.
భౌతిక శాస్త్రం, గణితం మరియు
ఖగోళశాస్త్రo లో చెప్పుకోదగిన కృషి చేసిన ప్రపంచంలోని
గొప్ప శాస్త్రవేత్తలలో ఇబ్న్ ఆల్-హేతన్ ఒకరు. అతని “కితాబ్ అల్-మనాజీర్” అనేది దృశ్య
శాస్త్రం (ఆప్టిక్స్) మరియు కాంతిపై రాయబడిన మొదటి సమగ్ర పుస్తకంమరియు
భౌతికశాస్త్రoపై రాయబడిన అపురూప గ్రంధం అని చెప్పవచ్చు. అతను దృష్టి (విజన్) కు సరైన
వివరణను ఇచ్చాడు. గ్రహా కక్ష్యల ఊహాజనిత వలయాలకు
సంబంధించిన పురాతన భావనను తన ఘన గోళాల సిద్ధాంతంతో అతను గ్రహాల నమూనాను
మెరుగుపర్చాడు మరియు కంటి యొక్క పరావర్తనం మరియు వక్రీభవనం యొక్క నియమాలను కనుగొన్నాడు.
అబూ అలీ అల్-హసన్ ఇబ్న్
అల్-హేథం 354 AH / 956 AD
లో బస్రా, ఇరాక్ లో జన్మించాడు మరియు తన విద్యబ్యాసం అక్కడే పూర్తి
చేసి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశాడు.కానీ అతను తన ఉద్యోగం తో సంతృప్తి చెందలేదు
మరియు తన చదువుని కొనసాగించాడు. కైరోలోని నైలు నదిపై మూడు డ్యామ్లు, రిజర్వాయర్లను
నిర్మించేందుకు ఆయన ఒక పెద్ద ప్రాజెక్టును సిద్ధం చేశాడు. వార్షిక వరదల నుండి
కైరోను కాపాడుట, నీటిని నిల్వ చేయట
మరియు ఏడాది పొడుగునా నిల్వచేసిన నీటిని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుట
అనే మూడు లక్ష్యాల కొరకు ఈ డ్యామ్నిర్మాణం
ఉద్దేశించ బడినది.అధిక వ్యయం మరియు విజయం గురించి అనిశ్చితి వంటి కొన్ని కారణాల
వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టబడింది. ఇటివల కొన్నిసంవత్సరాల క్రితం, ఐక్యరాజ్యసమితి ఈ ప్రాజెక్టును
పునరుద్ధరించింది మరియు కైరో సమీపంలోని నైలు నదిపై భారీ ఖర్చుతో అశ్వాన్ ఆనకట్టను
నిర్మించింది. తన జీవిత చివరి సంవత్సరాల్లో, అల్-హేథం మసీదు మరియు అల్-అజహర్
విశ్వవిద్యాలయానికి సమీపంలో నివసిస్తూ, శాస్త్రీయ పరిశోధన, ప్రయోగం మరియు
రచనలలో కాలం గడిపినాడు. అతను చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు మరియు 430 AH / 1039 AD లో కైరోలో
మరణించాడు.
ఇస్లాం యొక్క పది
గొప్ప శాస్త్రవేత్తలలో ఇబ్న్ అల్-హేథమ్ ఒకడు. అతను వేదాంతశాస్త్రం, కవిత్వం, మెటాఫిజిక్స్, రాజకీయాలు, నైతికత, తర్కం, సంగీతం, భౌతికశాస్త్రం, రాజకీయాలు, ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రంలో 100 కంటే ఎక్కువ పుస్తకాలు వ్రాసాడు. “కితాబ్ అల్-మనాజీర్, మకాలా ఫి అల్-అల్మమ్ మరియు మకాలా ఫి దాదా అల్-ఖమర్” అనేవి అతని ప్రసిద్ద
గ్రంధాలు.
అతనుదృష్టి(విజన్)
గురించి సరైన వివరణ ఇచ్చిన మొదటి శాస్త్రవేత్త. కాంతి కన్నుగుండా ప్రసరించి
వస్తువును కాంతి వంతం చేసి కంటికి
కనిపించేటట్లు చేస్తుందనే ప్రాచీన గ్రీక్ సిద్దంతాన్ని ఖండించినాడు. వస్తువు నుండి
వచ్చే కాంతి దాని ప్రతిబింబాన్ని కంటిలో ఏర్పరచి కంటికి
కనిపించేటట్లు చేస్తుంది అన్నాడు. కాంతి
ప్రయాణించడానికి సమయం పడుతుంది అని అతను చెప్పాడు; అది ప్రయాణిస్తున్నప్పుడు దాని తీవ్రత తగ్గుతుంది; కాంతి విరళ యానకం
(గాలి) గుండా వేగం గా ప్రసరించును మరియు సాంద్రత యానకం(గాజు) లో దాని వేగం
తగ్గును,.గణిత శాస్త్రవేత్తలు యూక్లిడ్ కాలం
నుండి అతని పన్నెండవ అక్షం (సరళ రేఖల) ను నిరూపించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇబ్న్ అల్-హేథం యొక్క
ముఖ్యమైన గణితశాస్త్ర సాధనల్లో ఒకటి, క్లిష్టమైన విద్య పద్ధతికి బదులు ఒక సాధారణ ప్రత్యామ్నాయం కనుగొనుట మరియుఒకదానితో
ఒకటి ఖండించుకోనేరెండు సరళరేఖలు అదే రేఖకు సమాంతరంగా ఉండవు. ఇబ్న్ ఆల్-హేథమ్ కు 800 సంవత్సరాల
తర్వాత ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ ప్లేఫెయిర్ ఇదే విషయాన్నీ చెప్పాడు.
గణితం మరియు భౌతిక
శాస్త్రంలో అతని కృషి అపారమైనది. అతను బీజగణితం మరియు జ్యామితి మధ్య సంబంధాన్ని
అభివృద్ధి చేశాడు. అతను వస్తువు యొక్క చలనం యొక్క యాంత్రిక శాస్త్రాన్ని (మెకానిక్స్
ను) అధ్యయనం చేశాడు మరియు ఒక వస్తువు యొక్క చలనాన్ని మార్చడానికి లేదా చలన దిశను
మార్చడానికి బాహ్య బలం ఆవసరం అని అన్నాడు. ఇది న్యూటన్ యొక్క మొదటి నియమం కి సమానం చెప్పవచ్చు.
అతని రచనలు పదమూడవ
శతాబ్దం నుండి లాటిన్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, హిబ్రూ, రష్యన్ మరియు
ఆంగ్ల భాషలోకి అనువదించబడ్డాయి. రోజెర్ బేకన్, జోహన్నెస్ కెప్లర్, న్యూటన్, ఫెర్మాట్, డెస్కార్టెస్, వీటోలో, స్నెల్ మరియు
ఇతరులు వంటి చాలా మంది యూరోపియన్ శాస్త్రవేత్తలు అతని ఆలోచనలు స్వీకరించారు లేదా
అతనిచే బాగా ప్రభావితం పొందారు.
ఇబ్న్ హేథం భౌతికశాస్త్రం
మరియు ఆప్టిక్స్ సైన్స్ లో గణనీయమైన కృషి
చేశాడు. ఆప్టికల్ రిసర్చ్ థియరీ మరియు ప్రాక్టిస్ లో ఒక నూతన అధ్యాయాన్ని
ఆరంబించాడుమరియు అతడు ఎంతో గౌరవించబడ్డాడు.
No comments:
Post a Comment