28 September 2017

ఆధునిక విద్యాలయాలు మదరసాలు


పురాతన ఇస్లామిక్ సెమినరీలలో ఒకటైన మదర్సాతుల్ ఇస్లా యొక్క పూర్వ విద్యార్ధి అబు ఒసామా ఒక మదరాసా  నుండి పట్టభద్రుడైన తర్వాత  తాను ఆధునిక ప్రపంచంతో  పోటీ పడలేడని నమ్మాడు, కాని వెంటనే తన భావన తప్పు అని  తెలుసుకున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్  మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగంలో సహాయక ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒసామా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అతని మాటలలో "నేను మదరసా  నుండి సిలబి,  కర్రిక్యులం,ఇస్లామిక్ విలువలు మరియు నైతికత  తో పాటు చాలా నేర్చుకున్నాను” అలాగే మరొక మదరసా విద్యార్ధి అయిన సయ్యద్ ముంతాజ్ ఆలం 1994 లో మదరసా  నుండి పట్టభద్రుడయ్యాడు మరియు ఢిల్లీకి చెందిన ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్ ఇండియా టుమారో.నెట్  యొక్క సంపాదకుడిగా పనిచేశారు

ఇటివల కాలం లో మదరసాలు    అనేక తప్పుడు కథనాలతో, వాస్తవ  విరుద్ద అంశాలతో   వార్తల లోనికి  వచ్చాయి. జాతీయ/ ప్రాంతీయ మీడియా మదరసాలపై వ్యతిరేక(negative)/ వాస్తవ  విరుద్ద  కథనాలను ప్రసారం చేసింది మరియు వాటిని "టెర్రర్ నర్సరీ"గా పిలవసాగింది.  కాని వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. దేశం లోని అనేక మదరసాలు మారే కాలం  తో పాటు  ఆధునిక, ప్రగతిశీలక సిలబిని  ప్రవేశ పెడుతున్నాయి. మదరసా విద్యార్ధులు కంప్యూటర్లు మరియు ఇతర సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తున్నారు.

ఈ మదరసాలు  సైన్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, పెర్షియన్ లాంగ్వేజెస్, కంప్యూటర్ సైన్స్, ఖురాన్, థియాలజీ, అరబిక్ భాషలతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. మదరసాలు నేడు సాంప్రదాయక ఇస్లామిక్ మరియు ఆధునిక విద్యను భోదిస్తున్నాయి.వాటిలో కొన్ని పాలిటెక్నిక్ మరియు మినీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ) కూడా ప్రారంభించాయి. దేశం లోని కొన్ని  మదరసాలు వివిధ ఎలక్ట్రానిక్ బ్రాంచ్లకు సంబంధించిన కోర్సులు, మొబైల్ ఆపరేటింగ్, కంప్యూటర్ మరియు ట్రాన్స్లేషన్ కోర్సులు కూడా అందిస్తున్నావి. ఇస్లామిక్ మదర్సాలలో అనేక  ఆధునిక విషయాలను భోదిస్తున్నారు

వాట్సప్ (WhatsApp) మదరసా విద్యార్థుల కోసం, ఒక ప్రముఖ కమ్యూనికేషన్ మార్గం గా మారింది మరియు వారిలో  చాలా మంది పేస్ బుక్ (Facebook) లో  ఖాతాలు మరియు ఇమెయిల్ ID లు కలిగి  ఉన్నారు. మదరసా విద్యార్ధులు మంచి మరియు అధునాతన పద్ధతి లో ఇస్లాం మరియు సమాజానికి ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకొని నేటి మదరసాలు పనిచేస్తున్నాయి.

ఆధునిక విషయాలను నేర్చుకోవడమే గాక  ఇస్లాం ను బాగా అర్థం చేసుకోవడానికి మరియు ప్రచారం చేయడానికి మదరసా విద్య  ఉపయోగపడుతుంది అని  కొందరి నమ్మకం. మదరసా విద్యార్ధులకు ఆధునిక విషయాల జ్ఞానం  అవసరం ప్రస్తుతం ఉంది. ఇస్లామిక్ చట్టబద్ధమైన వారసత్వం మరియు వ్యాపార వ్యవహారాలకు సంబంధించి సమస్యలను అర్థం చేసుకోవటానికి గణితశాస్త్రం అవసరం ఉంది  మరియు విజ్ఞాన శాస్త్రం అనేక ఖురాన్ యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అని కొందరి వాదన.

JNU లో పరిశోధనా పండితుడైన మొహమ్మద్ సౌద్ ఆజ్మి అభిప్రాయం ప్రకారం మదరసా సిలబస్ లో ఆధునిక విషయాల పరిచయం సరైన దిశలో ఒక అడుగుగా చూస్తాము. ఆధునిక విద్యాభోధన పద్దతులతో మదరసా విద్యార్ధులు  సన్నద్ధం అవుతున్నారు మరియు మదరసాలు తమ బోధన శైలిని మెరుగుపరుచుకోని  పర్యావరణ శాస్త్రం మరియు ఆధునిక అర్థశాస్త్రం వంటి అంశాలను కూడా తమ సిలబుస్ లో  జోడించాలి" అని అన్నారు.

ఈ సంస్థల పూర్వ విద్యార్ధులు అనేక మంది పెద్ద సంఖ్యలో భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలో పాల్గొనడం లేదా భారతదేశం లోని అనేక  ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలలో  పని చేస్తున్నారు. మదరసాలు నిర్వహించే ఎక్స్ట్రా-కరిక్యులర్/సాంస్కృతిక కార్యకలాపాలు యువత కెరియర్ అవకాసాలను పెంచుతున్నాయి. అనేకమంది మదరసా పూర్వ విద్యార్ధులు తెలుగు, హిందీ, ఆంగ్లం తో సహా  అనేక ప్రాంతీయ బాషల వార్త పత్రికలోఅనువాదకులుగా,ఎడిటర్లుగా,  జర్నలిస్టు లుగా స్థిరపడినారు మరియు అనేకమంది పత్రిక రంగం లో ఉపాధి పొందుతున్నారు.  

ఆధునిక కాలంలో దేశం లోని అనేక మదరసాలు  యువత ఉపాది అవకాసాలను  మరింత విస్తృతంగా పెంచుతున్నాయి, తత్ఫలితంగా, వేలాది మంది యువకులు మస్జిద్ లలో, ప్రభుత్వ విభాగాల్లో, కార్పొరేట్లు, ఎంఎన్సిలు(MNC) లలో  ఉద్యోగాలు పొందుతున్నారు.

సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లిం విద్యార్ధులలో కేవలం  4% మంది మాత్రమే మదరసాలలో విద్య పొందుతున్నారు.








No comments:

Post a Comment