26 October 2017

ఇబ్న్ సిన (అవిసెన్నా) - ఆధునిక వైద్య శాస్త్ర స్థాపకుడు మరియు వైద్యులకే వైద్యుడు గా ప్రసిద్ది కెక్కిన గొప్ప వైద్యుడు. (IbnSina (Avicenna) - Founder Of Modern Medicine Whom The World Know As Doctor Of Doctors)


Image result for avicenna


ఇబ్న్ సినా 980 C.E లో బుకారా సమీపంలోని ఆఫ్షనా గ్రామంలో జన్మించాడు, ఇది ప్రస్తుతం రష్యాకు దక్షిణాన ఉంది. అతని తండ్రి, అబ్దుల్లా, బాల్క్ప్రాంతం లోని ఇస్మాయిలీ శాఖకు చెందినవాడుమరియు అతని తల్లి బుఖారా సమీపంలోని ఒక గ్రామస్తురాలు.

ఇబ్న్ సినా, (పశ్చిమాన అవిసెన్నా)చిన్నతనం నుంచి అసాధారణ మేథోప్రతిభ ప్రదర్శించాడు మరియు పది సంవత్సరాల వయస్సులోదివ్య ఖుర్ఆన్ మరియు అరబిక్ క్లాసిక్లలో నైపుణ్యం సాధించాడు. తరువాత అతను ముస్లిం న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం మరియు సహజ విజ్ఞాన   శాస్త్రo మరియు లాజిక్, యుక్లిడ్ మరియు ఆల్గామేస్ట్ ను  అధ్యయనం చేశాడు.17 ఏళ్ళ వయసులో ఇబ్న్ సినా మెడిసిన్ వైపుకు తన దృష్టిని మళ్ళించాడు మరియు ప్రముఖ తత్వవేత్త అల్-ఫరాబీ రచనలను అద్యయనo చేసాడు.

18 ఏళ్ల వయస్సులో ఇబ్న్ సినాఒక వైద్యుడిగా ఖ్యాతి గడించాడు మరియు సమానీ పాలకుడైన నుహ్ ఇబ్న్ మన్సూర్ (976-997 CE)ఇబ్న్ సిన యొక్క సేవలకు కృతజ్ఞతగా, రాయల్ లైబ్రరీ ఉపయోగించుకోవటానికి అనుమతి ఇచ్చాడు. అందులో లో చాలా అరుదైన మరియు అతి విలువైన  పుస్తకాలు ఉన్నాయి.21 ఏళ్ల వయస్సులో తన మొదటి పుస్తకాన్ని వ్రాసాడు.అదేసమయంలో అతను తన తండ్రిని కోల్పోయాడు మరియు త్వరలోనే బుఖారా వదిలిపశ్చిమ దిశగా వెళ్ళాడు. అనేక ప్రయాణాల తరువాత జుర్జన్ నగరంలో ఇబ్న్ సినా తర్కం మరియు ఖగోళశాస్త్రం భోదించాడు మరియు అతని ప్రసిద్ద రచన ఖనన్ (Qanun) యొక్క మొదటి భాగంరచించాడు.

అక్కడినుండి అతను ఆధునిక టెహెరాన్ సమీపంలో రే కి తరలిఅక్కడ వైద్యుడిగా ప్రాక్టిస్ ప్రారంభించాడు.  రే లో అతని జీవితం అక్కడి అమీర్ యొక్క సేవలతో పగటి పూట బిజీగా నడిచిందిరాత్రిపూట వైద్య శాస్త్ర ప్రసంగాలు  మరియు నోట్స్ తో గడిచేది., షిఫా మరియు ఖనన్ అనే గొప్ప పుస్తకాలు అప్పటికే రచించబడినవి మరియు వాటినిఅతని విద్యార్ధులు అద్యయనం చేసే వారు. అమీర్ మరణం తరువాత, ఇబ్న్ సినా ఇస్ఫహాన్ కు వెళ్ళాడు. అక్కడి నగర పాలకుడు అల్వా అల్-దౌలా కు శాస్త్రీయ మరియు సాహిత్య అంశాలపై సలహా  మరియు మిలటరీ ప్రచార కార్యక్రమాలతో తన చివరి సంవత్సరాలు గడిపాడు.ఇబ్న్ సినా 58 సంవత్సరాల వయస్సులో1038 లో మరణించాడు. హమాదాన్ లో  ఆయన సమాధి చేయబడ్డాడు. అక్కడ అతని సమాధి ఇంకా ఉంది.

ఇబ్న్ సినా తత్వశాస్త్రం, ఔషధం, వేదాంతశాస్త్రం, జ్యామితి, ఖగోళ శాస్త్రం పై 21 ప్రధాన మరియు 24 చిన్న రచనలను పూర్తి చేసాడని అల్-ఖిఫ్టి (Al-Qifti)పేర్కొన్నాడు. మరొక మూలం (బ్రాకెల్మాన్) ప్రకారం ఇబ్న్ సినా99 పుస్తకాలు వ్రాసాడు. అందులో వైద్యశాస్త్రం పై16, వేదాంతశాస్త్రంమరియు అధిభౌతికపై68, ఖగోళశాస్త్రం పై11మరియు పద్యం మీద నాలుగు పుస్తకాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అరబిక్ లో ఉన్నాయి; కానీ పెర్షియన్ బాష లో  అతను“డానిష్-నామా-ఇ-అలై”అనే పేరుగల తాత్విక విజ్ఞాన శాస్త్రంపై ఒక పెద్ద మాన్యువల్ ను మరియు పల్స్ అనే  ఒక చిన్న గ్రంథం వ్రాసాడు.

అతని అత్యంత ప్రసిద్ధ అరబిక్ పద్యం ఉన్నత స్థితి నుండి ఆత్మ శరీరానికి చేరుట గురించి వివరిస్తుంది. ఆయన శాస్త్రీయ రచనలలో, “కితాబ్ అల్-షిఫా” (బుక్ ఆఫ్ హీలింగ్)- ఇది అరిస్టాటిల్ సంప్రదాయాల పై ఆధార పడినది  మరియు “ఆల్-ఖనన్-అల్-టిబ్ల”ఇది మెడిసిన్ పై  గ్రీకో-అరేబియా ఆలోచనలను తెల్పుతుంది. ఇబ్న్ సిన యొక్క 16 వైద్య రచనలు(ఎనిమిది అనారోగ్యాలు, పరిశుభ్రమైన సూత్రాలు, నిరూపితమైన పరిష్కారాలు, శరీర నిర్మాణ సంబంధ జ్ఞాపకాలకు సంబంధించిన 25 సూచనలు వంటి అంశాలపై వేర్వేరు వ్యాసాలకు సంబంధించినవి) కలవు.  అతని గద్య రచనలలో, గొప్పదిఖనన్  (Qanun)ఇందులో కార్డియాక్ మందుల పై వివరణ కలదు. అతని రచనలఅనేక లిఖిత ప్రతులుబ్రిటీష్ మ్యూజియం లో కలవు కానీ అవి  ప్రచురించబడలేదు.

ఖనన్  (Qanun)ఇబ్న్ సిన యొక్క రచనలలో అతిపెద్దది మరియు అత్యంత ప్రసిద్ధ చెందినది. ఈ రచనలో ఒక మిలియన్ పదాలు కలవు మరియు అనేక ఇతర అరబిక్ పుస్తకాల వలే ఇది విభజన  మరియు ఉపవిభజన చేయబడింది. ప్రధాన విభాగం ఐదు పుస్తకాలలో విభజింప బడినది. మొదటిది  సాధారణ సూత్రాలతో, రెందోవది సాధారణ ఔషధాలతో  అక్షరక్రమంగా ఏర్పాటు చేయబడింది,మూడవది తల నుండి కాలి పాదం  వరకు శరీరం యొక్క ప్రత్యేక అవయవాలు మరియు వాటి రోగాలతో,నాల్గవదిజ్వరంవంటి సాధారణ వ్యాధితో బాధపడుతున్న శరీర ఇతర భాగాలను మరియు ఐదవది మందులసమ్మేళనంగురించి తెలుపును.

ఖనన్ మెడియాస్టినైటిస్ ను  ప్లురసి (mediastinitis from pleurisy) నుండి వేరుచేస్తుంది మరియు ఫెటిస్(phthisis) (ఊపిరితిత్తుల క్షయవ్యాధి) మరియు నీటి మరియు మట్టి ద్వారా వ్యాప్తి చెందును అని గుర్తిస్తుంది. ఇది యాన్కిలోస్టోమియాసిస్ యొక్క శాస్త్రీయ రోగ నిర్ధారణను ఇస్తుంది మరియు ఒక ప్రేగు పురుగుకు ఆపాదిస్తుంది(ankylostomiasis and attributes the condition to an intestinal worm). ఆహార పదార్థాల ప్రాముఖ్యత, ఆరోగ్యంపై వాతావరణం మరియు పర్యావరణ ప్రభావం  మరియు నోటి మత్తుమందు శస్త్రచికిత్స ఉపయోగం యొక్క ప్రాముఖ్యతను ఖనన్ వివరిస్తుంది.

ఇబ్న్ సినా ప్రారంభ దశల్లో క్యాన్సర్ చికిత్స చేయమని మొత్తం వ్యాధి కణజాలo తొలగించమని సర్జన్లకు సలహా ఇచ్చాడు. ఖనన్ మేటిరియా  మెడికా 760 రకాల  మందులను గురించి వాటి  సాధారణ ఉపయోగం గురించి వివరించినది. అతను ముందుగా జంతువులు మరియు మానవుల  పై  ఒక కొత్త ఔషధ పరీక్షను సిఫార్సు చేశాడు.

ఇబ్న్ సినా భావోద్వేగాలకు మరియు శారీరక స్థితికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తించాడు  మరియు సంగీతం  రోగులపై ఖచ్చితమైన శారీరక మరియు మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుందని భావించాడు. అతను ఖనన్ వివరించిన అనేక మానసిక రుగ్మతల్లో: ప్రేమ అనారోగ్యంlove sickness!ఒకటి.

ఖనన్ (Qunun)యొక్క అరబిక్ వచనం 1593 లో రోమ్ లో  ప్రచురించబడింది మరియు ముద్రించబడిన  ప్రారంభ అరబిక్ పుస్తకాలలో ఒకటి. ఇది 12 వ శతాబ్దంలో క్రీమోనా గెరార్డ్ చేత లాటిన్ లోకి  అనువదించబడింది. 'ఖనన్ ', దాని ఎన్సైక్లోపెడియా కంటెంట్, దాని క్రమబద్ధమైన అమరిక మరియు తాత్విక ప్రణాళికతో, గాలెన్, అల్-రజి మరియు అల్-మజూసి రచనలను మించి వైద్య సాహిత్యంలో మరియు ఐరోపాలోని అనేక వైద్య విద్య పాఠశాలల్లో టెక్స్ట్ బుక్ గా  మారింది.

15 వ శతాబ్దంలో చివరి30 సంవత్సరాల్లో అది 15 లాటిన్మరియుఒక హీబ్రూ సంచికలలో   ప్రచురింపబడినది.ఇటీవల సంవత్సరాల్లోఆంగ్లంలో దాని  పాక్షిక అనువాదం చేయబడిoది. 12 వ -17 వ శతాబ్దం నుంచి, ఖనన్ పడమటి వైద్య విజ్ఞాన శాస్త్రానికి ప్రధాన మార్గదర్శిగా పనిచేసింది మరియు లియోనార్డో డావిన్సీని ప్రభావితం చేసిందని చెబుతారు. డాక్టర్ విలియమ్ ఓస్లర్ యొక్క మాటల్లో,ఖనన్  "ఏ ఇతర గ్రంధం కంటే ఎక్కువ కాలం వైద్య విద్యా  గ్రoధం " గా ఉంది.

తన రచనలకు ఈ విధమైన ఘనమైన నివాళి ఉన్నప్పటికీ, ఇబ్న్ సిన ను  ఈ రోజు పశ్చిమంలో చాలా అరుదుగా జ్ఞాపకం చేసుకొoటారు మరియు వైద్య శాస్త్రం లో మరియు యూరోపియన్ పునఃనిర్వాణo లో  అతని ప్రాథమిక రచనల పాత్ర  ఎక్కువగా గుర్తించబడలేదు.

బుఖారాలో ఉన్న మ్యూజియంలో, అతని రచనలు, అప్పటి శస్త్రచికిత్సా పరికరాలు మరియు చికిత్స చేయించుకున్న రోగుల చిత్రాల లు ఉన్నాయి. 'వైద్యుల వైద్యుడు' అని పిలువబడిన వ్యక్తి యొక్క జీవితం మరియు రచనలకు ఆకట్టుకునే స్మారక చిహ్నం బుఖారా మ్యూజియం వెలుపల ఉంది మరియు పారిస్ విశ్వవిద్యాలయంలో వైద్య కళాశాల హాల్ లో అతని చిత్రపటo వేలాడుతోంది.


No comments:

Post a Comment