గేబర్ లేదా అబూ ముసా జబీర్ ఇబ్న్ హయ్యన్ ఒక
ప్రముఖ ఇస్లామిక్ ఆల్కెమిస్ట్,
ఫార్మసిస్ట్, ఫిలాసఫర్, అస్ట్రోనోమర్, తత్వవేత్త మరియు
బౌతిక శాస్త్రవేత్త. ఇతను "అరబ్ రసాయనక
శాస్త్ర పితామహుడు” గా యూరోపియన్లచే పిలవబడ్డాడు.
కొందరు అతను ఒక అరబ్ మరి కొందరు అతడిని పెర్షియన్ అని వర్ణించారు.
ఇరాన్ లోని ఖురాసాన్ లోని తుస్ లో జబీర్ 721 లేదా 722లో జన్మించాడు. అతను యెమన్ నుండి కుఫ్యాకు
(ప్రస్తుతం ఇరాక్) వలసపోతున్న అరేబియా అజ్ద్ తెగ యొక్క ఔషధ నిపుణుడు హయ్యాన్
అల్-అద్దీ కుమారుడు. జాబిర్ యెమెన్ లో పెరిగాడు మరియు హర్బి అల్-హిమ్యారీ అనే ఒక
పండితుడి క్రింద ఖురాన్, గణితం మరియు ఇతర విషయాలను అధ్యయనం చేశాడు.
అబ్బాసీలు అధికారాన్ని తీసుకున్న తరువాత, జాబిర్ కుఫ్యాకు తిరిగి వచ్చాడు.కుఫాలో వైద్య వృత్తిని అభ్యసించినాడు.776 లో అతను కుప్యా లో రసాయనిక శాస్త్రం పట్ల ఆసక్తి ప్రదర్శించాడు. జాబిర్ మరణించే
వరకు కూపా లోనే ఉన్నాడు.ఎన్సైక్లోపీడియా బ్రిటానికాచే అతని మరణం.815 గా ఇవ్వబడింది, కానీ ఇతర వనరుల ద్వారా 808 గా ఉంది.
రసాయనిక శాస్త్రం లో అతని సేవలుContributions to
Chemistry:
జబీర్ ఎక్కువగా రసాయన శాస్త్రo లో తన రచనలకు
ప్రసిద్ధి చెందారు. అతను క్రమపద్ధతిలో ప్రయోగాన్ని నొక్కి చెప్పి రసాయన శాస్త్రం
ను ఒక విజ్ఞాన శాస్త్రంగా మార్చాడు. అనేక రకాలైన
రసాయన ప్రయోగశాల సామగ్రిని
కనిపెట్టడంతోపాటు, అనేక సాధారణ రసాయన పదార్థాలు మరియు ప్రక్రియల
యొక్క ఆవిష్కరణ మరియు వర్ణనకు కారకుడు అయ్యాడు. నేటి కెమిస్ట్రీ మరియు రసాయన
ఇంజనీరింగ్ లో విరివిగా వాడబడే హైడ్రోక్లోరిక్ మరియు నైట్రిక్ ఆమ్లాలు, స్వేదనం మరియు స్ఫటికీకరణ(distillation, and crystallization)రూపొందించినాడు.
అల్-రజి, అల్-తుఘ్రాయి
మరియు అల్-ఇరాకీలు (9 వ, 12 వ మరియు 13 వ శతాబ్దాలలో నివసించిన తరువాతి ఇస్లామిక్
రసవాదుల) కోసం అతను మార్గం సుగమం చేశాడు. అతని పుస్తకాలు మధ్యయుగ యూరోపియన్
రసవాదులను బలంగా ప్రభావితం చేశాయి మరియు తత్వవేత్త యొక్క రాతి(philosopher's stone)కోసం వారి శోధనను బలపరిచాయి. మార్మిక
సిద్ధాంతం (అతను ఒక సూఫీగా భావించబడ్డాడు) మరియు మూఢనమ్మకాలతో అనుబంధం ఉన్నప్పటికీ, అతను మరింత స్పష్టంగా, ప్రయోగాత్మక ప్రాముఖ్యతను గుర్తించి ప్రకటించాడు.
"రసాయన శాస్త్రంలో మొట్టమొదట ముఖ్యమైనదిThe first essential in chemistry", "మీరు ఆచరణాత్మక పనిని చేయాలని మరియు ప్రయోగాలను ప్రయోగించాలని, ప్రయోగాత్మక పని చేయకపోయినాలేదా ప్రయోగాలు చేయకపోయినా, నైపుణ్యం సాధించలేరు" అని అతను ప్రకటించాడు. జాబిర్ నేడు ఉపయోగించే అల్లెమ్బిక్
(alembic)వంటి అనేక రసాయన పరికరాల అభివృద్ధి,ఆవిష్కరణ చేసాడు. వాటితో స్వేదనం (distillation)చేయడం సులభం, సురక్షితం మరియు
సమర్థవంతమైనది.
స్వేదనం ప్రక్రియ(Distillation Process):సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలిపి వివిధ లవణాలు
వేయడం ద్వారా, జబీర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం (ఉప్పు నుండి)
మరియు నైట్రిక్ ఆమ్లం (ఉప్పుపెరిsaltpeter నుండి) కనుగొన్నారు. రెండు కలపడం ద్వారా, అతనుబంగారంను కరిగించేకొన్ని పదార్ధాలలో ఒకటి అయినఆక్వా రిజియాను(aqua regia) ను కనుగొన్నాడు. బంగారు వెలికితీత మరియు శుద్దీకరణలో దాని స్పష్టమైన ఉపయోగాలు కాకుండా, ఈ ఆవిష్కరణ తరువాతి సంవత్సరాల్లో రసవాదుల యొక్క కలలకు ఇంధనంగా పని చేసింది.
సిట్రిక్ ఆమ్లం (కుళ్ళిన నిమ్మకాయలు మరియు ఇతర పండని పండ్లు(the sour component of
lemons and other unripe fruits), ఎసిటిక్ యాసిడ్
(వినెగర్ నుండి), మరియు టార్టరిక్ ఆమ్లం (వైన్ తయారీ చేసే
శ్లేషాలresidues నుండి) వంటివి కూడా కనుగొన్నాడు.
ఉక్కు మరియు ఇతర లోహాలను తయారు చేయడం, వాటిని తుప్పు పట్టకుండా చూడటం , బంగారంపై చెక్కడం, అద్దకం మరియు వాటర్ రూపింగ్ వస్త్రం, చర్మశుద్ధి లెదర్ మరియు పిగ్మెంట్లు మరియు ఇతర పదార్ధాల రసాయన విశ్లేషణ వంటి
అనేక ఉత్పాదక ప్రక్రియల అభివృద్ధికి జాబీర్ తన రసాయన విజ్ఞానాన్ని అన్వయించాడు.
గాజు తయారీలో మాంగనీస్ డయాక్సైడ్ ఉపయోగించడాన్ని అతను అభివృద్ధి చేసాడు. వేడిచేసిన
వైన్ ఆవిరి చెందును అని కనుగొన్నాడు తరువాత అది
అల్-రజి యొక్క ఆవిష్కరణఇథనాల్ కనుగొనటానికి మార్గం సుగమం చేసింది.
లోహాలను మరియు అలోహాలు గా ఆధునిక వర్గీకరణ
యొక్క ప్రారంభ వర్ణన అతని రసాయన నామకరణం లో చూడవచ్చు. అతను మూడు వర్గాలు
ప్రతిపాదించాడు: "ఆవిరి” చెందే కర్పూరం, ఆర్సెనిక్, మరియు అమ్మోనియం క్లోరైడ్ వంటివి, బంగారం, వెండి, సీసం, రాగి మరియు ఇనుము వంటి "లోహాలు"; మరియు "రాళ్ళు" వాటిని పౌడర్లుగా మార్చవచ్చు. మధ్య యుగాలలో, రసాయన
శాస్త్రంపై జబీర్ యొక్క గ్రంథాలు లాటిన్ లోకి అనువదించబడ్డాయి మరియు యూరోపియన్ రసవాదులకు
ప్రామాణిక పాఠాలుగా మారాయి.
వీటిని తన కితాబ్ అల్-కిమియా (బుక్ ఆఫ్ ది కాంపొసిషన్ ఆఫ్
ఆల్కెమీ ఇన్ యూరోప్), రాబర్ట్ ఆఫ్ చెస్టర్ (1144) చే అనువదించబడింది; మరియు “కితాబ్ అల్-సబీన్”ఇది గెరార్డ్ ఆఫ్ క్రీమోనా (1187 కి ముందు) లో చేర్చాడు. మార్సలిన్
బెర్థెల్ట్ ఇతని పుస్తకాల్లో కొన్ని “బుక్
ఆఫ్ ది కింగ్డమ్, బుక్ ఆఫ్ ది బ్యాలెన్స్స్, మరియు బుక్ ఆఫ్ ఈస్టర్న్ మెర్క్యురి” పేర్లతో అనువదించాడు.జాబిర్ ప్రవేశపెట్టిన అనేక సాంకేతిక పదాలు, ఆల్కాలీ వంటివి, వివిధ ఐరోపా భాషల్లోకి ప్రవేశించాయి మరియు
శాస్త్రీయ పదజాలంలో భాగమయ్యాయి.
రసవాదానికి జాబిర్
చేసిన సేవలు(Contributions
to Alchemy)::
ఖలీఫా హరున్ అల్-రషీద్ ఆస్థానం లో జబీర్ ఒక రసవాది
అయ్యాడు, అతని కోసం అతను కితాబ్ అల్-జుహ్రా ("ది
బుక్ అఫ్ వీనస్ -రసవాదం యొక్క గొప్ప కళ") వ్రాశాడు.
జాబిర్ యొక్క ఆల్కెమికల్ పరిశోధనలు టక్విన్
యొక్క అంతిమ లక్ష్యం చుట్టూ తిరుగుతాయి - జీవితం యొక్క కృత్రిమ సృష్టి. రసవాదానికి
షియేట్ మిస్టిసిజంతో సుదీర్ఘ సంబంధం ఉంది; మొదటి ఇమామ్ , అలీ ఇబ్న్ అబి తాలిబ్, ప్రకారం "రసవాదం భవిష్యవాణి సోదరి".
రసవాదానికి సంబంధించిన జాబిర్ యొక్క ఆసక్తి
అతని ఉపాధ్యాయుడు జాఫెర్ అల్-సాడిక్ ద్వారా ప్రేరణ పొందినాడు మరియు "సూఫీ" గా పిలువబడ్డాడు.అతని
రచనలలో జాబిర్ ఈజిప్టు మరియు గ్రీకు రసవాదులయిన హెర్మెస్ ట్రైస్మేజిస్టస్, అగాథోడైమన్, పైథాగరస్ మరియు సోక్రటీస్ లకు(Hermes Trismegistus,
Agathodaimon, Pythagoras, and Socrates) నివాళులు అర్పిస్తాడు.
అతను రసవాదం యొక్క సుదీర్ఘ చరిత్రను
ప్రస్పుటం చేశాడు, "దీని మూలం అరియస్ ... మొదటి తరంతత్వవేత్త మరియు
రాతిపై ప్రయోగాన్ని ప్రయోగించిన మొదటి వ్యక్తి ... మరియు ప్రకృతి యొక్క పనితీరును
అనుకరించటం ను వ్యక్త కలిగి ఉన్నాడని అతను
ప్రకటించాడు" (నాస్ర్ ,
సెయిడ్ హోస్సీన్, ఇస్లాం మతం యొక్క సైన్స్ మరియు నాగరికత).
అరిస్టాటిల్ భౌతిక శాస్త్రానికి, జబీర్ నాలుగు లక్షణాలను వేడిమి, చల్లదనం, పొడి మరియు తేమ (బర్క్హార్డ్ట్, పేజి 29) జోడించారు. ప్రతి అరిస్టాటిల్ మూలకం ఈ లక్షణాలు
కలిగి ఉంటుంది: అగ్ని వేడి మరియు పొడి, భూమి చల్లని
మరియు పొడి, నీరు చల్లగా మరియు తడిగా మరియు గాలి వేడిగా
మరియు తడిగా ఉండేది. లోహాలు లో ఈ లక్షణాలు రెండు అంతర్గత మరియు రెండు బాహ్యoగా ఉన్నాయి. ఉదాహరణకు, లీడ్ చల్లని మరియు పొడి మరియు బంగారం వేడి మరియు తడిగా ఉంది.
జబీర్ మెడిసిన్,ఖగోళ శాస్త్రం మరియు ఇతర
విజ్ఞాన శాస్త్రాలలో ముఖ్యమైన రచనలు
చేశారు. అతని పుస్తకాలలో కొన్ని మాత్రమే ఎడిట్ చేయబడినవి మరియు కొన్ని ప్రచురించబడ్డాయి మరియు కొన్ని అనువాదం
రూపేణ అందుబాటులో ఉన్నాయి. చంద్రుని మీద బిలం(Crater) కు ఉన్న “గీబర్ బిలం”అని అతని పేరు పెట్టబడింది.
జబీర్
రచనలు Writings
by Jabir::
జబీర్ ఇబ్న్ హయ్యన్ యొక్క రచనలు నాలుగు
విభాగాలుగా విభజించబడ్డాయి:
1)112 పుస్తకాలు: ఈ
సమూహం ఎమెరాల్డ్ టాబ్లెట్ యొక్క అరబిక్ సంస్కరణను కలిగి ఉంది.ఇది పురాతనమైనది, ఇది హెర్మెటిక్ లేదా "ఆధ్యాత్మిక" రసవాదం యొక్క పునాది. మధ్య
యుగాలలో ఇది లాటిన్ లోకి అనువదించబడింది
(టబులా స్మరాగ్డినాTabula Smaragdina)మరియు యూరోపియన్ రసవాదులలో విస్తృతంగా
వ్యాపించింది.
2. ది సెవెన్టి బుక్స్:వీటిలో ఎక్కువ భాగం మధ్య యుగాలలో లాటిన్
లోకి అనువదించబడ్డాయి. ఈ సమూహంలో కితాబ్
అల్-జుహ్రా ("బుక్ అఫ్ వీనస్") మరియు కితాబ్ అల్-అహార్ ("బుక్ ఆఫ్
స్టోన్స్") ఉన్నాయి.
4.ది బుక్స్ ఆన్ బ్యాలన్స్:ఈ సమూహం లో ఆయన రచించిన
“ప్రకృతి లోని లోని సంతులనం యొక్క అత్యంత
ప్రసిద్ధ సిద్ధాంతం' ఉన్నది. కొంతమంది
పండితులు ఈ రచనల లో కొన్ని జాబిర్ చేత
వ్రాయబడలేదని అతని అనుచరుల యొక్క వ్యాఖ్యానాలు మరియు చేర్పులు అంటారు. ఏది ఏవైనా జబీర్
యొక్క ఆల్కెమీ రచనలు గానే వాటిని పరిగణించవచ్చు.
No comments:
Post a Comment