NCTఢిల్లీ జనాభా లో రాజ్యాంగపరoగా గుర్తించబడిన మతపరమైన మైనారిటీలు అనగా ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైన్ మరియు పార్సీలు –- సుమారు 20% వరకు ఉన్నారు, కానీ వారు "ప్రభుత్వ సేవలలో అత్యల్ప ప్రాతినిద్యానికి
గురవుతున్నారు", అని ఢిల్లీ మైనారిటీస్ కమీషన్ యొక్క
వార్షిక నివేదిక 2017-18 తెల్పుతున్నది. " చాలా ప్రభుత్వ సేవలలో వారి ప్రాతినిధ్యం 5 శాతం కంటే తక్కువగా ఉంది" అని
ఢిల్లీ మైనారిటీస్ కమీషన్ అధ్యక్షుడు డాక్టర్ జఫర్ అహ్మద్ ఖాన్ విడుదల చేసిన 152 పేజీల నివేదిక వెల్లడించింది. వారిలో ముస్లింల ప్రాతినిద్యం వారి జనాభా సంఖ్య
(12.86%)
కంటే తక్కువుగా ఉంది.
Ø ప్రబుత్వ సర్వీసులలోని పెద్ద విభాగాలు
మరియు చిన్నవాటిలో, మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యం "అల్పంగా
ఉంది. ఉదాహరణకు, 2017-18లో ఢిల్లీ పోలీసులలో 88,823 మంజూరైన పోస్టులకు గాను 75,681 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కేవలం 2,885 మంది మాత్రమే మైనార్టీల నుండి వచ్చారు,అనగా డిల్లీ
పోలిసులలో మైనారిటిల వాటా కేవలం 3.81% మాత్రమే.
ప్రధాని 15 పాయింట్ల కార్యక్రమం మరియు సచార్ నివేదిక
తరువాత కూడా ముస్లింలతో సహా మైనార్టీల పరిస్థితుల్లో మార్పు లేదని ఈ నివేదిక
వెల్లడించింది. ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వారి ప్రాతినిద్యం
తగినంతగా లేదు. ఫిబ్రవరి 2015 నుండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని
కలిగి ఉంది మరియు 2015 కు ముందు 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో
ఉంది.
Ø ఢిల్లీ పోలీస్ తర్వాత, 12,118 మంది సిబ్బందితో ఢిల్లీ మెట్రో
అతిపెద్ద ప్రభుత్వ విభాగంగా ఉంది. నియమించారు. దానిలో మతపరమైన మైనారిటీ ఉద్యోగుల సంఖ్య
475
(3.92%) గా ఉంది.
డిల్లీ ప్రబుత్వ సర్విసులలో మైనారిటీల ప్రాతినిద్యం
Representation of Minorities in Govt. Services in
Delhi
|
||||||
|
2015-16
|
2016-17
|
2017-18
|
|||
Departments
విభాగాలు
|
Employees
ఉద్యోగులు
|
Minorities
మైనార్తిలు
|
Employees ఉద్యోగులు
|
Minorities
మైనార్తిలు
|
Employees ఉద్యోగులు
|
Minorities
మైనార్తిలు
|
డిల్లి పోలిస్ Delhi
Police
|
77,397
|
2,993
|
77,427
|
3,035
|
75,681
|
2,885 (3.81%)
|
Delhi Metro
డిల్లి మెట్రో
|
8,524
|
282
|
8,524
|
283
|
12,118
|
475 (3.92%)
|
Delhi Development Authority (DDA)
డెల్లి డెవలప్మెంట్ అథారిటీ
|
6,031
|
295
|
Correct Figures Unavailable
సరియిన సంఖ్య వివరాలు లేవు.
|
Correct Figures Unavailable
సరియిన సంఖ్య వివరాలు లేవు.
|
4,028
|
223 (5.53%)
|
Delhi Fire
డిల్లి ఫైర్
|
1,843
|
21
|
2,080
|
26
|
2,011
|
26 (1.29%)
|
Delhi Tourism & Transportation
డిల్లి టూరిజం& ట్రాన్స్పోర్టేషాన్
|
741
|
32
|
716
|
43
|
649
|
28 (4.31%)
|
"ప్రబుత్వ సర్విసులలో మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో మైనారిటీలు
తక్కువగా ప్రాతినిధ్యం వహించడం ఆందోళన కలిగిస్తున్నది. వివిధ ప్రభుత్వ విభాగాలు
మరియు ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ప్రభుత్వ విభాగాలలో మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో
మైనారిటీల ప్రాతినిధ్యం తక్కువుగా ఉందని చూపిస్తుంది. NCT ఢిల్లీ లో మైనారిటీలు 20 శాతం ఉన్నారు కానీ ప్రభుత్వ సేవలలో
వారి ప్రాతినిధ్యం 5 శాతం కంటే తక్కువగా ఉంది "అని డాక్టర్
జఫర్ అహ్మద్ ఖాన్ తన నివేదికలో పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ సర్విసులలో ముస్లింల
ప్రాతినిధ్యం.
Ø 2011 జనాభా లెక్కల ప్రకారం, ఢిల్లీలోని మతపరమైన మైనారిటీల జనాభా 18.32%. అందులో ముస్లింలు 12.86%గా ఉన్నారు.