చలికాలం
ముగుస్తూ వేసవి ప్రారంభమవుతుందనగా తేగలు వచ్చేస్తాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో
తాటి గేగులు అని కూడా అంటారు. తేగలు తినేందుకు కొందరు ఇష్టపడరు.
అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం తినకుండా వుండలేరు. తేగల్లో
ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి
తేగలలో అనేక ప్రయోజనకరమైన ఖనిజాలు,పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల
కలవు.తేగలలోపోషకాలు సమృద్ధిగా మరియు తక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉండి పొటాషియం, ఇనుము, రాగి, భాస్వరం
మరియు జింక్ వంటి అనేక ఖనిజాలను అందిస్తుంది.
పోషక విలువలు:
(100-గ్రామ్) తేగలలో:
• కేలరీలు: 36
• ప్రోటీన్: 4 గ్రాములు
• కొవ్వు: 1 గ్రాము
కంటే తక్కువ
• పిండి పదార్థాలు: 4 గ్రాములు
• ఫైబర్: 4 గ్రాములు
• పొటాషియం: రోజువారీ విలువలో 38% (DV)
• భాస్వరం: DVలో 20%
• రాగి: DVలో 70%
• జింక్: DVలో 36% కలదు.
తేగలను తీసుకోడం వలన కలిగే ప్రయోజనాలు:
1.తేగలలో పీచు పదార్థం ఎక్కువ.
ఈ పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో
తోడ్పతుతుంది. పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను
తొలగిస్తుంది.
2.తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు
రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
౩.తేగలు తినడం బరువు తగ్గడంలో సహాయం పడుతుంది.
4,తేగలు తింటే క్యాన్సర్‌ను దూరం
చేసుకోవచ్చు. తేగలు బ్లడ్ క్యాన్సర్
రాకుండా అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్‌ను తొలి దశలోనే
నిర్మూలించే శక్తి వీటికున్నాయి,
5.తేగలలోని క్యాల్షియం ఎముకలకు
బలాన్నిస్తాయి. ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.
6.తేగల్లో మానవ
శరీరానికి మేలు చేసే పీచు పదార్ధాలతో పాటు పిండి పదార్ధం కూడా పుష్కలంగా
లభిస్తుంది. తేగలను చిన్న చిన్న ముక్కలుగా
కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి
చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.
7.తేగల
పిండిని గోధుమ పిండిలా మెత్తగా చేసి రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా
వున్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి
కూడా వున్నాయి.
8.తేగలు
ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి. తేగలను పాలలో ఉడికించి ఆపాలను చర్మానికి పూతలా వేసుకుంటే
చర్మానికి చాలా మేలు చేస్తుంది.వేసవిలో వచ్చే చెమటకాయలను తేగలు
నివారిస్తాయి.
9. తేగలలోని సి విటమిన్
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని తెల్లకణాలను వృద్ధిచేస్తుంది.
10.ఆకలిని
నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా
బరువు తగ్గుతారు. శరీరానికి చలవనిచ్చి
నోటిపూతను తగ్గిస్తుంది.
11. తేగలను
ఎక్కువగా తీసుకోకూడదని రోజుకు రెండు తినాలని వారానికి ఐదారు తీసుకోవచ్చునని
అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
No comments:
Post a Comment