భారత దేశం లో కేంద్ర సివిల్
మరియు రాష్ట్ర సివిల్ సర్వీసెస్ లలో ముస్లింల ప్రాతినిద్య శాతం 3% మించలేదు. అలాగే
పారామిలటరీ దళాలలో ముస్లిం ప్రాతినిద్యం 4% కు మించలేదు. దురదృష్ట్యావశాత్తు భారత దేశం
లో పబ్లిక్ రంగం తో పాటు ప్రవేట్ రంగంలో కూడా ముస్లిం ఉద్యోగిత శాతం కేవలం 3%
మాత్రమె ఉంది.
ప్రేవేట్ రంగంలో ముస్లిం బ్లూ-కాలర్ (blue-collar) ఉద్యోగుల పై సమాచారం అసమగ్రంగా ఉంది. దేశ జనాభాలో ముస్లిమ్స్ 14.2% మంది ఉన్నారు. వారికి ప్రైవేటు రంగంలో కూడా జనాభా కు తగినంత ప్రాతినిద్యం లబించుట లేదు.
ఇటివల భారత మాజీ వైస్ ప్రెసిడెంట్
హమీద్ అన్సారీ ముస్లింల విషాద స్థితిని ప్రస్తావించారు మరియు కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు మరియు ఇతర ప్రవేట్ పారిశ్రామిక సంస్థలు భారతీయ ముస్లింల స్థితిగతులను
మెరుగు పరచడం లో కృషి చెయ్యాలన్నారు. కానీ భారతదేశ పారిశ్రామిక సంస్థలు ఈ విషయం లో
ఆశించినంతగా కృషి చేయడం లేదు.
ఒక ET ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషణ ప్రకారం బిఎస్ఇ లిస్టెడ్ 500 కంపెనీలలో
ముస్లింలు కేవలం 2.67% డైరెక్టర్లు మరియు 2,324 సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలో 62 మంది ఎగ్జిక్యూటివ్లు గా ఉన్నారు.
ఈ అగ్ర కార్యనిర్వాహకులు (top executives) మొత్తం వేతనాల్లో 3.14% తీసుకొంటున్నారు. బిఎస్ఇ -100 కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్లో ముస్లింలు మొత్తం డైరెక్టర్లు మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో4.60% ఉన్నారు అనగా 587 మందిలో 27 మంది ఉన్నారు. ముస్లిం బ్లూ-కాలర్ ఉద్యోగుల సమాచార కొరత ఉంది. దేశ జనాభాలో ముస్లిమ్స్ 14.2% మంది ఉన్నారు, ప్రైవేటు రంగంలో ముస్లింలకు తీవ్ర ఉద్యోగిత కొరత ఉంది.

భారత ఉద్యోగాల మార్కెట్లో ముస్లిం
మైనారిటీ వర్గo, కార్పొరేట్ ఇండియా యొక్క రాడార్లో ఇంకా గుర్తించబడలేదు. గత దశాబ్దంలో
ప్రైవేటు రంగం ఎక్కువగా దళితులపై దృష్టి పెట్టింది, ముస్లింలను పూర్తిగా ఉపేక్షించినది. .
..
అంచనాల ప్రకారం
ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా చాలా తక్కువగా ఉన్నది. అది జనాభాలో వారి సగం
వాటా కంటే తక్కువగా ఉంది. "ముస్లింలు ఉద్యోగాల మార్కెట్లో అత్యంత వెనుకబడి
ఉన్నారు; పట్టణ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగల (ఎస్టి)
కన్నా వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది "అని అమితాబ్ కుందూ న్యూఢిల్లీకి
చెందిన మానవ వనరుల అభివృద్ధి సంస్థ (IHD) ప్రొఫెసర్ అన్నారు.
సచార్ కమిటి
తరువాత భారతదేశంలో ముస్లింల సామాజిక-ఆర్థిక పరిస్థితిని పరిశీలించటానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కందూ
కమిటీని ఏర్పాటు చేసినది. 2014 లో
సమర్పించిన కందూ కమిటీ నివేదిక ఎస్సీలు
మరియు ఎస్టీలు రిజర్వేషన్లు లేదా నిశ్చయాత్మక చర్య కార్యక్రమాల కారణంగా విద్య మరియు
ఉద్యోగాలను పొందటానికి పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని సూచిస్తున్నది.
పూణే ఆధారిత ఫోర్బ్స్ మార్షల్ గ్రూపుకు చెందిన ఫర్హాద్ ఫోర్బ్స్, సిఐఐ నేషనల్ కమిటీ ఆన్ అఫ్ఫ్రేటివ్ యాక్షన్, ప్రైవేటు రంగం తీసుకొన్న నిశ్చయత చర్య affirmative action 'ఉపరితలాన్ని గీయడం scratched the surface’ ' మాత్రమే అని అన్నారు. "షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కోసం అన్ని ప్రైవేటు రంగ సంస్థల యొక్క నిశ్చయాత్మక కార్యాచరణ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి" అని అన్నారు.
చంద్ర భాను ప్రసాద్, దళిత కార్యకర్త మరియు దళిత భారత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సలహాదారుడు (DICCI), ముస్లింల దమనియ పరిస్థితి పై ఆందోళన వెళ్ళబుచ్చారు. "ముస్లింలను దూరంగా ఉంచడం ప్రేవేట్ వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు " అని ఆయన చెప్పారు.
ప్రైవేటు రంగం మైనారిటీల పరిస్థితిని
తీవ్రంగా పరిశీలిoచవలసిన సమయం ఆసన్నమయిoదని
ఫోర్బ్స్ భావిస్తున్నది కానీ అది నిశ్చయాత్మక చర్య affirmative
action మరియు
రిజర్వేషన్ల మధ్య ఉన్న తేడాను అర్ధం చేసుకోలేదు.నిశ్చయాత్మక చర్య అనేది విద్య, నైపుణ్యాలు లేదా ఉపాధి కల్పన
కార్యక్రమాలు ద్వారా అన్నింటినీ నిర్వహించడం మరియు నియామకంలో అనుకూల వివక్షత అని
అర్థం.
ఇటివల టాటా, ఫోర్బ్స్ మార్షల్ గ్రూపులు తమ పథకాలలో ముస్లింలపై
స్పష్టంగా దృష్టి కేంద్రీకరించినవి. పూణేలో ముస్లిం బాలికలకు విస్తృతమైన అధునాతన
పాఠశాల ప్రాజెక్ట్ ఫోర్బ్స్ స్థాపించినది మరియు ముస్లిం-యాజమాన్యంలోని సంస్థల
స్థాపనలో సహాయపడింది.
సోషల్ ఇండికేటర్స్
కుందూ కమిటీ ముస్లిం సమాజాన్ని పలు అంశాలపై పరిశీలించింది: ఆదాయం, నెలసరి తలసరి వినియోగం ఖర్చు, ఆరోగ్యం, విద్య మరియు ప్రాథమిక సేవల ప్రాప్తి. వారు చాలా సూచికలలో వెనుకబడి ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ముస్లిం మహిళల ఆరోగ్య స్థితి బాగా ఉంది. ఎస్సీ, ఎస్టీలు, పోలిస్తే గ్రామీణ ముస్లింలు వినియోగం లో ముందు ఉన్నారు. ఒకే ఆదాయం వర్గం లోని హిందూ మహిళ కంటే ముస్లిం మహిళ ఎక్కువ కాలం జీవిస్తుంది ," అని కుందూ చెప్పారు.

కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర మైనారిటి
వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన డైవర్సిటి
ఇండెక్స్ పై జరిగిన సమావేశం కు
ప్రొఫెస్సర్ కుందూ అద్యక్షత వహిస్తూ ప్రైవేట్ రంగంతో సహా అన్ని సంస్థలను కవర్ చేసే
వైవిధ్య కమీషన్ను Diversity Commission ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
సమానత్వం సంస్థాగతీకరించడానికి ఒక సమగ్ర ప్రయత్నం చేయడానికి సమయం ఆసన్న మయినదని శ్రీ కుందూ అన్నారు. కోటా విధానం అసమాన ఫలితాలకు దారితీసింది అని ఆయన అభిప్రాయ పడ్డారు.
ప్రేవేట్ రంగం తన CSR మరియు స్థిరత్వ నివేదికలు ప్రచురించేటప్పుడు
ఎందుకు తన వైవిధ్యాన్ని diversity ప్రదర్శించలేకపోతుందని ఆయన ఆశ్చర్యపడ్డారు.
ప్రస్తుతం లింగ సమస్యలు gender issues మాత్రమే ప్రాముఖ్యతను పొందుతున్నాయి. సంస్థ
యొక్క వైవిధ్య ప్రదర్శన ఆధారంగా ప్రోత్సాహకాలు ఉండాలని అన్నారు. ఇది చేయవచ్చు అని అన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు-భాగస్వామ్య సంస్థలతో కూడిన అన్ని ప్రైవేటు రంగ సంస్థలు, మతం, కులం మరియు లింగ ఆధారిత వైవిధ్య సూచికలను వార్షికంగా ప్రచురించాల్సిన అవసరం ఉంది. ప్రోత్సాహకాలు పాలన వైవిధ్యంగా ఉండటానికి తోడ్పడవచ్చు. "వైవిధ్యం కోసం ఆందోళన ఒక చిన్న సూది మందు లాంటిది " అని ప్రొఫెసర్ కుందూ అన్నారు.

No comments:
Post a Comment