మౌలానా అబుల్ కలాం ఆజాద్
భారత రాజకీయాలు మరియు ఉర్దూ సాహిత్యానికి చిహ్నంగా ఉన్నారు. వారిని
ఆదరం గా ప్రజలు “ఆజాద్” అని పిలుస్తారు. వారు
మక్కాలో నవంబర్ 11, 1888 న సంపన్నమైన ఇస్లామీయ
కుటుంబంలో జన్మించాడు మరియు ఢిల్లీలో ఫిబ్రవరి 22, 1958 న మరణించారు. మౌలానా ఒక కవి, తత్వవేత్త, రచయిత, విద్యావేత్త, రాజకీయవేత్త, భారతీయ
విద్యా వ్యవస్థ నిర్మాత మరియు భారతీయ సంస్కృతిపై నిపుణుడిగా భావించబడతారు. వారు అరబిక్, పెర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ బాషలలో నిష్ణాత పండితులు.
మౌలానా ఆజాద్ భారతీయ
స్వాతంత్ర్యోద్యమ గొప్ప నాయకుడు మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రముఖులు. వారు లౌకికవాదం మరియు జాతీయ సమైక్యతకు గొప్ప ప్రతిక.
ఆజాద్ భారతదేశం యొక్క విభజనను వ్యతిరేకించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన
తరువాత, వారు కేంద్ర ప్రభుత్వంలో
మొట్టమొదటి విద్యా శాఖమంత్రి అయ్యారు. ఢిల్లీలో జరిగిన 9 వ UNESCO సమావేశానికి అద్యక్షత వహించారు.
ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్
రిలేషన్స్, యూనివర్శిటీ గ్రాంట్స్
కమీషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ, సాహిత్య అకాడమీ, సంగీత్ నాటక అకాడమీ మరియు చాలా సంస్థల స్థాపకులు.
1992 లో ఆయన భారతదేశ అత్యున్నత
పౌర పురస్కారమైన భారత్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. అతని పుట్టినరోజును
"జాతీయ విద్యా దినోత్సవం" గా భారతదేశం అంతటా జరుపుకుంటారు. మౌలానా అబుల్
కలాం ఆజాద్ ఒక సృజనాత్మక మేధావి మాత్రమే కాదు, పాశ్చాత్య
విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీలో
బాగా ప్రావీణ్యం పొందారు.
విశిష్ట లక్షణాలతో ఉన్న
వ్యక్తికి అరుదైన ఉదాహరణ మౌలానా ఆజాద్.మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆచార్య కృపలానీ, అభిప్రాయo లో "మౌలానా ఆజాద్ యొక్క వ్యక్తిత్వం గొప్పది. అతనిది చారిత్రాత్మక వ్యక్తిత్వం కాదు, దానికి బదులుగా చరిత్ర యొక్క గణనీయమైన కాలం
అతని వ్యక్తిత్వంలో అంతర్గతంగా ఉంది. "
డాక్టర్ సయ్యద్ అబిద్
హుస్సేన్ మౌలానా ఆజాద్ యొక్క సాహిత్య జీవితాన్ని మూడు కాలాల్లో విభజించారు- మొదటి
కాలం 12 సంవత్సరాల నుండి
ప్రారంభమై 1916 వరకు వ్యాసాలు రాయడం వరకు
కొనసాగింది. రెండోవది 1936 వరకు కొనసాగింది. ఈ కాలంలో అతను తన ప్రసిద్ధ
జర్నల్ ఆల్-హిలాల్ ను ప్రారంభించాడు మరియు
తన స్వీయచరిత్ర టాజ్కిరా మరియు టఫ్సీర్-ఇ-ఖురాన్ (Tazkira and Tafseer-e-Quran) ను రచించారు. మూడవ కాలం 1936 నుండి ప్రారంభమైంది మరియు 1945 వరకు కొనసాగింది, ఈ కాలంలో అతను గుబర్-ఎ-ఖతిర్ ను రచించాడు. ఈ
దశలో మౌలానా ఆజాద్ యొక్క సాహిత్య జీవితం ముగిసింది.
ఒక పాత్రికేయుడు గా మౌలానా ఆజాద్ కి వకీల్, జమీందార్, ముస్లిం గజెట్, పైసా
అక్బర్, మశ్రీఖ్, హాలెల్-అల్-మతిన్, మస్సల్మాన్, అల్
హకామ్, అల్ హక్, హామ్దార్డ్ మరియు కామ్రేడ్ (ఆంగ్ల పత్రిక) వంటి ప్రసిద్ధ పత్రికలతో అనుభందం
ఉంది. ఈ పత్రికలు "పాన్-ఇస్లామిక్"
భావనతో చిత్రీకరించబడ్డాయి.
మౌలానా ఆజాద్ యొక్క
ఎడ్యుకేషనల్ లీడర్షిప్
మౌలానా ఆజాద్
విద్యావంతుడు. అతను గత శతాబ్దo లో ఐదు
దశాబ్దాలు అవిచ్చిన్నంగా విద్యా నాయకత్వం చేపట్టారు. వారి విద్యా నాయకత్వ మూడు
విస్తృత దశలుగా విభజించబడింది. 1900 నుండి 1920 వరకు ఆయన భారతదేశంలో ఇస్లాం విద్యా వ్యవస్థ కార్యక్రమంపై దృష్టి కేంద్రీకరించినారు.1920 నుండి 1946 వరకు,
దేశవ్యాప్తంగా
తన నాయకత్వ పరిధిని విస్తరించారు. 1947 నుండి 1958 వరకూ కేంద్ర విద్యా
మంత్రిత్వశాఖ కు నాయకత్వం వహించారు. ఇండియాలో విద్య కోసం కొత్త జాతీయ లక్ష్యాలను
నెలకొల్పారు. .
మౌలానా ఆజాద్ యొక్క విద్యా
ఆలోచనలు, విద్యాపరమైన తత్వశాస్త్రం, విద్యావిషయక ప్రణాళిక మరియు ఇస్లామిక్
విద్యపై అతని అభిప్రాయాల గురించి చాలా మంది వ్రాశారు.మౌలానా ఆజాద్ కేంద్ర విద్యా శాఖ మంత్రి
చేసిన మొట్టమొదటి ప్రకటన లో "మన జాతీయ అవసరాలు తగినట్లు గా విద్య విధానంను రూపొందించడం"
తన లక్ష్యం గా పేర్కొన్నారు. బ్రిటీష్
నుంచి సంక్రమించిన విద్య "జాతీయ ప్రయోజనాలకు తగినది కాదు, అది దేశ పౌరులు
కాని వారిచే రూపొందించ బడినది” అని పేర్కొన్నారు.
విద్యా విధానాలపై మౌలానా
ఆజాద్ యొక్క భావాలు:
విద్యా విధానాలలో ఆజాద్
యొక్క ఆలోచనల అధ్యయనం నుండి,
స్వాతంత్య్ర
భారతదేశానికి విద్య యొక్క కొత్త లక్ష్యలుగా నాలుగు ముఖ్యమైన లక్ష్యాలను రూపొందించారు:
1. విద్య యొక్క ప్రజాస్వామ్యం; 1. Democratisation of education;
2. విద్యా ప్రమాణాల నిర్వహణ; 2. Maintenance of educational standards
3. విద్యా దృక్పథం యొక్క విస్తరణ; మరియు Broadening of
educational outlook; and
4. పరస్పర అవగాహన ప్రమోషన్. Promotion of mutual understanding
భారతదేశంలో విద్యను
ప్రజాస్వామికరణ కోసం సామూహిక నిరక్షరాస్యతకు నిర్ములించేందుకు ఆజాద్ దేశంలో రెండు విద్యా సంస్కరణలను
ప్రవేశపెట్టి, వయోజన విద్య వ్యాప్తి
మరియు సార్వత్రిక ప్రాధమిక విద్య కోసం దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించినారు. యువ
తరానికి ఉచిత విద్య మరియు సార్వత్రిక విద్యను కల్పించే ఉద్దేశ్యంతో, 40 ఏళ్ళ యుద్ధానంతర విద్యా ప్రణాళికను అమలు
చేయాలని ఆయన నొక్కిచెప్పారు. మౌలానా ఆజాద్ సెకండరి దశ వరకు విద్య ఉచితo మరియు
తప్పనిసరి చేయడం పై పట్టుదల వహించారు.
భాష సమస్య మీద
ఆంగ్ల భాషను మార్చాలనే
ప్రశ్నమీద తీవ్ర చర్చలు జరిగాయి, మౌలానా ఆజాద్ ఆంగ్ల భాషకు కనీసం ఐదు
సంవత్సరాల సమయం ఇవ్వాలని కోరుకున్నాడు. మౌలానా
ఆజాద్, మహాత్మా గాంధీ మరియు
మోతిలాల్ నెహ్రూతో ఈ విషయం చర్చించారు, హిందీ
లేదా ఉర్దూ బదులు "హిందూస్థానీ" పట్ల మొగ్గు చూపారు. అంతిమంగా, మౌలానా
ఆజాద్ యొక్క ప్రతిపాదన ఆమోదించబడలేదు మరియు పార్లమెంటులో తాను ప్రసంగించిన
ప్రసంగంలో దానిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్య మంత్రిగా మౌలానా
ఆజాద్ యొక్క ఎడ్యుకేషనల్ లీడర్షిప్
మౌలానా ఆజాద్ నాయకత్వం లో , కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ దేశంలో విద్యా
నాయకత్వాన్ని సాధించింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య మంత్రిగా తన
మంత్రివర్గంలో మౌలానా ఆజాద్ పేరును చేర్చారు.సాంఘిక,
సాంస్కృతిక మరియు శాస్త్రీయ పరిశోధనా విభాగాలు అతని కింద
ఉంచబడ్డాయి. మౌలానా ఆజాద్ యొక్క మార్గదర్శకత్వంలో యూనియన్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ
శాఖ,
దాని చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్బుతమైన ఆలోచనలను
అవలంబించింది మరియు వాటిని అమలుపరిచింది. ఉదాహరణకు,
ప్రాథమిక, సెకండరీ
యూనివర్సిటీ,
టెక్నికల్, అడల్ట్ ఎడ్యుకేషన్
కొరకు వేర్వేరు కమిషన్లు ఏర్పరిచినది. ఈ
సంస్థలు కొత్త ప్రణాళికలను రూపొందించాయి మరియు జాతీయ ప్రణాళికలో ఏకరూపతను
తీసుకురావడానికి ప్రయత్నించాయి .మౌలానా ఆజాద్ అద్వర్యం లో విద్య శాఖ లో ఈ విభాగాలు / సంస్థలు / కమీషన్లు / కౌన్సిల్స్ /
బోర్డ్లు / బ్యూరోలు స్థాపించబడ్డాయి:
1. యూనివర్సిటీ కమీషన్: ఈ కమిషన్ 1948 లో స్థాపించబడింది. ఈ కమిషన్ యొక్క సూచనలు చాలావరకు
ప్రభుత్వం ఆమోదించాయి. మౌలానా ఆజాద్ ప్రయత్నాల కారణంగా అనేక కొత్త విభాగాల్లో బోధనలు
విశ్వవిద్యాలయాలలో ప్రారంభించబడ్డాయి. UGC అతని నాయకత్వంలో
పనిచేసింది.
2. అఖిల భారత విద్య కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్: ఈ
కౌన్సిల్ రాష్ట్రాల మధ్య పరస్పర సంబంధాలను అభివృద్ధి చేయడానికి స్థాపించబడింది.
3. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్: మౌలానా ఆజాద్ ఉన్నత పాఠశాలల పాత
సిలబి మార్చాలని భావించారు. ఇందుకోసం సెప్టెంబరు 1952 న సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ను స్థాపించారు. డాక్టర్
ఎ.ఎల్. ముదలియార్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ కమిషన్ సిఫార్సుపై,
సెకండరీ విద్య నిర్మాణం మార్చబడింది.
4. టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క ఆల్ ఇండియా కౌన్సిల్: టెక్నికల్
ఎడ్యుకేషన్ కోసం అల్ ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. దాని సిఫార్సు మీద
సాంకేతిక పాఠశాలలు మరియు కళాశాలలు పెద్ద సంఖ్యలో ప్రారంభించారు.
5.పెద్దవారికి విద్య: నిరక్షరాస్యులైన పెద్దలలో విద్యావంతులను చేయటానికి
పెద్దవారికి విద్య కోసం బోర్డ్ ఏర్పాటు చేయబడింది.
6.గ్రామీణ ఉన్నత విద్య: గ్రామీణ ఉన్నత విద్యను విస్తరించడానికి గ్రామీణ ఉన్నత
విద్య బోర్డు ఏర్పాటు చేయబడింది.
7. సెంట్రల్ సోషల్ డెవలప్మెంట్ బోర్డు.
8. సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్.
9. ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ బ్యూరో.
10. బేసిక్ ఎడ్యుకేషన్ కోసం నేషనల్ ఆర్గనైజేషన్.
11. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్.
పైనవే కాకుండా,
మౌలానా ఆజాద్ హిందీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు
మరియు జాతీయ భాషగా హిందీ కి తన అంగీకారం
తెలిపారు. అతడు శారీరక విద్య,
విహారయాత్రలు, యువతకు, సామాజిక సేవ, వికలాంగులకు విద్య వంటి అనేక పథకాలను ప్రారంభించారు. మౌలానా
ఆజాద్ యొక్క కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ యొక్క విద్యావిషయక ప్రణాళికలో విద్యా
అభివృద్ధి పథకాలు ప్రారంభించబడటం జరిగింది.
పైన అభివృద్ధి ప్రణాళికలతో పాటు, మూడు అకాడమీలు
స్థాపించబడ్డాయి,
(1) సాహిత్య అకాడమీ, (2) కళ అకాడెమీ మరియు (3)
డాన్స్-డ్రామా అండ్ మ్యూజిక్ అకడెమీ. UNESCO మరియు అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థలతో సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పడానికి
విద్య మంత్రిత్వశాఖలో కొత్త విభాగం ప్రారంభించబడింది. ఉపాధ్యాయులకి మరియు బోధకులకు
మధ్య మార్పిడి ద్వారా విద్యను బలోపేతం చేయడం కోసం ఒక నూతన సంస్థ కూడా
స్థాపించబడింది.
మౌలానా ఆజాద్ తీసుకున్న ఈ అన్ని చర్యలు, అతని ఐక్య జాతీయవాద సిద్ధాంతానికి ప్రాముఖ్యత
ఇస్తున్నాయియి. అతని జీవితం యొక్క ఏకైక లక్ష్యాలు ఐక్యత, స్నేహం మరియు ప్రేమ.
No comments:
Post a Comment