మతం విషయంలో ఇస్లాం బలవంతం లేదా లేదా
అణచివేతను అంగీకరిoచదు. ఇది విశ్వాసం యొక్క పూర్తి స్వేచ్ఛ మరియు ఎంపిక స్వేచ్ఛను నొక్కి చెప్పుతుంది. ఇది చాలా ప్రశాంతమైన, స్వేచ్ఛా మరియు విద్యా వాతావరణాన్ని సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది మరియు
వ్యక్తులు వారి అవగాహన మరియు జ్ఞానంతో ఏ
మతాన్ని అయినా స్వీకరించగలరు. అందువల్ల ఇస్లాం లో జిహాద్
లేదా యుద్ధం యొక్క లక్ష్యo విశ్వాసం విషయంలో ఏ విధమైన వత్తిడిని/బలవంతం ను రద్దుచేయుట. తమ ప్రజలను ఒక ప్రత్యేక మతాన్ని
స్వికరించమని బలవంతం చేసే నిరాశాజనకమైన శక్తులపై ఇస్లాం జిహాద్ కొరకు
పిలుపునిస్తుంది. ఇస్లాంను స్వీకరించడానికి లేదా ప్రజలను ఇస్లాం లోనికి మార్చడానికి లేదా వారిని మత విషయం లో నిర్బంధించటానికి ఇస్లాం జిహాద్ లేదా యుద్ధానికి
పిలుపునివద్దు. ముస్లిలు తమ ధర్మాన్ని ఇతరులపై బలవంతం గా రుద్దరాడు. ఈ విషయంలోదివ్య ఖుర్ఆన్ వచనం చాలా ముఖ్యమైనది.
అల్లాహ్ ఇలా అంటున్నాడు: "ఇకపై పీడన (ఫిత్నా) అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడే
వరకు, మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే,
దౌర్జన్యపరులను తప్ప మరేవ్వరిని శిక్షించ కూడదు. (2:
193)
ఫిత్నా యొక్క అర్ధం: 'ఫిత్నా' అనే పదాన్ని ఒక ప్రత్యేక విశ్వాసాన్ని గుడ్డిగా అనుసరించే వారిని మరియు శత్రుత్వం
మరియు దురాక్రమణలో అన్ని పరిమితులను వ్యతిరేకించే వారిని మరియు అధీకృత వ్యక్తుల ధోరణిని సూచిస్తుంది.
ప్రజలు తమ విశ్వాసాన్ని గురించి స్వేచ్ఛగా ఆలోచించకుండా తమ దృష్టిలో సంతృప్తికరంగా
మంచిగా ఉండే దానిని అనుమతించే అధికార
వర్గాల వారిని సూచిస్తుంది. మతపరమైన
సహ-ఉనికిని మరియు బహుళత్వాన్ని కల్పించని రాజ్యం మరియు ప్రజల ఎంపికను నియంత్రింఛి మరియు వారి మతాన్ని నిర్దేశించడానికి ప్రయత్నిస్తున్న రాజ్యం ప్రత్యేకంగా 'ఫిత్నా' క్రింద వస్తావి. ఇస్లాం మతం, మరియు విశ్వాసం విషయాలలో ఏ రాజ్యం పై వత్తిడి చేయటానికి అనుమతించదు. ఇది ఒక వ్యక్తి
మరియు అతని సృష్టికర్త మధ్య మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి ఇస్లాం ధర్మం స్పష్టమైన దృక్కోణాన్ని
కలిగి ఉండి మరియు అలాంటి అణచివేతను తొలగించమని అడుగుతుంది.
దివ్య ఖుర్ఆన్ ఇలాంటి సందర్భాలలో ఇలా చెబుతోంది: “ అల్లాహ్ కొరకు మరియు మీ
కొరకు పోరాడండి. నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులను ఇష్టపడడు”. ఎ రాజ్యం అయినా ముస్లిమేతర ధర్మమును లేదా విగ్రాహారాదనను అనుసరిస్తూ, శాంతియుతoగా మరియు ఇస్లాం కు అనుకూలo
గా ఉంటె, ఇస్లాం వారితో పోరాడదు. ఇస్లాం వారి శాంతియుత సహజీవనాన్ని ప్రశంసించింది
.అల్లాహ్ ఇలా చెప్తున్నాడు: " అల్లాహ్ సర్వశక్తిమంతుడవుతాడు, మరియు క్షమించే వాడు మరియు అనంత కృపాశాలి. మీ విశ్వాసాన్నిబట్టి
మీపై తిరుగుబాటు చేయని మరియు మీ స్వదేశo నుండి మిమ్మల్ని బయటికి తరవని వారి పట్ల
దయ చూపించమని మరియు పూర్తిగా వారితో, నిశ్చయంగా దయతో ప్రవర్తించమని అల్లాహ్ చెబుతాడు. అల్లాహ్ న్యాయం
గా ప్రవర్తించే వారిని ప్రేమిస్తాడు.ఎవరు
మీతో ధర్మం విషయం లో యుద్ధం చేసారో, మిమ్మల్లి మీ ఇళ్ళ నుండి బహిష్కరించారో,
మిమ్మల్లి బహిష్కరించటం లో పరస్పరం సహకరించు కొన్నారో, వారితో మీరు స్నేహం
చేయటాన్ని మాత్రం అల్లాహ్ వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసిన వారే
దుర్మార్గులు. (60: 7-9).
'అన్ని ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే అంకితం
చేయబడివనవి. అల్లాహ్ పై విశ్వాసం ఉన్నంత
వరకు ఈ ఆయత్ వారిని పోరాడమని చెబుతుంది.
దీని అర్థం ఏమిటి? 'అల్లాహ్ పై విశ్వాసం'అంటే ఏమిటి?
అల్లాహ్ యొక్క ప్రేమ మరియు ఆయన కోసం శోధన మానవ స్వభావంలో అంతర్గతంగా ఉంటుంది.
సహజంగానే అందరు మానవులు వారిని సృష్టించి
మరియు అభివృద్ధి చేసిన వారి కొరకు అన్వేషిస్తారు. వారు ఆయనను ప్రార్ధిస్తూ ఒక రకమైన శాంతి మరియు ఆనందాన్ని కనుగొంటారు.
ఆలోచన మరియు ఎంపిక యొక్క స్వేచ్ఛను కోల్పోయినప్పుడు మరియు చెడ్డ వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు
వారి సృష్టికర్త తో అనుబంధం మరచిపోతారు.
ప్రవక్త (స) ఇలా అన్నారు: ఎవరైతే నిజమైన స్వభావం (ఇస్లాం) లో జన్మించినవారో తరువాత
అతని/ఆమె తల్లిదండ్రులు జుడాయిజం లేదా క్రైస్తవ మతం లేదా జొరాస్ట్రియానిజం వైపుకు కు
అతనిని/ఆమెను మళ్ళిస్తారు. అందరు మానవులు/
జంతువులు అసలు ప్రకృతిలో నిజమైన జంతువులు..
మీరు చెవులు లేకుండా ఏ జంతువునయినా చూసారా?
కాబట్టి మానవులు అణచివేత, విధేయతను తొలగిస్తూ, తమ సొంత ఆలోచనలు చేయగలిగితే, అప్పుడు అల్లాహ్ మరియు వారి మధ్య దూరం ఉండదు. దీన్ అనగా భావన మరియు విశ్వాసం కాదు, బదులుగా విధేయత మరియు సమర్పణ అని సాహిత్య అర్థం. విధ్యుక్తమైన ఆంక్షలు మరియు
అణచివేత నుండి మానవులు విముక్తి పొందినప్పుడు వారు తమ సృష్టికర్తకు తిరిగి
వస్తారనేది సుస్పష్టం గా ఉంది.
No comments:
Post a Comment