-
మస్జిద్-అల్-హరామ్
(المسجدالحرام "పవిత్రమైన మసీదు"), మక్కా నగరం లోని ఒక
పెద్ద మస్జిద్ మరియు ఇస్లామీయ ప్రపంచంలోని అతి పెద్ద
మస్జిద్. ఈ మస్జిద్ కాబా గృహం చుట్టూ ఉన్నది. ముస్లింలందరూ ఈ కాబా వైపు తిరిగి
నమాజు చేస్తారు. ముస్లింలకు పరమపవిత్రం, దీన్నే హరమ్ షరీఫ్ అని కూడా అంటారు.
మస్జిద్-ఎ-నబవి, మదీనా
మస్జిద్-ఎ-నబవి (ప్రవక్తగారి మసీదు) (అరబ్బీ: المسجدالنبوي ) మదీనా నగరంలో గలదు. దీనిని రెండవ అతి పవిత్ర స్థలంగా పరిగణిస్తారు. మస్జిద్ నిర్మాణంలో స్వయంగా ప్రవక్త పాల్గొన్నారు. ఈ మస్జిద్ యొక్క గుంబద్ లేక గుంబజ్(గుమ్మటం)ను ప్రేమాభక్తితో సబ్జ్ గుంబద్ అని గుంబద్-ఎ-ఖజ్రా అని వ్యవహరిస్తారు.
అల్ –అక్సా-మస్జిద్ :
ముస్లింల ప్రకారం మక్కా నగరం లోని పవిత్ర కాబా ను తన కుమారుడు ఇష్మాయిల్ తో కలసి నిర్మించిన తరువాత అబ్రహం ప్రవక్త అల్-అక్సా మస్జిద్ ను జెరూసలేం లో నిర్మించెను.కాబా కిబ్లా గా మారక పూర్వం ఇది ముస్లింల మొదటి కిబ్లా గా ఉండెడిది. ప్రస్తుతం ఇది యూదుల (ఇస్రాయిల్) చట్టవ్యతిరేక, బలవంతపు అధీనం లో ఉన్నప్పటికీ మొదటినుంచి ముస్లింలు దీని నిజమైన సంరక్షకులుగా వ్యవరించేవారు.
అల్ –అక్సా మస్జిద్ ను ఎవరు నిర్మించారు అన్న దానిపై వివాదం కలదు. యూదుల ప్రకారం ఇది కింగ్ డేవిడ్ మరియు అతని కుమారుడు సోలోమన్ (ప్రవక్తలు) చే నిర్మించబడినది. దివ్య ఖురాన్ ప్రకారం ప్రవక్త ఇబ్రహీం మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం అల్-అక్సా-మస్జిద్ ను నిర్మించిరి. మక్కా లోని కాబా భూమిపై అల్లాహ్ ని ఆరాధించుటకు నిర్మించబడిన మొదటి మస్జిద్. ఇస్మాయిల్ మరియు అతని తల్లి హాజిరా మక్కా లో స్థిర నివాసం ఏర్పర్చుకోనిరి. అబ్రహం ప్రవక్త తన పేరు మీద నిర్మించబడిన హేబ్రోన్ (పాలస్తీనా భూభాగం) లో నివాసం ఏర్పర్చుకోనేను. మక్కా లో కాబా నిర్మించిన అబ్రహం తన నివాసం హేబ్రోన్ కు దగ్గిరలో ఉన్న జెరూసలేం లో ఆరాధన మందిరం (అల్-అక్సా) నిర్మించలేదు అనటం ఎంతవరకు సబబు? ప్రవక్తలకు పితామహుడగు అబ్రహం జెరూసలేం లో కూడా ఒక ఆరాధన మందిరం బెటేఎల్(హిబ్రు బాష లో దేవుని ఆరాధనా మందిరం అని అర్ధం) నిర్మించెను. హేబ్రోన్ లో జన్మించిన అబ్రహాం కుమారుడు ఇస్సాక్ తండ్రి తో కలిసి బెటేఎల్ లో దేవుని ఆరాదించెవాడు మరియు మక్కా లోని కాబాకు తండ్రి తో కలసి హజ్ యాత్ర చేసి అక్కడ సోదరుడు ఇస్మాయిల్ తో కలసి అల్లాహ్ ను ఆరాదించేవాడు. అబ్రహం తను నిర్మించిన బెటేఎల్ కు మస్జిద్ –అల్-అక్సా (తూర్పున సుదూర మస్జిద్)ని నామకరణం చేసినాడు. ఇది మక్కా కు వ్యాయువ్య మూలన కలదు.
ఇసాక్ కుమారుడు యాకూబ్ బెటేఎల్ ద్వారాలను ను ఒకే దేవుని అందు నమ్మక ఉంచే వారందరి కొరకు తెరచినాడు. ప్రారంభం లో పాలస్తీనా లో అనేక తెగలు ఉదా: ఫిలిస్టిన్స్, మోఅబిటేస్, హిట్టీస్ ఉండేవి. ఫిలిస్టిన్స్ తెగ పేర ఆ భూభాగం నకు పాలస్తీనా అను పేరు వచ్చింది. హిట్టీస్ తెగ ఆడపడుచు సోలమన్ తల్లి. అబ్రహం ఉర్ (ప్రస్తుత) ఇరాక్ లో జన్మించెను. నిమ్రోద్ రాజు వలన ప్రవాస జీవితం గడిపి అల్-ఖలిల్ (పాలస్తీనా) లో స్థిర నివాసం ఏర్పర్చుకోనేను.
1948 లో పాలస్తీనా భూభాగం లో బలవంతం గా ఏర్పాటు చేయబడిన ఇస్రాయిల్ క్రమం గా బలపడి 1967 అరబ్-ఇస్రాయిల్ యుద్ధం లో పాలస్తీనా భూభాగం అయిన తూర్పు జెరూసలేం ను బలవంతం గా ఆక్రమించినది. ఈ ఆక్రమణలో ముస్లిం ల పవిత్ర స్థలాలు ఐన మస్జిద్-అల్-అక్సా, బైతుల్ ముఖద్దస్ (డోమ్ అఫ్ ది రాక్) తో పాటు మస్జిద్-అల్-షరీఫ్ ప్రాంగణం ఇస్రాయిల్ ఆక్రమణ లోనికి వెళ్ళినాయి. ఆనాటి
నుండి ఇస్రాయిల్/యూదులు మస్జిద్-అల్-అక్సా, బైతుల్ ముఖద్దస్ (డోమ్ అఫ్ ది రాక్) –మస్జిద్-అల్-షరీఫ్ లో ముస్లిం విశ్వాసుల ప్రార్ధనల పై అనేక ఆంక్షలు విధిస్తూ ముస్లింలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
వర్తమాన చరిత్ర లో అల్-అక్సా మస్జిద్ ప్రదేశం (హరమ్ –అల్-షరీఫ్ ప్రాంగణం) యూదు మరియు ముస్లింల మద్య వివాదాస్పదంగా మారింది. ఈ ప్రదేశం ఇద్దరి మత గ్రంధాలలో పరమ పవిత్ర ప్రదేశం గా పరిగణించ బడుతున్నది. యూదులు జెరూసలేం ను తమ రాజధాని గా భావిస్తారు. అల్ అఖ్సా మస్జిద్ జెరూసలేం నగరంలోని ఆలయాల సమూహంలో గలదు. ఈ ఆలయాల సమూహం యూదులకు పరమ పవిత్రంగా భావిస్తారు. యూదుల ప్రకారం చారిత్రికంగా ఈ ప్రదేశం లో వారి మొదటి మరియు రెండోవ దేవాలయాలు పూర్వం కలవు. ప్రస్తుతం కరుడు కట్టిన యూదు సంప్రాదాయక వాదులు హారమ్- అల్ -షరీఫ్ ను ఆక్రమించి అక్కడ యుదు మత ప్రార్ధనలు చేయుటకు డిమాండ్ చేయుచున్నారు. కాని యూదు న్యాయసుత్రాల ప్రకారం యూదులు టెంపుల్ మౌంట్ (యూదుల భాష లో హారమ్- అల్ -షరీఫ్ ప్రాంగణం) లో అడుగు పెట్టరాదు. వాస్తవానికి అల్-అక్సా మస్జిద్, డోమ్ అఫ్ ది రాక్, అనేక మదరసాలు ఉన్న హారమ్- అల్- షరీఫ్ ప్రాంగణం లోనికి యూదులు అడుగు పెట్ట రాదన్న బోర్డు ఇప్పటికి అక్కడ కలదు. వాస్తవానికి జెరూసలేం పై మొదటి నుంచి ఇతరుల ఆక్రమణలు కలవు . ప్రాచిన కాలం లో బాబిలోనియన్లూ, ఈజిప్ట్ పాలించిన ఫారో లు. పెర్సియన్లు, రోమన్లు జేరుసేలెం ను ఆక్రమించిరి.
ఆ తరువాత క్రైస్తవులు, తిరిగి సలాఉద్దిన్ కాలం లో జెరూసలేం ముస్లింల అధినం లోనికి వచ్చింది. క్రమంగా ముస్లింలు జెరూసలేం పై తమ ఆధిపత్యం ను కొల్పొయినారు. మొదటి ప్రపంచయుద్దం లో టర్కీ ఒడిపొయినప్పుడు పాలస్తీనా బ్రిటిష్ వారి ఆధీనం లోనికి వచ్చింది దానిని వారు విభజించి పాలస్తీనా లోని కొంత భూభాగంను యూదులకు ఇస్రాయిల్ పేర స్వతంత్ర దేశంగా 1948 లో ఏర్పాటు చేసిరి. 1967 అరబ్-ఇస్రాయిల్ యుద్ధం లో ఇస్రాయిల్ విజయం సాధించి పాలస్తీనా లోని మస్జిద్-అల-అక్సా, డోమ్ అఫ్ ది రాక్ తో కూడిన తూర్పు జేరుసులేం ను తమ అధీనం లోనికి తెచ్చుకొన్నారు. ప్రస్తుత జెరూసలేం (మస్జిద్-అల-అక్సా, డోమ్ అఫ్ ది రాక్ కూడిన మస్జిద్ –అల్- షరీఫ్ ప్రాంగణం ) ఇస్రాయిల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగం గా ఉంది.
బైతుల్-ముఖద్దస్ జెరూసలేం లోని మస్జిద్
ల సమూహాలలో ముఖ్యమైన మస్జిద్. ఇది ఇస్లాం లోని ఒక
పుణ్యక్షేత్రం. దీని నిర్మాణం 691 లో పూర్తయింది. ఇది ఇస్లాం లోని ప్రపంచంలోనే
అత్యంత పురాతన కట్టడం. దీనినే ఇంగ్లీషువారు 'డూమ్ ఆఫ్
రాక్' అని వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment