భారతదేశంలో, 1983 వ
సంవత్సరము నుండి ప్రతి ఏటా డిసెంబర్ 17 వ తేదీన " పెన్షనర్స్ డే" జరుపుకుంటున్నారు. ప్రపంచంలో
మొట్టమొదటి సారిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జర్మనీ దేశపు ఛాన్సలర్
"ఓట్టొవా బిస్మార్క్ ".
భారతదేశంలో
" పెన్షన్ "కు 160
ఏళ్ల చరిత్ర ఉంది..1871 వ సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం
నామమాత్రపు పెన్షన్ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది..
1922 వ సంవత్సరం జనవరి 1 వ తేదీ నుండి భారతదేశంలో అమలులోకి
వచ్చిన" ఫండమెంటల్ రూల్స్"లో పెన్షన్
ను ఒక హక్కుగా పొందుపరచలేదు... ఈ నేపథ్యంలో,, రక్షణ మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా ఉండి 1972 వ సంవత్సరం రిటైర్డ్ అయిన DS. నకారా గారు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యల
పైన పిటిషన్ ఫైల్ చేశారు. సుదీర్ఘకాలం కేసు వాదోపవాదాలు విన్న అప్పటి
ధర్మాసనం లో, భారతదేశపు 16 వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ YV చంద్ర చూడ్ గారు,, "" పెన్షన్""అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో
ఇచ్చే జీవనభృతి కాదని,,,,
పెన్షనర్లు సుదీర్ఘకాలం, శారీరకంగా,మానసికంగా, కుటుంబ పరంగా, ఎన్నో త్యాగాలు చేసి, సమాజానికి పలు విధాలుగా సేవలందించిన
తరుణంలో వారికి" పెన్షన్ "అన్నది ఒక " ప్రాథమిక హక్కు "గా ప్రకటిస్తున్నాను, అని సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. ఈ
చారిత్రాత్మక తీర్పు1982 డిసెంబర్ 17 వ తేదీన ప్రకటించారు..
ఆ
కారణంగానే డిసెంబర్ 17 వ తేదీన మన దేశమంతటా శ్రీ DS నకారా, శ్రీ చంద్ర చూడ్ గార్లను
స్మరించుకుంటూ పింఛనుదార్ల దినోత్సవం
"(PENTIONERS DAY) గా జరుపుకుంటారు.
ఈ
సందర్భంగా పింఛను దారుల ప్రశాంత జీవన
సరళికి ఎనలేని కృషి చేసిన శ్రీ DS. నకారా
గారికి, మరియు శ్రీ చంద్ర చూడ్ గారికి,,, ఇంకా, పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేసిన,,, చేస్తున్న,,,"
ఎందరో మహానుభావులు, అందరికీ హృదయపూర్వక వందనాలు ",, తెలియజేసుకుంటున్నది,,,,""
No comments:
Post a Comment