అదృశ్య పురుషులు, కాలవేగంతో ప్రయాణం,
ఎగురుతున్న
యంత్రాలు మరియు అంతరిక్ష ప్రయాణాలను మనం పూర్తిగా యూరోపియన్ ఆలోచనలుగా అర్థం
చేసుకుంటాము, కానీ అవి ఇస్లామిక్ సంస్కృతిలో కూడా గొప్ప మూలాలను కలిగి
ఉన్నాయి.అదృశ్య పురుషులు, కాలం తో సమాన ప్రయాణం, ఎగిరే యంత్రాలు మరియు ఇతర గ్రహాల ప్రయాణాల వర్ణన మనం
సాధారణం గా యూరోపియన్ లేదా 'పాశ్చాత్య' కల్పన యొక్క
ఉత్పత్తిగా భావిస్తాము?
“వెయ్యి నొక రాత్రి”(1001) ఇస్లామిక్
స్వర్ణయుగం(8 వ నుండి 13 వ శతాబ్దాలు)లో సమయంలో
సంకలనం చేయబడిన జానపద కథల సముదాయం లో పై వర్ణనలు అన్ని కనిపిస్తాయి.
పాశ్చాత్య పాఠకులు/విమర్శకులు
ముస్లిం సాహిత్యం లో ఉన్న సైన్స్ ఫిక్షన్ మరియు ఉహాకల్పన సాహిత్యం ను పూర్తిగా
నిర్లక్షం చేసినారు. ముస్లిం స్వర్ణ యుగం లో వికసించిన కథా సాహిత్యం లో వాటి ఛాయలు మనకు కనిపిoచును. అరేబియా
ద్వీపకల్పం నుంచి స్పెయిన్ వరకు మరియు భారతదేశం
వరకు విస్తరించిన విశాల ఇస్లామిక్ సామ్రాజ్యం లో
విబిన్న సంస్కృతులు మరియు బిన్న వర్గాల ప్రజలను సమన్వయ పరిచి సామ్రాజ్య
సమగ్రతను కాపాడటానికి ఆనాటి సాహిత్యం ప్రయత్నించినది.
9 వ శతాబ్దంనాటి ఇస్లామిక్ మహా పండితుడు
అల్-ఫరాబి చే వ్రాయబడిన “ది వర్త్యువస్ సిటీ The
Virtuous City (అల్-మదీనా అల్-ఫదిలా)”, ముస్లిం ముస్లిం నాగరికతచే రూపొందించబడిన మొట్టమొదటి గొప్ప గ్రంథాలలో ఒకటి.
ఇది ప్లాటో “రిపబ్లిక్” యొక్క ప్రభావంతో వ్రాయబడింది. ఇందులో పరిపూర్ణమైన సమాజం ఊహించబడింది మరియు ముస్లిం తత్వవేత్తలచే అది
పరిపాలించబడుతుంది. ఇది ఇస్లామిక్
ప్రపంచంలో సుపరిపాలన మీద వ్రాయబడిన ఒక ఆదర్శ గ్రంధం.
అలాగే రాజకీయ
తత్వశాస్త్రం, డిబెట్స్ మరియు హేతువు/కారణం(reason)
గురించి చర్చలు ఆనాటి ముస్లిం సార్వస్వతం
యొక్క ముఖ్య లక్షణం. మొట్టమొదటి అరబిక్ నవల “The Self-Taught Philosopher స్వీయ-బోధించిన తత్వవేత్త (హేయ్ ఇబ్న్
యక్జాన్, సాహిత్యపరంగా అలైవ్, సన్ ఆఫ్ అవేక్)” 12 వ శతాబ్దపు స్పెయిన్ నివాసి ఇబ్న్ తుఫైల్ అనే ముస్లిం వైద్యుడు స్వరపరిచాడు. ఇంగ్లీష్
రాబిన్సన్ క్రూసో నవలను పోలి ఏమాత్రం
బాహ్య ప్రపంచం తో సంభంధం లేని ఒక
వ్యక్తి విశ్వం గురించి తెలుసుకోవడానికి ఎలా హేతుబద్ధoగా ఆలోచిస్తాడు అనే దానిపై ప్రయోగంగా దీనిని చదవవచ్చు.
ఇది ఒక ఒంటరి పిల్లవాడికి సంబంధించినది.
అతను ఒక మారుమూల
ద్వీపంలో వన్య ప్రాణులతో
పెంచబడుతాడు. అతనికి మానవ సంస్కృతి లేదా మతం తో ఎటువంటి పరిచయం ఉండదు,
అక్కడ అతను మానవ
సమాజం చే తిరస్కరించబడిన ఒక వ్యక్తి తో
కలుస్తాడు. మానవ స్వభావం, అనుభవవాదం,
జీవితం యొక్క
అర్ధం, సమాజంలో వ్యక్తి పాత్ర - ఈ పుస్తకంలోని
అనేక ఇతివృత్తాలు. జాన్ లాకే మరియు ఇమ్మాన్యువల్ కాంట్ వంటి ఆధునిక కాల తత్వవేత్తల భావాలు వారికంటే ముందే
ఇతని రచనలలో ప్రతిధ్వనించినవి.
స్త్రీవాద
వైజ్ఞానిక కల్పన యొక్క మొదటి రచనలలో ఒకటిగా బెంగాల్ రచయిత్రి రోకియా సఖవత్ హుస్సేన్ రచించిన 'సుల్తానాస్ డ్రీం' (1905) అనే చిన్న కథ పరిగణిoచబడుతుంది.ఇది లేడీలాండ్(స్త్రీ
రాజ్యం)అనబడే రాజ్యంలో జరుగుతుంది. ఇందులో స్త్రీ-పురుషులు నిర్వహించే పాత్రలు/విధులు
తలక్రిందులవుతున్నాయి మరియు పరిపాలన మహిళలచే
నిర్వహించబడుతుoది. ఇందులో మహిళలు తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ఉపయోగింఛి పురుషులపై
విజయం సాధిస్తారు. వారి ప్రపంచమంతా చాలా ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం తో
నిండి ఉంటుంది.
20 వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం ప్రపంచం నుండి ఊహాజనిత కల్పనా సాహిత్యం పాశ్చాత్య వలసవాదం యొక్క తీవ్రత కు నిరోధక
రూపంగా మారింది. ఉదాహరణకు, నైజీరియన్ హౌసా రచయిత అయిన ముహమ్మూ
బెల్లో కగర, వెస్ట్ ఆఫ్రికా ఇతివృతం తో “గండోకి Ganďoki “(1934), అనే నవలను రచించాడు;
కథలోస్థానికులు
బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటారు. వారి ప్రపంచం జిన్స్ ఇతర అదృశ్య జీవులతో (jinns and other mystical creatures )కూడి ఉంటుంది.
తరువాతి దశాబ్దాల్లోపాశ్చాత్య రాజ్యాల వలస వాదం అంతరించటం ప్రారంభమైనది.రాజకీయ
వ్యoగం తో కూడిన రచనలు చేయబడినవి. మొరాకో రచయిత ముహమ్మద్ అజీజ్ లాబాబి నవల “ది ఎలిక్సిర్
ఆఫ్ లైఫ్The Elixir of Life (Iksir
al-Hayat) (1974 (ఇక్సిర్ అల్-హయత్)” (1974), లో చిరాయువు ప్రసాదించే ఒక పానీయం
ప్రస్తావించబడుతుంది. కానీ అది శాంతి సౌఖ్యలకు బదులుగా, అది వర్గ విభేదాలు, అల్లర్లు, ప్రేరేపించి సామాజిక విచ్ఛిన్నతలను పెంచుతుంది.
ముస్లిం సంస్కృతుల
నుండి నేడు కల్పిత భయానక/బీబత్స సాహిత్యం కూడా ఉద్భవించింది. అహ్మద్ సాడావి “ఫ్రాంకెన్స్టైయిన్
ఇన్ బాగ్దాద్Frankenstein in Baghdad (2013)” అనే నవలలో 2001 ఆక్రమణ తరువాత ఆధునిక ఇరాక్ లో ఫ్రాంకెన్స్టైయిన్ తరహ కృత్యాలను ను చిత్రీకరించాడు. ఈ నవలలో జాతి మరియు మతపరమైన
హింస కారణంగా మరణించిన వివిధ వ్యక్తుల శరీర భాగాల నుండి ఒక రాక్షసుడు సృష్టించబడ్డాడు. చివరకు ఆ రాక్షసుడు సొంత వినాశనం పొందుతాడు. ఈ నవల ప్రక్రియలో యుద్ధం యొక్క అనాలోచితత్వం
మరియు అమాయక ప్రజల మరణాల వ్యధ ఉంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
కు చెందిన నౌరా అల్ నోమన్ యొక్క యువ వయోజన నవల “అజవాన్Ajwan” (2012) లో యువ, ఉభయచర గ్రహాంతరవాసి
తో ఒక ఆమె కిడ్నాప్డ్ అయిన తన కొడుకును తిరిగి పొందేందుకు చేసిన పోరాట వివరణ
ఉంటుంది. ఈ నవల తరువాత ఒక TV
సిరీయల్ గా
రూపొందించ బడింది మరియు శరణార్థులు మరియు రాజకీయలు దానిలో ప్రస్తావించబడినవి.
సౌదీ అరేబియా కు చెందిన ఇబ్రహీం
అబ్బాస్ మరియు యాస్సర్ బహజత్(Ibraheem
Abbas and Yasser Bahjatt’s) యొక్క ప్రారంభ విజ్ఞాన కల్పిత నవల హ్వజ్న్HWJN (2013)స్త్రీ-పురుష (లింగ)
సంబంధాలు, మత ద్వేషం మరియు అజ్ఞానం గురించి విశ్లేషిస్తుంది మరియు
దినిలో జిన్ల(jinn’s) ప్రస్తావన
కనిపిస్తుంది.
ఈజిప్షియన్ రచయిత అహ్మద్
టౌఫీక్ యొక్క నవల “ఉటోపియా (2008)”, లో 2023నాటి ఒక గేటెడ్ కమ్యూనిటీ
వర్ణన ఉంటుంది. దేశ ఆర్థిక మరియు సాంఘిక పతనం తరువాత ఈజిప్టు సమాజంలోని ఉన్నత వర్గ
ప్రజల పరిస్థితి దీనిలో వివరించబడినది. అరబ్ స్ప్రింగ్ తరువాత ఈజిప్ట్ నవలాకారుడు బస్మ అబ్దేల్
అజీజ్ Basma Abdel Aziz రచించిన “క్యూ (2016)” నవలలో ఒక
విజయవంతo కాని విప్లవం తరువాత సామాన్య ప్రజలు ఒక నిరంకుశ, వికృత నియంత పాలనలో పడే
ఇబ్బందులను వర్ణించినది.
ఊహాత్మక కల్పన తరచుగా
యూరోప్ రొమాంటిసిజమ్ తో కలసి పారిశ్రామిక విప్లవానికి ప్రతిస్పందనగా చదువబడుతుంది.
కాని ముస్లింలు ఈ రంగం లో విజయవంతమైన రచనలు ముస్లిం స్వర్ణ యుగ ప్రారంభం నుండే
ప్రారంబించారు.
No comments:
Post a Comment