భారతదేశంలో రెండవ అతిపెద్ద మతంగా ఇస్లాం ఉంది. దేశ జనాభాలో 14.2% మంది లేదా సుమారు
172 మిలియన్ ప్రజలు ఇస్లాం అనుసరించేవారిగా
లెక్కింప బడినారు. శతాబ్దాలుగా, ముస్లింలు
భారతదేశ ఆర్థిక, సంస్కృతిక వికాసం లో మరియు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించినారు. కాని స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత తరువాత కూడా భారతీయ ముస్లింల పరిస్థితి నిరాశాజనకంగా
ఉంది.
దశాబ్దాలుగా నిరక్షరాస్యత, పేదరికం మరియు ఘెట్టోయిజం ghettoization భారతీయ ముస్లింలను దెబ్బతీశాయి. మతపరమైన
అల్లర్లు జరిగినప్పుడు 1970 ల మధ్యభాగంలో మొదటిసారిగా భారతీయ ముస్లింలలో
ఘెట్టోయిజం ghettoization ప్రారంభమైంది. ఇది 1989 లో బాగల్పూర్ హింసాకాండ తరువాత
అధికం అయ్యింది మరియు 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అది
అలవాటు ధోరణిగా మారింది. కొద్దికాలంలోనే దాదాపు అన్ని అనేక ప్రధాన నగరాలలో రక్షణ
కొరకు ముస్లిమ్స్ అందరు కలసి విడిగా ప్రత్యేక ప్రదేశాలు/వాడలు లేదా
ఘెట్టోలలో ఉండసాగారు. అయితే ఈఘెట్టోలు వారికి అనుకున్నంత రక్షణ ను కల్పించలేక
పోయినవి.
2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా, ఈ ఘెట్టోలు లేదా విడిగా ఉన్న ముస్లిం రెసిడేన్షియాల్
కాలనీలు అల్లరిమూకకు తేలికగా టార్గెట్ అవినవి. అల్లర్లకు గురైన
పలువురు వ్యక్తులు ప్రాణాలను కోల్పయారు. మారణహోమం జరిగి అపార జననష్టం, ఆస్థి నష్టం అయ్యింది.
ముంబై, ఢిల్లీ, కోల్కతా మరియు గుజరాత్లోని అనేక నగరాల్లో
హిందూ-ఆధిపత్య మరియు ముస్లిం-ఆధిపత్య పొరుగు ప్రాంతాలు(Hindu-dominated and Muslim-dominated neighbourhoods) ఏర్పడినవి మరియు స్పష్టమైన
సాంఘిక-సాంస్కృతిక విభజనను మనం చూడవచ్చు.బొంబాయి
లో ముస్లిమ్స్ కు ఆఖరికి ముస్లిం చలన చిత్ర ప్రముఖులకు కూడా ఇళ్ళు అద్దెకి లేదా
కొనడానికి లభించని పరిస్థితి ఏర్పడింది. అనేకమంది ముస్లిం చలన చిత్ర ప్రముఖులు ఈ
విషయంలో తమ ఆందోళన ప్రకటించారు.
గుజరాత్ లో అల్లర్లు
మరియు ముస్లింల పరాయీకరణ(alienation) వలన ముస్లిం కమ్యూనిటీ పెద్ద ఎత్తున ఘెట్టోయిజం వైపు
మరలింది. ఉదాహరణకు 2002 నాటి అల్లర్ల నుండి, అహ్మదాబాదులోని జహపూర ప్రాంతం జనాభా
250,000 నుంచి 650,000 మందికి చేరింది. గుజరాత్లోని ముస్లింలు తమ ఆర్థిక, వృత్తిపరమైన హోదాతో నిమిత్తం
లేకుండా, ఘెట్టోలలో నివసిoచ సాగినారు.
పెరుగుతున్న ఘెట్టోలలో జీవనo సాధారణ,ఆర్ధిక మరియు విద్యా అవకాశాల అలబ్యతకు దారితీసింది.
కొంతమంది భారతదేశంలో లౌకికవాదం ముస్లింలకు
అనుకూలంగా చూస్తున్నారు తప్పితే దాన్ని ప్రజాస్వామ్యానికి ఆవశ్యకం గా చూడుట లేదు.
సచార్ కమిటీ రిపోర్టు సాంఘిక,ఆర్దిక,విద్యా,
రాజకీయాలలో ముస్లింల స్థితిగతులను నిశితంగా
పరిశీలించినది. ముస్లిం సమాజంలో అత్యధిక జనన రేటుపై పరిశీలనలు చేయటం కూడా ఇందులో
ఉన్నాయి: 2100 నాటికి భారత జనాభాలో, ముస్లిం
జనాభా 17% మరియు 21% మధ్య స్థిరoగా ఉంటుందని కమిటీ అంచనా వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు దాదాపు 15% మరియు పది సంవత్సరాల్లో కేవలం 2% పైగా పెరిగారు.
సచార్ కమిటీ భారతదేశ ఆర్థిక, రాజకీయ, మరియు సామాజిక ప్రధాన స్రవంతిలో భారతీయ ముస్లింలు ఎలా
పాల్గొవాలో అందుకు నిరోధాలను ఎలా తొలగించాలనే అనే దానిపై పలు సూచనలనుచేసింది. భారతీయ ముస్లింల యొక్క "వెనుకబాటుతనం"
పై నివేదికను ప్రచురించింది.
భారతీయ జనాభాలో ముస్లింలు 14% ఉన్నారు, కాని భారత ప్రభుత్వ సర్విసులలో కేవలం 2.5% మాత్రమే ఉన్నారు. భారతీయ ముస్లింల పరిస్థితులు
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కంటే తక్కువగా ఉన్నాయని సచార్ కమిటీ
నిర్ధారించింది.
సచార్ రిపోర్టు భారతీయ ముస్లింల అసమానత సమస్య జాతీయ దృష్టికి తీసుకువచ్చింది. హౌసింగ్ వంటి విషయాలలో వివక్ష ఫిర్యాదులను
పరిష్కరించడానికి ఒక చట్టపరమైన యంత్రాంగాన్ని అందించడానికి ఒక సమాన అవకాశాల
కమిషన్ని(Equal Opportunity Commission) ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సచార్ కమిటీ
యొక్క పరిశీలనలకు ప్రతిస్పందనగా, నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం నేషనల్
మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC) యొక్క బడ్జెట్ను
పెంచారు మరియు ఈ సంస్థ విధి సచార్ కమిటీ
యొక్క సిఫార్సులు అమలు చేయటంగా నిర్ణయిoచారు.
అయితే అలాంటి సిఫార్సులు ఇంకా అమలు చేయబడలేదు మరియు భారతీయ
ముస్లింలు స్వతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత కూడా నిరక్షరాస్యత, పేదరికం మరియు అన్యాయంతో బాధపడుతున్నారు.
No comments:
Post a Comment