14 April 2022

మజ్లిస్-ఎ-అహ్రార్ ఇస్లాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ప్రశంసించబడిన జాతీయవాద ముస్లిం పార్టీ मजलिस-ए-अहरार इस्लाम, एक राष्ट्रवादी मुस्लिम पार्टी जिसकी तारीफ़ नेताजी सुभाष चंद्रा बोस ने की

 


1929లో, మజ్లిస్ అహ్రార్ ఇస్లాం” పంజాబ్‌లో జంగ్-ఎ-ఆజాదీ యొక్క గొప్ప నాయకుడు హజ్రత్ మౌలానా అతావుల్లా షా బుఖారీ చే స్థాపించబడినది మరియు ఈ పార్టీ పంజాబ్ మరియు కాశ్మీర్‌ లో విస్తరించబడే ద్రుష్టి లో ఉంది. హజ్రత్ మౌలానా అతావుల్లా షా బుఖారీ పాట్నాలో జన్మించాడు, కానీ పంజాబ్‌లో స్థిరపడ్డారు. చౌదరి అఫ్జల్ హక్, మౌలానా మజర్ అలీ మజర్, మౌలానా హబీబుర్ రెహమాన్ లుధియాన్వీ వంటి వ్యక్తులు దీనికి నాయకులు.

బీహార్‌లో, మజ్లిస్ అహ్రార్ ఇస్లాం గయాలో ప్రారంభించబడింది. గయాలో “మజ్లిస్ అహ్రార్ ఇస్లాం”ను ఫజల్ రెహ్మాన్ మరియు బిలాల్ అబ్గిల్వి స్థాపించారు. షా ముహమ్మద్ ఉస్మానీ ఇంట్లో దాని కార్యాలయం ఉంది. షా ముహమ్మద్ ఉస్మానీ మరియు అతని సోదరులు కూడా ఈ పార్టీ తో సంబంధం కలిగి ఉన్నారు.

 1932లో, మజ్లిస్ అహ్రార్ ఇస్లాం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించినది. గయాలో ఈ పార్టి కి నాయకుడిగా ఉన్న ఖాజీ ముహమ్మద్ హుస్సేన్,బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం లో చురుకుగా పాల్గొని, అరెస్టు చేయబడ్డాడు. అప్పుడు అతని సోదరుడు ఖాజీ అహ్మద్ హుస్సేన్ పార్టీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో అహ్రారీ పార్టీ కార్యకర్తల బృందం  గయా నుండి కాశ్మీర్ వరకు పర్యటనకు వెళ్ళింది.

 గయా నివాసి షా వాజిహుద్దీన్ మిన్హాజీ 1932లో “బెంగాల్ మజ్లిస్ అహ్రార్ ఇస్లాం” కార్యదర్శి అయ్యాడు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నాడు మరియు 15 జూన్ 1932న అరెస్టయ్యాడు. జైలులో చాలా బాధలు అనుభవించారు.1937 బీహార్ ఎన్నికలలో  ముస్లిం అహ్రార్ పార్టీ పాల్గొంది మరియు దర్భంగా నుండి ముహమ్మద్ సలీం ముస్లిం అహ్రార్ పార్టీ టిక్కెట్‌పై గెలిచారు.

మజ్లిస్ అహ్రార్ ఇస్లాం భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించింది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 31 ఆగస్టు 1942న బెర్లిన్ నుండి తన రేడియో సందేశంలో ఈ పార్టీ పేరును బహదూర్ మజ్లిస్-ఇ-అహ్రార్, అని ప్రస్తావించారు మరియు దీనిని భారతీయ నేషనలిస్ట్ ముస్లిం పార్టీ  అని పేర్కొన్నారు. మజ్లిస్-ఇ-అహ్రార్  1939లో బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ప్రచారాన్ని ప్రారంభించింది.

మజ్లిస్-ఎ-అహ్రార్ ఇస్లాం ప్రధాన ఆశయం  భారతదేశంలోని ముస్లింలను ఒకే వేదికపైకి తీసుకురావటం, కాంగ్రెస్ మరియు  ముస్లిం లీగ్ అనుసరిస్తున్న విభజన రాజకీయాల నుండి ముస్లింలను బయటకు తీసుకురావడము మరియు ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం.

No comments:

Post a Comment