3 July 2025

భారతదేశంలో ముస్లింల సామాజిక-విద్యా స్థితి - ఒక అధ్యయనం Socio-Educational status of Muslims in India – a Study

 



ముస్లిం వెనుకబాటుతనం’ అనేది భారతదేశములో ఒక చర్చనీయాంశమైన అంశం. ముస్లింలు సాధారణంగా నిరక్షరాస్యత, విద్య లేకపోవడం, అవకాశాల లేకపోవడం వల్ల పేద జీవన పరిస్థితుల్లో జీవిస్తున్నారనేది వాస్తవం.

జోయా హసన్ మరియు రీతు మీనన్ వారి 'ఎ స్టడీ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో " ముస్లింలు గత 75 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో అత్యంత విద్యాపరంగా వెనుకబడిన సామాజిక-మత సమూహాలలో ఒకటిగా గుర్తించబడ్డారు"

2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు భారత సమాజంలో ఆర్థికంగా, విద్యాపరంగా మరియు సామాజికంగా అత్యంత వెనుకబడిన వర్గాలలో ఉన్నారు. జాతీయ సగటు 70% కు బిన్నంగా కేవలం  59శాతం మంది ముస్లిం పిల్లలు ప్రాథమిక పాఠశాలకు హాజరవుతున్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది. ముస్లిం విద్యార్థులలో డ్రాపౌట్ రేటు కూడా ఎక్కువగా ఉంది. పేదరికం, విద్య అందుబాటులో లేకపోవడం మరియు వివక్షత ఈ అసమానతలకు కారణమని నివేదిక పేర్కొంది.

సచార్ కమిటీ ముఖ్యమైన సూచనలు :

Ø ముస్లింలలో అక్షరాస్యత రేటు 59.1%, ఇది జాతీయ సగటు 64.8% కంటే తక్కువ;

Ø ముస్లింలలో 4% కంటే తక్కువ మంది గ్రాడ్యుయేట్లు లేదా డిప్లొమా హోల్డర్లు, జాతీయ సగటు 7% (ఈ డేటా 20 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల జనాభా గురించి).

Ø అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం చేరిన 25 మంది విద్యార్థులలో ఒకరు మాత్రమే ముస్లిం  ఉన్నారు.

Ø పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం చేరిన యాభై మంది విద్యార్థులలో ఒకరు మాత్రమే ముస్లిం.

Ø డిగ్రీ కోర్సు కోసం చేరే ముస్లిం పురుషుల శాతం, ముస్లిం మహిళల కంటే తక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం.


సచార్ కమిటీ నివేదిక 2006 సంవత్సరంలో ప్రచురించబడింది, ఇప్పుడు తాజా పరిస్థితిని పరిశీలిద్దాం.

Ø 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 74.04%. (2021 జనాభా లెక్కలు నిర్వహించబడలేదు కాబట్టి, తాజా విశ్వసనీయ మరియు అధికారిక డేటా అందుబాటులో లేదు).

Ø మతపరమైన సమాజం మరియు లింగం ఆధారంగా విద్యా స్థాయిలో 2011 భారత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ముస్లింలలో 57.3% మంది అక్షరాస్యులు (అంటే భారతదేశంలోని ముస్లింలలో 42.7% మంది నిరక్షరాస్యులు, ముస్లిం జనాభాలో దాదాపు సగం మంది ముస్లిములు తమ మాతృబాష లో పేరు చదవలేరు లేదా వ్రాయలేరు).

Ø ఇతర మైనారిటీలలో అక్షరాస్యత రేట్లు ముస్లింలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.

Ø జైనులు 84.7%, తరువాత క్రైస్తవులు 74.3%, బౌద్ధులు 71.8% మరియు సిక్కులు 67.5% ఉన్నారు.

 

ముస్లిం విద్యార్థుల పాఠశాలలో నమోదు Enrolment of Muslim students into School (2021-22):

పాఠశాలల్లో ముస్లిం విద్యార్థుల నమోదు, ప్రాథమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయి విద్యపై దృష్టి పెడదాం focus on Enrolment of Muslim students into schools, Primary Level to Secondary Level of education.

2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింల మొత్తం జనాభా 14.22%.

పాఠశాలలో ముస్లిం విద్యార్థుల నమోదు (2021-22)

 Enrolment of Muslim students into School (2021-22)

పాఠశాల స్థాయి    పురుష       స్త్రీ          సగటు

ప్రాథమిక స్థాయి (1 నుండి 5వ తరగతి వరకు) 15.40    15.90    15.65

ఉన్నత ప్రాథమిక స్థాయి (6 నుండి 8వ తరగతి వరకు) 13.90    15.00     14.45

ద్వితీయ స్థాయి (9& 10వ తరగతి) 11.90     13.40    12.65

హయ్యర్ సెకండరీ స్థాయి (11& 12వ తరగతి) 9.90     11.70     10.8

మొత్తం             12.77         14.00      13.38

సౌజన్యం: భారతదేశంలో ముస్లిం విద్య యొక్క స్థితి డేటా-ఆధారిత విశ్లేషణ, అరుణ్ సి మెహతా (చార్ట్ 4, పేజీ నం. 22)


పై డేటా నుండి పొందిన అంశాలుConclusions from the data above:

1#. భారతీయ ముస్లింలు ఇప్పుడు జనన సమయంలో లింగ నిష్పత్తిని కలిగి ఉన్నారు (ప్రతి 100 మంది బాలికలకు 106 మంది బాలురు), ఇది భారతదేశంలో కనిపించే సహజ ప్రమాణానికి natural norm దగ్గరగా ఉంది. దీని అర్థం బాలికల కంటే ఎక్కువ మంది బాలురు ఉన్నారు, కానీ నమోదు రేటు భిన్నమైన ధోరణిని చూపిస్తుంది.

2#. ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక స్థాయిలను మినహాయించి, సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలలో ముస్లిం బాలురు మరియు బాలికల నమోదు వాటా మొత్తం జనాభాలో వారి వాటాతో (14.23 శాతం) సరిపోవడం లేదని డేటా సూచిస్తుంది.

3#. డేటా 2021-22 సంవత్సరం ఆధారంగా రూపొందించబడింది.

2021 జనాభా లెక్కల ప్రకారం 5-18 సంవత్సరాల వయస్సు గల ముస్లిం పిల్లల జనాభా అందుబాటులో లేదు. ఏమైనప్పటికీ పాఠశాలకు వెళ్లే పిల్లల జనాభా 13.38% మాత్రమే. (ITI/ITC లేదా డిప్లొమా కోర్సులు వంటి సాంకేతిక అధ్యయనాలను ఎంచుకునే విద్యార్థులను హయ్యర్ సెకండరీ స్థాయిలో పరిగణించరు).


ఉన్నత విద్య కోసం ముస్లిం విద్యార్థుల నమోదు (మొత్తం నమోదుతో పోలిస్తే) Enrolment of Muslim Students for Higher Education (in Comparison with Total Enrolment)


ఉన్నత విద్య కోసం ముస్లిం విద్యార్థుల నమోదు చాలా ఆందోళన కలిగించే విషయం (క్రింద ఇవ్వబడిన పట్టిక చూడండి). చాలా మంది ముస్లిం విద్యార్థులు తక్కువ ఆదాయ కుటుంబాల నుండి వచ్చారు మరియు ఉన్నత విద్య ఖర్చును భరించడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్న అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం మరియు మద్దతు అందించడం చాలా అవసరము.

 

 

 

 

 

వివిధ వర్గాల విద్యార్థుల ద్వారా ఉన్నత విద్య కోసం నమోదు (2020-21) Enrolment for Higher Education by different Categories of Students (2020-21)

 

వర్గం     పురుష      స్త్రీ     మొత్తం

Category  Male

Female

Total

 

ముస్లిం (లక్షల్లో)   9.55   9.67    19.22

మొత్తం విద్యార్థులు (లక్షల్లో) 212.38 201.43 413.81

మొత్తం నమోదు లో ముస్లిం నమోదు 4.5 % 4.8 % 4.64 %

సౌజన్యం: భారతదేశంలో ముస్లిం విద్య యొక్క స్థితి డేటా-ఆధారిత విశ్లేషణ, అరుణ్ సి మెహతా (పట్టిక 31, పేజీ నం. 162)

 

పైన ఉన్న డేటా నుండి పొందిన అంశాలు Conclusions from the data above:

1#. భారతదేశ మొత్తం జనాభాలో ముస్లిముల శాతం(14.23 శాతం)  తో పోలిస్తే ముస్లిం విద్యార్థుల నమోదు వాటా 4.64  చాలా తక్కువగా ఉందని డేటా సూచిస్తుంది.

 

ఉన్నత విద్య కోసం SC/ST & OBC వర్గాలకు చెందిన విద్యార్థుల నమోదు (మొత్తం నమోదుతో పోలిస్తే) Enrolment of Students belonging SC/ST & OBC Categories for Higher Education (in Comparison with Total Enrolment)

 

SC/ST & OBC వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం నమోదు (2020-21)

దేశంలోని మొత్తం జనాభాలో వర్గం   (లక్షల్లో)  (మొత్తం విద్యార్థులలో%లో)  %

 

షెడ్యూల్డ్ కులం (లక్షల్లో) 58.95   14.25 %   16.60 %

షెడ్యూల్డ్ తెగ (లక్షల్లో) 24.12    5.83 %    8.60 %

ఓబీసీ (లక్షల్లో) 148.22      35.82 %    42.00 %

చేరిన మొత్తం విద్యార్థులు (లక్షల్లో) 413.81

 

సౌజన్యం: https://www.data.gov.in/resource/category-wise-enrolment-students-belonging-scheduled-castes-sc-scheduled-tribes-st-and

 

పైన ఉన్న డేటా నుండి పొందిన అంశాలు Conclusions from the data above:

1#. షెడ్యూల్డ్ తెగ (ST) విద్యార్థులు ఉన్నత విద్య కోసం నమోదు చేసుకునే వాటా 5.8%, అది  ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య కోసం నమోదు చేసుకునే దానికంటే 4.64%.ఎక్కువగా ఉందని డేటా సూచిస్తుంది,

2#. భారతదేశ మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ తెగల వాటా 8.60% మాత్రమే. నమోదు చేసుకునే వాటా 5.8:నిష్పత్తిలో ఉంది.

3#. భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల వాటా 14.23%. నమోదు వాటా నిష్పత్తి  4.64 మాత్రమె

గమనిక: ముస్లిం పురుషులు సగటున 6.4 సంవత్సరాలు పాఠశాల విద్యను మరియు మహిళలు సగటున 4.9 సంవత్సరాలు పాఠశాల విద్యను కలిగి ఉన్నారని ఒక అంచనా.


మార్చి 24, 2023న రాజ్యసభలో ఈ క్రింది అంశాలపై చర్చ జరిగింది (శ్రీ అబ్దుల్ వహాబ్ ఫిబ్రవరి 10, 2023న ప్రతిపాదించిన తీర్మానం)

(i) సచార్ కమిటీ నివేదిక, 2006 మరియు రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక, 2007 భారతదేశంలో ముస్లింల పరిస్థితి SCలు మరియు STల కంటే దారుణంగా ఉందని వెల్లడిస్తున్నాయి;

(ii) “సచార్ కమిటీ నివేదిక” ప్రకారం 6-14 సంవత్సరాల వయస్సు గల ముస్లిం పిల్లలలో నాలుగింట ఒక వంతు మంది ఎప్పుడూ పాఠశాలకు హాజరు కాలేదు లేదా మానేశారు(డ్రాప్-అవుట్);

(iii) 17 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో, ఉన్నత విద్యలో ముస్లింల విద్యాసాధన educational attainment 17%, జాతీయ సగటు 26%

మిడిల్ స్కూల్ విద్యను పూర్తి చేసిన ముస్లిం పిల్లలలో 50% మాత్రమే మాధ్యమిక విద్యను పూర్తి చేసే అవకాశం ఉంది, జాతీయ సగటు 62% తో పోలిస్తే;

(iv) జాతీయ జనాభాలో ముస్లిం జనాభా 14% ఉన్నారు కానీ ఉన్నత విద్యలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ;

(v) AISHE ​​2019-20 సర్వేలో, భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ఓపెన్ మరియు ఇతర రకాల విశ్వవిద్యాలయాలతో సహా మొత్తం 1019 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి మరియు సర్వేలో ముస్లింలు 5.5% మాత్రమే ఉన్నత విద్యలో ఉన్నారని తేలింది;

(vi) ఉన్నత విద్యలో ముస్లిం మహిళల సంఖ్య 100 మందిలో 13 మంది ఉన్నారు, ఇది అఖిల భారత స్థాయి జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO), 2018 నివేదిక ప్రకారం చాలా తక్కువ;

(vii) నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) ప్రకారం, 2018లో జీతాల తరగతి salaried-class ఉద్యోగాలలో ముస్లింలు అత్యల్ప ప్రాతినిధ్యం వహించారు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటా, జనాభాలో ముస్లిముల నిష్పత్తిలో సగం కంటే తక్కువ.

(viii) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) 500 కంపెనీలలో డైరెక్టర్లు మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో ముస్లింలు కేవలం 2.67 శాతం మాత్రమే ఉన్నారు


పైన పేర్కొన్న డేటా ప్రకారం  దేశంలో ముస్లింల విద్యా మరియు సామాజిక స్థితి చాలా తక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. 2006లో సచార్ కమిటీ నివేదిక, 'భారతదేశంలో ముస్లింల విద్యా మరియు సామాజిక స్థితి' ప్రచురించబడినప్పటి నుండి దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయి.. పెద్దగా మెరుగుదల లేదని తాజా సర్వేలు చూపిస్తున్నాయి.

ప్రభుత్వ సంస్థల సహాయంతో సమన్వయంతో ముస్లిం సమాజం ఈ విషయాన్ని స్వయంగా చేపట్టాలి. 'ముస్లిం సమాజం దుబారా మరియు ఆడంబరాలకు వీడ్కోలు చెప్పి బదులుగా విద్యా నిధి ఏర్పాటుచేసి దానికి విరాళం ఇవ్వాలి. ముస్లిములలో విద్య అభివృద్ధి కోసం స్థానిక  మసీదు కమిటీలను తాలూకా-జిల్లా-రాష్ట్ర-ప్రాంతీయ-జాతీయ స్థాయిలో సమన్వయం చేయాలి. చాలా మంది పదవీ విరమణ చేసిన వారి సేవను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

No comments:

Post a Comment