భారతదేశ ముస్లింలు ఇస్లాం
ధర్మం ను స్వీకరించడం ద్వారా ముస్లింలుగా మారిన భారతీయులు. వీరు ఈ 'నేల యొక్క కుమారులు'.
ముస్లింలు ఈ దేశాన్ని సుమారు 4౦౦ సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశంలో వారు
అనేక సామాజిక రాజకీయ ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. రూపాయి మరియు పైసా,
గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాణం చేసిన షేర్ షా సూరిని మరియు ఆర్ధిక, పన్ను సంస్కరణలను ప్రవేశపెట్టి
భారత దేశ అర్దికాభివ్రుద్ది కి తోడ్పడిన ఢిల్లీ సల్తానత్, తొలిసారిగా యుద్దంలో
రాకెట్లను టిప్పు సుల్తాన్లను భారతీయులు ఎన్నడు మరువలేరు. కళా రంగంలో తాజ్ మహల్ ,
కుతుబ్ మినార్, మక్కా మస్జిద్ వంటి నిర్మాణాలు చేసిన వీరి
సేవలు చిరస్మరణియాలు.
స్వాతంత్రం పూర్వం
జమీందారులు, నవాబులు,పాలకులుగా ఉన్న వీరు నేడు కడు దమనీయ పరిస్థితిలలో తమ జీవనం
వెలుబుచ్చు చున్నారు. భారత జనాభాలో ముస్లింలు 15% ఉన్నారు. కాని వీరు ఆర్ధిక, సామాజిక విద్యా రంగాలలో ఎస్.సి. కన్నా
వెనుకబడి ఉన్నారు. సచార్ కమిటి తన నివేదికలో ఈ విషయాన్నీ స్పష్టం చేసినది.
స్వాతంత్రానంతర భారత
దేశం లో ముస్లింలు అనేక రంగాలో తమదైన ముద్రను వేసినారు. దేశ రాజకీయ, కళా, క్రీడల,
విజ్ఞాన శాస్త్ర, సైనిక, న్యాయ మరియు పరిశ్రమల రంగాలలో రాణించి ఈ దేశ కీర్తి
ప్రతిష్టలను పెంపొందించినారు.
రాజకీయాలు POLITICS
Ø ఇప్పటి వరకు ముగ్గురు ముస్లింలు భారత రాష్ట్రపతులుగా పనిచేసినారు: జాకీర్
హుస్సేన్, ముహమ్మద్ హిదయతుల్లా(తాత్కాలిక
రాష్ట్రపతి), ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరియు APJ అబ్దుల్ కలాం
Ø ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేసినారు: జాకీర్ హుస్సేన్, ముహమ్మద్ హిదయతుల్లా మరియు హమీద్ అన్సారీ.
Ø భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు
కమ్యూనికేషన్ల శాఖ మొదటి మంత్రిగా రఫీ అహ్మద్ కిద్వాయ్ పనిచేసారు.
Ø కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో
అనేకమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లుగా, కేబినెట్ మంత్రులుగా ఉన్నారు.
న్యాయవ్యవస్థ JUDICIARY
Ø ముహమ్మద్ హిదయతుల్లాహ్, మీర్జా
హమీదుల్లాహ్ బేగ్, అజీజ్ ముసాబిర్ అహ్మాది మరియు ఆల్తామాస్
కబీర్ భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు.
Ø అనేకమంది ముస్లింలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు.
Ø అనేకమంది ముస్లింలు దిగువ కోర్టులలో న్యాయమూర్తులుగా మరియు వివిధ స్థాయిలలో
ప్రముఖ న్యాయవాదులుగా ఉన్నారు.
శాస్త్రీయ మరియు
సాంకేతిక విజ్ఞానాలు SCIENCE AND
TECHNOLOGY:
Ø డాక్టర్ సయ్యద్ జహూర్ ఖాసిమ్(DR.Z.A.Khasim, ఒక సముద్ర జీవశాస్త్రవేత్త, ఆయన 1982
లో అంటార్కిటికాకు మొదటి భారతీయ యాత్రకు నాయకత్వం వహించాడు అతని సేవలకు మెచ్చి
ప్రభుత్వం మరియు పద్మశ్రీ మరియు పద్మభూషణ్
బిరుదులతో సత్కరించినది.
Ø బర్డ్ మాన్ అఫ్ ఇండియా గా పిలువబడే సలీం మోజుద్దీన్ అబ్దుల్ అలీ, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వెనుక కీలకమైన వ్యక్తి,
ప్రముఖ పక్షి శాస్త్రజ్ఞుడు మరియు ప్రకృతివేత్త (ornithologist and naturist). అతను భరత్పూర్ బర్డ్ సంరక్షాలయమును సృష్టించాడు మరియు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు
స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు. పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత.
Ø భారత్ రత్నా డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం, భారతదేశం యొక్క క్షిపణి మనిషిగా (MISSILE MAN)పేరుగాంచాడు.
ఇస్రో అధ్యక్షుడిగా పనిచేసాడు. భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణు
కార్యక్రమాల నిర్వహణ వెనుక ప్రముఖ పాత్ర వహించాడు.
Ø డాక్టర్ రఫిఉద్దిన్ అహ్మద్ 'ఫాదర్ అఫ్ ఇండియన్ డెంటిస్ట్రీ ' గా పేరుగాంచాడు
సైన్యంMILITARY:
భారత సైనిక దళంలో ముస్లింలు
అంత్యంత పరాక్రంను,శౌర్యమును ప్రదర్శించారు.
Ø డోగ్రా రెజిమెంట్కు చెందిన 35 సంవత్సరాల బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్ భారతదేశపు-పాకిస్తాన్
యుద్ధం 1947-48లో యుద్ధం లో మరణానంతరం రెండవ గొప్ప అత్యున్నత పురస్కారం మహా వీర
చక్ర పొందాడు. అతను జీవించి ఉంటె భారతదేశానికి మొట్టమొదటి ముస్లిం చీఫ్ ఆర్మీ స్టాఫ్ అయి
ఉండేవాడు.
Ø 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో గ్రెనెడియర్ రెజిమెంట్ యొక్క హవాల్దార్
అబ్దుల్ హమీద్ ఒంటి చేతితో ఆరు పాకిస్తానీ ట్యాంకులు ద్వంసం చేసినాడు. అబ్దుల్
హమీద్ మరణానంతరం భారతదేశం యొక్క అత్యున్నత సైనిక గౌరవం, పరం వీర చక్ర పొందినాడు.
Ø రాజపుత్రా రైఫిల్స్ కు చెందిన కెప్టెన్ హనీఫుద్దిన్ 1999 లో కార్గిల్
వివాదంలో మరణానంతరం భారతదేశం యొక్క మూడవ అత్యున్నత సైనిక గౌరవం వీర్ చక్ర, పొందినాడు మరియు అతను చనిపోయిన ప్రాంతాన్ని సబ్ సెక్టార్
హనీఫ్ గా పిలవటం జరుగుతుంది. మార్చారు.
పరిశ్రములు INDUSTRY:
Ø భారతీయ ముస్లింలు పెద్ద వ్యాపార సంస్థలను కలిగి ఉన్నారు. విప్రో మరియు
సిప్లా, రెడ్ టేప్, వక్హార్డ్ట్, అజ్మల్, హమ్దార్డ్, హిమాలయ మరియు మోంకిని వంటి సంస్థలను
స్థాపించారు. అసంఘటిత రంగం అయిన వస్త్రాలు, తాళాలు మరియు
తోలు,వ్యవసాయ రంగాలలో ముస్లింలు పెద్ద
సంఖ్యలో ఉన్నారు. జెట్ ఏవియేషన్ రంగం నుండి సాధారణ కార్మికులు పనిచేసే వివిధ పరిశ్రమలలో లెక్కలేనన్ని ముస్లిం ఉద్యోగులు ఉన్నారు.
కళ మరియు సంస్కృతి ART AND CULTURE:
Ø ఆధునిక భారతదేశం యొక్క అత్యంత గుర్తింపు పొందిన చిత్ర కళాకారుడు MF హుస్సేన్. భారతీయ సంగీతం మరియు వాణిజ్య కళలకు ముస్లింల సహకారo
మరువలేనిది. రఫీ మరియు శంషాద్ బేగం వంటి గాయకులు, జాకీర్
హుస్సేన్ మరియు ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ వంటి కళాకారులు, సహీర్ లుధియాన్వి మరియు
కైఫీ అజ్మి వంటి కవులు, దిలీప్ కుమార్, నసీరుద్దిన్ షా వంటి నటులు సరోజ్ ఖాన్ మరియు ఫరా ఖాన్ వంటి నృత్య దర్శకులు, ఎంతో పేరుగాంచారు. ముస్లిం
కళాకారులు లేని భారతదేశం ఊహించలేము. భారతదేశ సాహిత్యంలో ఉర్దూ భాష స్థానంను విస్మరించ లేము.
క్రీడలు SPORTS:
Ø
సయ్యద్ కిర్మాణి, ముహమ్మద్ అజారుద్దీన్, పఠాన్ సోదరులు మరియు జహీర్ ఖాన్ వంటి క్రికెటర్లు, సానియా మీర్జా వంటి టెన్నిస్ క్రీడాకారిణి, జాఫర్ ఇక్బాల్ వంటి హాకీ క్రీడాకారుడు, ముహమ్మద్ అనాస్ వంటి అదేలటిక్ వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో భారత దేశానికి బంగారు, వెండి మరియు కాంస్య పతకాలు సాధించిన ముస్లిం క్రీడాకారులందరూ ఎందరో కలరు.
సయ్యద్ కిర్మాణి, ముహమ్మద్ అజారుద్దీన్, పఠాన్ సోదరులు మరియు జహీర్ ఖాన్ వంటి క్రికెటర్లు, సానియా మీర్జా వంటి టెన్నిస్ క్రీడాకారిణి, జాఫర్ ఇక్బాల్ వంటి హాకీ క్రీడాకారుడు, ముహమ్మద్ అనాస్ వంటి అదేలటిక్ వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో భారత దేశానికి బంగారు, వెండి మరియు కాంస్య పతకాలు సాధించిన ముస్లిం క్రీడాకారులందరూ ఎందరో కలరు.
భారతదేశంలో నిజమైన
ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేసినవారు ముస్లింలు.
వాస్తవానికి, అజ్ఞానం మరియు ఉదాసీనత
అగాధం నుండి సమాజాన్ని వెలుగులోనికి తేవడంలో సూఫీ గురువుల పాత్ర ను మరువలేము.
సామాజికం వెనుకబడిన వర్గాల వారిలో చైతన్యం కల్పించినవారు సూఫీలు. భారత సామాజిక
వ్యవస్థపై పై సూఫీల ప్రభావం ఎంతైనా ఉంది.
జమాత్-ఎ-ఇస్లామి
హింద్, జామిత్-ఉలేమా హింద్ వంటి సంస్థలు
సాంఘిక న్యాయం మరియు సామరస్యాన్ని
సాధించటానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. ముస్లింలు వారి దాతృత్వంలో, అవసరాలకు సహాయపడే వారి నిస్వార్థమైన నిబద్ధతకు పేరుగాంచారు. వందలాది లక్షల
మంది ముస్లింలు ప్రతి సంవత్సరం జకాత్ రూపంలో ఆర్దిక న్యాయం తో తోటి భారతీయులను
పేదరికం నుండి తొలగించి, మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం
కల్పించారు.
ఇటీవలి
కేరళ వరదలు నేపథ్యంలో ముస్లింలు భారి ఎతున్న విరాళాలు ప్రకటించారు. వడ్డీ రహిత ఆర్థిక సంస్థల/ ఇస్లామిక్
బ్యాంక్ ఏర్పాటు ఆర్థిక దోపిడీ బాధితులకు ఒక వరంగా మారింది. మద్యపానం, నగ్నత్వం, వ్యభిచారం,
స్వలింగసంపర్కం, ఆడ భ్రూణహత్య, కట్నం మరియు మతతత్వం వంటి సాంఘిక దుష్క్రియలకు వ్యతిరేకంగా ముస్లింలు
పోరాడారు. ఈ దేశం యొక్క ప్రఖ్యాత మిశ్రమ సంస్కృతిని(గంగాజమునా తెహ్జీబ్)ను
కాపాడారు. లక్షలాది ముస్లింలకు భారతదేశం నిలయం. జాతీయ కవి ఇక్బాల్ “సారే జాహా సే
అచ్చా హిందూస్తా హామారా” అని భారత దేశంను
కొనియాడాడు.
..
No comments:
Post a Comment