20 February 2020

ఇస్లాం మహిళలను గౌరవిస్తుంది Islam Dignifies Women




దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది: విశ్వసించిన ప్రజలారా! బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మ సమ్మతం కాదు. ఇంకా, వారిని వేధించి సాధించి మీరు వారికీ ఇచ్చిన మెహర్ లో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం చెయ్యటం కూడా ధర్మసమ్మతం కాదు. అయితే వారు గనుక బాహాటంగా చేడునడతకు పాల్పడినట్లేతే , (అప్పుడు వారిపట్ల కటినంగా ప్రవర్తించే అధికారం మీకు ఉంది). వారితో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకువారు నచ్చక పోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చక పోవచ్చు. కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలును పెట్టి ఉండవచ్చు. -(4:19)


ఇస్లాoకు  పూర్వo అరేబియాలో మహిళలు దుర్వినియోగం చేయబడినారు. వారికి మానవ హక్కులు లేవు. స్త్రీలకు పురుషుల కంటే చాలా తక్కువ స్థానం ఇవ్వబడింది, వారు నిర్జీవమైన వస్తువులతో సమానంగా పరిగణించబడినారు. వినోదం మరియు ఆనందం కోసం ఉపయోగించబడ్డారు, కోరికలను తీర్చే  లైంగిక వస్తువులుగా పరిగణించబడ్డారు. స్త్రీలను శృంగార కళలు మరియు సాహిత్యానికి విషయంగా ఉపయోగించారు.


ఇస్లాం మహిళలను అదోస్థానం నుండి ఉద్ధరించడానికి వచ్చింది, కుటుంబంలో మరియు సమాజంలో తమ పాత్రను పోషించడానికి వారికి  తగిన స్థానాన్ని ఇచ్చింది. మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఒకే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింప జేశాడు. -దివ్య ఖురాన్ (4: 1)

ఇస్లాం వైవాహిక సంబంధాన్ని  అత్యున్నత స్థాయికి పెంచినది. దానికి పరస్పర గౌరవం, ఆప్యాయత మరియు సంరక్షణ జోడిoచినది  మరియు దానిని మరింత దృఢమైన  పునాదిపై ఉంచినది.  


అజ్ఞాన కాలం లేదా ఇస్లాం కు పూర్వకాలం   లో కొన్ని అరబ్బు తెగలలో  మరణించిన వ్యక్తి బంధువులు  మరణించిన  వ్యక్తి విధవ పై తమకు హక్కు కలదని భావించే వారు. మరణించిన వ్యక్తికి చెందిన జంతువులను మరియు ఆస్తిని వారసత్వంగా పొందినట్లుగా వారు ఆమెను వారసత్వంగా పొండేవారు. బంధువులలో ఎవరైనా ఆమెను కోరుకుంటే వారు ఆమెను వివాహం చేసుకోవచ్చు లేదా ఆమెను వేరొకరితో వివాహం చేసి ఆమె కట్నం తాము తీసుకోవచ్చు. ఆమె ఉనికి/స్థితి ఇష్టానుసారం విక్రయించగల జంతువు కంటే ఎక్కువ కాదు మరియు వారు ఆమెను ఎవరినైనా వివాహం చేసుకోకుండా అడ్డుకోవచ్చు.


అరేబియాలో పాటిస్తున్న మరొక సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ వితంతువుగా మారితే, మరణించిన భర్త యొక్క బంధువు తన వస్త్రాన్ని ఆమెపై విసిరేయవచ్చు. ఇది ఆమెపై తన హక్కు ను చెప్పడానికి సరిపోతుంది. ఇక ఆమె అతనిది అవుతుంది. ఆమె అందంగా ఉంటే, అతను ఆమెను వివాహం చేసుకోవచ్చు. ఆమె అందవిహినంగా ఉంటే, అతను ఆమెను తన ఇంటికే  పరిమితం చేయవచ్చు;

కొంతమంది అరబ్బులు మహిళలకు  విడాకులు ఇచ్చేవారు మరియు తమ మాజీ భర్తల అనుమతి లేకుండా వారు ఎవరినీ వివాహం చేసుకోరాదనీ  నిర్దేశించేవారు. అటువంటి స్థితిలో ఉన్న స్త్రీకి తన స్వేచ్ఛను తిరిగి పొందటానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే, ఆమె మాజీ భర్త నుండి అందుకున్న మొత్తం కట్నం (మహర్) ను తిరిగి అతనికి చెల్లించడం.

కొన్ని అరేబియా తెగలలో, ఒక చిన్న పిల్లవాడు ఆమెను వివాహం చేసుకునే వయస్సు వచ్చేవరకు ఒక వితంతువును వివాహం లేకుండా ఉంచేవారు..ఒకవేళ  విధవరాలుకి అమ్మాయి ఉంటే, మాజీ భర్త చిన్న కొడుకు పెరిగే వరకు ఆ ఆమ్మాయి వివాహం ను అడ్డుకునేవారు. అతను ఆమెను వివాహం చేసుకొని ఆమె డబ్బు అంతా తీసుకునేవాడు. ఆ కాలం  నాటి ఈ పద్ధతులు స్త్రీలను మరియు పురుషులను నైతికంగా సామాజికంగా మరింత దిగజార్చాయి.

ఇస్లాం స్త్రీలను గౌరవప్రదమైన దృక్పథంతో చూసింది. ఇస్లాం పురుషుడు మరియు స్త్రీ మధ్య సంబంధాన్ని గౌరవప్రదమైన స్థాయికి పెంచింది, అల్లాహ్ తన అన్ని జీవులకన్నా మానవులను గౌరవించి, ఉన్నత స్థానంలో ఉంచాడు. ఇస్లాం స్త్రీలను తమ భర్తను ఎన్నుకోవటానికి స్వేచ్ఛని ఇచ్చింది.  ఆ స్వేచ్ఛను ప్రతి స్త్రీ, కన్య, వితంతువు లేదా విడాకులు పొందినవారు అనుభవిస్తారు.


దివ్య ఖుర్ఆన్ భార్యలతో   సద్భావంతో జీవితం గడపండి.అంటుంది. ఇది ఒక విధి. 4:19 అయత్ లోని చివరి భాగం, “వారితో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకువారు నచ్చక పోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చక పోవచ్చు. కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలును పెట్టి ఉండవచ్చు”.

ఈ ఆయత్ ప్రజలు ఆశతో అల్లాహ్ వైపు తిరగడానికి సహాయపడుతుంది. ఈ అయత్ గురించి ఇబ్న్ అబ్బాస్ ఇలా వ్యాఖ్యానించాడు: "భర్త తన భార్య పట్ల కరుణ అనుభూతి చెందడానికి మరియు అల్లాహ్ అతనికి ఆమెతో ఒక బిడ్డను ఇస్తాడు, మరియు ఈ పిల్లవాడు అద్భుతమైన మంచితనాన్ని కలిగి ఉంటాడు."

ప్రామాణికమైన హదీసులు ఇలా చెబుతున్నాయి: విశ్వాసి తన విశ్వాసి అయిన భార్యను ద్వేషించకూడదు. ఆమె ప్రవర్తనలో కొంత భాగాన్ని అతను ఇష్టపడకపోతే, అతను ఖచ్చితంగా మరొకదాన్ని ఇష్టపడతాడు. ” (ఇబ్న్ కతిర్)

ఇస్లాం ఇంటిని శాంతీయుత, సురక్షిత  ప్రదేశంగా చూస్తుంది, ఇక్కడ కుటుంబంలోని ప్రతి సభ్యుడు  సురక్షితంగా ఉంటాడు. ఇస్లామిక్ దృక్కోణం లో  వైవాహిక సంబంధం ఆప్యాయత మరియు కరుణపై ఆధారపడిన సంబంధం. ఇది స్వేచ్ఛా ఎంపిక ఆధారంగా ఉనికిలోకి రావాలి మరియు ఇది ప్రేమ, సానుభూతి మరియు కరుణ యొక్క పరస్పర భావాలు వృద్ధి చెందగల వాతావరణాన్ని వ్యాపిoపజేస్తుంది. ఇస్లాం లో వివాహ బంధం ఎంతో విలువైనది, వివాహం చాలా ప్రాముఖ్యత కలిగిన సంస్థ.





No comments:

Post a Comment