారతదేశంలోని  ముస్లింలు ఇంకా  శైశవ దశలోనే  ఉన్నారు.  ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, అస్సాంలో ముస్లింలు సెకండరీ మరియు సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మాధ్యమం పాఠశాలలు, మరియు కొన్ని ప్రొఫెషనల్ కళాశాలలు స్థాపించడo ప్రారంభించారు. కానీ ఇది  ప్రారంభం మాత్రమే మరియు మరిన్నిఇలాంటి సంస్థలు  చాలా అవసరం.

ఆర్థిక పరిస్థితి రంగం లో దక్షిణ భారత ముస్లింలు మరియు  ఉత్తర భారతీయ ముస్లింలు (Economic condition of North Indian Muslims Vs South Indian Muslims)

 నార్త్ ఇండియాలోని  ఒక ముస్లిం లోకాలిటి  మరియు దక్షిణ భారతదేశంలోని  ఒక ముస్లిం లోకాలిటి లో పర్యటించండి మీరు తేడాను అర్థం చేసుకుంటారు. ఆర్థిక రీత్యా దక్షిణ భారతదేశంలో ముస్లింలు,  ఉత్తర భారతదేశంలోని ముస్లింల కంటే మెరుగ్గా ఉన్నారు.

అందుకు ఉదాహరణ గా  కొచ్చిలోని  లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ను  సందర్శించండి మరియు కేరళలోని  ముస్లింల ఆర్ధిక శక్తీ మీకు తెలుస్తుంది. భారతదేశంలోని నోయిడాలోని డిఎల్ఎఫ్ మాల్ తర్వాత, కేరళలో ఉన్న లూలూ మాల్ భారతదేశంలోని  రెండవ అతిపెద్ద షాపింగ్ మాల్. ఇది కేరళలో ఎక్కువగా సందర్శకులు సందర్శించే ప్రదేశాలలో ఒకటి.  17 ఎకరాలలో  (6.9 హెక్టార్లు)  2.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నిర్మించిబడినది.  ఈ మాల్ మొత్తం రిటైల్ స్థలం 1.7 మిలియన్ చదరపు అడుగులు. ఈ మాల్ మార్చి 2013 న ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 16 బిలియన్లు లేదా US $ 250 మిలియన్ డాలర్స్.

బెంగుళూరులోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇర్ఫాన్ రజాక్ లేదా ఫెరోజ్ ఎస్టేట్ యాజమాన్యంలోని ప్రెస్టీజ్ గ్రూప్ లేకుండా ఊహించలేము. 63 ఏళ్ల ఇర్ఫాన్ రజాక్ ఫోర్బ్స్ ప్రకారం $ 1.2 బిలియన్ల సంపద కలిగి బెంగళూరులోని టాప్ ఎంటర్ప్రైజర్స్ లో  ఒకడు. అతి తక్కువ ప్రొఫైల్ కలిగిన  వ్యాపార మాగ్నెట్ మరియు అతను ప్రెస్టీజ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్. భారతదేశం లో ప్రముఖ ఆస్తి డెవలపర్ల లో  ఒకరు మరియు ఛైర్మన్ మరియు బెంగుళురు ఇన్వెంటర్ అకాడమీ యొక్క సహ వ్యవస్థాపకుడు.


బెంగుళూరులోని  అజిమ్ హషీం ప్రేమ్జీ, ముంబైలోని సిప్లా కంపనీ  హమీద్ షేక్ మరియు అనేక ఇతర బిలియనీర్ వ్యాపారవేత్తలు దక్షిణ భారత దేశం లో  ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఈ రకమైన వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించిన వారు అధికం గా లేరు. ఉన్న కొద్ది మంది మాత్రమే తమ వ్యాపారాన్ని కొన్ని ప్రత్యేక రంగాల్లో అభివృద్ధి చేసారు. కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి.

No comments:

Post a Comment