25 November 2018

ఇస్లామిక్ ఫైనాన్స్ కు ఆఫ్రికాలో పెరుగుతున్న ఆదరణ (Islamic finance’s growing impetus in Africa)

.
 




అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ సంస్థ సుకుక్(ఇస్లామిక్ బాండ్లు) జారీ మరియు ఇస్లామిక్ బ్యాంకింగ్ లో సామర్థ్యాన్ని కలిగియున్న 18 ఆఫ్రికన్ దేశాలని గుర్తించింది. మూడీస్ పెట్టుబడిదారుల సేవ యొక్క కొత్త నివేదిక ప్రకారం ఆఫ్రికా అంతటా ఇస్లామిక్ ఫైనాన్స్, ఆఫ్రికన్ సుకుక్ (ఇస్లామిక్ బాండ్) ద్వారా గత అయిదు సంవత్సరాల్లో, $ 2.3 బిలియన్స్ నూతన నిధులు వనరులను సమకూర్చుకోంది. మూడి యొక్క అంచనాలు ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం ఆఫ్రికన్ బ్యాంకింగ్ వనరులలో  ఇస్లామిక్ బ్యాంకింగ్ ఆస్తుల వాటా దాని ప్రస్తుత స్థాయి 5% నుండి 10% వరకు పెరుగుతుంది.

ఒక ప్రకటనలో, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇలా చెప్పింది: "మూడి సంస్థ సుకుక్(ఇస్లామిక్ బాండ్లు) జారీ మరియు ఇస్లామిక్ బ్యాంకింగ్ లో సామర్థ్యాన్ని కలిగియున్న 18 ఆఫ్రికన్ దేశాలని గుర్తించింది. ఆ దేశాల జాబితా లో  ఈజిప్టు, మొరాకో, సెనెగల్, నైజీరియా, సూడాన్ మరియు కెన్యా ఉన్నాయి".

ప్రపంచవ్యాప్తంగా
, ఇస్లామిక్ ఫైనాన్సు ఆస్తులు, ప్రపంచ ఆర్థిక ఆస్తులలో 1% కంటే తక్కువగా ఉన్నాయి. ఇవి  2003 లో సుమారు US $ 200 బిలియన్ల నుండి 2016 నాటికి US $ 2 ట్రిలియన్లకు  చేరుతాయని అంచనా వేయబడింది. కొన్ని అంచనాలు ప్రకారం 2020 నాటికి ఇవి US $ 3 ట్రిలియన్లను  అధిగమించుతాయని  భావిస్తున్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ప్రకారం 2017 లో, 350 మిలియన్ల మంది ఆఫ్రికన్లకు అధికారిక బ్యాంకు ఖాతాలు లేవు. ఇస్లామిక్ ఫైనాన్స్ ఉత్పత్తుల అభివృద్ధి మరింతగా ఆఫ్రికా జనాభాకు ఆర్థిక వనరులను అందుబాటులోకి తెస్తుందని పేర్కొంది.



"ఇస్లామిక్ ఫైనాన్స్ ఆర్ధిక స్థిరత్వాన్ని ప్రోత్సహించటానికి సహాయపడవచ్చు," అని IMF దక్షిణా ఆఫ్రికా ప్రతినిధి చెప్పారు. "బ్యాంక్ డిపాజిట్లలో అధిక భాగo లాభాన్ని పంచుకోవడం మరియు నష్టo-భరించే పద్ధతిలో ఉన్నాయి మరియు బ్యాంకింగ్ రంగానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్పష్టంగా 'బెయిల్-చేయలేనివిగా ‘bail-inable’ ఉన్నాయి'. ఇస్లామిక్ ఆర్థిక మౌలిక సూత్రాలు, ఊహాజనిత ఉత్పత్తుల తొలగింపు వంటివి బ్యాంకింగ్ రంగ నష్టాలను తగ్గిస్తాయి.
ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో వలే కాక ఆఫ్రికా లో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒక్కరు మాత్రమే లాంఛనప్రాయమైన బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారు. క్రెడిట్ ప్రాప్తి అనేది ఇప్పటికీ ఆఫ్రికా ఖండం అంతటా సవాలుగా ఉంది.

సాంప్రదాయిక బ్యాంకులు అనుసరించే  ఆర్థిక ఉత్పత్తులను ఆమోదించటానికి అయిష్టంగా ఉండే ముస్లిం సమాజాలకు ఇస్లామిక్ ఫైనాన్స్ అనేది  ఒక అవకాశంగా  ఉండవచ్చు. ఇటువంటి సమూహాలకు
, షరియా'- ఆధారిత  ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆకర్షణీయమైన ఎంపిక మార్గంగా  ఉండవచ్చు.

"బ్యాంకింగ్ సదుపాయం అలవాటు లేని ఆఫ్రికా యొక్క పెద్ద ముస్లిం జనాభా కు ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఆస్తుల పెరుగుదలకు ఒక బలమైన పునాదిని అందిస్తుంది
," అని మూడీస్ ప్రతినిధి  అన్నారు.

ఆఫ్రికన్ డెవెలప్మెంట్ బ్యాంకు అంచనాల ప్రకారం
, 2025 వరకు ఆఫ్రికా లో దాని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిసంవత్సరం US $ 130-170 బిలియన్లు అవసరం. ఇందుకు అవసరమైన ద్రవ్యాన్ని సుకుక్ బాండ్లు అందిస్తాయి. పెరుగుతున్న ఆర్థిక అవసరాలతో పాటు  ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సుకుక్ బాండ్ల జారి లో పెరుగుదల అవసరం అని మూడిస్  ఆశిస్తుంది.

"ఆఫ్రికన్ ప్రభుత్వాలు చేపట్టే  రహదారులు, వంతెనలు, నీరు మరియు పారిశుద్ధ్య కార్యాలయాలు మరియు ఆసుపత్రులు వంటి ప్రాజెక్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి  సుకుక్ బాండ్స్ సహాయపడుతాయి అని అంతర్జాతీయ న్యాయ సంస్థ వైట్ & కేస్లో భాగస్వామి దేబాషిస్ డే అన్నారు.  "మధ్యప్రాచ్యం నుండి మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి పెట్టుబడిదారులను పెట్టుబడిని ఆకర్షించడానికి ఇస్లామిక్ ఫైనాన్స్ తోడ్పడుతుంది.
"మూడి వైస్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అకిన్ మజేకోడున్మి ప్రకారం: "గల్ఫ్ మరియు ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధికవ్యవస్థలతో బలమైన పెట్టుబడి సంబంధాల కోసం సుకుక్ బాండ్స్ ఆఫ్రికా కు తోడ్పడుతాయి".

ఆఫ్రికాలో ఇస్లామిక్ ఫైనాన్స్ కు ప్రజాదరణ పొందడం కొనసాగుతుంది. 2014లో సెనెగల్  సకుక్  బాండ్ జారీ ద్వారా  
US$ 200 మిలియన్ల సేకరించినది మరియు దక్షిణాఫ్రికా సకుక్  బాండ్ జారీ ద్వారా  తొలిసారిగా US$ 500 మిలియన్లను పొందింది.

దక్షిణాఫ్రికా
, నైజీరియా, కెన్యా, సెనెగల్, జిబౌటి, ఉగాండా మరియు మొరాక్కోలు ఇస్లామిక్ ఫైనాన్స్ విస్తరణను ప్రోత్సహించేందుకు అవసరమైన చట్టపరమైన మరియు నియంత్రణ పద్దతులను ప్రవేశపెట్టాయి. "ఇటీవల అవి  షరీయా-ఆధారిత  మరియు సాంప్రదాయ ఉత్పత్తుల మధ్య మరింత సమన్వయo  సృష్టించేందుకు స్టాంప్ డ్యూటీ మరియు విలువ-జోడించిన పన్ను నియంత్రణను ప్రవేశపెట్టాయి" అని డే చెప్పారు.


"నైజీరియా, ట్యునీషియా మరియు దక్షిణాఫ్రికా ఇప్పుడు ఇస్లామిక్ బ్యాంకులు మరియు తకఫుల్ (takaful) (ఇస్లామిక్ భీమా) కంపెనీలకు నిలయంగా ఉన్నాయి. "ఆఫ్రికా ఖండం అంతటా అనేక సాంప్రదాయ బ్యాంకులు కూడా ఇస్లామిక్ విండౌస్  ద్వారా షరియా'-ఆధారిత  బ్యాంకింగ్ ఉత్పత్తులను అందిస్తున్నాయి".

మూడి ప్రకారం సంస్కరణలను అవలంబించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది: వారి జనాభా సాంస్కృతిక మరియు మతపరమైన అనుబంధాలకు అనుగుణంగా ఇస్లామిక్ బ్యాంకింగ్కు మద్దతు ఇవ్వడానికి ఆఫ్రికన్ ప్రభుత్వాల ప్రయత్నాలు ఈ రంగంలో వృద్ధికి దోహదం చేస్తాయి
, ఎందుకంటే 40% ఆఫ్రికన్ జనాభా ముస్లింలు."అని మూడి అభిప్రాయ పడింది.

ఇస్లామిక్ న్యాయ మీమాంసకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవల సదుపాయం సంప్రదాయ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ నిర్మాణాలను మెరుగుపరుస్తుంది. "ఇస్లామిక్ బ్యాంకులు ఆస్తి యాజమాన్యంలో భాగస్వాములుగా
, ప్రత్యక్ష ఆస్తులలో వాణిజ్యం చేయగలవు, మరియు వినియోగదారులకు ఈక్విటీ ఫైనాన్సింగ్ అందించడం చేయును. ఇది పెట్టుబడి ప్రమాదాలను తగ్గిస్తుంది" అని ఇస్లామిక్ బ్యాంకింగ్ కార్యకలాపాల పాత్రను వివరించ వచ్చు.

అయితే ఇస్లామిక్ ఫైనాన్సింగ్ నిర్మాణపరమైన సంక్లిష్టతకు దారితీస్తుంది ఎందుకంటే అవి  వడ్డీ-రహితమైన ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ కు  ఉద్దేశించబడలేదు మరియు అవి ప్రస్తుత పౌర లేదా సాధారణ చట్టాల పరిధి లోపల సరిపోవు".

No comments:

Post a Comment