అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు: " కృంగిపొకండి మరియు
దుఃఖపడకండి, మీరే ప్రాబల్యం పొందుతారు, మీరు విశ్వాసులే అయితే.(3:139).
ప్రజలు బలహీనపడుతున్నప్పుడు లేదా వారు చెడు పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు
దుఃఖపడకూడదు, వారు నిజమైన విశ్వాసి అయితే, ఎందుకంటే వారే విజయం
పొందుతారు. ఒక మోమిన్(విశ్వాసి) లక్షణాలను
వర్ణించే అనేక అయతులు దివ్య ఖురాన్ లో ఉన్నాయి. మోమిన్(విశ్వాసి) లక్షణాలను వర్ణించే ఆయతులు (2: 285, 4: 162, 8: 2-3, 9:71, 9: 111-112, 23:
1-9, 24:51, 24:62, 27: 2-3, 33:36 మరియు 49:15).
విశ్వాసి కు సంభందించి దివ్య ఖురాన్ లో రెండు వేర్వేరు పదాలను ఉపయోగిస్తారు. 1.
ముస్లిం 2. మోమిన్. ముస్లిం అనగా అల్లాహ్
కు తన్ను తానూ సమర్పించిన వ్యక్తిగా వర్ణించారు. అతను అల్లాహ్ ఒక్కడే అని నమ్మాడు.
అల్లాహ్ కొరకు ప్రార్థిస్తాడు మరియు దివ్య ఖుర్ఆన్ పఠిస్తాడు. ఏంజిల్స్ మరియు
జడ్జిమెంట్ డే అందు నమ్మకం ఉంచుతాడు. ఒక ముస్లిం తన మతపరమైన విధులను నిర్లక్ష్యం చేయవచ్చు,
అతను ప్రపంచానికి ప్రాముఖ్యత ఇవ్వవచ్చు, అతను తన జీవితం
లో కొంత సమయం దుష్ట శక్తులకు లొంగిపోవచ్చు.
కాని విశ్వాసి అల్లాహ్ పట్ల ఉన్నత స్థాయి లో పూర్తి నమ్మకం సాధిoచును. విశ్వాసి యొక్క నమ్మకం ముస్లిం నమ్మకం కన్నా
ఉన్నతమైనది. విశ్వాసితన విధులను నిర్లక్షం చేయడు మరియు ప్రాపంచిక అందాలు మరియు ఆకర్షణలు అతనికి ప్రలోభపెట్టు లేవు.
ఈ విషయంలో, ప్రవక్త ముహమ్మద్ (స)ఒక సారి ఇలా అన్నారు, "బలహీనమైన నమ్మినకల వారి కంటే బలమైన నమ్మిక గలవారు అల్లాహ్ కు ఉత్తమమైన మరియు మరింత ప్రియమైనవారు, అయితే ఇద్దరూ మంచివారే. మీకు ప్రయోజనం కలిగించే దానిని పొందటానికి, అల్లాహ్
సహాయం పొందటoనిస్సహాయంగా భావించవద్దు.-"(ముస్లిం)
పై హదీసు బలమైన విశ్వాసి గా ఉండటం
మంచిది అని తెలుపుతుంది.
నిజమైన విశ్వాసి యొక్క లక్షణములు:
1. నమ్మకం (దివ్య ఖురాన్ 2: 285, 4: 162, 24:62, 27: 3 మరియు 49:15)
మోమిన్ యొక్క మొదటి లక్షణo అతను అల్లాహ్, అతని దూతలలో, ఆయన పుస్తకాలలో, అతని సందేశహరులందరిలో, మరియు అల్లాహ్ యొక్క తీర్పుదినం అందు విశ్వాసం ఉంచాలి. ఇస్లాం లో విశ్వాసం
యొక్క ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నవి.
ii. విధేయత (దివ్య ఖురాన్ 2: 285, 9:71, 9: 112, 24:51 మరియు 33:36)
విశ్వాసి యొక్క రెండవ లక్షణం విధేయుత. అల్లాహ్ నుండి పొందినదానిని సంతోషంగా అంగీకరించాలి. అల్లాహ్ మరియు ప్రవక్త(స)
యొక్క ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలి. 'వినంటం మరియు
కట్టుబడి' వైఖరి కలిగి ఉండాలి.అల్లాహ్ ప్రవక్తలు అందరి
యందు విశ్వాసం ఉంచుట, ముహమ్మద్ ప్రవక్త (స) కు వెల్లడించిన విషయంలో విశ్వసించటం మరియు అతనికి
ముందు వచ్చిన సందేశహరులలో వెల్లడించిన దానిని నమ్మవలయును.
iii. ప్రార్థన(దివ్య ఖుర్ఆన్ 4: 162, 8: 3, 9:71, 9: 112, 23: 2, 23: 9 మరియు 27: 3)
విశ్వాసి మూడవ లక్షణం రోజు కు ఐదు సార్లు సమయానికి నమాజ్ నిర్వహించడo, మరియు దానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. అల్లాహ్ ముందు
నిలబడి ఉండటం ద్వారా అల్లాహ్ అందు విధేయత చూపటం కూడా చాలా ముఖ్యమైనది. ప్రార్థనను
స్థాపించడానికి, మనిషి తన విశ్రాంతి నుండి బయటకు వచ్చి, విధేయతను చూపిస్తాడు.
1V. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం (దివ్య ఖురాన్ 4: 162, 8: 3, 9:71, 23: 4 మరియు 27: 3)
ఒక మోమిన్ యొక్క నాల్గవ లక్షణం
అల్లాహ్ యొక్క మార్గంలో అతను గడుపుతాడు. అల్లాహ్ ఇచ్చిన సంపదను అల్లాహ్ కు ప్రియం
కలిగించేటట్లు ఖర్చు చేస్తాడు.మానవుడు తన
సంపదను ఎక్కువగా ప్రేమిస్తాడు మరియు అల్లాహ్ యొక్క మార్గం లో తన డబ్బును ఖర్చు
చేసినప్పుడు అతను నిజమైన నమ్మిక గల వ్యక్తిగా మారతాడు.
V. అల్లాహ్ పట్ల భయము (దివ్య ఖురాన్ 8: 2)
ఒక మోమిన్ యొక్క ఐదవ లక్షణం అతని హృదయం అల్లాహ్ యొక్క గొప్పతనo మరియు అతనిపట్ల
ప్రేమను కలుగజేయడంలో మునిగిపోతుంది. ఈ స్థితి గౌరవ వాతావరణం మరియు
చుట్టుపక్కల భయాలను కలిగి ఉండాలని కోరుతుంది. ప్రజలు అల్లాహ్ యొక్క పేరు విన్నప్పుడు
వారి హృదయాలు అల్లాహ్ గొప్పతనాన్ని
ఆలోచించి భయపడతాయి. అలాంటి దానిని 'తక్వా' అని పిలుస్తారు.
VI. విశ్వాసం పెరుగుదల (దివ్య ఖురాన్ 8: 2):
మోమిన్ యొక్క ఆరవ లక్షణం ఏమిటంటే, దివ్య ఖురాన్ యొక్క ఆయతులు విన్నప్పుడు వారి విశ్వాసం క్రమబద్ధతతో బలంగా
పెరుగుతుంది. దివ్య ఖురాన్ యొక్క ఆయతులు అవగాహన చేసుకొని చదివేటప్పుడువిశ్వాసం బలోపేతo అగును.
vii. అల్లాహ్ పై విశ్వాసం (దివ్య ఖురాన్ 8: 2)
ఒక మోమిన్ యొక్క ఏడవ లక్షణం అతను
అల్లాహ్ అందు సంపూర్ణం గా విశ్వసించేవాడు.
నమ్మిన అల్లాహ్,ను జీవితంలోని అన్ని పరిస్థితుల్లో కూడా
పూర్తిగా స్వచ్ఛoగా, సంపూర్ణo, గా విశ్వసించాలి .
VIII.మంచి ని ఆహ్వానించుట మరియు చెడు ను నిషేదించుట: (దివ్య ఖురాన్ 9:71)
మోమిన్ యొక్క ఎనిమిదవ లక్షణం మంచిని పెంచుట మరియు చెడును నిషేధించడం. ఇదే అంతిమ దినం వరకు కొనసాగించాలి.
ఈ ప్రపంచంలో మంచి ని పెంచే మనుష్యులందరిని ఆహ్వానించడం మరియు చెడు నుండి ప్రజలను దూరం
చేయాలి. ఈ ప్రపంచంలో మరియు పై లోకం లో వారు ఇబ్బందులను మరియు శిక్షలను పొందకుండ చూడాలి.
IX.అల్లాహ్
మార్గంలో నడుచుట (దివ్య ఖురాన్ 9: 111-112 మరియు 49:15)
మోమిన్ తొమ్మిదవ లక్షణం అల్లాహ్
మార్గంలో నడుచుట. అల్లాహ్ మార్గంలో తమ ఆస్తిని మరియు తమ జీవితాలను అర్పితం చేసిన వారే నిజమైన
విశ్వాసులు. వారు అల్లాహ్ చూపిన మార్గంలో పోరాడటానికి సంకోచించరు మరియు వారు
అత్యంత ధైర్యంతో పోరాడుతారు మరియు శత్రువులను నాశనం చేయటానికి పూర్తి ప్రయత్నం
చేస్తారు మరియు వారు అమరత్వం పొందుతారు.
X. పశ్చాత్తాపం (దివ్య ఖురాన్
9: 112)
మోమిన్ యొక్క పదవ లక్షణం అతనుపశ్చాత్తాపం చూపును. తప్పు
చేస్తే పశ్చాత్తాపం చెందును. వారు ఏదైనా తప్పు లేదా పాపం చేసినట్లయితే, వారు దానిని
క్షమించమని, అల్లాహ్ వైపు తిరగి
అతని క్షమాపణ కోసం ప్రార్థిస్తారు. ఇది
అల్లాహ్ యొక్క విధేయత వైపు మరులుట. దానితో
అతను చేసిన పాపం పరిహారం అవుతుంది.
XI.అల్లాహ్ ను స్తుతించటం (దివ్య ఖుర్ఆన్ 9: 112)
ఒక మోమిన్ యొక్క పదకొండవ లక్షణం, అతను అల్లాహ్ ను ఘనంగా ప్రశంసిస్తాడు. వారు అల్లాహ్ కు కృతజ్ఞులై, అల్లాహ్ యొక్క ప్రశంసలను పాడుతూ ఉంటారు మరియు
వారు ఆయనకు మాత్రమే కృతజ్ఞులై ఉంటారు.
XII. అల్లాహ్ కొరకు ప్రపంచం అంతటా పర్యటించుట (దివ్య ఖురాన్ 9: 112)
ఒక మోమిన్ యొక్క పన్నెండవ లక్షణం అల్లాహ్ కొరకు అతను
ప్రపంచం అంతట పర్యటించును. వారు ధర్మ ప్రచారం కోసం ప్రయాణాలను చేయుదురు మరియు ప్రయాణం లోని కష్టాలను అధిగమిస్తారు. ధర్మ
జ్ఞానం కోసం విశ్వాసపు చిహ్నాలను వెతుకుతూ, ప్రజలకుసేవ చేస్తూ, ధర్మ ప్రచారం లో తమ
కాలాన్ని గడుపుతారు.
XIII. అనాలోచిత ప్రసంగం నుండి దూరంగా
ఉండుట (దివ్య ఖుర్ఆన్ 23: 3)
ఒక మోమిన్ యొక్క పదమూడవ లక్షణం వారు అనాలోచితంగా మాట్లాడకుండా ఉండటం. వారు ఫలితము
లేని మరియు విషయ రహిత విషయాల నుండి దూరంగా ఉంటారు. విశ్వాసులు పనికిరాని
విషయాలపట్ల ఆసక్తి చూపరు మరియు అలాంటి పనులకు వారు దూరంగా ఉంటారు. పనికి రాని విషయాలను
మాట్లాడే వారితో బహు జాగ్రతగా వ్యవహరిస్తారు.
XIV. వారి గుప్త భాగాలను కాపాడుకొంటారు (దివ్య ఖుర్ఆన్ 23: 5)
మోమిన్ యొక్క పద్నాలుగో లక్షణం అతను తన వ్యక్తిగత శరీర గుప్త భాగాలను కాపాడు కొంటారు. వారు తమ
శరీర కోరికలను అక్రమo గా తృప్తి పొందరు.
వారు ప్రతి కోణంలో నమ్రత కలిగి ఉంటారు మరియు వారు లైంగిక దుర్వినియోగం మరియు
లైంగిక వేధింపులకు పాల్పడరు. వారు ఇతరుల ముందు తమ గుప్త శరీర అంగాలను బహిరంగంగా ప్రదర్శించరు.
XV. సభా మర్యాదలను పాటిస్తారు. (దివ్య ఖుర్ఆన్ 24:62)
ఒక మోమిన్ యొక్క పదిహేనవ లక్షణం అతను సమావేశం యొక్క మర్యాదను అనుసరించును.
అల్లాహ్ మార్గంలో నడుచుట లేదా ఇతర మతపరమైన విషయాల్లో ఆచరించే దిశలను ఇవ్వటానికి ఒక
సమావేశం పిలువబడినప్పుడు,
అటువంటి
సమావేశాలు అధిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. విశ్వాసి సమావేశానికి హాజరు కావాలి, అనుమతి లేకుండా
సమావేశాన్ని వదిలివేయకూడదు.
దివ్య ఖుర్ఆన్ లోని అనేక ఆయతులలో అల్లాహ్ విశ్వాసులకు ఇవ్వబడే ప్రతిఫలం గురించి తెలియజేశాడు.
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా చెప్తున్నాడు: " మేము గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము."
(దివ్య ఖుర్ఆన్ 4: 162)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్
ఇలా ప్రకటిస్తున్నాడు: "వాస్తవానికి వారు విశ్వాసులే. వారి కొరకు వారి
ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు కలిగి ఉన్నాయి. "(దివ్య ఖుర్ఆన్ 8: 4)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్
ఇలా ప్రకటిస్తున్నాడు:" వారి పాపాలకు మన్నింపు, వారికి చక్కని ఉపాధి
లబిస్తాయి. "(దివ్య ఖుర్ఆన్ 8:74)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్
ఇలా ప్రకటిస్తున్నాడు: "ఆయనే (అల్లాహ్) వారిపై కరుణిస్తాడు.నిశ్చయంగా అల్లాహ్
ప్రబలుడు, వివేకవంతుడు మరియు వివేచనాపరుడు."(దివ్య ఖుర్ఆన్
9:71)
అల్ ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
"వారు స్వర్గానికి వారసులు, అల్-ఫిర్దాస్ వారసులు.(దివ్య ఖుర్ఆన్ 23: 10-11)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్
ఇలా ప్రకటిస్తున్నాడు: "వారు సత్య వంతులైన వారు" (దివ్య ఖుర్ఆన్ 49:15)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్
ఇలా ప్రకటిస్తున్నాడు: “వారు విజయ వంతులైన వారు" (దివ్య ఖుర్ఆన్ 24:51)
కాబట్టి, ప్రజలు మోమిన్ అయినప్పుడు, అల్లాహ్ వారికి ప్రతిఫలమిస్తాడు మరియు ఈ
ప్రపంచంలో మరియు పరలోకంలో వారు విజయం సాధించగలరు.
No comments:
Post a Comment