14 September 2017

స్మార్ట్ ఫోన్ వలన కలిగే మానసిక దుష్పరిణామాలు The psychological toll of smartphones


ఒక వ్యక్తి యొక్క సెల్ ఫోన్ ఆ వ్యక్తి యొక్క పని జ్ఞాపకశక్తిని(working memory)  మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను(problem-solving skills) తగ్గిస్తుందని పరిశోధనలు తెల్పుతున్నాయి. 
యుక్తవయసులోని వారితో  ముఖాముఖి సామాజిక పరస్పర చర్యలను మెరుగుపర్చడానికి ముందు మన విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలి.
గోరఖ్పూర్ మరియు నాసిక్ ఆసుపత్రులలో శిశువుల విషాద మరణాల గురించి ప్రతి ఒక్కరూ స్పందించారు  మరియు ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలోవివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుoటున్న యువతీ -యువకుల గురించిన వార్తలు ప్రతి రోజు వార్తాపత్రికలలో మనము చూస్తున్నాము. పైకి ఈ రెండు సంఘటనల వలన సంభవించిన  మరణాలకు కారణాలు విభిన్నంగా కనిపిస్తాయి, కాని దగ్గరగా పరిశీలనలోఅవి ఒక సాధారణ కారణం నుండి ఉత్పన్నమవుతున్నాయి అని తెలుస్తుంది.
గోరఖ్ పూర్ ఆస్పత్రులలో మరణాలకు తక్షణ కారణం ఆక్సిజన్ సిలిండర్ల అలభ్యతగా చెప్పబడింది. గోరఖ్ పూర్లో  ఆక్సిజన్ సిలిండర్ల అలభ్యతకు కారణాల కోసం చూస్తే, అందులో ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది: అది దశాబ్దాల తరబడి  ఉదాసీనత మరియు రాష్ట్రంలో మరియు దేశంలో తల్లి మరియు శిశు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం. అది చివరకు ప్రాణవాయువు(ఆక్సిజన్)అలభ్యతకు దారితీసింది.  ప్రాణవాయువు(ఆక్సిజన్) ప్రాణం  యొక్క అతి ముఖ్యమైన అంశం.
ఇటీవలి కాలం యవత ఆత్మహత్యలకు  నీలి తిమింగలం ఛాలెంజ్(Blue Whale Challenge) వంటి ఇంటర్నెట్ గేమ్స్  మరియు పోటీ పరీక్షలలో వైఫల్యం చెందడం కారణంగా కనిపిస్తాయి. కానీసమస్య యొక్క మూల కారణం ఆలోచిoచుతే అది మానవ జీవితానికి అవసరమైన అంశాల అలభ్యత, ఇంకోవిధమైన ఆక్సిజన్ కొరత గా కన్పిస్తుంది.
యువత  ఆత్మహత్యల వెనుక మూల కారణం ఏమిటి?
సెల్ ఫోన్  అనేది ప్రపంచ చరిత్రలో అతి త్వరగా స్వీకరించిన వినియోగదారు సాంకేతికత. కానీ ఇటీవల జరిపిన అనేక అధ్యయనాలు మానవులపై ఈ సాంకేతిక పరిణామాల దుష్పలితాలను వివరించినవి. జర్నల్ అఫ్ ది అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ రీసెర్చ్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి ప్రక్కన నిరంతరం  ఉన్న ఒక సెల్ ఫోన్  ఆ వ్యక్తి యొక్క పని జ్ఞాపకశక్తి మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను తగ్గిస్తుంది.
ది అట్లాంటిక్ లో వచ్చిన వ్యాసం  "హవ్ స్మార్ట్ ఫోన్స్  డిస్ట్రాయడ్ ఎ జెనరేషన్" లో జీన్ M. ట్వెంగ్చే యువకుల భావోద్వేగ స్థితులలో ఆకస్మిక మార్పులు గురించి వివరించినాడు. ఈ వ్యాసం 1995 మరియు 2012 మధ్య జన్మించినవారిపై దృష్టి పెట్టింది మరియు వారిని రచయిత ఐ జెన్ (iGen)తరం గా పేర్కొన్నాడు.
వ్యాసం ప్రకారం, 1940 మరియు 1960 ల మధ్య బేబీ బూన్ లో జన్మించిన తరం 87%డేట్ కు వెళ్ళింది, ఐజెన్ తరం లో కేవలం 57% మాత్రమే  డేట్ కు  వెళ్ళే అవకాశం ఉంది. లైంగికంగా చురుకుగా ఉన్న యువకుల సంఖ్య 1991 నుండి 40% తగ్గింది. యుక్త వయస్కుల గర్భం రేటు 2016 నాటికి అన్ని సమయాల కన్నా  తక్కువగా ఉంది. పాత తరం యువత 18 సంవత్సరాలు నిండగానే     తమకు ప్రయాణపు స్వేచ్ఛ నిచ్చే  డ్రైవింగ్ లైసెన్స్  కోసం ఎదురు చూసేవారు  కాని నేటి ఐజెన్ (iGen)తరం నేటికి వారి  తల్లిదండ్రులు తమను డ్రైవ్ చేయటానికి  ఇష్టపడుతున్నారు.
ఐ జెన్ (IGen)తరం ఏమి కోరుకొంటున్నారు?వారు  ఫోన్లలో నిరంతరం  మునిగి  ఉన్నారు, వారు వారి గదుల్లో కూర్చుని, ఒంటరిగా ఉంటారు. వారి సామాజిక జీవితం ఫోన్లో గడుపుతారు. వారు తమ స్నేహితులను సంప్రదించడానికి వారి గదులను వదిలిపెట్టరు. 2000 మరియు 2015 మధ్యకాలంలో, వారి స్నేహితులతో కలిసి గడిపిన టీనేజ్  యువతీ యువకుల సంఖ్య 40% కంటే ఎక్కువగా పడిపోయింది.
ప్రఖ్యాత బ్రిటీష్ మానవశాస్త్రవేత్త రాబిన్ డన్బార్ వ్యక్తిగత సామాజిక నెట్వర్క్ల పరిమితులను మరియు ఈ సంబంధాలకు సేవలు అందించే సమయాలను  గుర్తించారు.డన్బర్ ప్రకారం ఒక మానవుడు150 మందితో ఒక సాధారణ సంబంధాన్నికొనసాగించగలడు. ఈ గుంపులో 15మంది తో  అత్యంత సన్నిహిత మానసిక మరియు శారీరక సంబంధాలు కొనసాగించగలదు. డన్బార్ ప్రకారం 15 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే  సంక్షోభ సమయంలో మానవులకు ఎమోషనల్ మద్దతు ఇవ్వగలరు. అమెరికన్ సోషియోలాజికల్ రివ్యూలో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం, సహాయక సమూహాన్ని(support clique) కలిగి ఉండటం లో ఆధునిక యువకులు పేదరికం ను  కలిగి  ఉన్నారు.
జనరల్ సోషల్ సర్వే (GSS) డేటా ఆధారంగా, ఈ అధ్యయనం 1985 నుండి  ఎలాంటి సన్నిహిత స్నేహితులను కలిగి లేరని చెప్పే యువకుల సంఖ్య సుమారుగా మూడింతలు గా ఉందని తేల్చింది. సర్వే చేసిన వారిలో దాదాపు పావు శాతం మంది సన్నిహిత స్నేహితుల సంఖ్య  "జీరో" గా నివేదించిరి.  అనేక ఇతర అధ్యయనాలు కూడా మానవజాతి చరిత్రలో నేటి తరం యువకులు “ఒంటరి  తరం” యువకులు  అని పేర్కొన్నాయి.
1948 నుండి ఫ్రాంకింగ్హామ్(Framingham), మసాచుసెట్స్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా 2009 లో జరిపిన అధ్యయనంలో పాల్గొన్నవారు అధికం గా ఒంటరిగా ఉన్నారు. ఒంటరితనం అంటువ్యాధి. కానీ ఎందుకు అది ఇటీవల దారుణంగా ప్రబలింది?
ఒంటరితనం, స్మార్ట్ ఫోన్  మరియు సోషల్ మీడియాల వాడకం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. నేటి యువత తమ  ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తో  గడుపుతారు. అది వారిలో మాంద్యం(డిప్రేషన్) యొక్క లక్షణాలను చూపుతుంది. రోజుకు వారి స్మార్ట్ ఫోన్ తో సుమారు 3 గంటలు గడిపిన టీనేజ్ వయస్సు వారిలో  ఆత్మహత్యకు ముప్పు35 శాతం కంటే ఎక్కువ.
2013 సంవత్సరం లో అమెరికన్ యువకుల మధ్య ఒంటరితనం ఎక్కువైనది. ఆ సంవత్సరం స్మార్ట్ ఫోన్ సొంతం గా కలిగిన యువత సంఖ్య 50% మార్కును అధిగమించింది. అప్పటి నుండి ఒంటరితనం యొక్క స్థాయి చాలా ఎక్కువగా ఉంది.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాను కలిగి  ఉంది.  ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్  వినియోగదారుల స్థావరాలలో ఒకటి. భారతదేశం యువత స్మార్ట్ ఫోన్ వలన కలిగే  మానసిక దుష్పరిణామలను గ్రహించాలి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవలే చెప్పినట్లుగా, మన  పిల్లలు  ప్లేస్టేషన్ల ను విడిచిపెట్టిఆట స్థలాల్లో  ఉండాలి. ముఖాముఖి  సంభాషణ కు ఆన్లైన్ సంభాషణ సమర్థవంతమైన నిజమైన ప్రత్యామ్నాయం కాదు.
యుక్తవయసులోని యువకుల మద్య ముఖాముఖి సామాజిక పరస్పర చర్యలను మెరుగుపర్చడానికి ముందు మన  విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలి. గోరఖ్ పూర్ ఆసుపత్రిలో శిశువులకు ప్రాణవాయువు సిలిండర్లు అవశ్యకం అయినట్లే మానవ జీవితానికి ఈ సామాజిక ముఖాముఖి  సంభాషణలు     తప్పని సరి.


No comments:

Post a Comment