28 October 2017

అల్-బెరూని మహా విద్వాoసుడు.
Image result for al biruniఇస్లామిక్ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు, గతంలో ముస్లింల శాస్త్రీయ పరిజ్ఞానం మరియు మేధావితనం తో మనం ఆశ్చర్య పడతాము. ముస్లిం స్వర్ణ యుగంలో వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రo మరియు  తత్వశాస్త్రం లో  వారి కృషి శ్లాఘనీయం. ముస్లింలు దాదాపు అన్ని రంగాల విజ్ఞానశాస్త్రాల వికాసం లో  నూతన ఆవిష్కరణల తో  ముందంజలో ఉన్నారు. ఇబ్న్ సినా, ఇబ్నె అల్ హదీమ్, ఇబ్న్ ఖాల్దున్ మరియు అల్-ఫరాబి వంటి పేర్లు ఇస్లామిక్ విజ్ఞాన శాస్త్ర వికాసం లో పేరు  గాంచినవి.

ముస్లిం విద్వాంసులలో ప్రముఖుడు అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని (Abū Rayḥān Muḥammad ibn Aḥmad Al-Bīrūnī (Chorasmian/Persian: ابوریحان بیرونی‎‎ Abū Rayḥān Bērōnī;) ఇతను  973 నుండి 1048 మద్య  నివసించాడు.  11వ శతాబ్దానికి చెందినవాడు. మధ్య ఆసియా మరియు భారత ఉపఖండంలో తన జీవితంలో ఎక్కువ భాగాన్ని గడిపాడు. జన్మత:ఒక పర్షియన్ 'తజకిముస్లిం.  బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మధ్యయుగపు ఉజ్బెకిస్తాన్ కు చెందిన సార్వత్రిక జ్ఞాని.

అల్-బెరునీ చరిత్ర, భౌతికశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, భాషాశాస్త్రం, తులనాత్మక మతం మరియు భూగర్భ  శాస్త్రo, తత్వశాస్త్రము, బౌగోళిక శాస్త్రము వంటి అనేక రంగాలలో   నిపుణుడు. అవిసెన్నా మరియు అల్-హాజెన్ ల సమకాలికుడు. అరబ్బీ భాషలో రచించాడు, ఇతనికి అరబ్బీయేగాక నాలుగు ఇతర భాషలు తెలుసు.  బెరూని ముస్లిం ప్రపంచం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గలవాడు. కానీ ఇతర ముస్లిం సమకాలికులైన అబూ అల్-ఖాసిం, ఇబ్న్ అల్-హేతామ్, మరియు అవిసెన్నా లాగా పశ్చిమ దేశాలకు పరిచయస్థుడు కాడు.
 అల్-బెరునీ 973 లో ఈశాన్య పర్షియాలో ఖొరాసాన్ రాష్ట్రం లో  జన్మించాడు. చిన్న వయసులోనే చదువుకున్నాడు, అరబిక్ మరియు పెర్షియన్ భాషలను అలాగే ప్రాథమిక ఇస్లామిక్ అధ్యయనాలు మరియు సహజ విజ్ఞాన శాస్త్రాలు  అబ్యసించినాడు.  మొదట్లో గణిత శాస్త్రం మరియు ఖగోళశాస్త్రం పట్ల  ఆసక్తిని చూపాడు మరియు ఆ కాలం నాటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తల క్రింద శిక్షణ పొందాడు.

తన 20 వ సంవత్సరం జ్ఞానాన్ని అన్వేషిస్తు  పర్షియా అంతా ప్రయాణించాడు.  అనేక విజ్ఞాన విషయాలను  పండితుల నుంచి  నేర్చుకున్నాడు. చివరకు అతను జర్జన్ (ఆధునిక గోర్గాన్) లో 998 లో స్థిరపడినాడు. పరిశోధనలు చేయడం, పుస్తకాలు వ్రాయడం మరియు మరింత నేర్చుకోవడం లో తన సమయాన్ని గడిపాడు.ఈ సమయంలో ప్రాచీన సామ్రాజ్యాల యొక్క చారిత్రక వివరాలను విశ్లేషించి, ఆ సామ్రాజ్యాల పెరుగుదల మరియు పతనం గురించి  ఒక స్మారక కధనాన్ని రచించాడు. ఈ పుస్తకం చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, ఖగోళశాస్త్రం మరియు సాంస్కృతిక అధ్యయనాల గతకాలపు సంఘటనలను వివరిoచినది.

అల్-బెరుని అక్కడినుండి ఘజ్నీకి తరలిపోయాడు అక్కడ సుల్తాన్ మహముద్ యొక్క ఆస్థానం లో ఉండేవాడు. ఘజ్నీ మహ్మూద్ యొక్క సామ్రాజ్యం నేటి ఆధునిక ఇరాన్, పాకిస్తాన్, మరియు భారతదేశం తో  ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ యొక్క సరిహద్దులకు మించి విస్తరించింది. భారతదేశంలో అల్-బెరునీ యొక్క ప్రయాణాలు  అతని గొప్ప ఆవిష్కరణలలో కొన్నింటికి కారణం అయ్యాయి.  ఘజ్ని సుల్తాన్ మహమూద్ వెంట అల్-బెరునీ భారతదేశo పై  సైనిక దండయాత్రలలో పాల్గొన్నాడు.  

అల్-బెరునికి  భారతదేశపు  భాష, సంస్కృతి మరియు మతo పట్ల ఆసక్తి పెరిగింది. ఆల్-బెరునీ త్వరగా సంస్కృత భాషను నేర్చుకోగలిగాడు.అతను సంస్కృతం నుండి అరబిక్ మరియు పర్షియన్ భాషల లోనికి గ్రంధాలను  అనువదించాడు మరియు అరబిక్ నుండి సంస్కృతం లోనికి  అనువదించాడు. నాగరికతలు పరస్పరం ఒకరినొకరు నాశనం చేయటానికి బదులు ఒకదానికొకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం అతని  ఒక దృఢ నమ్మకం.

అల్-బెరునీ ప్రాచీన భారతీయ చరిత్ర యొక్క ఎన్సైక్లోపెడియాని సంకలనం చేయగలిగాడు, దానిని  “కితాబ్ ధరిఖ్ అల్-హింద్ - ది బుక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ” అని పిలుస్తారు. నిజానికి, పురాతన భారతదేశం గురించి నేడు తెలిసిన చాలా విషయాలు అల్-బెరుని పుస్తకం నుండి గ్రహించినవే. అల్-బెరుని చారిత్రక సంఘటనల నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోని, పురాతన భారతదేశం గురించి వివరించాడు. భారతీయ తత్వశాస్త్రం, భూగోళ శాస్త్రం మరియు సంస్కృతికి ఒక దర్పణం అల్-బెరునీ పుస్తకం.  “తారీఖ్ అల్-హింద్” ప్రపంచంలోని మొదటి అంత్రోపోలజి పుస్తకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

శాస్త్రీయ ఆవిష్కరణలు (Scientific Discoveries):
భారతీయ చరిత్ర మరియు సంస్కృతిలో నిపుణుడు అయిన అల్-బెరుని శాస్త్ర విజ్ఞానం నందు కూడా నిపుణులు.  వివిధ ప్రాంతాలలో తన ప్రయాణాల కారణంగా అతను వివిధ ప్రాంతాల  భౌగోళిక లక్షణాలను విశ్లేషించడం ద్వారా అల్-బెరుని భూగర్భ శాస్త్రం మరియు బౌగోళిక సిద్ధాంతాలను మరియు భూమి రూపాలు, నీటి పాత్రనువివరించాడు.
ఒక అధ్యయనంలో అతను ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి హిమాలయాల పర్వతాల వరకు గల  పురాతన సముద్రపు జంతువుల శిలాజాలను గుర్తించాడు. అల్-బిరునీ ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక సమయంలో మహాసముద్రంలో ఉండేయని లక్షలాది సంవత్సరాలుగా మార్పులు చెంది  ప్రస్తుత స్థానాన్ని కలిగి ఉన్నాయని వివరించాడు. ఇది ప్లేట్ టెక్టోనిక్స్ (plate tectonics) యొక్క ఆధునిక అవగాహనకు దారితీసింది - ఖండాలు కాలక్రమేణా ఎలా కదులుతాయి మరియు మారతాయి అనేది వివరించాడు.
అల్-బిరునీ భూగర్బ శాస్త్ర రంగంలో కూడా ప్రాచుర్యం పొందాడు. అతను వందల లోహాలు మరియు రత్నాలని సేకరించి, విశ్లేషించి, సంకలనం చేశాడు. అతను వాటి లక్షణాలు వివరించాడు, వాటి తయారు ఎలా, మరియు అవి ఎక్కడ దొరుకుతావో వివరించాడు. రత్నాలపై అతని పుస్తకాలు వందల సంవత్సరాలుగా విలువైన రాళ్ళను అర్ధం చేసుకోవడానికి ప్రామాణికమైనవి.
అల్-బిరునీ క్రింది రంగాలలో పరిశోధన చేసాడు
·        దాని అక్షం మీద భూమి ఎలా తిరుగుతుంది
·        ఎలా బావులు మరియు ఊటల నుండి  నీరు ఉపరితలానికి చేరుతుంది.
·        మెకానిక్స్ అధ్యయనం లోకి స్టాటిస్టిక్స్ మరియు డైనమిక్స్ కలపడం
·     అనేక వందల నగరాల అక్షాంశ మరియు రేఖాంశాలను రికార్డు చేశాడు, అది ప్రతి నగరం కోసం మక్కా దిశను నిర్ణయించటానికి తోడ్పడినది.
·        నీడలు యొక్క ఆప్టికల్ స్వభావం, ముఖ్యంగా ప్రార్థన సమయాల లెక్కింపుకు వాటి  ఉపయోగం
·        మూఢ జ్యోతిషశాస్త్రాన్ని శాస్త్రీయ ఖగోళశాస్త్రం నుండి వేరుచేయటం .

తన 75 సంవత్సరాల కాలంలో అల్-బెరునీ అనేక నూతన విషయాలను అర్ధం చేసుకున్నాడు. 1048 లో అతను మరణించిన సమయానికి అతను 100 కు పైగా పుస్తకాలను వ్రాసాడు. వివిధ విషయాల పై అతని మేధావితనం  మరియు నైపుణ్యం, అతడి స్థానాన్ని  గొప్ప ముస్లిం పండితుల మధ్య   ఉంచుతుంది. గతంలోని ముస్లిం పండితుల సామర్ధ్యం, విజ్ఞాన శాస్త్రాలలో వారి విజ్ఞాన పరిజ్ఞానం తెలుసుకోవడానికి అతని జీవితం ఉపయోగపడుతుంది. రాజకీయ సమస్యలను, యుద్ధాలు, మరియు సాధారణ అస్థిరతలను మరియు  ప్రపంచంలోని మారుతున్న పరిశోధనలకు అనుగుణంగా  ఇంకా గొప్ప ఆవిష్కరణలు చేయడానికి తోడ్పడుతుంది.


No comments:

Post a Comment