12 October 2017

అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ ఖల్దున్ (Abd al-Rahman Ibn Khaldun) Great Islamic Historian, Economist and Sociologist గొప్ప ఇస్లామిక్ చరిత్రకారుడు, సమాజ శాస్త్ర వేత్త మరియు ఆర్ధిక శాస్త్రవేత్త


Image result for ibn khaldun statue
ఈ వ్యాసం ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆర్ధికవేత్త, మానవ శాస్త్రవేత్త మరియు న్యాయవాది అయిన ఇబ్న్ ఖల్దున్ యొక్క జీవిత చరిత్రను, అతని రచనా వ్యాసంగాన్ని తెలియ చేస్తుంది. ఇబ్న్ ఖల్దున్ ఒక గొప్ప చరిత్రకారుడు మరియు చరిత్ర యొక్క అద్యయన  పద్దతిని అతను సమూలంగా మార్చాడు.  
ముస్లింలు చరిత్రలో రచనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. చరిత్ర అనునది  విజ్ఞాన పరిణామంలో ముఖ్యమైన వనరుల్లో ఒకటి. పవిత్రమైన ఖురాన్ యొక్క మొదటి అయత్ క్యలాం( Qalam) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. విజ్ఞాన పరిణామానికి ఒక ముఖ్యమైన పరికరం. గత నాగరికత యొక్క సంఘటనలు మరియు వాటి నమోదు పద్దతి మరియు చరిత్ర యొక్క మూలం మనలో ఎంతమంది తెలుసు? 13 వ శతాబ్దపు గొప్ప చరిత్రకారుడైన ఇబ్న్ ఖాల్డున్ ఆనాటి సాంఘిక మరియు రాజకీయ కార్యక్రమాలను నమోదు చేసే కొన్ని పద్ధతులను ప్రవేశపెట్టారు.

ఇబ్న్ ఖల్దున్  ముందు, కొంతమంది అరబ్ చరిత్రకారులు చరిత్ర మరియు ప్రవక్త (స) కాలం నాటి యుధ్ధం యొక్క సంఘటనలను నమోదు చేశారు. మగజీ. (Magazi) ప్రవక్త(స) యొక్క కాలంలో సంభవించిన యుద్దాలకు సంభందించి వ్రాయబడిన ప్రముఖ పుస్తకాల్లో ఒకటి. “ఫుతూహు ఉల్ బుల్దాన్ (Futoohulbuldan)” మరియు ఇతర పుస్తకాలు చరిత్ర పై ఇస్లాం విద్వాంసులు వ్రాసిన విషయాలను చర్చించాయి. ఇబ్న్ ఖల్దున్ శాస్త్రీయంగా చరిత్రను సంకలనం చేసాడు.

 అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ ఖాల్దున్ 1332 మే 27 న ట్యునీషియాలో జన్మించాడు. అతని పేరు వాలి అల్-దిన్ అబ్ద్ అల్-రహ్మాన్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ ఖల్దున్. వంశం ద్వారా అతను ఒక అరబ్. వారు స్పెయిన్లోని సెవిల్లెలో 93AH లో (స్పెయిన్ పై ఇస్లామీయ ఆక్రమణ తరువాత) స్థిరపడ్డారు. క్రైస్తవులు 1248 లో సెవిల్లెను స్వాధీనం చేసుకునే ముందు వారు తిరిగి ట్యునీషియాకు వలస వచ్చారు.
అబ్ద్ అల్-రహ్మాన్ ఇబ్న్ ఖాల్దున్ అతని ప్రారంభ విద్యను తన తండ్రి మార్గదర్శకంలో ఇంటి వద్ద  పొందారు. ఇతని తండ్రి ఒక  అరబిక్ పండితుడు. అతను పవిత్ర ఖురాన్, అరబిక్ వ్యాకరణం, న్యాయ శాస్త్రం, హదీసులు, వాక్చాతుర్యం, భాషాశాస్త్రం మరియు కవిత్వం అబ్యాసించాడు. అతను గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు తాలెంసర్ యొక్క తత్వవేత్త అల్-అబిలి నుండి గణితం, తర్కం మరియు తత్వశాస్త్రం నేర్చుకున్నాడు. కొలది కాలం లోనే అతను పండితునిగా గణతికెక్కాడు. ఇబ్న్ ఖల్దున్ తన సాంప్రదాయిక అధ్యయనాలను 19 సంవత్సరాల వయస్సులో పూర్తి చేసినట్లు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

ఇబ్న్ ఖాల్డున్ వివిధ దేశాలలో న్యాయనిర్ణేత, పరిపాలకుడు, న్యాయవాది, గురువు మరియు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.రాజకీయ నేపథ్యం మరియు రాజులతో మరియు వివిధ ప్రభుత్వాలతో ఉన్న  సంబంధాలు అతన్ని ఒకే స్థలంలో ఉండ నివ్వలేదు.  తన జీవితకాల మంతా అతను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలో ప్రయాణిస్తున్నాడు.

అతను ఒక యాత్రికుడు కాదు, అయితే అతను యూరోప్, ఆఫ్రికా మరియు అరేబియా ద్వీపకల్పాలకు విస్తృతంగా ప్రయాణించినట్లు అతని రచనలు  తెల్పుతున్నాయి. అతని పుస్తకం “ముకద్దమ Muqaddama అతని  వ్యక్తిగత అనుభవం మరియు పరిశీలన యొక్క ఫలితం. అతను తన జీవితాన్ని ప్రమాదంలో గడిపినట్లు తెలుస్తోంది; అతను అనేకసార్లు ఖైదు చేయబడ్డాడు, అతను తన కొన్ని సార్లు దేశం నుండి   బహిష్కరించబడ్డాడు. ఇబ్న్ ఖాల్డన్ ఈజిప్టులో తన ఆఖరి క్షణాలను గడిపాడు. ఈజిప్టులో మాలికీ న్యాయస్థానంలో ఒక న్యాయనిర్ణేతగా పనిచేస్తున్న సమయంలో చాలా పరిశోధన కార్యక్రమాలు ఈజిప్టులో నిర్వహించబడ్డాయి. గొప్ప చరిత్రకారుడు మరియు తత్వవేత్త, లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేశాడు, ఈజిప్టులో మార్చి 17, 1406 న తన చివరి శ్వాసను తీసుకున్నాడు.

అతను 30 సంవత్సరాల వయస్సులో తన రచన వ్యాసoగాన్ని ప్రారంభించాడు. అనేకమంది చరిత్రకారులు ముకుద్దమ [Prologue ముందస్తు] అతను వ్రాసిన మొదటి పుస్తకము మరియు దానిని ఆరు నెలలలో పూర్తి చేసాడని నమ్ముతారు. ఈ పుస్తకం యొక్క మొట్టమొదటి సంపుటి  “ముకద్దమాMuqaddama” అనగా అక్షరాలా పరిచయం అని అర్ధం మరియు మరియు అది అతని పుస్తకం “కితాబ్ల్ అబ్రార్ వ-దివాన్ అల్-ముబతాడ వ-ల-ఖబర్ ఫిర్ తరిఖ్ అల్-అరబ్ వ-లా-బార్బర్ వ-మాన్ అస్రారాహ్ం మిన్ ధవీ ఆష్-షాన్ అల్-అక్బర్” (Kitabul Abrar wa-Diwan al-Mubtada wa-l-Khabar fi Tarikh al-Arab wa-l-Barbar wa-Man Aṣarahum min Dhawi ash-Shaan al-Akbar) లో భాగం. “కితాబూల్ అబ్రార్” ఏడు సంపుటాలలో  విభజించబడింది.

“ముకుద్దమ” ఈ పుస్తకం యొక్క మొదటి భాగం అయినప్పటికీ, ఇది పూర్తి పుస్తకం యొక్క ఒక ప్రత్యేక భాగం గా పరిగణిoచ బడుతుంది. భౌగోళికశాస్త్రం, మానవ శాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, మతం, సంస్కృతి, సమాజం, ఆర్థికశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, కళలు, మరియు మనస్తత్వ శాస్త్రం గురించి మానవ సమాజాన్ని విశ్లేషించడానికి మొగాదామా Muqaddama మొదటి ప్రధాన ప్రయత్నం చేసినట్లు భావించ బడుతుంది. “ముకుద్దమ” ను క్రింది విధంగా ఆరు భాగాలుగా విభజించవచ్చు
1. మానవ సమాజం
2. గ్రామీణ నాగరికతలు
3. ప్రభుత్వం మరియు సంస్థలు
4. సమాజం మరియు పట్టణీకరణ
5. ఆర్థిక గుణకాలు (economic Modules)
6. శాస్త్రం మరియు మానవత్వం
కితాబుల్ అబ్రార్ ముకుద్దమ యొక్క తరువాతి భాగం, ఇది వివిధ  దేశాల నాగరికత, ప్రభుత్వం, పరిపాలన మరియు సంస్కృతి యొక్క వివిధ అంశాల గురించి చర్చిస్తుంది. II, III, IV మరియు V సంపుటాలు ఇబ్న్ ఖాల్దున్ కాలం వరకు జరిగిన  మానవాళి చరిత్రను చర్చించాయి. వాల్యూమ్ VI మరియు VII బర్బెర్ ప్రజల చరిత్ర మరియు మగ్రిబ్ల (Barber people and Maghrib) గురించి చర్చించాయి. ఈ భాగం బెర్బర్ చరిత్ర యొక్క ప్రామాణిక మరియు ముఖ్యమైన మూలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కటబూల్ అబ్రార్తో పాటు, అతను వివిధ విషయాలపై అనేక పుస్తకాలను రచించాడు.

సోషియాలజీ యొక్క వివిధ కోణాల గురించి చర్చిస్తూ, ఇబ్న్ ఖాల్డున్ సంఘర్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. అతను నోమడ్(ఎడారి ప్రజల) మరియు నిశ్చల జీవనశైలి మద్య ఉన్న ద్వైధీభావాన్ని మరియు బిన్న తరాలు అధికారం కోల్పోవడం గురించి సిద్ధాంతపరంగా (theory of dichotomy of sedentary life verses nomad life, the concept of generation and loss of power)పేర్కొన్నాడు.

ఇబ్న్ ఖాల్దున్ నాగరికత సిద్ధాంతం, రాజకీయ ఆర్థిక సిద్ధాంతం, వ్యాపార చక్రం సిద్ధాంతం, పన్నుల సిద్ధాంతం, సాంఘిక సంయోగం మరియు గిరిజన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతాలతో పాటుగా, ఇబ్న్ ఖాల్డున్ పలు ఇతర గుణకాలు(మాడ్యుల్స్) మరియు ఆలోచనలను ప్రస్తావించాడు, తరువాత ఇవి  పాశ్చాత్య పండితులు మరియు సాంఘిక శాస్త్రవేత్తలకు సూచనల కేంద్రంగా మారినవి. లాఫర్ కర్వ్ అభివృద్ధిలో ఆర్థర్ లాఫ్ఫర్ ఇబ్న్ ఖాల్దున్ కు రుణపడి ఉన్నాడు.


లాఫ్ఫెర్ కర్వ్ ఉత్పత్తి మరియు వ్యవసాయంపై భారీ పన్ను విధింపును సూచిస్తుంది.  ఈ సిద్ధాంతంలో ఇబ్న్ ఖల్దున్ ప్రభుత్వం పన్నుల స్థాయిని తగ్గించాలని సూచించాడు. ప్రజలపై అదనపు పన్ను  వ్యాపారాన్ని నిరుత్సాహపరుస్తుంది మరియు  ఆర్ధిక వ్యవస్థలో ఉత్పత్తి స్థాయిని తగ్గించి, ప్రభుత్వం యొక్క రాబడిని తగ్గించును అని ఆయన సూచించారు. ఇది ఉత్పత్తి ద్రవ్యోల్బణం (supply-side inflation) కు దారి తీయును. ఇది ఆధునిక ఆర్ధిక సాహిత్యంలో ఆర్థిక వ్యవస్థలో వ్యయాల ద్రవ్యోల్బణం(cost-push inflation) గా పిలబడుతుంది.


ఇబ్న్ ఖాల్దున్ ఇస్లామిక్ ద్రవ్య సిద్ధాంతాన్ని మరియు కరెన్సీ నిర్వహణను నొక్కి చెప్పాడు. అతను బంగారు లేదా వెండి నాణేలనుముద్రించ మన్నాడు. అతను కరెన్సీ అంతర్గత మరియు ముఖ విలువ మధ్య సమతౌల్యాన్ని స్థాపించాలని సూచించాడు. అతని నాగరికత యొక్క కారణం, స్వభావం, ప్రభావాలు మరియు పరిణామాల విశ్లేషణ ప్రపంచంలోని గొప్ప ప్రశంసలను రేకెత్తించింది.

ప్రముఖ బ్రిటీష్ చరిత్రకారుడు అర్నాల్డ్ జె. టోయ్ బీ (Arnold J. Toynbee)  “ముకుద్దమా” ను  చరిత్ర యొక్క  తత్వశాస్త్రంగా అభివర్ణించాడు మరియు ప్రపంచం లో ఇప్పటివరకు రచించ బడిన వాటిలో   గొప్ప కృతి అనుట  నిస్సందేహం గా అభివర్ణించాడు.

No comments:

Post a Comment