8 October 2017

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభ్యాసన(learning) సంక్షోభం (A learning crisis in the developing world)




విద్యను అభ్యసిస్తున్నప్పటికీ కనీస నైపుణ్యత స్థాయిలను సాధించటంలో పిల్లలు విఫలమవడం ఆర్థిక, నైతిక సంక్షోభన్ని సూచిన్తుంది.
గ్రామీణ భారతదేశంలోఅసిర్ యొక్క తాజా ఎడిషన్ నివేదిక  ప్రకారం, 5వ తరగతి విద్యార్ధులలో కేవలం 47.8% మాత్రమే తరగతి IIవ తరగతి స్థాయి పాఠాన్ని చదవగలరు మరియు 8 వ తరగతి విద్యార్థుల్లో 43%మాత్రమే Vవతరగతి స్థాయి అంకగణితం చేయగలరు.
కొంతకాలంగా భారతీయ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు హాజరవడం జరుగుతుంది  కానీ తగినంతగా నేర్చుకోవడం లేదని మనకు  తెలుసు. కాని ఇప్పుడు, అది  కేవలం భారతీయ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక తక్కువ- మరియు మధ్య-ఆదాయం కలిగిన దేశాలని చుట్టుముడుతున్న  ప్రపంచ అంటువ్యాధి. యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ (UIS) కొత్త అంచనాల ప్రకారం  సుమారు 617 మిలియన్ పిల్లలు లేదా ప్రతి 10 మందిలో ఆరుగురు  చదివటం మరియు గణితంలో కనీస నైపుణ్యత స్థాయిలను సాధించుట లేదు.
యుఐఎస్ డాటా ప్రకారం, సబ్-సహారా ఆఫ్రికాకు చెందిన దేశాల విద్యా గణాoకాలు పరమ చెత్తగా ఉన్నాయి, దాదాపు 88% పిల్లలు సరిగా చదివలేరు లేదా వారు మిడిల్ స్కూల్ ముగిసే సమయానికి సాధారణ గణితాన్ని చేయలేరు. దక్షిణ మరియు మధ్య ఆసియా రెండవ స్థానం లో ఉంది, ఆ దేశాల పిల్లలు ప్రాధమిక విద్యలో  కనీస ప్రమాణాలు కలిగి లేరు.
అసిర్ యొక్క తాజా ఎడిషన్ నివేదిక  ప్రకారం, గ్రామీణ భారతదేశపు 5వ తరగతి విద్యార్ధులలో కేవలం 47.8% మాత్రమే తరగతి IIవ తరగతి స్థాయి పాఠాన్ని చదవగలరు మరియు 8 వ తరగతి విద్యార్థుల్లో 43%మాత్రమే Vవతరగతి స్థాయి అంకగణితం చేయగలరు. గత నెల చివరిలో విడుదలైన వార్షిక "వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్" లోప్రపంచ బ్యాంకు దీనిని "అభ్యాస సంక్షోభంlearning crisis" గా కాకుండా "నైతిక సంక్షోభం"“moral crisis గా వర్ణించింది మరియు దేశాల మధ్య మరియు దేశం లోపల అసమానతలను పెంచడం గా భావించినది.
అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం యొక్క అంతర్జాతీయ అంచనాలు తక్కువ ఆదాయం కలిగిన దేశాల నుండి వచ్చిన విద్యార్ధులు అధిక ఆదాయం కలిగిన దేశాల వారి కంటే దారుణంగా వెనుకబడి  ఉన్నారు అని తెలుపుతున్నాయి. బలమైన మధ్య-ఆదాయ దేశాల నుండి వచ్చిన అగ్రశ్రేణి విద్యార్ధులు  కూడా అధిక ఆదాయం కలిగిన దేశాల విద్యార్ధుల కంటే  క్రింద స్థాయి లో ఉంటారుమరియు వారితో సమాన స్థాయి సంపాదించడానికి  కష్టపడుతున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఇండోనేషియాగత 10-15 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (పిఐఎస్ఏ) లో తన పనితీరును గణనీయంగా మెరుగుపరిచిందిమరియు దాని 2003-15 రేటు ప్రకారం దాని విద్యార్ధులు అభివృద్ధి చెందిన దేశాల విద్యార్ధుల గణిత శాస్త్ర స్థాయిని చేరడానికి ఇంకా ఐదు దశాబ్దాలు మరియు చదవడానికి మరో ఏడు దశాబ్దాలు పట్టవచ్చు.
ముఖ్యంగాఈ అభ్యాస సంక్షోభం దేశం అంతా  నమోదు స్థాయిలు పెరగినప్పుడు రావటం విచారకరం గా  ఉంది. సార్వత్రిక నమోదును భారత్ సాధించింది మరియు ప్రపంచవ్యాప్తంగా, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాఠశాలకు వెళ్ళే పిల్లల మధ్య అంతరం తక్కువ అవుతున్నది. అనగా విద్యఅందరికి అందుబాటులోనికి వచ్చింది  కానీ విద్య నాణ్యతలు క్షిణిoచినవి. దీనిని మనం వనరుల లేమి అనుకోవచ్చు కాని దక్షిణ కొరియా, వియత్నాం, పెరూ, మలేషియా మరియు టాంజానియాల లెర్నింగ్ (అబ్యాసన) రంగం లో సాదించిన విజయగాథలను మర్చిపోరాదు.
ఎందుకు కొన్ని వ్యవస్థలు విజయవంతం అవుతున్నవి? కొన్ని వ్యవస్థలు ఎందుకు విఫలమౌతున్నాయి? ముఖ్యంగావిఫలమౌతున్న వ్యవస్థలు  తమ కీలక అంశాలని సమర్థవంతంగా ఏకీకృతం చేయలేవు. ప్రపంచ బ్యాంకు నాలుగు అటువంటి అంశాలను-విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ మరియు పాఠశాల అవస్థాపనలగా (school administration and school infrastructure) సూచించినది.ఇందులో ఎఒక్క దానిలోనైనా  దోషాలు ఉంటే, మొత్తం వ్యవస్థ పాడవుతుంది. పర్యావరణ వ్యవస్థను సరిచేసుకోవడమంటే, ప్రతి అంశాన్నీ ఒక్కొక్కటిగానూ మరియు సమిష్టిగానూ తీర్చడం.
విద్యార్థులతో ప్రారంభించండి. పిల్లలు అనారోగ్యం లేదా ఆకలితో పాఠశాలకు వచ్చినా వారి అభ్యాస స్థాయిలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనికి గర్భిణీ స్త్రీలు, కొత్త తల్లులు మరియు వారి శిశువులను లక్ష్యంగా చేసుకునే  ప్రారంభ జోక్యం(early interventions) ప్రభావవంతంగా ఉంటుంది. భారతదేశం యొక్క ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం మరియు మధ్యాహ్న భోజన పథకం వీటికి మంచి ఉదాహరణలు.
ఉపాధ్యాయుల వైపు మరలండి. ఉపాధ్యాయుల నైపుణ్యాలు మరియు సామర్థ్యాల ప్రాముఖ్యత గురించి  ఎటువంటి విశదీకరణ అవసరం లేదు. అయినప్పటికీ, వారి పట్ల  తక్కువ శ్రద్ధ తీసుకుంటాము. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు వారి పాఠశాలలకు ఉత్తమమైన మరియు ఆకర్షణీయమైన టీచర్స్ ను  ఆకర్షించడానికి మంచి జీతం చూపుతున్నాయి. ఉపాధ్యాయులు, ఒకసారి నియమించబడిన తరువాత వారికి శిక్షణ ఇవ్వడం లేదా వారి వృత్తిపరమైన అభివృద్ధి కి మద్దతు ఇవ్వడం లేదు, దీనితో వీరు తరగతి గదిలో సరిఅయిన  నైపుణ్యం కలిగి ఉండరు.
విద్య వ్యవస్థలు అరుదుగా బోధన నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ప్రోత్సాహకాలను అందిస్తాయి మరియు బోధనకు  బదులుగా బోధన-కాని విదులను  జతచేస్తాయి. ఇథియోపియా మరియు గ్వాటెమాలలో బోధన కోసం పూర్తి బోధన సమయాలలో మూడవ వంతు మాత్రమే ఉపయోగించబడింది. భారతదేశంలోప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సెన్సస్ కార్మికులుగా మరియు ఎన్నికల అధికారులుగా  ఉపయోగపడుతున్నారు. 
స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు పాఠశాల యాజమాన్యాలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2015 లో భారతదేశంతో సహా ఎనిమిది దేశాల్లోని 1,800 ఉన్నత పాఠశాలపై స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ యొక్క నికోలస్ బ్లూమ్ చేసిన అధ్యయనం ప్రకారం మెరుగైన స్కూల్ నిర్వహణ మంచి ఫలితాలను అందించింది, మరియు ఎక్కువ స్వయంప్రతిపత్తి కలిగిన పాఠశాలలు ప్రత్యేకించి బాగా విజయవంతం అయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాఠశాల నిర్వహణలు, అభ్యాసన ఫలితాలను మెరుగుపర్చడానికి అరుదుగా అధికారం లేదా ప్రోత్సాహకరంగా ఉంటాయి.

పాఠశాల అవస్థాపన పరంగా, అభ్యాసన  స్థాయిలు మరియుఅభ్యాసన సాధనలు  అనగా  ల్యాప్ టాప్లు  మరియు ప్రయోగశాలలు మధ్య సంబంధాలు తరచూ అధిక ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. వనరులను ఎలా ఉపయోగించాలో అనేదాని మీద ఆధారపడి, ఇలాంటి వనరులు చాలా భిన్నమైన ఫలితాలను ఇస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, బ్రెజిల్ యొక్క  ల్యాప్టాప్ పర్ చైల్డ్ పథకం.  ఒక అంచనా ప్రకారం అక్కడ 40% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు తరగతి గదిలో అబ్యాసన పరికరాలను అరుదుగా ఉపయోగించారు.

భారత దేశ విద్యా హక్కు  చట్టం సమర్ధవంతంగా పనిచేయుట లేదు. విధానం మరియు ఆచరణలో మార్పు కోసం, ఫలితాలను అంచనా వేయడం ప్రారంభించాలి. విద్యా వ్యవస్థలను మరింత ప్రభావవంతంగా చేయడానికి ఇది ప్రపంచ బ్యాంకు యొక్క ఉత్తమ సిఫార్సు. భారతదేశంలో అస్సర్ సర్వే భారతదేశంలో జాగురుకతను మేల్కొల్పినది కానీ చాలా ముందుకు వెళ్ళవలసి ఉంది.  భారతదేశం అరుదుగా అంతర్జాతీయ అంచనాలలోinternational assessments పాల్గొంటున్నదిమరియు అది ఎప్పుడైతే పాల్గోoటదో అప్పుడు దాని స్థానం  దిగువ భాగంలో ఉంటుందని  తెలుస్తుంది.


పనితీరు అంచనా, కొలవటం మరియు బెంచ్ మార్కింగ్ మొదటి అడుగు. చివరికి, తక్కువ అభ్యాసం ఉచ్చు నుండి బయటపడటానికి  నిర్మాణాత్మక చర్య మరియు సాక్ష్యం-ఆధారిత విధానం అవసరం అవుతుంది.

No comments:

Post a Comment