అల్-జహ్రావి తర్వాత గత 1000 సంవత్సరాల్లో ముస్లిం ఉమ్మా(సమాజం) లో మరోసారి అలాంటి మేధో దిగ్గజం పుట్టలేదు. అల్-జహ్రావి
(i) ఆప్తాల్మాలజీ; (ii) కుప్పింగ్ (హిజమా); (iii) సర్జరీ మరియు (iv) డెంటిస్ట్రీ పై రచనలు చేసారు.
అబూ అల్-ఖాసిమ్ ఖలాఫ్ బిన్ అబ్బాస్ అల్-జహ్రావి (Abu
al-Qasim Khalaf bin Abbas Al-Zahrawi), (క్రీ.శ. 936-1013),
అల్బుకాసిస్(ALBUCASIS)
గా పడమటి దేశాల వారికి పరిచయం. అతడు యురోపియన్ శస్త్రవైద్యులు దృష్టిలో గాలెన్, (పురాతన ప్రపంచ ప్రసిద్దిచెందిన సర్జెన్)
కన్నా గొప్ప వాడు. అల్-జహ్రాయ్ తన మొత్తం
జీవితాన్ని మరియు మేధావితనం ను పూర్తిగా
వైద్యశాస్త్ర యొక్క పురోగతికి మరియు ముఖ్యంగా
శస్త్రచికిత్సకు అంకితo చేసాడు.
అతని గొప్ప రచన “అట్-టాస్రిఫ్ లిమాన్ 'అజిజా' అట్-తాలిఫ్ (ది మెథడ్ ఆఫ్ మెడిసిన్)”. ఈ 30 వాల్యూమ్ వైద్య గ్రంథం శస్త్రచికిత్స, మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఫార్మకాలజీ, న్యూట్రిషన్ మొదలైనవాటికి సంబంధించినది. ఈ
పుస్తకం 1000 AD ని పూర్తి అయినది. దాదాపు 50 ఏళ్ల కృషి ఫలితంగా ఈ పుస్తకం
రూపొందినది.
అల్-జహ్రావి
యొక్క రచనలు లాటిన్ లోకి అనువదించబడ్డాయి
మరియు అనేక శతాబ్దాలుగా ఐరోపాలో ప్రామాణిక పుస్తకం వలె ఉపయోగించబడ్డాయి.
శరీరనిర్మాణం మరియు శస్త్రచికిత్సపై అతని రచనలు అతన్ని హిప్పోక్రేట్స్ మరియు
గాలెన్ స్థాయికి పెంచాయి. వాస్తవానికి అతని కృషి శస్త్రచికిత్స ను మెడిసిన్ నుండి దూరంగా
స్వతంత్ర స్పెషాలిటీగా రుపొందించిడం. మధ్య యుగాలలో ఇటలి, ఫ్రాన్సుమరియు యూరప్ లోని
విశ్వవిద్యాలయాల లో శస్త్రచికిత్స పైన “అల్-తఫ్సీర్
” ముఖ్య గ్రంధం గా ప్రసిద్ధి చెందింది. అల్-జహ్రావి ఇస్లాం లో నర్సింగ్ ప్రోత్సహించిన
మరియు మంత్రసానులు గా మహిళలు ప్రోత్సహించిన
మొదటి పరిశోధకుడు.
ఐరోపా లో మెడికల్ సైన్స్ పై “తఫ్సీర్ ” త్వరితగతిన ప్రమాణిక గ్రంధంగా
మారి లాటిన్ లో ఐదు సార్లు అనువదించబడింది.
ఇది ఇప్పటివరకు వ్రాసిన మొట్టమొదటి స్వతంత్ర శస్త్రచికిత్స గ్రంథం. ప్రసిద్ధ
ఫ్రెంచ్ సర్జన్ గై డి చౌకియాక్అభిప్రాయం లో "ఇది మధ్యయుగ శస్త్రచికిత్స పై వ్రాసిన గొప్ప
ఘనత కలిగిన గ్రంధం." అతను 200 సార్లు పైగా “అల్-తస్రీఫ్” పేర్కొన్నాడు. ఈ
విధంగా వైద్య శాస్త్ర చరిత్రలో గొప్ప ప్రసిద్ధ
చెందిన గ్రంధం "కితాబ్-అల్-తస్రిఫ్". ఇది మెడిసిన్ పై ముప్పై సంపుటికల ఎన్సైక్లోపెడియా. ప్రొఫెసర్ మరాజీ సూచన ప్రకారం ఇది
“మెడిసిన్ చరిత్రలో తన గొప్ప కృషి మరియు 50 ఏళ్ల వైద్య వ్యక్తిగత అనుభవాల సారాoశం”.
అల్-జహ్రావి 1- శస్త్రచికిత్సలో, రక్తస్రావం
యొక్క నియంత్రణలో మరియు ఎముకల విరగటం లో పాడింగ్ గా కాటన్ ఉపయోగించాడు. 2- హేమోఫిలియా వివరాలను వివరించాడు. 3- కాతరి, మైనం మరియు మద్యం ను శస్త్రచికిత్సలో
పుర్రె నుండి రక్తస్రావమును నియంత్రించడానికి మరియు అంబ్రోస్ పారే ముందుగా ధమనుల
యొక్క లిగూచర్ని వివరించడానికి (Use cautery, wax and
alcohol to control bleeding from the skull during cranial surgery and described
the ligature of arteries long before Ambrose Pare) 4. యోని (vagina) శస్త్ర చికిత్స కోసం
లిథొత్తమిక్ స్థానమును బోధించినాడు మరియు ఎక్టోపిక్ గర్భాన్ని వివరించిన మొదటి
శస్త్రచికిత్సకుడు.-5 ట్రాచోటోమీ
శస్త్రచికిత్సను వివరిస్తూ, తన సేవక పై
దానిని ఒక అత్యవసర చికత్స అందు
ఉపయోగించాడు 6. ఆర్థోడోంటిక్
ను వివరిస్తూ పాడైపోయిన(misaligned) పళ్ళు చికిత్స ఎలా చేయాలో వివరించారు.
గెరార్డ్ డి క్రెమోనా అల్-జహ్రావి పుస్తకం అల్ తస్రిఫ్ (ALTASREIF) ను పన్నెండవ శతాబ్దంలో అని లాటిన్ లోకి అనువదించాడు. ఈ అనువాదం లాటిన్ శాస్త్రవేత్తలు, వైద్యులు, ఫార్మసిస్ట్లు మరియు సర్జన్లను ప్రభావితం చేసింది. పదిహేను శతాబ్దంలో ఐరోపాలోని
పలువురు రచయితలు అల్-జహ్రావి పుస్తకం
గురించి పేర్కొన్నారు ఫ్రెంచ్ సర్జన్ గై
డి చౌలీక్, ప్రొఫెసర్
లూసియాన్ లేక్లెర్క్ వారిలో ప్రముఖులు.
అల్-జహ్రావి (అల్బుకాసిస్) గొప్ప ముస్లిం శస్త్రవైద్యుడు. అతని కాలంలోని
యూరోపియన్ శస్త్రవైద్యులు అతనిని శస్త్ర చికత్స పై గొప్ప ప్రామాణికం అని భావించారు.
ఆల్ జహ్రావిని పియట్రో ఆర్గల్లాటా (1423) " శస్త్రచికిత్సల అధిపతిగా " వర్ణించారు.
మరో ఫ్రెంచ్ సర్జన్ జాక్స్ డెలి చాంప్స్ (1513-1588), తన విస్తృతమైన వ్యాఖ్యానంలో “అల్-తఫ్సీర్”
ప్రముఖ గ్రంధం అని మరియు మధ్య యుగాల నుంచి
మరియు పునరుజ్జీవనo వరకు అల్ జహ్రావి
యొక్క గొప్ప ప్రతిష్టను ధ్రువీకరించాడు.
అతను తన మొత్తం జీవితాన్ని పూర్తిగా మెడిసిన్ యొక్క పురోగతికి మరియు ముఖ్యంగా
శస్త్రచికిత్సకు అంకితం చేశారు.
అల్-జహ్రావి
శస్త్రచికిత్సలో వివిధ పరికరాల వాడకం వివరించిన మొదటి రచయిత. ఈ శాస్త్ర చికత్స
పరికరాలు ఎక్కువగా అల్-జహ్రావి చేత కనుగొనబడ్డాయి. నాలుక మాంద్యం tongue depressor, దంత
ఎక్స్ట్రాక్టర్, ఫోర్సెప్స్, కత్తెరలు, కత్తిరించిన
కత్తులు, కాథెటర్ మరియు
ప్రసూతి సాధనల సుమారు 200 డ్రాయింగ్లు
ఉన్నాయి. అతని పరికరాలు నేడు అనేక మార్పులతో ఉపయోగంలో ఉన్నాయి. అతను ఆధునిక శస్త్రచికిత్సలో అనేక పద్ధతులను వివరించాడు. ప్రాణాంతక స్తన కణితిని (malignant breast tumour) వివరిస్తున్నప్పుడు, అల్-జహ్రావి దానిని
పూర్తిగా తొలగించమని ఆదేశించాడు. దాని మూలం నుండి తీసివేయబడాలి అన్నాడు.
అల్-జహ్రావి ప్రమాదాలు
మరియు ట్రామా యొక్క శస్త్రచికిత్సా పద్ధతులు సూచించాడు. అతి పురాతన ఆపరేషన్
ట్రిపనేషన్ (Trepanation). అప్పటి నుండి అనేక
మంది గొప్ప వైద్యులు హోమర్, హిప్పోక్రేట్స్, హేరోఫిలస్, ఎరాసిస్టాటస్, గాలెన్ వంటి వారు శస్త్రచికిత్స
అభివృద్ధిలో పాల్గొన్నారు. అల్ జహ్రావీ వారిలో ఒకరు. అతను స్పెయిన్ రాజు ఆల్-హకం II కి వైద్యుడు.
No comments:
Post a Comment