భారత దేశ పోలీసు దళంలో ముస్లింల ప్రాతినిద్యo అత్యల్ప శాతంగా ఈ నాటి వరకు కొనసాగుతోంది. ఇది ఒక చింతిoచవలసిన ధోరణి.భారత దేశo లోని వివిధ రాష్ట్రాలలోని పోలిస్ దళాలలో మరియు కేంద్ర ప్రభుత్వ పోలిస్ పారామిలిటరీ దళాలలో ముస్లింల ప్రాతినిద్యం సుమారు 5% మాత్రమే ఉంది.
భారత దేశం లో ముస్లింల సాంఘిక మరియు ఆర్ధిక ప్రొఫైల్ ను పరిశీలించినప్పుడు వలసరాజ్య పాలనలో ముస్లింలు మెరుగ్గా పోలిస్ దళం లో ప్రాతినిధ్యం వహించారని మరియు ఇండిపెండెంట్ ఇండియాలో వారి ప్రాతినిధ్యం నిరాశాజనకమైనదిగా ఉందని స్పష్టమవుతుంది.
మైనార్టీలు ఈనాటికన్నా ఎక్కువ బ్రిటిష్ కాలంలో సైన్యం మరియు పోలీసులలో ప్రాతినిధ్యం వహించారు.
పోలీసు బలగాలు మరియు పారామిలిటరీదళాలతో పాటు జనాభాలో
పోల్చితే ఐపిఎస్లో IPS లో ముస్లింల శాతం బహు
తక్కువగా ఉన్నది. "భారతదేశంలో ఇంటెలిజెన్స్ సంస్థలు మరియు పారా మిలటరీ దళాలు దేశ జనాభా వైవిధ్యాన్ని ప్రతిబింబించవు.
"1969 లో నేషనల్ ఇంటెగ్రేషన్ కౌన్సిల్ (ఎన్ఐసి) సిఫారసుపై, ముస్లింలను పోలిస్ దళాలలో రిక్రూట్ చేయటానికి
ప్రయత్నాలు జరిగినాయి.
సైన్యంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో జవాన్స్ ఉన్నారు. అధికారులలో
చాలా కొద్దిమంది ముస్లింలు ఉన్నారు ఎందుకంటే ముస్లింల విద్యా స్థాయి తక్కువగా
ఉంటుంది, అందువలన UPSC పరీక్షలో పోటీ చేసే సామర్థ్యం
బలహీనంగా ఉంది. CRPF యొక్క రాపిడ్ యాక్షన్ ఫోర్స్
ముస్లింలకు మంచి ప్రాతినిధ్యం ఉంది. పోలిస్లలో చాలా తక్కువ ముస్లిం పోలీసు
అధికారులు ఉన్నారు మరియు కొద్ది సంఖ్యలో
ఐపిఎస్ అధికారులు ఉన్నారు.
గుజరాత్ పోలీస్లో చాలా కొద్దిమంది ముస్లింలు ఉన్నారు; VN రాయ్ ప్రకారం 6.2% మంది మాత్రమె ఉన్నారు. అనేక వందల
రాష్ట్ర పోలీసు అధికారులలో కేవలం 65 మంది ముస్లింలు ఉన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ
ప్రకారం గుజరాత్ లోని 136 IPS అధికారులలో కేవలం ఐదుగురు మాత్రమే ముస్లింలు.
2012 జూలై నాటికి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో
ప్రకారం మహారాష్ట్ర, యూ.పి. బీహార్ పోలిసులలో ముస్లిం ప్రాతినిద్యం 5% కన్నా
తక్కువ ఉంది. మహారాష్ట్రలో 1% మాత్రమే. రాజస్థాన్లో 1.2 గా ఉంది.
జమ్మూ-కాశ్మీర్ మాత్రం ఎక్కువ సంఖ్యలో అనగా
60% పోలిసులు ముస్లిమ్స్ గా ఉన్నారు. డిల్లి పోలిస్ లో ముస్లిం అధికారుల సంఖ్య కేవలం
2% మాత్రమే ఉంది.అల్ ఇండియా లెవెల్ లో ముస్లిం అధికారుల సంఖ్య కేవలం 6% మాత్రమే
ఉంది.
సచార్ కమిటి తన నివేదికలో పోలిస్ దళంలోను ఇతర దలలో
ముస్లింల దమనీయ స్థితిని తెల్పింది.
ప్రధాన మంత్రి 15 సూత్రాల ముస్లింల అభివృద్ధి పధకం లో
భాగంగా పోలిస్ దళాల ఎంపికలో ముస్లింలకు తగిన ప్రాతినిద్యం కల్పించమని, ఎంపిక
కమిటిలో అల్ప సంఖ్యాక వర్గం వారిని నియమించమని స్పష్టం చేసింది.
భారత
దేశం యొక్క పోలీసు దళం లో ముస్లింల అత్యల్ప శాతం ఈ నాటి వరకు కొనసాగుతోంది. ఇది ఒక
చింతిoచవలసిన ధోరణి. పోలీసు దళంలో వైవిద్యం అనగా మైనారిటీ వర్గాల పురుషులు మరియు మహిళలకు మరింత
ఎక్కువ ప్రాతినిద్యం కల్పించాలి.
ఐపిఎస్IPSలో
ముస్లింల అల్ప ప్రాతినిధ్యం వలన వారికి రిజర్వేషన్ కల్పించాలి. అదే సమయంలో, UPSC పరీక్షలో
విజయవంతంగా పోటీపడటానికి మైనారిటీలకు విస్తృతమైన కోచింగ్ ఉండాలి.
అందుకు గాను ఎక్కువ సంఖ్యలో కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నియామక స్థాయిలో పారదర్శకత పెంచాలి.
తిరస్కరించబడిన వ్యక్తుల వివరాలు, వారు ఏ పరీక్షలో విఫలమైందన్నదాని గురించి తెలియజేయాలి. వీటితో పాటుగా, పోలీసు బలగాల నియామక జాబితాలు ప్రచురించాలి.
No comments:
Post a Comment