తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రం పట్ల
ఆసక్తి ముస్లిం ప్రపంచం లో క్షీణిoచి పాశ్చాత్య ప్రపంచం లో
దానిపట్ల ఆసక్తి పెరుగుతున్న కాలం లో అల్-వాలిద్
ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్ రష్ద్,
లేదా పడమటి
దేశాల వారిచే అవిరోస్ లేదా ఇబ్న్
రోచ్డ్ గా పిలువబడే మేధావి(1126—1198) జన్మించారు. అతని జననానికి 50 సంవత్సరాల పూర్వం మరణించిన ప్రఖ్యాత ఇస్లాం
విమర్శకుడు అల్-గజాలి (1058-1111)
ముస్లిం
నియోప్లాటోనిక్ తత్వశాస్త్రం
ప్రత్యేకించి
తత్వవేత్త ఇబ్న్ సిన (అవిసెన్నా) యొక్క రచనలపై విమర్శలు చేశాడు. అటువంటి పరిస్థితుల్లో జన్మించిన స్పానిష్-ముస్లిం
తత్వవేత్తలలో న్యాయవేత్త మరియు
వైద్యుడు ఇబ్న్ రష్ద్ అత్యంత ప్రభావవంతమైన ముస్లిం తత్వవేత్తగా
పరిగణించబడ్డారు. ఇతడు పశ్చిమాన ముస్లిం తత్వశాస్త్రం యొక్క
సంప్రదాయo వారసత్వంగా పొందిన వాడు.
అరిస్టాటిల్
పై అతని ప్రభావవంతమైన వ్యాఖ్యానాలు
మరియు ప్రత్యేకమైన వివరణలు ఆరవ శతాబ్దం నుండి నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన
గ్రీకు తత్వశాస్త్రం పట్ల పాశ్చాత్య
విద్వాంసుల ఆసక్తిని పునరుద్ధరించాయి,
అతను తన “ఫాస్ల్ అల్-మకాల్” (నిర్ణయాత్మక గ్రంధం The Decisive Treatise ) లో అల్-ఘజాలి చే విమర్సింప
బడిన సున్నీ సంప్రదాయంలోని తాత్విక వ్యతిరేక భావాలను సవాలు చేశాడు. ఈ విమర్శ
క్రైస్తవ సంప్రదాయంలో "ఎవెరోయిస్ట్స్" గా గుర్తించగల
పండితులను సృష్టించినది.
తత్వవేత్తల
స్థానం ఇస్లాం యొక్క వెలుపల ఉన్నది అనే చాలా మంది ముస్లిం వేదాంతుల వాదనలలో ఏ ఆధారమూ లేదని ఇబ్న్ రష్ద్
వాదించారు. అతని ప్రకారం ఇస్లాం లో తత్వశాస్త్ర అధ్యయనం నిషేధించబడలేదు.
అతను అచరైట్, ముతజైలిట్,
సూఫీ, "అక్షరవాదుల
(“Asharite, Mutazilite, Sufi,literalist”) భావనలను సవాలు
చేశాడు.
వారి దైవిక
ప్రసంగం మరియు ప్రపంచం యొక్క ఆవిర్భావానికి సంబంధించిన వివరణల నుండి
ఉత్పన్నమయ్యే తాత్విక సమస్యలను గుర్తించాడు. ఇబ్న్ రష్ద్ మతాన్ని విమర్శనాత్మకంగా
మరియు తత్వపరంగా చేయకపోతే
అది సాంప్రదాయం
యొక్క లోతైన అర్థాలను కోల్పోవచ్చని నిరూపించటానికి ప్రయత్నించాడు. అంతిమంగా అది దైవిక అవగాహన మరియు తప్పు అవగాహనలకు దారితీస్తుంది
అన్నాడు.
|
No comments:
Post a Comment