భారతీయ కళాశాలల మరియు విశ్వవిద్యాలయల పట్టభద్రుల అల్ప/అతి తక్కువ ఉద్యోగితా రేటును సూచించే నివేదికలు చూసిన్నప్పుడు
చాలా మంది భారతీయులు కలత చెందారు. .
ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ నివేదికలు భారత
ఇంజనీరింగ్ పట్టభద్రుల సరిపోని సాంకేతిక నైపుణ్యాలు మరియు తక్కువ ఉపాధి రేటును
సూచించాయి. తాజా ఇంజనీరింగ్
గ్రాడ్యుయేట్లు ప్రాధమిక సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉత్పాదకమవ్వటానికి productive on ముందుగా భారతీయ ఐటి పరిశ్రమ 16.5
బిలియన్ డాలర్లు, ఇంటెన్సివ్ ట్రైనింగ్ లో
పెట్టుబడులు పెట్టే ప్రయత్నం మన ఉన్నత విద్యావ్యవస్థలో లోపం తెలియజేస్తుంది.
మ్యానేజ్మెంట్ ఎడ్యుకేషన్ పోర్టల్ MBAuniverse.com యొక్క నివేదికలో 2,000 పైగా ఇండియన్ మేనేజ్మెంట్
స్కూల్స్ నుండి MBA గ్రాడ్యుయేట్లు (టాప్ 200 బిజినెస్
స్కూల్స్ మినహా) 300,000 యువతీ, యువకులు ఉద్యోగ విఫణిలో ఉద్యోగిత కొరతను
ఎదుర్కొంటున్నారు.
HireMee సంస్థ
ప్రకారం భారతదేశ ఇంజనీరింగ్, వాణిజ్య, మ్యానేజ్మెంట్ మరియు సాంఘిక శాస్త్రాల గ్రాడ్యుయేట్లు వారి కోర్ సాంకేతిక నైపుణ్యాలు,
కెరీర్ ఆకాంక్షలు, ఆసక్తి ప్రాంతాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయలేక పోతున్నారని తెల్పింది. సృజనాత్మకత,
సమస్య-పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించడం, అత్యంత అంతర్-అనుసంధానం తో కూడిన పరస్పరాధారిత
ప్రపంచ పని వాతావరణంలో పని చేయడానికి సిద్ధం చేయడం మొదలగు రంగాలలో భారత
విద్యావ్యవస్థ విఫలమైనది.
అయితే ఇదే సందర్బం లో ప్రపంచంలోని అత్యుత్తమ
ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ పాఠశాలలు - తమ పూర్వ
విద్యార్ధులను భారతదేశo నుండి పొందాయి. ఐఐటిలు, ఐఐఎంలు, ఎఐఐఎంఎస్లు, ఐఐఎస్సీలు (IITs,
IIMs, AIIMS and IISc) విజయవంతం కావడం వెనుక కఠినమైన ఎంపిక ప్రమాణాలు మరియు ఉదారంగా ప్రభుత్వ
నిధుల కేటాయింపు గమనించవచ్చు. ఫలితంగా వాటి నాణ్యత పెరిగింది.
ఈ పరిస్థితి మెరుగుదలకు ఏమి చేయాలి? భారత దేశం లోని విద్యా సంస్థలు, ఆచరణాత్మకంగా " పరిశ్రమ ఇంటర్ఫేస్" దూరం అయ్యాయి. భారతదేశం యొక్క అధిక-నియంత్రిత over-regulated ఉన్నత విద్యావ్యవస్థ గడువు ముగిసిన కరిక్యులంకు, ఆవిష్కరణలకు నేలవైనది. కొన్ని రాష్ట్రాలలో విద్యా సంస్థలు కటినమైన నియమాలను, ప్రొఫెషనల్ కోర్సులకు చెల్లిస్తున్న ట్యూషన్ ఫీజు పై నియంత్రణ ఎదుర్కొంటున్నాయి.
విద్యా సంస్థలు పరిమిత పరిశ్రమ దృష్టిని కలిగి ఉన్నాయి. పరిశోధనలు లేవు మరియు కొత్త జ్ఞానం సృష్టి లేదు. ఇది పాఠశాలలో లేదా వారి ఎంపిక సంస్థలలో అధ్యయనం చేయడానికి విద్యార్థుల అవకాశాలు పరిమితం చేస్తుంది. ఆర్ధికంగా బలం ఉన్నవారు విదేశాల్లో చదవటానికి అధ్యయనం చేయడానికి ప్రోత్సహిస్తుంది.
భారత విద్యా వ్యవస్థ నుండి వచ్చే లక్షలాది
గ్రాడ్యుయేట్ల నాణ్యతను మెరుగుపరచడానికి మనము ఏమి చేయవచ్చు? భారత దేశ మిలియన్ల గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు
పొందేటట్లు ఏవిధంగా చేయగలము?
ముందుగా, విద్యా విధానకర్తలు మరియు విద్యావేత్తలు ఉపాధిని నిర్వచించాలి? ఉపాధి, అనగా కేవలం ఉద్యోగం పొందటం కాదు యువతీ, యువకులు ఉద్యోగo పొందటానికి అవసరమైన స్కిల్ల్స్, విజయవంతం కావటానికి అవసరమైన స్కిల్ల్స్, , జ్ఞానం మరియు సాధన పెంపొందించటం.
భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థల యొక్క ఉపాధి
అవకాశాలు తమ పాత పాఠ్య ప్రణాళికను ఆధునీకరణ మరియు ఉపాధ్యాయులు తరగతిలో వారి జ్ఞానాన్ని
సమస్య-పరిష్కార విధానానికి చూపటం ద్వారా మెరుగు పడుతాయి. ఫ్యాకల్టి ప్రశ్నలు అడగటం
మరియు విద్యార్ధులు వాటికి సమాధానాలు చూపటం ద్వారా మెరుగు పడుతాయి.
ఇండియన్ స్కూల్స్ ఫ్యాకల్టి తమ విద్యార్థులను ఆలోచన మరియు వారి సొంత భవిష్యత్తు యొక్క బాధ్యతలను ఎలా
తీసుకోవచ్చో చూపటం ద్వారా పరిస్థితిలను
మెరుగు పరచవచ్చు. 'ప్రొఫెషనల్ డెవెలప్మెంట్ మాడ్యూల్' యువ విద్యార్థులకు కార్యాలయ
సంస్కృతి, రిక్రూట్మెంట్ ప్రక్రియ అందించడం
ద్వారా మరియు ఇంటరాక్టివ్ సెషన్ల వారు
గ్లోబల్ కెరీర్ సాధించడానికి
అవసమైన స్కిల్ల్స్ అందించవచ్చునని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో కెరీర్లు
మరియు ఎంప్లాయిమెంట్ మేనేజర్ బ్లెయిర్ స్లాటర్తో అభిప్రాయ పడుతున్నారు. అతను ప్రపంచ
ఉద్యోగ అవకాశాలకు ప్రతి సంవత్సరం దాదాపు 21,000 అంతర్జాతీయ విద్యార్థులను సిద్ధం చేసే అనుభవం
కలిగి ఉన్నాడు.
ఈనాడు కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలను చూపటానికి లింక్డ్ఇన్ Linkedin వంటి నెట్వర్కింగ్ టూల్స్ ఉన్నాయి, అవి పూర్వ విద్యార్ధులు మరియు ఉద్యోగస్తులతో పరిచయం పెంచుకొని ఉద్యోగాలను పొందడానికి సహాయపడతాయి. అందుకు వారు ముందుగా తమ సంభాషణ నైపుణ్యాలను పదును పెట్టుకోవాలి మరియు సమర్థవంతమైన రేజ్యుమ్స్ తయారు చేయాలి. యజమానులతో కనెక్ట్ కావడానికి కమ్యూనికేషన్ ప్రోటోకాల్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని వారు తెలుసు కోవాలి.
దీనికి గాను భారతదేశం విద్యావ్యవస్థ 'డిగ్రీలను మంజూరు' నుండి "ఉపాధిని పెంచుకోవడంపై"
దృష్టి కేంద్రీకరించడo అవసరం. అది ఉద్యోగం
పొందటానికి అవసమైన ప్రస్తుత కాల అవసరమైన నైపుణ్యాలు అందించడానికి సన్నద్ధం కావలి. అదేవిధంగా ఉద్యోగ మార్కెట్ కు అవసరమైన
నైపుణ్యాలను విద్యార్ధులు పొందవలసి ఉంటుంది.
No comments:
Post a Comment