అరబ్బులు, పెర్షియన్లు మరియు
తుర్క్స్ అయిన ముస్లిం శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలు మధ్యయుగం లోని యురోపియన్ల
కన్నా వందల సంవత్సరాలు ముందు ఉన్నారు. వారు అరిస్టాటిల్ తత్వశాస్త్రం మరియు
నియో-ప్లాటోనిస్టులు, యుక్లిడ్, ఆర్కిమెడిస్, టోలెమి మరియు
ఇతరుల నుండి ప్రభావాన్నిపొందారు. అసంఖ్యాక ఆవిష్కరణలు చేసి మెడిసిన్, శస్త్రచికిత్స, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, జ్యామితి మరియు
అనేక ఇతర రంగాల పై ముస్లింలు లెక్కలేనన్ని పుస్తకాలు వ్రాశారు.
.నేటి ఈ వ్యాసం అత్యంత
ప్రసిద్ధ ముస్లిం శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు వారి అద్భుతమైన ఆవిష్కరణలను
చర్చిస్తుంది.
1.
అబూ నసర్ అల్-ఫరాబి. (872 - 950)(Abu Nasr Al-Farabi (872 – 950)
ఇతడిని ఆల్ఫారబియస్ అని కూడా పిలుస్తారు. అరబ్
శాస్త్రవేత్త మరియు తత్వవేత్త మరియు మధ్యయుగ ప్రముఖ
ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించారు.
2. అల్-బత్తని (858 - 929)(Al-Battani (858 – 929)
ఇతడిని ఆల్బాటియస్ అని
కూడా పిలుస్తారు. ఇతను అరబ్ గణిత
శాస్త్రజ్ఞుడు, మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఇతడు సంవత్సరం యొక్క ఖచ్చితమైన కాలమానం ను మరియు వివిధ
రుతువుల కాల మానాలను లేక్కించాడు.
3.
ఇబ్న్ సిన (980
- 1037) (Ibn Sina (980 – 1037)
అవిసెన్నా అని కూడా
పిలుస్తారు. అరిస్టాటిల్ తత్వశాస్త్రం మరియు వైద్యo పై తన రచనలకు ప్రసిద్ది చెందిన పర్షియన్
వేదాంతవేత్త మరియు శాస్త్రవేత్త.
4.ఇబ్న్ బటుట (1304 - 1369)Ibn
Battuta (1304 – 1369)
ఇతడిని షామ్స్-ఉద్దిన్
అని కూడా పిలుస్తారు.చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రయాణ పుస్తకాల్లో ఒకతైన రిహ్లా వ్రాసిన అరబ్ యాత్రికుడు మరియు
పండితుడు.
5.ఇబ్న్ రష్ద్ (1126
- 1198)ఇబ్న్ Ibn Rushd (1126 –
1198)
ఇతనిని అవేరోస్
అని కూడా పిలుస్తారు. అరటి తత్వవేత్త మరియు పండితుడు అరిస్టాటిల్ యొక్క రచనలలో
చాలా భాగం మరియు ప్లాటో రిపబ్లిక్ పై సారాంశాలను మరియు వ్యాఖ్యానాలను సృష్టించాడు.
6.ముహమ్మద్ ఇబ్న్
మూసా అల్-ఖ్వారిజ్మి (780 - 850) Muhammad ibn Musa Al-Khwarizmi (780 –
850)
అల్గోరిట్మి లేదా
అల్గారిజిన్ అని కూడా పిలుస్తారు. అతని రచనలు హిందూ-అరబిక్ అంకెలు మరియు బీజగణిత
విధానాలను యూరోపియన్ గణిత శాస్త్రంలోకి పరిచయం చేశాయి.
7. ఒమర్ ఖయ్యం (1048 - 1131)(Omar Khayyam (1048 –
1131)
పెర్షియన్ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ
శాస్త్రవేత్త మరియు కవి. శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు రుబాయ్యాత్ ("క్వాట్రైన్స్") లకు ప్రసిద్ధి.
8.థిబిట్ ఇబ్న్
ఖురా (826 - 901)(Thabit
ibn Qurra (826 – 901)
ఇతనిని తేబిట్ అని
పిలుస్తారు. అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు, వైద్యుడు మరియు ఖగోళవేత్త; టోలెమిక్ వ్యవస్థ
యొక్క మొట్టమొదటి సంస్కర్త మరియు స్టాటిక్స్ వ్యవస్థాపకుడు.
9.అబు బక్ర్
అల్-రజి (865 -
925)(Abu Bakr Al-Razi (865 – 925)
రాజేస్ అని కూడా పిలుస్తారు.
పెర్షియన్ రసవాది మరియు తత్వవేత్త, చరిత్రలో గొప్ప వైద్యులలో ఒకరు.
10. జబీర్ ఇబ్న్
హైయాన్ (722 -
804)Jabir
Ibn Haiyan (722 – 804)
గెబెర్ అని కూడా
పిలుస్తారు. రసవాదం మరియు లోహాశాస్త్రంపై తన అత్యంత ప్రభావవంతమైన రచనలకు ప్రసిద్ది
చెందినాడు. అరబ్ రసాయన శాస్త్రం యొక్క పితామహుడు.
.
11. ఇబ్న్ ఇషాక్
అల్-కిండి (801
- 873)(Ibn
Ishaq Al-Kindi (801 – 873)
అల్ కిన్డుస్ అని కూడా పిలుస్తారు. అరబ్ తత్వవేత్త మరియు
శాస్త్రవేత్త, ముస్లిం
పర్పెపెటరి తత్వవేత్తలలో మొదటివాడు
12. ఇబ్న్ అల్-హేథం
(965 - 1040)(Ibn
Al-Haytham (965 – 1040)
అల్హజీన్ అని కూడా
పిలుస్తారు. అరబ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఆప్టిక్స్ సూత్రాలకు మరియు అతని శాస్త్రీయ
ప్రయోగాలలో తన ముఖ్యమైన రచనలకు ప్రసిద్ధి చెందారు.
13. ఇబ్న్ జుహ్ర్ (1091 - 1161)Ibn Zuhr (1091 – 1161)
అవెంజోజార్ అని కూడా
పిలుస్తారు. అరబ్ వైద్యుడు మరియు శస్త్రవైద్యుడు. అతడి
ప్రభావవంతమైన పుస్తకం “అల్-టైయిసర్ ఫిల్-ముదావత్ వాల్-తడ్బీర్” (బుక్ ఆఫ్
సింప్లిఫికేషన్ థెరపీటిక్స్ అండ్ డైట్) కు ప్రసిద్ది.
14. ఇబ్న్ ఖాల్దున్
(1332 - 1406)(Ibn
Khaldun (1332 – 1406)
అరబ్ చరిత్రకారుడు మరియు
హిస్తోగ్రాఫర్ ఆధునిక చరిత్ర, సామాజిక శాస్త్రం మరియు ఆర్థికశాస్త్రం యొక్క పూర్వీకునిగా పరిగణించబడుతున్నాడు.
15. ఇబ్న్ అల్-బైటర్
(1197 - 1248)(Ibn
Al-Baitar (1197 – 1248)
అరబ్ శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు
మరియు వైద్యుడు. మధ్య యుగంలో ఇస్లామిక్ వైద్యులు చేసిన ఆవిష్కరణలను క్రమపద్ధతిలో
నమోదు చేశాడు.
No comments:
Post a Comment