14 December 2018

2018అసెంబ్లీ ఎన్నికలు –ముస్లింల స్థితి -

 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, మిజోరాం లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల లో  మొత్తం 19 మంది ముస్లిం అబ్యర్ధులు విజయం సాధించారు.

Ø రాజస్థాన్, తెలంగాణాలో చేరి ఎనిమిది మంది ముస్లిం అభ్యర్థులు, ఇద్దరు  ముస్లిం అభ్యర్థులు మధ్యప్రదేశ్ నుండి గెలిచారు, ఒక ముస్లిం అభ్యర్థి ఛత్తీస్గఢ్ నుండి గెలిచారు. మిజోరాం నుంచి ముస్లిం అభ్యర్థి పోటీ చేయలేదు.

రాజస్తాన్:
Ø 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రాజస్థాన్లో 6,215,377 మంది ముస్లింలు ఉన్నారు, రాష్ట్ర జనాభాలో వీరు 9.1% మంది ఉన్నారు.

Ø రాజస్థాన్ శాసనసభలో 200 సభ్యులు ఉన్నారు. జనాభాకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీలో 18-20 మంది ముస్లింలు ఉండాలి కానీ ఎనిమిది ముస్లింలు మాత్రమే ఈసారి విజయం సాధించారు.

Ø ముస్లిం MLA ప్రాతినిద్య శాతం 2.4% కు   తగ్గింది.

Ø రాజస్తాన్ లో క్రిందటి సారి  ఇద్దరు ముస్లిం అబ్యర్ధులు విజయం సాధించగా ఈసారి ఎనిమిది మంది విజయం సాదించారు.


Ø 1998 నుండి మొదటిసారిగా BJP నుండి ఎవరు ముస్లిం అబ్యర్ధిగా విజయం సాధించలేదు.

Ø గెల్చిన వారిలో 7గురు కాంగ్రెస్ కు చెందగా ఒకరు BSP కి  చెందినవారు. కాంగ్రెస్స్ 15 మంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది.


Ø పోకరన్ కు చెందిన సోహైల్  మొహమ్మద్ అతి తక్కువ మెజారిటీ 929 వోట్ల  తో విజయం సాధించారు.

Ø విజయం పొందిన ముస్లిం ఏకైక మహిళా అబ్యార్ది జహిదా ఖాన్ 39వేల వోట్ల మెజార్టీ తో గెలిచారు.

Ø రాజస్థాన్లో 34 స్థానాలు ఎస్.సి. లకు, 25 స్థానాలు ఎస్.టి.లకు మొత్తం 59 స్థానాలు రిజర్వేడ్ చేయబడినవి.

 

Ø రాజస్థాన్లో 59 రిజర్వేషన్ స్థానాల్లో కాంగ్రెస్స్ 31, BJP 21 స్థానాలో విజయం సాధించెను.



రాజస్థాన్ అసెంబ్లీ: ముస్లిం విజేతలు
 


నియోజకవర్గం     పేరు                      పార్టీ
ఆదర్శ్ నగర్       రఫీక్ ఖాన్                కాంగ్రెస్
ఫతేపూర్           హకమ్ అలీ ఖాన్        కాంగ్రెస్
కామన్             జహీదా ఖాన్             కాంగ్రెస్
కిషన్ పోల్         అమిన్ కగ్జీ                కాంగ్రెస్
పోఖరన్            సోహైల్ మొహమ్మద్     కాంగ్రెస్
సవాయి మాధోపూర్ డానిష్ అబ్రార్          కాంగ్రెస్
షావ్                అమీన్ ఖాన్              కాంగ్రెస్
నగర్               వాజిబ్ అలీ               బిఎస్పి


Ø తెలంగాణా:

ఎన్నికలలో ఏఐఎంఐ ఏడూ నియోజకవర్గాల్లో గెలిచింది మరియు టిఆర్ఎస్ నుండి  ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.

 

Ø తెలంగాణ అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం ఇంచుమించు క్రిందటిసారిలాగానే ఉంది.
Ø MIM అబ్యర్ది రాజేంద్రనగర్ నుండి మిర్జా రహ్మాత్ బేగ్ టిఆర్ఎస్ అబ్యర్ది చేతిలో  ఓడిపోయాడు.

Ø గత ఎన్నికలలో గెలిచిన 7 సీట్లను AIMIM నిలుపుకుంది.


Ø టిఆర్ఎస్ షకీల్ అమీర్ మహ్మద్ నిజామాబాద్ లోని బోధన్ నుండి విజయం సాధించారు.
మద్య ప్రదేశ్  

Ø మధ్యప్రదేశ్ శాసన సభ లో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర జనాభా లో ముస్లిమ్స్ 6.75%వరకు ఉన్నారు. జనాభా రిత్యా  ముస్లింలకు 15-20 స్థానాలు ఉండాలి. 25 నియోజక వర్గాలలో పలితాలను నిర్ణయిoచే స్థితి లో ముస్లిమ్స్ ఉన్నారు. 

Ø కాని ఈసారి శాశనసభ కు జరిగిన ఎన్నికలలో కేవలం ఇద్దరు ముస్లిం అబ్యర్ధులు మాత్రమె విజయం సాదించారు.

Ø క్రిందటి శాసన సభ లో కేవలం ఒక ముస్లిం MLA మాతమే ఉన్నారు.

Ø bJP ఒక్కరికీ, కాంగ్రెస్ ముగ్గురికి సీట్స్ ఇచ్చింది.

Ø గెలిచిన ఇరువురు కాంగ్రెస్స్ కు చెందిన వారు. ఒకరు భోపాల్ నార్త్ నుంచి, మరొకరు భూపాల్ సెంట్రల్ నుండి ఎన్నికైనారు.

Ø ౩౩ సంవత్సరాల(1998)తరువాత మొదటి సారిగా శాసన సభకు ఇద్దరు ముస్లిమ్స్ ఎన్నైకైనారు.
ఛత్తీస్ఘడ్:
Ø ఒక ముస్లిం అబ్యర్ది విజయం పొందెను.

Ø రాష్ట్ర జనాభా లో ముస్లిమ్స్ 2%వరకు ఉన్నారు

Ø .కాంగ్రెస్ ఇద్దరికీ సీట్ ఇచ్చినది. BJP తరుపున ముస్లిం అబ్యర్ది ఎవరు లేరు.

Ø  కాంగ్రెస్ తరుపున మొహమ్మద్ అక్బర్ 59 వేలకు పైగా మెజారిటీ తో కవార్ధ నియజక వర్గం నుండి విజయం పొందెను.


No comments:

Post a Comment