శిశు మరణాల రేటు తగ్గినప్పటికీజన్మించిన నవజాత శిశువులు భారతదేశంలో ఇప్పటికీ చనిపోతున్నారు: UN నివేదిక
బాలిక శిశువు ఆరోగ్య సంరక్షణ కు ప్రధాన అవరోధం అధిక ఖర్చులు అని ఈ నివేదిక
నొక్కి చెప్పింది.1990 నుండి 2015 వరకు భారతదేశంలో ఐదు సంవత్సరాల లోపు శిశువుల మరణాల రేటు 66 శాతం తగ్గుముఖం పట్టింది. అయితే కొత్తగా జన్మించిన నవజాత శిశు మరణాలు దేశంలో చాలా ఎక్కువ అని ఐక్యరాజ్య సమితి
నివేదిక పేర్కొంది.
యునిసెఫ్ నిర్వహించిన సర్వే ఆన్ లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్
మోర్టాలిటీ 2017 ప్రకారం,
భారత్ దాని మిలీనియం డెవలప్మెంట్ గోల్ (MDG)
లక్ష్యo అయిన ఐదు సంవత్సరాల లోపు శిశువుల మరణాల రేటు మూడింట
రెండు వంతుల కన్నా తక్కువను సాధించినదని అంచనా వేసింది.యునిసెఫ్రిపోర్ట్ గురువారం
ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
"గత ఐదు సంవత్సరాల్లో బాలిక శిశు మరణం ఇటీవల
త్వరితగతిన తగ్గుతోంది కానీ భారతదేశంలో ఐదు సంవత్సరాల లోపు బాలికా శిశు మరణాలు మగ
శిశువ ల కంటే 12.5 శాతం ఎక్కువగా ఉన్నాయి" అని నివేదిక తెలియజేసింది.ప్రపంచవ్యాప్తంగా ఇది
బాలుర లో ఏడు శాతం ఎక్కువ.
భారతదేశంలోని బాలిక ఆరోగ్య సంరక్షణకు
సమానమైన అవకాశాలు ఉండాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది,
"ఈ అంతరాన్ని అధిగమించడానికి మరియు బాలిక
శిశువుకు ఆరోగ్య సంరక్షణకు సమానమైన ప్రాముఖ్యతను నిర్ధారించడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేయాలి".
"మిలీనియం డెవలప్మెంట్ గోల్ (MDG)లక్ష్యాలను సాధించిన రాష్ట్రాల్లో కూడా లింగ అసమానతలు
ఉన్నాయి,
సాంస్కృతిక అడ్డంకులు మరియు ప్రబలమైన సాంఘిక నిబంధనల
కారణంగా తరచూ బాలికా సంరక్షణ నిర్లక్ష్యం చేయబడుతుంది."బాలిక శిశువుకు ఆరోగ్య సంరక్షణ కోరుతూ ప్రధాన అవరోధం అధిక
ఖర్చులు అని ఈ నివేదిక నొక్కి చెప్పింది."దీనిని పరిష్కరించడానికి, ప్రతి శిశువుకు ఉచిత రవాణా, మందులు,చికిత్స మరియు ప్రతి శిశువు కు సంవత్సరము వరకు ఉచిత
ఆరోగ్య సంరక్షణ హక్కును ప్రభుత్వం కల్పించింది.ఈ ప్రయత్నాలు ఉన్నప్పటికీ,
పురుష నవజాత శిశువుల కేర్ యూనిట్స్ 41% ఉండగా మగ నవజాత
శిశువు కేర్ యూనిట్స్ 59% ఉన్నవి.
బాలిక శిశువు ఆరోగ్య సంరక్షణ లో కల్చరల్ అడ్డంకులను పరిష్కరించాల్సిన అవసరం
వుంది."బాలిక శిశువు పట్ల
నిర్లక్ష్యం సమస్య విస్తృతమైనది ఇందుకు గాను సాంఘిక నియమాలు మరియు సాంస్కృతిక
పద్ధతులను కూడా పరిష్కరించాలీ. ఇందుకు పౌర
సమాజ సహాకారం అవసరం మరియు బాలికల విలువను మెరుగుపరచవలసిన అవసరము ఉంది.
కమ్యూనిటీ స్థాయిలో ఈ ముఖ్యమైన అంశంపై చర్చకు సంబంధించి అవగాహన కల్పించడం
మరియు కమ్యూనిటీలు కూడా చర్చలో పాల్గొనడం ఇందులో భాగంగా ఉంటుంది."బాలిక విద్య పై అధిక పెట్టుబడులు పెట్టాలి మరియు భారతదేశంలో బాలికా
విద్య మీద ఉన్న ప్రబలమైన ప్రతికూల సామాజిక నిబంధనలను పరిష్కరించడానికి ప్రధాని
నరేంద్రమోడీ "బేటీ బచావో బేడీ పథావో" పథకాన్ని ఉపయోగించవచ్చని ఈ నివేదిక
నొక్కి చెప్పింది.
నివేదిక ప్రకారం మాత మరణాల నిష్పత్తి
(ఎంఎంఆర్) మిలీనియం డెవలప్మెంట్ గోల్ కాలంలో 68 శాతం క్షీణించింది, ప్రపంచవ్యాప్తంగా క్షీణత 44 శాతం ఉంది.
ఏదేమైనా, MMR యొక్క పెరుగుదల,
రాష్ట్రాలు మరియు ఉప-రాష్ట్ర స్థాయిలో ఎక్కువ ఉంది. అస్సాం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత మరణాల నిష్పత్తి చాలా
ఎక్కువగా ఉంది అది జాతీయ సగటు కంటే 100,000జననాలలో 79 మంది తల్లి మరణాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నివేదిక ప్రకారం ఐదు సంవత్సరాలలోపు చనిపోయే పిల్లల సంఖ్య 2000 లో 9.9 మిలియన్లతో పోలిస్తే, 2016 నాటికి 5.6 మిలియన్లకు తక్కువగా ఉంది. అయితే అదేకాలం లో 5 సంవత్సరాల
లోపు ఉన్న నవజాత శిశువు మరణాలు ప్రపంచ స్థాయిలో ఐదు శాతం అనగా 41 శాతం నుంచి 46 శాతం కు పెరిగాయి.
"2016 లో ప్రతిరోజూ, వారి ఐదవ పుట్టినరోజుకు ముందు 15,000 మంది పిల్లలు మరణించారు, వారిలో 46 శాతం లేదా 7,000 మంది పిల్లలు - జీవితంలో మొదటి 28 రోజులలో మరణించారు."దక్షిణాసియా (39 శాతం), సబ్-సహారా ఆఫ్రికాలలో (38 శాతం) ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. ఐదు దేశాలు నవ జాత
శిశువు మరణాలలో సగం శాతం ఆక్రమించినవి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (నాలుగు
శాతం),
ఇథియోపియా (మూడు శాతం), పాకిస్థాన్ (10 శాతం), నైజీరియా (తొమ్మిది శాతం),ఇండియా 24 శాతం). "
No comments:
Post a Comment