ముస్లిం సమాజ విద్య మరియు ఆర్థిక సూచికలను
మెరుగుపర్చడానికి ప్రభుత్వ జోక్యం అవసరం
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, ముస్లింల ఆర్థిక పరిస్థితి అభివృద్ధిని ఏ సూచికలు చూపించలేదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) వివిధ మత వర్గాల ఆర్థిక మరియు విద్యా సూచీలపై సేకరించిన సమాచారం యొక్క విశ్లేషణ తెలుపుతున్నది. ముస్లింలు పేదరికం యొక్క విష వలయం లో చిక్కుకోన్నట్లు విశ్లేషణ తెల్పింది.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, ముస్లింల ఆర్థిక పరిస్థితి అభివృద్ధిని ఏ సూచికలు చూపించలేదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) వివిధ మత వర్గాల ఆర్థిక మరియు విద్యా సూచీలపై సేకరించిన సమాచారం యొక్క విశ్లేషణ తెలుపుతున్నది. ముస్లింలు పేదరికం యొక్క విష వలయం లో చిక్కుకోన్నట్లు విశ్లేషణ తెల్పింది.
అత్యల్ప విద్య స్థాయిలు
NSSO యొక్క 68 వ రౌండ్ (2011-12) సమాచార సేకరణ భారతదేశంలోని ప్రధాన మత వర్గాల్లో విద్య స్థాయిలు మరియు జాబ్ మార్కెట్ సూచికల అంచనా తెల్పుతుంది.
·
ముస్లింల విద్యా స్థితిగతులు భారత దేశం లోని వివిధ మత
వర్గాల కన్నా చాలా తక్కువగా ఉన్నాయి.
·
పట్టణ ప్రాంతాలలో, మగ ముస్లిం పోస్ట్ గ్రాడ్యుయేట్లు సంఖ్య 1,000 కు 15 కంటే తక్కువ ఉంది. ఈ సంఖ్య హిందువులు, క్రైస్తవులు మరియు సిక్కులతో సహా
ఇతర వర్గాల కంటే నాలుగు రెట్లు తక్కువగా ఉంది. ముస్లిం మహిళల పరిస్థితి కూడా వారి పురుషులతో బాటు సమానంగా ఉంది.
·
ముస్లింలలో మగ గ్రాడ్యుయేట్లు సంఖ్య 1,000 కి 71 ఉంది. వీరు ఇతర వర్గాలలోని గ్రాడ్యుయేట్లలో సగం కంటే (1,000 మందికి) తక్కువగా ఉన్నారు.
·
అదేవిధంగా, సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యాభ్యాసం చేసే ముస్లింల సంఖ్య వరుసగా 1,000 మందికి 162 మరియు 90 గా ఉంది. ఇది దేశం
లోని అన్ని వర్గాలకన్నా తక్కువ గా ఉంది.
·
15 సంవత్సరాలకు పైబడిన ముస్లిం జనాభా లో సగం మంది నిరక్షరాస్యులు లేదా ప్రాధమిక లేదా మధ్య పాఠశాల విద్యను కలిగి
ఉన్నారు.
·
నిరక్షరాస్యుల సంఖ్య ముస్లింలలో 1,000 కి 190గా
, హిందువులలో 84, సిక్కులు 79 మరియు క్రైస్తవులు (57)గా ఉన్నారు.
·
ముస్లింలలో ప్రాధమిక లేదా మధ్యతరగతి విద్య పొందిన
వ్యక్తుల సంఖ్య (15 సంవత్సరాలు పైబడినవారు ) వరుసగా 257 మరియు 198గా (1,000 మందికి) ఉన్నారు.
ఇతర వర్గాలతో పోలిస్తే, ముస్లిం జనాభా విద్య యొక్క ఉన్నత స్థాయిలలో మిక్కిలి
తక్కువుగా మరియు విద్య యొక్క దిగువ
స్థాయిలలో అత్యధికంగా ఉంటుంది.
అదేవిధంగా, ముస్లింలలో ప్రస్తుత హాజరు రేటు అన్ని వయసులవారిలో తక్కువగా ఉంటుంది.
·
పట్టణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలలో హాజరయ్యే 5-14 సంవత్సరాల ముస్లిం మగ పిల్లల సంఖ్య 1000 మందికి 869 గా ఉంది, ఇది అన్ని మతవర్గాలలో కనీసంగా
ఉంది.
·
క్రైస్తవులలో (981), సిక్కులలో (971), హిందూలలో (955)గా ఉంది.
·
అదేవిధంగా ముస్లింలు
మరియు ఇతర మత సమూహాల యొక్క ప్రస్తుత హాజరు రేట్లలో ఉన్న వ్యతాసం ఉన్నత వయస్కులలో కూడా
ఎక్కువగా కన్పిస్తుంది.
·
ముస్లింల అత్యల్ప హాజరు రేట్లు మరియు ముఖ్యంగా ఉన్నత
విద్యాభ్యాసం లో తక్కువ ప్రాతినిద్యం, వారి ఆదాయం స్థాయి మరియు పోస్ట్ సెకండరీ విద్య కోసం
అయ్యే అధిక వ్యయాల ద్వారా వివరించవచ్చు.
·
NSSO సర్వే ప్రకారం, ముస్లింలలో సగటు తలసరి వినియోగ
వ్యయం (ఆదాయం సూచికగా ఉపయోగించబడింది) రోజుకు కేవలం రు32.66 మాత్రమే ఉంది. ఇది అన్ని మత సమూహాల కంటే అతి తక్కువ.
·
సిక్కులలో సగటు తలసరి వినియోగ వ్యయం అత్యధికం (రు 55.30), తరువాత క్రైస్తవులు (రు 51.43) మరియు హిందువులు (రు 37.50).
విద్య పై (2014) లో 71 వ NSSO సర్వే ప్రకారం,
·
ప్రభుత్వ మరియు ప్రైవేట్ అన్ఏడెడ్ సంస్థలలో సాంకేతిక
కోర్సులలో కళాశాల డిగ్రీలకు సగటు కోర్సు భోధనా రుసుము వరుసగా రు25,783 మరియు రు64,442 గా
ఉంది. ముస్లింల తలసరి ఆదాయం దృష్ట్యా ఇది చాలా ఎక్కువ
·
14 ఏళ్ళ వయస్సు వరకు
పిల్లలు ఉచిత మరియు తప్పనిసరి విద్యకు హక్కు కలిగి ఉన్నప్పటికీ, ఉన్నత ప్రాధమిక విద్య కోసం
విద్యార్థికి సగటు కోర్సు రుసుం విద్యా సంవత్సరం కు రు.508గా ఉంది. అన్ని మత సమూహాలకు కోర్సు రుసుము
ఒకే విధంగా ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం కారణంగా ముస్లింలలో
దాని భారం అత్యధికం.
·
ముస్లింలకు సంవత్సర తలసరి వ్యయం లో 8.5%, అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కొరకు ఖర్చు చేయగా హిందువులు (7.4%), క్రైస్తవులు (5.4%) మరియు సిక్కులు (5.03%)ఖర్చు
చేస్తున్నారు.
·
ముస్లింలలో విద్యావ్యయం యొక్క అధిక భారం, వారి అతితక్కువ హాజరు రేట్ల కు కారణ మవుతుంది.
ముస్లింలలో ఉన్నత స్థాయి నిరక్షరాస్యత మరియు తక్కువ స్థాయి సాధారణ విద్య వారు పేదరికం యొక్క ఒక ప్రమాదకరమైన విష వలయం లో చిక్కుకున్నట్లు నిర్ధారిస్తారు.
ఉన్నత విద్య లేకపోవడం వారి ఉద్యోగ
సూచికలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉపాధి నాణ్యత విద్య మరియు నైపుణ్యాల
స్థాయికి అనుసంధానించబడి ఉంది. అందువలన, ఒక సమాజం
విద్యలో వెనుకబడి ఉంటే, అది పేదరికం యొక్క దుర్మార్గపు వలయంలో చిక్కుకుపోతుంది.
ప్రభుత్వ జోక్యం లేకుండా బయటకు రావడం
కష్టం.
భారతీయ ముస్లింలు పేదరికం యొక్క విష వలయం లో చిక్కు కొన్నారు. ఇది వారి తక్కువ వినియోగ వ్యయం మరియు తక్కువ ఉద్యోగ మార్కెట్ సూచికలు, LFPR, ఉపాధి హోదా మరియు కార్మికుల జనాభా నిష్పత్తిని తెల్పుతుంది.
భారతీయ ముస్లింలు పేదరికం యొక్క విష వలయం లో చిక్కు కొన్నారు. ఇది వారి తక్కువ వినియోగ వ్యయం మరియు తక్కువ ఉద్యోగ మార్కెట్ సూచికలు, LFPR, ఉపాధి హోదా మరియు కార్మికుల జనాభా నిష్పత్తిని తెల్పుతుంది.
·
ముస్లింలలో LFPR (labour force participation rate) పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా 342 మరియు 337 గా (1,000 కు) ఉంది. ఇది అన్ని ఇతర మత వర్గాల కన్నా తక్కువగా ఉంది. అనగా పట్టణ
ప్రాంతాల్లోని ముస్లింలలో పనిచేసే వయస్సు గల 1,000 మందికి 342 మంది మాత్రమే ఉద్యోగంలో ఉన్నారు లేదా
ఉద్యోగం కోసం అందుబాటులో ఉంటారని ఇది సూచిస్తుంది.
·
అదేవిధంగా, ఇతర కమ్యూనిటీల స్త్రీల కంటే ముస్లిం మహిళలలో LFPR (labour force participation rate) అధ్వాన్నంగా
ఉంది.
·
ముస్లింలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో నివసించటం వలన అక్కడ ఇంటి వెలుపల పనిచేసే అవకాశం ఉంది.
వారి ఈ తక్కువ LFPR వారి తక్కువ స్థాయి విద్య ద్వారా
వివరించవచ్చు.
అదేవిధంగా కార్మికుల జనాభా నిష్పత్తి worker population ratio (WPR) అనగా 1,000 మందికి ఉపాధి కల్పించినవారి
సంఖ్య ముస్లింలలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అత్యల్పంగా ఉంది.
·
పట్టణ పురుషులలో రెగ్యులర్ ఉద్యోగాలలో నియమించిన
ముస్లింల సంఖ్య 1,000 మంది ఉద్యోగులకు 288 మాత్రమే, అదే పట్టణ ముస్లిం మహిళలలో కేవలం
249 మాత్రమే ఉన్నారు. ఇది అన్ని ఇతర వర్గాలలో అతి
తక్కువగా ఉంది.
·
క్రైస్తవులలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది
(1000 మంది ఉద్యోగులకు పురుష జనాభాలో 494, స్త్రీ జనాభా లో 647 మంది), తరువాత హిందువులు (పురుషులు 463
మరియు స్త్రీలు 439) మరియు సిక్కులు (పురుషులు 418 మరియు స్త్రీలు 482గా )
ఉన్నారు.
అదేవిధంగా, రెగ్యులర్ జీతాలు నుండి ఆదాయం పొందే గృహాల నిష్పత్తి
ముస్లింలలో అతి తక్కువగా ఉంది.
ఏమి చేయవచ్చు
భారతీయ ముస్లింలు పేదరికపు విష వలయం నుండి తప్పించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఉన్నత విద్య కోసం ప్రత్యేక ప్రోత్సాహకం మరియు సబ్సిడీ వ్యవస్థను అందించడం వారి పరిస్థితి మెరుగుపరచడానికి ఒక మార్గంగా చెప్పవచ్చు. తద్వారా అది పాఠశాల విద్యార్థులందరూ ఉన్నత స్థాయి విద్య మరియు ఉన్నత విద్యకు వెళ్ళటానికి తోడ్పడుతుంది. అదేవిధంగా, సాధారణ విద్యా విద్య వద్దనుకొనే విద్యార్థులకు క్లాస్ 9 నుండి వృత్తి విద్య అందించాలి.
No comments:
Post a Comment