“దఖని” అనేది ఉత్తరాది మరియు దక్షిణాది బాషల ఒక మేలైన కలయిక. ఉప ఖండం
లోని భాషా వైవిధ్యం యొక్క నిజమైన ప్రతినిధి
డక్కన్ భూభాగం యొక్క భాష “దఖని” అని
పిలువబడుతుంది. ఇది భారతదేశ ద్వీపకల్పంలో మాట్లాడే ఉర్దూ / హిందీభాషల
కలయిక.
భాషావేత్తలు అన్నిభాషలు మార్పు మరియు పరిణామం చెందుతాయని సూచించుతారు. భాషలు కొత్త
భూభాగాల్లో ప్రయాణించినప్పుడు, మార్పు తప్పనిసరి అని చెప్పుతారు..కొన్ని శతాబ్దాల క్రితo ఉత్తరాది
భాష(ఉర్దూ) దక్షిణానికి తరలిoది. అక్కడ,
అది పరిణామం చెందింది, అభివృద్ధి చెందింది మరియు అద్భుతం గా విస్తరించినది.
పందొమిది వందల అరవై సంవత్సరాలలో ప్రముఖ
హాస్యనటుడు మహమూద్ ఈ ప్రత్యెక బాష (lingo -దఖని) ను గుమ్నాం(gumnam) చిత్రo ద్వార ప్రచారం లోనికి తీసుకువచ్చాడు. ఈ అద్భుతమైన విలక్షణమైన బాష పట్ల అనేక మంది ఆసక్తి ప్రదర్శించారు. ఈ బాష కు “దఖని” (లేదా డెక్కనీ) ఉర్దూ
అనే పేరు పెట్టబడింది.విశేష శృతి,
పదాల ఎంపిక మరియు వాక్య నిర్మాణంతో ఈ బాష (దఖని ఉర్దూ)
అనేక మందిని ఆకర్షించినది. వాస్తవానికి “దఖనీ” ఉర్దూ ఢిల్లీ మరియు లక్నోలో ఉర్దూ మాట్లాడే
ప్రజల బాషకు దూరంగాఉంది. ఆ ప్రాంతాలలో స్వచ్ఛ ఉర్దూ మాట్లేడే పండితులు దానిని “దఖని
ఉర్దూ” గా పరిగణించలేదు.1940లలో ప్రోగ్రెసివ్ రైటర్స్
ఉద్యమం “దఖని ఉర్దూని” ప్రజలను ఆకర్షించే భాషగా పరిగణించ లేదు మరియు వారు కొన్ని దశాబ్దాలపాటు
“దఖని ఉర్దూ” పట్ల శ్రద్ధ చూపించలేదు.కొంతకాలం హైదరాబాద్ లో నివసించిన ఉర్దూ మహా కవి జోష్ అలహాబది తన స్థానిక
అవధ్ ప్రాంత చుట్టుపక్కల మాట్లేడే ఉర్దూతో ఈ బాషను పోల్చి దీనిని హస్యబరిత బాషగా కొట్టిపార వేసినాడు.
దఖన్ భాషని దఖని బాష గా చెప్పవచ్చు, ఇది భారతదేశo లోని మహారాష్ట్ర,
కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి
చెందినది. దఖని ఉర్దూ బాష, ఉర్దూ/హిందీ భాష యొక్క పదజాలం ఆధారంగా ఏర్పడినది. తెలంగాణ
మరియు ఆంధ్ర ప్రాంతం లో, ఇది తెలుగు పదాలను తనలో మేళవిoచు కోన్నది; కర్ణాటకలో కన్నడ పదాలు; మహారాష్ట్రలో మరాఠీ పదాలను జేర్చుకోన్నది. ఇది ఈ ప్రాంతం లోని చాలామంది ముస్లిం ప్రజల మొట్టమొదటి
భాష మరియు ప్రామాణిక హిందీ/ఉర్దూ మరియు ఈ ప్రాంతం యొక్క ఇతర ప్రాంతీయ బాషలతో సహజీవనం కలిగి ఉంది.
ఈబాష (దఖని) యొక్క మూలాన్ని గుర్తించే ముందు, హిందూవావి (హిందీ యొక్క పూర్వపు పేరు)/ఉర్దూ
మూలాన్ని కనిపెట్టవలసి ఉంటుంది. "దఖ్నీ లిటరేచర్: హిస్టరీ, కల్చర్ అండ్ లింగ్విస్టిక్ ఎక్స్ఛేంజీస్" అనే గ్రంధం రచయిత ప్రకారం 1327లో ముహమ్మద్-బిన్-తుగ్లక్ తన రాజధానిని
దౌలతాబాద్ కు ( దేవగిరి-దక్కన్ ) తరలించి నప్పుడు, ప్రజలను డిల్లి విడిచి దౌలతాబాద్ కు తరలి వెళ్ళమన్నాడు. అలాగే
మాలిక్ కపూర్ యొక్క దండయాత్రల సమయం లో,
ఈ ప్రాంతానికి కొంతమంది హిందువీ/ఉర్దూ మాట్లాడే వారు
వచ్చినట్లు భావించబడింది. ఈపరిణామాల ఫలితంగా, ఉత్తరాది భాష ఉర్దూ మాట్లాడే జనాభా దక్కన్ వచ్చారు. కొంతకాలం తరువాత తుగ్లక్ తన మనస్సు మార్చుకొని ఢిల్లీకి తరలి వెళ్ళినప్పటికీ,
ఈ ప్రాంతం లో ఆభాష మిగిలిపోయింది. కొoతకాలానికి అది ఆప్రాంతం
లోని ఇతర భాషలతో పరస్పరం సంకర్షణ చెంది అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. తరువాతి
శతాబ్దంలో, దఖని అని
పిలువబడే ఈ బాష, దాని ఉత్తర
భారత మాతృక
(ఉర్దూ) నుండి
స్వతంత్రంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
తుగ్లక్ పాలన ముగింపు దశలో, అతని దక్షిణ సామంత రాజ్యాలు స్వతంత్రాన్ని ప్రకటించు
కొన్నవి మరియు 1347లో,
గుల్బర్గాలో హసన్ బహుమనీ పాలకుడు అయ్యారు. దక్షిణ
మహారాష్ట్ర, ఉత్తర
కర్ణాటక మరియు కొన్ని తెలంగాణ ప్రాంతాలలో ప్రాంతాల్లో బహామిని సుల్తానత్ స్థాపన
జరిగింది మరియు ఆ ప్రాంతం లో దఖని ఉర్దూ ప్రచారం లోనికి వచ్చింది. . 1398లో ప్రముఖ సూఫీ పండితుడు ఖ్వాజా బందా నవాజ్ (1321-1422), స్థానిక పాలకుని ఆహ్వానంపై గుల్బర్గాకు తరలివెళ్ళారు. అతను ఒక సూఫీ
కవిత “మిరాజ్-అల్ ఆషిఖీ “ ని స్థానిక
దఖని ఉర్దూ లో వ్రాసారు. ఆయన దఖని ఉర్దూ ని వాడిన మొట్ట మొదటి సూఫీ సన్యాసి,
ఆ తరువాత
శతాబ్దాల్లో ఈప్రాంతానికి చెందిన ఇతర సూఫీ సన్యాసులు దీనిని విస్తృతంగా ఉపయోగించారు.
మరొక ప్రారంభ రచన ఫక్ర్-ఐదిన్ నిజామి యొక్క కదంరావు.
పదంరావు, 1420-1430 మధ్య కాలంలో రచించినట్లు
చెప్పబడింది.ఇందులో అనేక దక్షిణ
భారతీయ భాషలు మరియు సంస్కృతo నుండి వచ్చిన పదాలు పూర్తిగా ఉండగా,
కవిత యొక్క వాక్య నిర్మాణం స్పష్టంగా ఉర్దూగా ఉంది. ఇతర సూఫీలు,
మిర్జిజి షామ్స్ అల్-ఉష్షాక్ (1499) మరియు అతని వారసులు కూడా దఖని ఉపయోగించారు.
.తరువాత కాలం లో బహుమనీ రాజ్యం నాలుగు స్వంత్రత రాజ్యాలుగా అహ్మద్ నగర్ (1460-1633),
బీజాపూర్ (1460-1686),
బిదార్ (1487-1619)
మరియు గోల్కొండ (1512-1687) గాఏర్పడినది. దఖని ఈ
రాచరికపు ఆస్థానాలలో వర్ధిల్లింది మరియు త్వరలోనే ఒక ప్రత్యేక గుర్తింపును
పొందినది. మొఘల్ సామ్రాజ్యం ప్రత్యేకించి
ఔరంగజేబు కింద, ఈ స్వతంత్ర రాజ్యాలను కబళించినది. ఔరంగజేబ్ తరువాత,
మొఘల్ రాజప్రతినిది మొదటి ఆసిఫ్ జాహి 1724లో సార్వభౌమాధికారం ప్రకటించి,
తన సొంత రాజవంశం సృష్టించాడు. ప్రస్తుత
మహారాష్ట్ర, కర్ణాటక
మరియు తెలంగాణా ప్రాంతాలతో కూడిన ఈనూతన సామ్రాజ్యానికి రాజధాని హైదరాబాద్,
దఖని యొక్క గుర్తించబడిన కేంద్రంగా మారింది. తరువాతి
కొద్ది శతాబ్దాల్లో, దఖని ఒక విభిన్నమైన విలక్షణమైన సాహిత్యాన్ని
కలిగింది. ఇది ఉత్తర భారతదేశ ఉర్దూ సాహిత్యo తో ముఖ్యమైన సారూప్యతలను బేధాలను కలిగిఉంది. ముహమ్మద్
ఖులి కుతుబ్ షా (1571-1611), వాలి దఖానీ (1668-1741)
మరియు ఇతరులు ఒక విభిన్నమైన,విలక్షణమైన ధఖని సాహిత్యం ను సృష్టించేందుకు దోహదపడ్డారు.
స్వాతంత్ర్యం పొందిన తరువాత, హిందీతో ఉర్దూ
భాష పోటి పడలేక పోయింది. ఇది ఉర్దూ ప్రతికూలతకు మరియు భారతదేశంలో ఉర్దూ భాష అభివృద్ధి కి ఆటంకంగా మారింది. దఖని విషయంలో, హైదరాబాద్ రాజ్యo
భారత దేశం లో విలీనం అగుట మరియు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, తెలుగుకు అధిక ప్రాముఖ్యత నివ్వడంతో,
అది కూడా తన ఉనికిని నిలుపుకోవటానికి చాలా కష్టపడింది. దఖని
పట్ల ఉత్తరాది రాష్ట్రాల వ్యతిరేకత ఎటూ ఉంది. అవి దానికి సాయపడలేదు. అయినప్పటికీ,
అది ఉత్తమ సాహిత్యాన్ని ముఖ్యం గా హాస్యభరిత సాంప్రదాయంలో మంచి
సాహిత్యాన్ని సృష్టించింది. సులేమాన్ ఖతీబ్ మరియు గౌస్ మొహిద్దిన్ అహ్మద్ ఉత్తమ
కవితలను లిఖించారు. క్రిందటి దశకం లో తీయబడిన మూడు చలన చిత్రాలు అంగ్రేజ్ పార్ట్ I
మరయు పార్ట్ II, హైదరాబాద్ నవాబ్స్ “దఖని” పట్ల ఆసక్తిని మరల పునరుద్దరించినవి.
దఖనీని డాక్యుమెంట్ చేయడానికి మరియు దానికి బలం
చేకూర్చడానికి ఒక డాక్యుమెంటరీ (ఇంకా అసంపూర్తిగా ఉంది) A
Tongue Untied: The Story of Dakhani అనే
పేరుతో ముంబైకి చెందిన చిత్రనిర్మాత గౌతం పెమ్మరాజు GautamPemmaraju ప్రారంభించారు.
దఖని భాషా చారిత్రకతను మరియు దాని జీవనశైలి, సాహిత్యం
మరియు సంస్కృతి యొక్క సంప్రదాయాలను తెలియ జెప్పే ఒక డాక్యుమెంటరీ నిర్మాణానికి
పూనుకొన్నారు. దఖని బాష మాట్లేడే వివిధ
ప్రాంతాల్లో భాషను మ్యాప్ చేసి, దాని యొక్క అత్యంత ముఖ్యమైన సాహిత్య వ్యక్తులతో
కొన్ని అమూల్యమైన క్షణాలను మన ముందుకు ఉంచదలచినారు. గౌతమ్ పెమ్మారాజు దఖని భాష మరియు దాని రచయితలను
గురించి విస్తృతంగా ప్రభావవంతంగా వ్రాశారు, దఖని భాష
మరియు దాని చరిత్రపై ఒక ముఖ్యమైన ఆధారాలను (ఆర్కైవ్) ను సృష్టించారు.
దఖని, ఉత్తర
మరియు దక్షిణ బాష రుచుల యొక్క మేలైన మిశ్రమం, మరియు ఉపఖండంలోని భాషా వైవిధ్యం యొక్క నిజమైన
ప్రతినిధి గా నిలిచింది.
.
No comments:
Post a Comment