అసఫ్ అలీ (11 మే 1888 - 2 ఏప్రిల్ 1953) ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ప్రముఖ
న్యాయవాది. ఇతను 11 మే 1888న సియోహరా, నార్త్-వెస్ట్రన్
ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా
లో జన్మించాడు మరియు 2 ఏప్రిల్ 1953న 64 ఏళ్ళ వయసులో
మరణించారు.
అతను అమెరికాలో మొదటి
భారత రాయబారి మరియు ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.
అసఫ్ అలీ డిల్లి లోని
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాడు. అతను ఇంగ్లాండ్‌లోని లింకన్స్ ఇన్ నుండి బారిస్టర్
పట్ట పొంది డిసెంబర్ 1914 లో భారతదేశానికి
తిరిగి వచ్చాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అసఫ్ అలీ జాతీయవాద ఉద్యమంలో ఎక్కువగా
పాల్గొన్నాడు.
అసఫ్ అలీ దేశంలో అత్యంత ప్రముఖ
గౌరవనీయమైన ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా అతి త్వరలోనే ఎదిగాడు.
1928 లో అతను తనకు 20 సంవత్సరాలు పైగా తనకు జూనియర్ అయిన అరుణా గంగూలి(అరుణా అసఫ్ అలీ) ని వివాహం చేసుకున్నాడు. 1942క్విట్ ఇండియా
ఉద్యమం, సందర్భంగా
బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ కాంగ్రెస్ జెండాను
ఎగురవేసినందుకు ఆమె పేరు గాంచినది.
1929 ఏప్రిల్ 8 న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు
విసిరిన షాహీద్ భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ల తరుపున న్యాయవాది గాపనిచేసాడు.
1935 లో ముస్లిం నేషనలిస్ట్ పార్టీ సభ్యుడిగా
కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత అతను కాంగ్రెస్ సభ్యునిగా ప్రాముఖ్యత
పొందాడు మరియు ఉప నాయకుడిగా నియమించబడ్డాడు.
ఆగష్టు 1942 లో అఖిల భారత
కాంగ్రెస్ కమిటీ ఆమోదించిన 'క్విట్ ఇండియా' తీర్మానం కు అనుగుణంగా ఆందోళనలో పాల్గొన్నాడు
మరియు జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇతర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుతో సహా అహ్మద్‌నగర్
ఫోర్ట్ జైలులో జైలు జీవితం గడిపినాడు.
1945 లో, భారత జాతీయ సైన్యం యొక్క అధికారుల డిఫెన్స్ కోసం
కాంగ్రెస్ స్థాపించిన ఐఎన్ఎ డిఫెన్స్ బృందం కన్వీనర్‌గా 1945 నవంబర్‌లో అసఫ్ అలీ
పనిచేశారు.
1946 లో జవహర్‌లాల్
నెహ్రూ నేతృత్వంలోని ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో రైల్వే మరియు రవాణా బాధ్యతలను
నిర్వహించారు.
ఫిబ్రవరి 1947 నుండి ఏప్రిల్ 1947 మధ్యకాలం వరకు
అతను యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి భారత రాయబారిగా పనిచేశాడు.
2,ఏప్రిల్ 1953న స్విట్జర్లాండ్ బెర్న్లోని కార్యాలయంలో భారత
రాయబారిగా పనిచేస్తున్నప్పుడు అసఫ్ అలీ మరణించాడు.
1989 లో అతని గౌరవార్థం ఇండియా పోస్ట్ ఒక స్టాంప్‌ను విడుదల
చేసినది.
అతని భార్య అరుణ అసఫ్
అలీకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం “భారత రత్న”మరణాంతరం లబిoచినది.
No comments:
Post a Comment