ముస్లిం
సైన్యం యెరూషలేమును జయించటానికి పూర్వం మరియు హిజ్రాకు రెండు సంవత్సరాల ముందు 27 రజాబ్ దినాన ప్రవక్త ముహమ్మద్ (స) తన రాత్రి ప్రయాణం లో జెరూసలెం
నగరాన్ని సందర్శించారు. ఈ రాత్రి ప్రయాణం (మేరాజ్) మరియు స్వర్గరోహణ ముస్లింలు
మరియు జెరూసలెం నగరం రెండింటికీ ప్రత్యేకమైనవి.
ఆ సమయం లో ప్రవక్త ముహమ్మద్ (స)అతని అనుచరులయిన ముస్లింలు అన్ని రకాల వివక్షత
మరియు హింసను ఎదుర్కొంటున్నప్పుడు, మరియు అతని పెదతండ్రి అబూ తాలిబ్
మరియు అతని ప్రియమైన భార్య ఖదీజా మరణించిన కఠినమైన మరియు క్లిష్టమైన సమయంలో ఇది జరిగింది.
తక్కిఫ్(Thaqif) వారి నుండి సహాయం కోరడానికి ప్రవక్త ముహమ్మద్ (స)తైఫ్(Taif) వెళ్లారు.తక్కిఫ్ వారు తమ మూర్ఖులను మరియు బానిసలను ప్రేరేపింఛి వారి పై
రాళ్ళు విసరగా, వారి పాదాలు గాయపడినవి. వారు అల్లాహ్ తో తన దినావస్థ
గురించి మొరపెట్టుకొన్నారు.
జెరూసలేం
మక్కాలోని ప్రారంభ ముస్లింలకు ఆశ, శాంతి
మరియు ఆనందం ప్రసాదించే నగరం గా ఉంది, అక్కడ ముహమ్మద్ (స) ఒక కొత్త
ప్రవచనాత్మక అనుభవాన్ని పొందారు. అప్పటి నుండి, జెరూసలేం ఎల్లప్పుడూ ముస్లింల ఆశ, శాంతి, న్యాయం ప్రసాదించే పట్టణం గా
ఉంది. ప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నుండి జెరూసలె౦కు హిజ్ర కు రెండు సంవత్సరాల
ముందు 27రజబ్ న
చేసిన యాత్ర పవిత్ర స్థలం జెరూసలేం లో చేసిన
ఆధ్యాత్మిక యాత్ర గా ముస్లింలు భావిస్తారు. పవిత్ర ఖుర్ఆన్ లో దిని గురించిన ప్రస్తావన ఉంది.
నిజానికి, ప్రవక్త ముహమ్మద్ యొక్క భూమిపై
ప్రయాణం మరియు అతని స్వర్గారోహణకు జెరూసలేం ఒక కేంద్ర బిందువు ఉంది. అతని రాత్రి
ప్రయాణం అక్కడ ముగిసింది మరియు అక్కడ నుండి అతని స్వర్గారోహణ ప్రారంభమైంది.
మక్కాలోని కాబా యొక్క పవిత్ర మసీదు అల్-అక్సా మసీదుతో దగ్గరి సంబంధం కలిగివుంది.యెరూషలేము
మరియు చుట్టుపక్కల ప్రాంతం ముస్లింల విశ్వాసం మరియు హృదయాలతో ముడిపడివుంది. మొదటి
ప్రవక్త ఆదం మక్కాలోని కాబాను నిర్మిoచిన 40 సంవత్సరాల తర్వాత వారిచే అల్-అక్సా
మస్జిద్ నిర్మించ బడినది. ప్రవక్త అబ్రాహాము మరియు అతని కుమారులు మక్కా మరియు
జెరూసలేంలో పవిత్ర స్థలాలను పునర్నిర్మించారు మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (స) తన
రాత్రి ప్రయాణం అక్కడి నుండి కొనసాగించారు.
ముస్లింల
ప్రకారం, పాలస్తీనా భూభాగం
మరి ముఖ్యంగా జెరూసలేం నగరం యేసు, డేవిడ్, మరియు సోలమన్ వంటి గొప్ప ప్రవక్తల
పుట్టినిల్లు. వారు అక్కడ పెరిగారు మరియు తమ దైవ కార్యం
కొనసాగించారు. అబ్రాహాము మరియు లాట్ వంటి ఇతర ప్రవక్తలు అక్కడికి వలసపోయారు లేదా
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మరియు మోషే వంటివారు అక్కడ సమాధి
కాబడ్డారు. ఇక్కడ జిబ్రెయిల్ వంటి దేవదూతలు
స్వర్గం నుంచి అవరోహణ చేసారు మరియు దేవుని ప్రవక్తలు, సందేశహారుల కొరకు మానవాళి
ఉపయోగం నిమిత్తం దైవిక ఉపదేశము తీసుకొచ్చినారు. ఇతర దేవదూతలు అక్కడ ఒక ప్రత్యేక పని చేయటానికి
దూతలుగా వస్తారు.
సంక్షిప్తంగా, ప్రవక్తలు యెరూషలేము మరియు దాని
పరిసర ప్రాంతం నిర్మించారు మరియు అక్కడ నివసించారు.యెరూషలేమునగరంలో ప్రవక్తలు ప్రార్ధన
చేయని లేదా నడవని ఒక అంగుళం స్థలం అయిన లేదు.
అన్ని దేశాల, అన్ని మతాల వారికి ఇది పుణ్యభూమి.
జెరూసలేం
పాటు, హేబ్రోన్
పాలస్తీనా లో మొదటి ఇస్లామిక్ దాతృత్వానికి చిహ్నం నిలిచింది. ప్రవక్త ముహమ్మద్ (స) తన సహచరుడు, టమిమ్ ఇబ్న్ ఆవుస్ అల్-దారి మరియు
అతని సోదరులు మరియు అతని వారసుల పేరుతో దానిని తీర్పు దినం వరకు దానం ఇచ్చారు.
తామిం ఇస్లాం స్వీకరించిన మొదటి పాలస్తీనా వ్యక్తీ. అతనికి ఈ గౌరవం కల్పించడం ద్వారా, ప్రవక్త ముహమ్మద్ (స) వాస్తవానికి
పాలస్తీనా పై ఇస్లాం కు చట్టబద్ధమైన యాజమాన్యo కల్పించారు. నిజానికి పాలస్తీనా అనేది
పాలస్తీనియన్లు లేదా అరబ్బులకు మాత్రమే
కాకుండా సమస్త ముస్లింలకు చెందినది అని
ముస్లింలు నమ్ముతారు. "పాలస్తీనా లోని ఏదైనా భాగాన్ని వదులుకోవడం అనేది ఒకరి మతాన్ని విడిచిపెట్టడం వంటిది."అని
ముస్లింలు భావిస్తారు.
ముస్లిం ఖలీఫాలు ఈ వక్ఫ్ (ఎండోమెంట్) కు మద్దతు ఇచ్చారు, దానిని గుర్తించి దానిని అమలు చేశారు. ముస్లిం ధర్మ పండితులు, ముఖ్యంగా హుజ్జత్ అల్-ఇస్లామ్ ఇమాం అల్-ఘజాలి, "ఈ వక్ఫ్ యొక్క సవ్యత మరియు దానిని ప్రశ్నించిన వారు
అవిశ్వాసులు " అని ప్రకటించారు. థామస్ హాయ్ క్రాఫ్ట్, బ్రిటిష్ ప్రధాన న్యాయాధికారి మరియు షేక్ ఖలీల్ అల్ హమిది
షరియాహ్ కోర్టు అఫ్ అప్పీల్ అద్యక్షుడు, 26 జనవరి 1927న తమ నిర్ణయం26/2లో తమీం అల్-దారి యొక్క వక్ఫ్ ను "మేము సరైన వక్ఫ్
గా భావించాము" అని తీర్పు చెప్పినారు.
పాలస్తీనాలోని బ్రిటీష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ వక్ఫ్ ను గుర్తించి ఇస్లామిక్ షరియా'స్ కౌన్సిల్ అధ్యక్షుడికి మెమొరాండం పంపినాడు.
ఈ శతాబ్దం ప్రారంభంలో
ఇస్లామిక్ అరబ్ ఈస్ట్ వలసవాదరాజ్య ముట్టడిని చవిచూసింది. 1907 యొక్క
క్యాంప్బెల్ బన్నెర్మాన్ సదస్సు(Campbell Bannerman
Conference) సిఫారసు కృత్రిమ "మినీ రాష్ట్రాలు” గా అరబ్ ప్రపంచం యొక్క విభజన మరియు
పాలస్తీనాలో ఒక "బఫర్ రాష్ట్ర" ఏర్పాటు సిఫార్స్ చేసింది. 1924లో ఒట్టోమన్
ఇస్లామిక్ ఖలిఫత్ రద్దు చేయబడినది.
ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి
నుండి అది ప్రతిరోజూ, యెరూషలేము యొక్క
భవిష్యత్ ను నిర్ణయించటానికి
ప్రయత్నిస్తుంది మరియు జెరూసలేం నగరంపై తన నియంత్రణను ఏకీకృతం చేయడానికి నగర
ప్రజలు దాని ఆధికారం ను ఆమోదించే విధంగా ప్రతిరోజు దశలవారిగా ఆచరణాత్మక చర్యలను చేపడుతుంది. ఇజ్రాయెల్ జెరూసలేం నగరానికి ఒక యూదు రూపాన్ని ఇవ్వడానికి తీవ్ర మరియు
అత్యవసర ప్రయత్నాలు చేస్తున్నది. జెరూసలెంలో జనాభా కూర్పులో మార్పులను
తీసుకురావటానికి చర్యలు తీసుకొంటున్నది. యూదు వలసల ను బలోపేతం చేయటానికి, నగరంచుట్టూ పక్కల
యూదు వలస స్థావరాలను నిర్మించటం, జెరూసలెo యొక్క
గుర్తింపు, ఉనికి , మరియు దాని
నాగరికత యొక్క స్వరూప స్వభావం మరియు దాని యొక్క జనాభా యొక్క స్వభావం మార్చడానికి
ప్రయత్నాలు చేస్తుంది.
ఉమర్ ఇబ్న్ అల్-ఖట్టబ్
సమయంలో జెరూసలేం పై ఇస్లామిక్ విజయం తో శతాబ్దాలుగా కొనసాగుతున్న అస్థిరత్వం, మతపరమైన హింస
మరియు వలసవాద పాలన ముగిసింది. ఇస్లాం యొక్క ఆగమనం తరువాత అక్కడి ప్రజలుక్రూసేడ్స్
(1099-1198) కాలం మినహా భద్రత, మరియు శాంతి
అనుభవించారు. అక్కడ విస్తృత స్థాయిలో విద్వాంసుల కార్యకలాపాలు జరిగాయి. పాఠశాలలు, మసీదులు మరియు
ఆస్పత్రులు స్థాపించబడినవి. అనేకమంది
పండితులు పట్టభద్రుల కేంద్రంగా ఉంది. క్రూసేడ్స్ (1099-1198) కాలం మినహా ఖలీఫా మరియు ముస్లిం పాలకుల
సంరక్షణను ఆస్వాదించింది.
ముస్లింలు జెరూసలేం ను స్వాధీనం
చేసుకున్నప్పుడు యూదులు నగరానికి తిరిగి వచ్చారు. మరియు ముస్లింలు దానిని అందరు విశ్వాసుల
కొరకు తెరిచారు. మరో మాటలో చెప్పాలంటే, ముస్లిం పాలనలో
యెరూషలేము ఒక ప్రత్యేక నగరం కాదు అందరి నగరం. అన్ని మతాలకు కేంద్రం. జెరూసలెం కు ఉమర్
రాక ఒక స్వర్ణయుగాన్ని ప్రారంభించినది మరియు అది అన్ని దేశాలకు న్యాయం మరియు శాంతి ప్రసాదించే
నగరంగా మారింది. కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రకారం, ఉమర్ "ఇస్లామిక్ సoతులితకు చిహ్నం. యూదులు
మరియు క్రైస్తవుల మాదిరిగా కాకుండా, ముస్లింలు యెరూషలేమును కొన్ని మతాల వారికే పరిమితం చేయకుండా యెరూషలేము
పవిత్రత కాపాడినారు. "ముస్లింలు
ఇతరులను వారి మత విశ్వాసాలను గౌరవించారు."వారి హక్కులను గౌరవించారు మరియు
బహుళత్వం మరియు సహజీవనాన్ని గౌరవించారు. పరిశుద్ధత కలిసిన ఈ దృష్టి నేడు యెరూషలేము
ప్రజలకు అవసరమవుతుంది.
న్యాయం లేకుండా శాంతి
లేదా స్థిరత్వం ఉండదు అని చరిత్ర నిరూపించినది. కారెన్ ఆర్మ్స్ట్రాంగ్ 1997 లో ఇస్లామిక్
జెరూసలెంలో జరిగిన అంతర్జాతీయ అకాడెమిక్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నట్లు, "చాలా ప్రాచీన రోజులలోనే, జెరూసలేం
సంస్కృతి సామాజిక న్యాయం కోసం నిరంతరం కట్టుబడి ఉంది. హిబ్రు బైబిల్లో, ప్రవక్తలు మరియు కీర్తనవాదులు జెరూసలేం ను పవిత్ర
నగరంగా, శాంతి, న్యాయానికి ఆలంబన గా చిహ్నం గా భావించారు. "సంక్షిప్తంగా చెప్పవలెనంటే శాంతి జెరూసలేం
తో మొదలవుతుంది మరియు జెరూసలేం సమస్య పరిష్కారం ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి కీ
మార్గం అవుతుంది.
No comments:
Post a Comment