25 December 2017

దివ్య ఖుర్ఆన్ పేజీల నుండి క్రీస్తు యొక్క కథ (The Story of Jesus the Christ from the Pages of the Quran ) -.Image result for The Story of Jesus the Christ from the Pages of the Quran )


మేరీ యొక్క తల్లి విన్నపము తో కథ మొదలవును:
అల్లాహ్ ఆదమ్ కు, నుహ్  కు, ఇబ్రహీం సంతతికి(1), ఇమ్రాన్ సంతతికి(2) సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యత  ఇచ్చి(తన సందేశం కొరకు) ఎన్నుకోన్నాడు. ఒకరి వంశము నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు.  ఇమ్రాన్(౩) స్త్రీ అల్లాహ్ ఇలా ప్రార్ధించి నప్పుడు (అల్లాహ్ విన్నాడు) “ప్రభూ! నా గర్భం లో ఉన్న శిశువును నేను నీకు సమర్పిoచు కొంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్ని వినేవాడవు, అన్ని తెలిసినవాడవు” తరువాత  ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు, ఆమె ఇలా విన్నవించు కొన్నది “ప్రభూ! నాకు ఆడ శిశువు కలిగినది- ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహ్ కు బాగా తెలుసు – బాలుడు బాలిక వంటివాడు కాడు.   నేను దానికి మర్యం అని పేరు పెట్టాను. శాపగ్రస్తుతుడైన షైతాన్ బారినుండి రక్షణ కొరకు నేను దానిని, దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆమె ప్రభువు  ఆ బాలికను సంతోషముతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చి దిద్దాడు. ఇంకా, జకారియను ఆమెకు సంరక్షకుడిగా నియమించాడు. జకారియా ఆమె గదికి పోయినప్పుడల్లా అమెవద్ద, అయన కొన్ని భోజన పదార్ధాలను చూసే వాడు. ఆమెను ఇలా అడిగే వాడు “ మర్యమ్! ఇవి నీ దగ్గిరకు ఎక్కడనుండి వచ్చాయి.ఆమె ఇలా జవాబు చెప్పేది, “అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.” [సూరా అల్ 'ఇమ్రాన్, 3: 33-37]

 అల్లాహ్ మర్యమ్ ను  ఆశ్విరదిస్తాడుస:
దేవదూతలు మేరీతో ఇలా అన్నారు: 'మర్యమ్! అల్లాహ్ నిన్ను ఎన్నుకోన్నాడు. నీకు పరిశుద్దతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళల అందరిపై నీకు ప్రాధాన్యమిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకోన్నాడు. మర్యమ్! నీవు నీ ప్రభువునకు విదేయురాలుగా ఉండు. అయన సాన్నిద్యం లో సజ్దా చెయ్యి(సాస్టాoగపడు) రుకూ చేసే దాసులతో నీవు రుకూ చెయ్యి(నమ్రతతో వంగు) ప్రవక్తా! ఇవన్ని అగోచర విషయాలకు సంభందించిన వార్తలు. వాటిని మేము(4) నీకు వహి ద్వారా తెల్పుతున్నాము. లేకపోతే, మర్యమ్ సంరక్షకుడు ఎవరు అవాలి అనే విషయ నిర్ణయం కొరకు, ఆలయ సేవకులు తమ తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా! ఇంకా, వారి మద్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. [సూరా అల్ 'ఇమ్రాన్, 3: 42-44]

దేవదూతలు మర్యమ్ కు  సంతోషకరమైన వార్తను అందిస్తున్నారు:
 దేవదూతలు ఇలా అన్నారు  'మర్యమ్! అల్లాహ్ తన ఒక “ఆజ్ఞ” సంభందించిన శుభ వార్తను నీకు పంపుతున్నాడు(5). అతని పేరు ఈసా మసిహా(6). అతను మర్యమ్ కుమారుడు. అతను ఇహపరలోకాలలో గౌరవనీయుడౌతాడు. అల్లాహ్ సామిప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణిoప బడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెరిగి పెద్దవాడై నప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడు అవుతాడు.” ఇది విన్న మర్యమ్ ఇలా అన్నారు:”ప్రభూ! నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడూ చేతితోనైనా తాకలేదే! సమాధానం లబించినది. “అలానే జరుగుతుంది. అల్లాహ్ తానూ కోరినదాన్ని సృష్టిస్తాడు.అయన ఒకపనిని చేయాలని నిర్ణయించినప్పుడు, కేవలం దానిని “అయిపొ” అంటాడు.అంతే, అది అయిపోతుంది”.

(దైవ దూతలు ఇంకా ఇలా అన్నారు) “అల్లాహ్ అతనికి గ్రంధాన్ని, దివ్య జ్ఞానాన్ని భోధిస్తాడు. తౌరాతు, ఇంజిలు గ్రంధాల జ్ఞానాన్ని నేర్పుతాడు.ఇంకా అతనిని ఇస్రాయీలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. (ప్రవక్త గా ఇస్రాయీల్ సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు),”నేను మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టి తో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోనికి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది.నేను అల్లాహ్ ఆజ్ఞ తో  పుట్టు గుడ్డిని, కుష్టు రోగిని బాగు చేస్తాను. అయన అనుజ్ఞ తో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించే వారు అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలం లో ఉన్న తౌరతు గ్రందోపదేశాలను ద్రువపరచడానికి నేను వచ్చాను. ఇంకా, పూర్వం మీకు నిషేదిoపబడిన (హరాం) కొన్ని వస్తులను ధర్మ సమ్మతం (హలాల్) చేయటానికి కూడా వచ్చాను. చూడండి! నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచన తీసుకు వచ్చాను. కనుక అల్లాహ్ కు బయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే మీకు ప్రభువే. కనుక మీరు అయన దాస్యాన్ని చేయండి.ఇదే రుజుమార్గం"[సూరా అల్ 'ఇమ్రాన్, 3: 45-51].

మర్యమ్ గర్భం ధరిస్తుంది:
మర్యమ్ తన వారినుండి(తన కుటుంబం) వేరై పోయి ఏకాంతం గా ఉన్నప్పుడు మేము ఆమె వద్దకు మా “ఆత్మ” ను (అంటే దూతను – దైవ దూత జిబ్రాయిల్) పంపాము. అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారం లో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మర్యమ్ ఇలా పలికింది, “ నీవు దైవభీతి గల మనిషివే అయితే, నేను నీ బారినుండి రక్షించవలసినదిగా దయామయుడైన దేవుని శరణ కోరుకొంటున్నాను.” అతను” నేను నీ ప్రభువు దూతను మాత్రమె. నీకు ఒక పరిశుద్ద పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను.” అని చెప్పాడు. మర్యమ్ “ నాకు పుత్రుడు ఎలా పుడుతాడు, నన్ను పురుషుడు ఎవడూ తాకనైనా లేదు, నేను చెడు నడత గల దానిని కాను” అన్నది. దైవ దూత ఇలా అన్నాడు, అలాగే జరుగుతుంది” నీ ప్రభువు ప్రజల కొరకు ఒక సూచనగా, మా తరుపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాను. ఇది జరిగి తీరవలసిన విషయమే” అని సెలవిస్తున్నాడు. "[సూరా మర్యమ్, 19: 17-21]

ఈసా యొక్క జననం
మర్యమ్ ఆ మగ శిశువును గర్భం లో దాల్చినది. గర్భవతి అయిన ఆమె ఒక సుదూర ప్రదేశానికి వెళ్ళిపోయినది. తరువాత ప్రసవవేధన పడుతూ ఆమె ఒక ఖర్జురపు చెట్టు క్రిందకు చేరింది. ఆమె ఇలా వాపోయినది.” అయ్యో! నేను ఇంతకూ ముందే మరణించి ఉంటె, నామ రూపాలు లేకుండా నశించి ఉంటె ఎంత బాగుండేది!” అప్పుడు దైవదూత కాళ్ళవైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, “భాధపడకు, నీ ప్రభువు నీకు దిగువ భాగం లో ఒక సెలయేరును సృజించాడు.  నీవు ఈ చెట్టు మొదలు కొంచం ఊపు. నీపై స్వచ్చమైన తాజా ఖర్జురపు పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు, నీ కళ్ళను చల్లబరుచుకో. తరువాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే, అతనికి, నేను కరుణామయుని కోసం ఉపావాసం ఉంటానని మొక్కుకొన్నాను. కనుక ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను.” అని చెప్పు. [సూరా మర్యమ్, 19: 22-26]

ఈసామొదటి అద్భుతం:
తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకోని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మర్యమ్! నీవు పెద్ద పాపమే చేసావు.ఓ హరూన్ సోదరి!(7) నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడత గల స్త్రీ కాదె!మర్యమ్ బాలుని వైపు సైగచేసి చూపింది. దానికి ప్రజలు, “ఉయ్యాలలోని ఈ పసిపిల్లవానితో మేము ఎం మాట్లాడము?” అని అన్నారు.పిల్లవాడు ఇలా పలికాడు, “నేను అల్లాహ్ దాసుణ్ణి. అయన నాకు గ్రంధాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే, అయన నన్ను శుభావంతునిగా చేసాడు, నేను జీవించి ఉన్నంతకాలం నమాజును, జకాత్ను పాటించు అని అజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నేరవేర్చేవానిగా నన్ను చేసాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, పాషాణ హ్రుదయునిగాను చేయలేదు. నేను పుట్టిన రోజునా, నేను మరణించే రోజునా, బ్రతికింపబడి లేవబడే రోజునా నాకు శాంతి కలుగు తుంది.

ఇతనే మర్యమ్ కుమారుడు ఈసా, ఇదే అతనికి సంభందించిన అసలు నిజం. దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాహ్ కు తగిన పద్దతి కాదు. అయన పరమ పవిత్రుడు.(8) ఏ విషయాన్ని గురించియైనా ఆయన నిర్ణయం తీసుకొంటే, “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడు.అంతే  అది అయిపోతుంది.. [సూరా మర్యమ్, 19: 27-35]

ఈసాయొక్క శిష్యులు:
ఇస్రాయిల్ వంశస్తుల అవిశ్వాసాన్ని, తిరస్కరాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: ”అల్లాహ్ మార్గం లో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవారిలు ఇలా జవాబు పలికారు: “మేము అల్లాహ్ కు సహాయకులం. మేము అల్లాహ్ ను విశ్వసించాము. మేము ముస్లిములము  (అల్లాహ్ విధేయులము)(9) అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభూ! నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము. మా పేర్లు సాక్షుల జాబితా లో వ్రాయి.” '[సూరా అల్' ఇమ్రాన్, 3: 52-53]

ప్రతి ఒక్కరూ నమ్మలేదు:
విశ్వసించిన ఓ ప్రజలారా! మర్యమ్ కుమారుడు ఈసా, హవారిలతో అన్నట్టు మీరు అల్లాహ్ కు సహాయకులు కండి. వారితో ఈసా ఇలా అన్నాడు, “అల్లాహ్ వైపునకు (పిలిచే పనిలో) నాకు సహాయపడే వారు ఎవరైనా ఉన్నారా? దానికి హవారిలు, “మేము ఉన్నాము అల్లాహ్ కు సహాయకులం” అని సమాధాన మిచ్చారు.అప్పుడు ఇస్రాయిల్ సంతతి లోని ఒక వర్గం విశ్వసించినది, మరొక వర్గం తిరస్కరించినది. తరువాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకం గా బలపర్చాము. వారే ఆధిక్యం వహించినారు. [సూరా అల్-తహ్రిమ్, 61:14]

విందు  యొక్క అద్భుతం
వారు “మర్యమ్ కుమారుడవైన ఈసా! నీ ప్రభువు మా కొరకు ఆహారపదార్ధాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుండి దిoప గలడా? అని అడిగినప్పుడు, ఈసా “మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ కు బయపడ౦డి” అని అన్నాడు. వారు ఇలా అన్నారు: ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నీవు మాకు   చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమె మేము కోరుతున్నాము”. దానిపై మర్యమ్ కుమారుడైనా ఈసా ఇలా ప్రార్దించాడు: “  అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి మాపై ఆహరం తో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింప జెయ్యి. అది మాకూ, మా పూర్వికులకూ, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా  నిర్ణయిoపబడాలి. నీ తరుపు నుండి ఒక సూచన కలగాలి. మాకు ఆహరం ప్రసాదించు. నీవు ఉత్తమ ఆహార ప్రదాతవు.” అల్లాహ్ ఇలా జవాబు పలికాడు:”నేను దానిని మీపై అవతరింప జేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకూ ఎవరికీ విధించని శిక్ష విదిస్తాను” [సూరా అల్ మాయిద, 5: 112-115]

అల్లాహ్ ఈసాను తన శత్రువుల నుండి రక్షించాడు
ఇస్రాయిల్ సంతతి వారు (ఈసాకు వ్యతిరేకంగా) రహస్యపుటేత్తులు పన్న సాగరు. వారి ఎత్తులకు అల్లాహ్ కూడా పన్నాడుడు. ఎత్తులు వెయ్యటం లో అల్లాహ్ మేటి.(అది అల్లాహ్ రహస్యతంత్రమే). అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: “ఈసా! నేను నిన్ను తిరిగి నా దగ్గిరకు రప్పించుకొంటాను,” నా వైపుకు లేపుకొంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి (అంటే వారి చెడు సాగాత్యం నుండి, వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండటం నుండి కాపాడి) నిన్ను పరిశుద్దినిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిర్సక్రించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలివస్తారు. అప్పుడు మీమధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. అవిస్వాసవైఖిరిని తిరస్కార ధోరణిని అవలంభించిన వారిని ఇహాపరాలు రెండిటిలోనూ కటినంగా శిక్షిస్తాను. వారు సహాయకులనేవ్వరిని పొందలేరు. ఇక విశ్వసించి మంచిపనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడుతాయి. బాగా తెలుసుకోండి! దుర్మార్ఘులను అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు.”[సూరా అల్ 'ఇమ్రాన్, 3: 54-57]

శిలువ వేయబడలేదు:
స్వయంగా, “మేము మసిహ్, మర్యమ్ కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము” అని అన్నారు-వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువ పైకి ఎక్కించను లేదు. కాని ఆ విషయం లో వారు బ్రమకు గురి చెయ్యబడ్డారు.ఈ విషయం గురించి అభిప్రాయబెధం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమి తెలియదు. వారు కేవలం ఉహానే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంప లేదు. కాని అల్లాహ్ ఆయనను తన వైపుకు లేపుకొన్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గ్రంధ ప్రజలలో ఎవ్వరు అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించ కుండా ఉండరు(10). ప్రళయం నాడు అయన వారికి వ్యతిరేకం గా సాక్షమిస్తాడు-[సూరా అల్-నిసా  4: 157-159]

క్రీస్తు ఈసా అనగా, మసిహ్ ఈసాఒక ప్రవక్త మాత్రమే:    
మర్యమ్ పుత్రుడైన మసిహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులు (ప్రతిరోజూ) భోజనం చేసేవారు.-చూడండి! మేము వారిముందు యదార్ధానికి సంభందించిన సూచనలను ఎలా విశిదికరిస్తున్నామో చూడండి! అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో! వారితో ఇలా అను: “ఇదేమిటి, మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గాని, లాభం గాని కలిగించే అధికారం లేని దానిని పూజిస్తున్నారు? అందరిది వినేవాడు అంతా తెలిసిన వాడూ అల్లాహ్ మాత్రమే.” '[సూరా అల్ మాయిద, 5: 75- 76]

ఈసాఆదాము లాగా మానవుడి గా సృష్టించబడినాడు:
అల్లాహ్ దృష్టిలో ఈసా పుట్టుక ఆద౦ పుట్టుక వంటిదే. అల్లాహ్  ఆదం ను మట్టి తో చేసి “అయిపో” అని అజ్ఞాపించాడు, అతను అయ్యాడు. [సూరా అల్ 'ఇమ్రాన్, 3:59]

అన్ని ప్రవక్తలు మాదిరిగా ఒకే  భగవంతుని ఆరాధన అనేది జీసస్ యొక్క  సందేశ సారం:
(ఈసా ఇలా ప్రకటించాడు) అల్లాహ్ నాకూ, మీకూ ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్ని చెయ్యండి. ఇదే రుజుమార్గం. [సూరా అల్ 'ఇమ్రాన్, 3:51 & 19:36]

ఈసాసూచనలు ఇచ్చాడు:
మర్యమ్ కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో,” ఓ ఇస్రాయిల్ సంతతి వారా! నేను మీ వద్దకు అల్లాహ్ చే పంపబడిన సoదేశహరుణ్ణి. నాకు పూర్వం వచిన్న తౌరాత్ గ్రంధాన్ని ద్రువపరుస్తున్నాను.నా తరువాత అహ్మద్ (11) అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభ వార్తను అందజేస్తున్నాను. అయితే అయన (ముహమ్మద్ (స) వారివద్దకు స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు వారు “ఇది పూర్తిగా మోసమే” అని అన్నారు.   [సూరా-సఫ్, 61: 6]


తీర్పు దినమున
అల్లాహ్, “మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు మనుజ జాతితో, అల్లాహ్ ను కాదని నన్నూ, నా తల్లి ని దేవుళ్ళుగా భావించండి అని భోదించావా? అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకొంటాడు : “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అంటం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆవిధంగా అని ఉంటె, అది నీకు తప్పకుండా తెలిసిఉoడేది. నా మనసులో ఏముందో నీకు   తెలుసు. నీ మనస్సు లో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యధార్ధలన్ని తెలిసిన మహ జ్ఞానివి. నీవు ఆదేశించిన దానిని తప్ప దేనిని నేను వారికి చెప్పలేదు. అది ఏమిటంటే అల్లహ్ ను  ఆరాధించండి. అయన నాకూ ప్రభువే, మీకు ప్రభువే. నేను వారి మద్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను.నీవు తిరిగి పిలుచుకోన్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు. నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉoడే వాడవు. ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే నీవు శక్తివంతుడవు. వివేకవంతుడవు.” అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు:”ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది. క్రింద కాలవలు ప్రవహించే ఉద్యానవనాలు (12)వారికి లబిస్తాయి. ఇక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు అల్లాహ్  అంటే ఇష్టపడతారు. అల్లాహ్  వారంటే ఇష్టపడతాడు.ఇదే గొప్ప విజయం.”భూమి, ఆకాశాలు, వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాదిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనకు ప్రతి వస్తువు పైన అధికారం ఉంది. [సూరా అల్-మయిదా) 5: 116-120]

రీఫెరెన్సులు/గమనికలు:
1. ఇల్లు (హౌస్)/సంతతి  అనే  పదంకు  పూర్వీకులు, వారసులు మరియు బంధువులు అని అర్థం గ్రహించాలి.
[2] ఇమ్రాన్ యొక్క ఇల్లు/సంతతి అతని కుమారులు మోషే అహరోను (Aaron) మరియు వారి సంతతివారు. జెకర్యా, అతని భార్య ఎలిజబెత్ Zachariah, his wife Elizabeth మరియు వారి బంధువు మర్యమ్Mary అహరోను(Aaron) వారసులు. అందువల్ల, జాన్ మరియు యేసు ఇద్దరూ ఇమ్రాన్ యొక్క సంతతికి/ ఇంటికి చెందినవారు.
[3] మరో అనువాదం: ఇమ్రాన్ యొక్క భార్య. ముస్లిం పండితుల ప్రకారం ఇమ్రాన్ అనే ఇద్దరు పురుషులు ఉన్నారు: మోసెస్ మరియు అహరోను తండ్రి మరియు మర్యమ్ యొక్క తండ్రి, (అతని పూర్వీకుల పేరు పెట్టబడినాడు named after his ancestor).
 [4] ఖుర్ఆన్ యొక్క అనేక ఆయతులలో 'మేము' గా పేర్కొన్నది అరబిక్ భాషలో అల్లాహ్ యొక్క సూచన గొప్పతనం మరియు శక్తిని సూచించడానికి వాడారు అని గమనించాలి. ఆంగ్ల భాషలో ఈ వాడుకను రాయల్ WE అని పిలుస్తారు.
[5] ఇక్కడ యేసు ఇచ్చిన ఉపమానము "దేవుడిచ్చిన వాక్యము" ఇవ్వబడినది.
[6] బైబిల్ మరియు ఖుర్ఆన్ యొక్క వాస్తవ భాషలలో ఉపయోగిoచిన పదం మెస్సీయ (అభిషేకం), ఇది ఆంగ్లంలో క్రీస్తుగా అనువదించబడింది.
 [7] బైబిలు ప్రకారం, మేరీ, అరోన్ Aaron ఒకే తెగకు చెందినవారు, ఆమె బంధువు ఎలిజబెత్ ఆరోన్ యొక్క వంశస్థురాలు.
8. అల్లాహ్
 [9] అరబిక్ పదం ఇస్లాం అంటే, సృష్టికర్తకు సమర్పణ అని అర్ధం. ముస్లిం అనగా  దేవునికి లొంగిపోయేవాడు అని అర్థం.
 [10] ఇస్లామీయ మూలాల ప్రకారం [ఖుర్ఆన్ మరియు  ముహమ్మద్(స) యొక్క ఉపదేశాలు(హదీసులు)], క్రీస్తు (అనగా, మెస్సీయ) యేసు శిలువపై చనిపోలేదు, కానీ భూమి పైకి తిరిగి వచ్చిన తరువాత అతను మామూలు మానవుడు గా  మరణించేవాడు, ఈ కాలంలో అతను మిగిలిన తన మిషన్(దైవ కార్యం) పూర్తి చేస్తాడు..
[11] 'అహ్మద్' అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు. దిని  అర్ధo: 'చాలా ఎక్కువ ప్రశంసలు పొందినవాడు.'
12. స్వర్గం
13.ముస్లింలు క్రైస్తవుల్ని, యూదుల్లి  అహల్ అల్-కితాబ్ (దైవగ్రంథం గలిగిన) ప్రజలు గా గౌరవంగా పరిగణిస్తారు.
13దివ్య ఖురాన్ – అనువాదం –షేక్ హమిదుల్లా షరీఫ్


No comments:

Post a Comment