7 April 2022

షా వాజిహుద్దీన్ మిన్హాజీ, గొప్ప భారతీయ జాతీయవాది 1907-1984 Shah Wajihuddin Minhaji, A Great Indian Nationalist1907-1984

 

షా వాజిహుద్దీన్ మిన్హాజీ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో షా ముహమ్మద్ ఉమైర్ నాయకత్వంలో అర్వాల్ థానాను కాల్చివేసినప్పుడు ప్రసిద్ధి చెందాడు.

1907లో బిహార్ లోని గయా జిల్లాలో జన్మించిన షా వాజిహుద్దీన్ మిన్హాజీ, మౌల్వీ మూసా రజా వద్ద తన ప్రారంభ విద్యను ఇంట్లోనే పొందాడు. ఆ తర్వాత ససారంలో ఉన్న మదర్సాకు వెళ్లాడు. 1920లో, షా వాజిహుద్దీన్ మిన్హాజీ ఇస్లామియా ఇంగ్లీష్ హై స్కూల్‌లో చేరాడు. 1920 సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో వలసవాద విద్యను బహిష్కరించడంతో, షా వాజిహుద్దీన్ మిన్హాజీ 1921లో నేషనల్ స్కూల్‌లో చేరాడు. ఈ పాఠశాలలో, షా వాజిహుద్దీన్ మిన్హాజీ బాబా ఖలీల్ దాస్ మరియు ఖాజీ అహ్మద్ హుసియాన్‌లతో పరిచయం పెంచుకున్నాడు. ఇక్కడ షా వాజిహుద్దీన్ మిన్హాజీ వక్తృత్వం మరియు గజల్ పఠనం నేర్చుకున్నాడు.

షా వాజిహుద్దీన్ మిన్హాజీ 1922లో కాంగ్రెస్ గయ సెషన్‌లో వాలంటీర్లలో ఒకడు. 1924లో, షా వాజిహుద్దీన్ మిన్హాజీ తదుపరి విద్య కోసం కలకత్తాకు పంపబడ్డాడు, అయితే అనారోగ్యం కారణంగా షా వాజిహుద్దీన్ మిన్హాజీ చదువును విడిచిపెట్టాడు. 1931లో, షా వాజిహుద్దీన్ మిన్హాజీ చేతితో వ్రాసిన “హిందూస్తాన్” అనే పీరియాడికిల్ ప్రారంభించాడు. ఇది  వలస పాలన కు వ్యతిరేక తిరుగుబాటు చర్యగా పరిగణించబడినది..

 ‘ముస్లిం సే ఖితాబ్అనే తన సొంత కవితను మిన్హాజీ 1931లో శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా రంజాన్ చివరి శుక్రవారం నాడు ఒక మసీదు లోపల పఠనం చేసినాడు. వెంటనే మిన్హాజీ ని పోలీసులు అరెస్ట్ చేశారు

ఆ తరువాత షా వాజిహుద్దీన్ మిన్హాజీ తల్లిదండ్రులు మిన్హాజీ ని ముజఫర్‌పూర్‌కు పంపారు, అక్కడ షా వాజిహుద్దీన్ మిన్హాజీ ఎక్కువ కాలం ఉండలేక కలకత్తా వెళ్ళాడు. గ్రామీణ బెంగాల్‌లోని పలు ప్రాంతాలు  తిరుగుతూ అస్సాం వరకు చేరుకున్నాడు. 1932లో, కలకత్తాకు తిరిగి వచ్చిన తరువాత, షా వాజిహుద్దీన్ మిన్హాజీ ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్‌ను వ్యతిరేకించాడు

15 జూన్ 1932, తెల్లవారుజామున 4 గంటలకు, CID పోలీసులు షా వాజిహుద్దీన్ మిన్హాజీ నివాసంపై దాడి చేశారు మరియు వారు కొంత 'తిరుగుబాటు' సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు మరియు షా వాజిహుద్దీన్ మిన్హాజీ ని అరెస్టు చేశారు. 14 రోజుల పాటు పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. విచారణ ప్రారంభించి అలీపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. షా వాజిహుద్దీన్ మిన్హాజీ విడుదలైనప్పుడు, మిన్హాజీ సహచరులు చాలా మంది జైలు గేటు వద్ద అతనికి స్వాగతం పలికారు. మరుసటి రోజు "బెంగాల్ మజ్లిస్ ఇ అహ్రార్-ఉల్-ఇస్లాం" షా వాజిహుద్దీన్ మిన్హాజీ ని సత్కరించింది.

1934 జూన్ 29న మిన్హాజీ వివాహం జరిగింది. తదనంతరం, మిన్హాజీ తన చేతితో వ్రాసిన విప్లవాత్మక పత్రికను తిరిగి ప్రారంభించాడు, ఇప్పుడు దీనిని “బాఘీ” అని పిలుస్తారు, వలస పాలనను వ్యతిరేకించాలని మరియు వలస సేవలలో చేరకూడదని ప్రజలను ఉద్భోధించాడు. ఇది “గార్మ్ గయావి” అనే మారుపేరుతో వ్రాయబడింది.

ఈ వివరాలన్నింటిని  మిన్హాజీ “మేరి తమన్నా” అనే తన డైరీలో పొందుపరిచాడు.   ఫిబ్రవరి 1936లో, మిన్హాజీ తన డైరీలో ఇలా పేర్కొన్నాడు, “మేరీ తమన్నా హై కె మాదర్ ఇ వతన్ కి అర్బన్ గాహ్ పర్ మేరీ జాన్ ఖుర్బాన్ హో జాయేఅనగా “నేను నా మాతృభూమి కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను. విస్తృత పాఠకుల కోసం డైరీని ప్రచురించగలిగితే చాలా బాగుంటుంది”.

మిన్హాజీ ముస్లిం లీగ్ మరియు జిన్నా యొక్క టూ నేషన్ థియరీకి తీవ్ర వ్యతిరేకి. మిన్హాజీ నవంబర్ 15, 1984 న మరణించాడు.

 

 

No comments:

Post a Comment