తన ప్రసంగాలలో ఒకటైన “ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అండ్ బికమింగ్ The Art of Being and Becoming” హజ్రత్ ఇనాయత్ “సాక్షాత్కారానికి మొదటి సంకేతం ఇతరుల పట్ల సహనం చూపటం” అన్నారు.
భారతీయ సంగీతకారుడు- ఆధ్యాత్మిక వేత్త - హజ్రత్ ఇనాయత్ ఖాన్ మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు పశ్చిమ దేశాలకు ఆధ్యాత్మికతతో సంగీతాన్ని నేర్పించారు.
"మీకు నిజంగా ఎవరు మీరు అని ధైర్యం ఉందా?" -హజ్రత్ ఇనాయత్ ఖాన్
భారతదేశపు "ప్రపంచ సూఫీ" గా ప్రసిద్ది చెందిన హజ్రత్ సూఫీ ఇనాయత్ ఖాన్ పాశ్చాత్య ప్రజలకు సితార్ మరియు "వయోలిన్" ద్వారా "హింస” నుoడి ఆధ్యాత్మిక ఉపశమనం అందించాడు. అందువల్ల, "ది బౌల్ ఆఫ్ సాకి" లో ఉన్న అతని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మరియు వివేకం గల మాటలు భారతదేశంలో అనాదిగా అమలులో ఉన్న పురాతన బహుళ మరియు రహస్యమయ వాదాన్ని pluralistic and mystical tradition పునరుజ్జీవింపచేయడానికి తీవ్రంగా అమలు చేయాలి.
హజ్రత్ ఇనాయత్ అంతర్-మత inter-religious వాతావరణంలో పెరిగారు అందువల్ల, తన బాల్యం నుండి, అతను దైవిక విశ్వవ్యాప్తత గురించి, అనుభవపూర్వక స్థాయిలో బలమైన నమ్మకంతో జీవించాడు. ఆ విధంగా తన జీవితాంతం, మతపరమైన ఆదర్శాల ఐక్యత, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, తోటి మానవులకు పరస్పర గౌరవం, వ్యక్తిత్వ కళను పెంపొందించడం మరియు సంగీతం యొక్క పవిత్ర స్వభావాన్ని మెచ్చుకోవడం వైపు ఒక అంతర్గత మార్గాన్ని చూపించారు.
“ది బౌల్ ఆఫ్ సాకి, ది హార్ట్ ఆఫ్ సూఫిజం, ది వే ఆఫ్ ఇల్యూమినేషన్, ది మ్యూజిక్ ఆఫ్ లైఫ్ మరియు ఇన్నర్ లైఫ్” వంటి అతని అన్ని ఉపన్యాసాల సారాంశం ఇది.
అతను తన బాల్యంలో సంగీతం మరియు కవితలను బాగా నేర్చుకున్నాడు మరియు నవాబులు మరియు యువరాజుల కోర్టులలో మరియు హైదరాబాద్ నిజాం వద్ద వీణ వాయించేవాడు. "సంగీతం, కవిత్వం మరియు తత్వశాస్త్రం పట్ల నా అభిరుచి, ప్రతిరోజూ పెరిగింది, నా వయస్సు గల అబ్బాయిలతో ఆటల కంటే వాటిని నేను చాలా ఇష్టపడ్డాను" అని ఆయన చెప్పారు.
అతని మర్షిద్, సయ్యద్ అబూ హషీమ్ చిష్తి అతన్ని “తూర్పు మరియు పడమరలను నీ సంగీతం యొక్క సామరస్యంతో సమన్వయం చేయి” అని ప్రోత్సహించారు. ఈ విధంగా, ఇనాయత్ తన ఆధ్యాత్మిక యానానికి పశ్చిమ దేశాలకు బయలుదేరాడు, అక్కడ అతను మతపరమైన ఆదర్శాల ఐక్యతను బలోపేతం చేసే లక్ష్యంతో భారతీయ సూఫీయిజం, పవిత్ర సంగీతం, ధ్వని మరియు సంగీతం యొక్క హిందూస్థానీ గాత్ర మార్మికతను పరిచయం చేశాడు.
“ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అండ్ బికమింగ్” అనే తన ప్రసంగo లో హజ్రత్ ఇనాయత్ “సాక్షాత్కారానికి మొదటి సంకేతం ఇతరుల పట్ల సహనం చూపటం” అన్నారు. యేసుక్రీస్తు: “నా తండ్రి ఇంట్లో చాలా భవనాలు ఉన్నాయి” అన్నారు మరియు ప్రవక్త ముహమ్మద్ (స): “ప్రతి ఆత్మకు దాని స్వంత మతం ఉంది”. అన్నారు దాని అర్ధం “ఆధ్యాత్మిక స్వేచ్ఛ”
మారుతున్న ఈ జీవితంలో వెతకడానికి లేదా నివసించడానికి కావాల్సినది ఏమిటనే ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రతి ఒక్కరూ తన పరిణామం ప్రకారం కోరికను కలిగి ఉన్నారని చెప్పారు. మనకు సిద్ధంగా ఉన్నది మనకు కావాల్సిoది సూచిస్తుంది. ఉదాహరణకు - పసి శిశువుకు కావాల్సినది, పాలు ఎందుకంటే దాని కోసం మాత్రమే పసిపాప సిద్ధంగా ఉన్నాది.
పెద్దవారికి చాలా ఆహారాల పట్ల కోరిక ఉంటుంది. "జీవితంలో ప్రతి దశకు తగిన మరియు కావాల్సిన విషయాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు. రూమి తన మస్నావిలో సూచించిన దానికి ఇది అనుగుణంగా ఉంటుంది:
ఒక వ్యక్తి తన అవసరానికి అనులోమానుపాతంలో సాధనాలను కలిగి ఉంటాడు.
ప్రేమగల దయతో సమృద్ధిగా ఉన్న సముద్రం పెరిగేలా, త్వరగా, మీ అవసరాన్ని పెంచుకోండి.
No comments:
Post a Comment