ఆర్థిక మరియు సామాజిక దుర్బలత్వం నుండి బయటపడటానికి విద్య ఒకేటే సాధనమని భారతీయుల
మధ్య అవగాహన పెరుగుతుంది. ఉన్నత విద్య నమోదులో ముస్లింలు మరియు మహిళల ముందంజ వారి
సామాజిక-ఆర్థిక వెనుకబడటాన్ని పరిష్కరించడానికి సహాయపడుతుంది.
అఖిల భారత సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016-17 ప్రకారం
దేశంలో ఉన్నత విద్య ఎన్రోల్మెంట్/నమోదులో మహిళలు మరియు ముస్లింల సంఖ్యపెరిగింది.ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016- 17 నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో మొత్తం ముస్లింల నమోదు 37% పెరిగింది
మరియు ముస్లిం మహిళల నమోదు శాతం ఉన్నత
విద్యలో 45% పెరిగింది.
పెరిగిన ముస్లిం ఎన్రోల్మెంట్:
·
గత ఐదు సంవత్సరాల్లో ఉన్నత విద్యాసంస్థలలో నమోదైన
ముస్లింల సంఖ్య 37% పెరిగినది. ఇది అన్ని వర్గాల విద్యార్ధులలో 18% పెరుగుదలగా
ఉంది.
·
గత
ఐదు సంవత్సరాల్లో ఉన్నత విద్య లో ముస్లిముల నమోదు శాతం 37% పెరిగినది మరియు ముస్లిం మహిళల నమోదు శాతం 45% పెరిగింది.
·
ముస్లిం
మహిళల నమోదు 2010-11లో 12 మిలియన్ల నుంచి 2017-18 లో
17.4 మిలియన్లకు పెరిగినది అనగా 45 శాతం పెరిగింది అని అల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016-17 నివేదిక
తెలుపుతుంది.
·
2013-14 సంవత్సరంలో భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో 12.80 లక్షల మంది ముస్లిం విద్యార్ధులు
ఉన్నారు, వారు మొత్తం విద్యార్ధుల సంఖ్య లో 4 శాతం మాత్రమె ఉన్నారు.
అప్పటి నుండి, ప్రతి సంవత్సరం స్థిరమైన పెరుగుదల
ఉంది.
·
లింగ సమానత్వం అన్ని వర్గాలలో మెరుగుపడింది.
·
గత ఐదేళ్ళలో ముస్లిం మహిళల నమోదు 46 శాతం పెరిగింది. కాగా అన్ని
వర్గాల నమోదు 24 శాతానికి పెరిగింది అని సర్వే వెల్లడించింది.
·
గత ఐదు సంవత్సరాల్లో ముస్లిం మహిళల నమోదు నిష్పత్తి మరియు మొత్తం ముస్లింల
నమోదు నిష్పత్తి, సాధారణ నిష్పత్తి కంటే 1 పాయింట్ అధికంగా ఉంది.
·
తాజా నివేదిక ప్రకారం, ఉన్నత విద్యలో చేరిన ముస్లింలలో 49 శాతం మహిళలు కాగా మొత్తం లో
అది 48 శాతంఉంది.
·
ముస్లిం పురుషుల సంఖ్యలో పెరుగుదల శాతం 2013-14 నాటికి రెండింతలు పెరిగిoది.
·
2001 లో సచార్ నివేదిక ప్రకారం
దేశవ్యాప్తంగా మొత్తం గ్రాడ్యుయేట్లలో ముస్లింల సంఖ్య కేవలం 6.3% ఉంది. అది
ఎస్సీలు / ఎస్టీల వాటా 8.2% కంటే తక్కువగా
ఉంది.
·
20 సంవత్సరాలు అంతకంటే వయస్సు అధికంగా ముస్లిం యువకులలో గ్రాడ్యుయేట్లు కేవలం 3.6% ఉన్నారు.
·
ఉన్నత విద్యలో ముస్లింల స్థూల నమోదు నిష్పత్తి 5.2% ఉంది. అది అన్ని
సామాజిక-మత వర్గాలతో పోలిస్తే చాలా
తక్కువ.
·
ఇటీవలి ఉన్నత విద్య నమోదు గణాంకాలలో ముస్లిం పురుషులు మరియు మహిళల
పెరుగుదల వలన ముస్లిం కమ్యూనిటీ భవిష్యత్తు ఆశాజనకం గా ఉంటుంది.
·
అయితే, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఉన్నత
విద్యలో చేరే ముస్లింలు అతి తక్కువ
ఉన్నారు.
·
రాజస్థాన్ యొక్క మొత్తం జనాభాలో ముస్లింల శాతం 9% కంటే ఎక్కువగా ఉన్నారు కాని ఉన్నత విద్యలో వారి నమోదు శాతం కేవలం 2.65% మాత్రమే ఉంది.
·
రాజస్తాన్ లోని ఇతర వర్గాలతో పోల్చినప్పుడు 2016-17లో 33,794 మంది ముస్లింలు ఉన్నత విద్య లో ఎన్రోల్ అవగా 2017-18లో అది 38,556 కు
చేరుకొంది అని ఆల్
ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016- 17
తెల్పుతుంది.
·
దేశంలోని ఉపాధ్యాయుల సంఖ్య లో జనరల్ కేటగిరీ నుంచి 56.8%, ఎస్.సి. నుంచి 8 శాతం మరియు ఎస్టి 2.27 శాతం ఉన్నారు. అది వారి రిజర్వేషన్ కోటా వరుసగా 15 శాతం, 7.5 శాతం
కన్నా తక్కువ.
·
దేశంలోని ఉపాధ్యాయుల సంఖ్య లో ముస్లిమ్స్
కేవలం 5% మాత్రమే ఉన్నారు.
స్త్రీల ఎన్రోల్మెంట్- ప్రగతి:
మహిళల నమోదు 45% పెరుగుదలను చూపించింది
·
మహిళల ఎన్రోల్మెంట్/నమోదు 2010-11లో 12 మిలియన్ల
నుండి 2017-18 లో 17.4 మిలియన్లకు అనగా
45% పెరిగింది.
·
2010-11లో పీహెచ్డీ, ఎంపీహిల్, పిజి ఎన్రోల్మెంట్/నమోదులలో మహిళల వాటా పురుషలలో సగం కంటే
తక్కువగా ఉండేది.
·
కాని 2017-18 లో MPhil మరియు పిజిలలో
మహిళల విద్యార్థుల ఎన్రోల్మెంట్/నమోదు సంఖ్య మగ విద్యార్థుల సంఖ్యను మించిపోయింది
.
·
మొత్తం MPhil విద్యార్థులలో
64% మంది మరియు మొత్తం పిజి విద్యార్ధులలో
53.8% విద్యార్ధులు మహిళలుగా ఉన్నారు.
·
ఈ సర్వే ప్రకారం మహిళలు తమ ఆధిపత్యాన్ని
పోస్ట్గ్రాడ్యుయేట్ సైన్స్లో విభాగం లో కొనసాగించారు.
·
వారి ఎన్రోల్మెంట్ గత ఐదు సంవత్సరాలలో MSc మరియు MA కోర్సులలో గణనీయంగా
పెరిగింది.
·
అయితే, ఉన్నత విద్యలో మహిళల ఎన్రోల్మెంట్ ఇంజనీరింగ్ మరియు
టెక్నాలజీ విభాగాల్లో చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
·
ఉదాహరణకు B.Tech కోర్సుల్లో 21.19 లక్షల మంది
విద్యార్థులు ఎన్రోల్ కాగా వారిలో 72%
పురుషులు ఉన్నారు.
·
అదేవిధంగా, BE లో, 18.2 లక్షల
మంది విద్యార్ధులు ఎన్రోల్ కాగా
వారిలో 71% మంది పురుషులు.
·
PG అయిన విద్యార్ధులలో లో పీహెచ్డీ కి ఎన్రోల్
అయినవారు 0.5% కంటే తక్కువగా ఉన్నారు.
·
ఇది పరిశోధనలో భారతదేశంలో కల మానవ వనరుల లోటును
వెల్లడిస్తుంది.
No comments:
Post a Comment