సికింద్రాబాద్‌లోని
MG రోడ్‌లో ఉన్న సేథ్ విక్కాజీ - సేథ్
పెస్టోంజీ మెహెర్జీ పార్సీ అగ్నిదేవాలయం
హైదరాబాద్:
దక్షిణ
భారతదేశంలోనే అత్యంత పురాతనమైన సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ రోడ్‌లో గల సేథ్
విక్కాజీ - సేథ్ పెస్టోంజీ మెహెర్జీ పార్సీ అగ్ని దేవాలయం 2022,జూలై నెలాఖరుతో 175 ఏళ్లు పూర్తి చేసుకోనుంది.
హైదరాబాద్‌లోని పార్సీ (జోరాస్ట్రియన్) కమ్యూనిటీ ఇక్కడ ఘనంగా వార్షికోత్సవ
కార్యక్రమం నిర్వహించనుంది.
ప్రసిద్ధ
ప్యారడైజ్ (ఇరానీ) రెస్టారెంట్‌కు సమీపంలో ఉన్న సేథ్ పెస్టోంజీ మెహెర్జీ పార్సీ
ఫైర్ టెంపుల్, 2020లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌లోని అతి చిన్న
అగ్ని ఆలయమైన ఖాన్ బహదూర్ ఎడుల్జీ సోహ్రాబ్జీ చెనై అంజుమన్ దార్-ఎ-మెహెర్ అగ్ని
ఆలయానికి సరిగ్గా ఎదురుగా ఉంది. వాస్తవానికి ఈ రెండు దేవాలయాలు MG రోడ్డులో చారిత్రకంగా ముఖ్యమైన
వారసత్వ కట్టడాల్లో ఒకటి.
MG రోడ్ లోని ఇతర చారిత్రాత్మకంగా ముఖ్యమైన నిర్మాణాలు జేమ్స్
స్ట్రీట్ పోలీస్ స్టేషన్ (1900) మరియు సేథ్ రాంగోపాల్ పూర్వీకుల
ఇల్లు.
సేథ్
పెస్టోంజీ మెహెర్జీ పార్సీ అగ్ని దేవాలయాన్ని సేథ్ విక్కాజీ మెహెర్జీ మరియు సేథ్
పెస్టోంజీ మెహెర్జీ అనే ఇద్దరు పార్సీ సోదరులు నిర్మించారు. తారాపూర్ గ్రామం
(మహారాష్ట్ర) నుండి వచ్చిన వారు నిజాంలు (1724-1948) పాలించిన పూర్వపు రాచరిక హైదరాబాద్ రాష్ట్రానికి
వచ్చారు. వారు చివరికి సికింద్రాబాద్‌లో స్థిరపడ్డారు.సికందరాబాద్ 1806లో ఈస్టిండియా కంపెనీ సేనల కోసం బ్రిటిష్ కంటోన్మెంట్‌గా
స్థాపించబడింది.
ఇద్దరు
పార్సీ సోదరులు నాటి హైదరాబాద్‌లో ప్రసిద్ధ వ్యాపారులు మరియు దాతలు అయ్యారు. ఈ
ప్రాంతంలో నివసిస్తున్న స్థానిక జొరాస్ట్రియన్ల ఉపయోగం కోసం వారు మొదట చిన్న అగ్ని
దేవాలయాన్ని (దద్గా) నిర్మించారు. ఆరు సంవత్సరాల తరువాత వారు అద్భుతమైన అజియారీ
లేదా సేథ్ విక్కాజీ - సేథ్ పెస్టోంజీ మెహెర్జీ పార్సీ ఫైర్ టెంపుల్‌ని
నిర్మించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే పురాతనమైనది మరియు హైదరాబాద్‌లోని 128 మహాత్మా గాంధీ రోడ్‌లో ఉన్నది.
అగ్నిమాపక
ఆలయానికి ఆనుకుని ఉన్న కల్నల్ హాఫ్కిన్ బంగ్లా మరియు దాని చుట్టూ ఉన్న భూమిని
మెహెర్జీ సోదరులు కొనుగోలు చేసి, సేథ్
విక్కాజీ మెహెర్జీ మరియు సేథ్ పెస్టోంజీ మెహెర్జీ అగ్నిమాపక ఆలయ నిర్వహణ కోసం దానంగా
ఇచ్చారు. అటాష్ అదరన్ (పవిత్ర అగ్ని) 1847 సెప్టెంబరు 12న వెలిగించబడినది/enthroned చేయబడింది మరియు పవిత్రం/consecrated చేయబడింది.
సికింద్రాబాద్‌లోని
MG రోడ్‌లో ఉన్న సేథ్ విక్కాజీ - సేథ్
పెస్టోంజీ మెహెర్జీ పార్సీ అగ్ని దేవాలయం
లోపల ఉంచిన
పాలరాతి ఫలకాలలో ఖాన్ బహదూర్ దస్తూర్ నోషెర్వాన్జీ జంషెడ్జీ జమాస్పాసా మరియు రాయ్
గిర్ధారి ప్రసాద్ పర్షియన్ ద్విపదలు/ couplets ఉన్నాయి. ఇది ఈ అగ్ని దేవాలయం
యొక్క రోజు మరియు తేదీని తెలియజేస్తుంది.
మెహెర్జీ సోదరులు - చిన్న
వ్యాపారుల నుండి పెద్ద బ్యాంకర్ల వరకు
Meherji brothers – From small time traders to big bankers;
హైదరాబాద్‌లోని
పార్సీ కమ్యూనిటీ లో ఈ రోజు దాదాపు 1000 మంది సభ్యులు ఉన్నారు.
మెహెర్జీ
సోదరులు ఇద్దరు సాధారణ ప్రారంభ జీవితాన్ని కలిగి ఉన్నారు. వారు చివరికి ఉత్తర మరియు దక్షిణ
కొంకణ్, పూనా, షోలాపూర్, అహ్మద్‌నగర్ మరియు ఖాందేష్
(పూర్వపు రాష్ట్రం) వంటి పెద్ద ప్రావిన్సులలో రైతులుగా మారారు. వారు ఎద్దుల బండ్ల ద్వారా
బెరార్ (మాజీ హైదరాబాద్ రాష్ట్రం, ఇప్పుడు
మహారాష్ట్రలో ఉన్న) పత్తిని బొంబాయికి దిగుమతి చేసేవారు..
మెహెర్జీ
సోదరులు ఎద్దుల బండ్ల రోడ్లను నిర్మించారు
మరియు సరుకుల వేగవంతమైన మరియు సురక్షితమైన రవాణా కోసం వంతెనలను నిర్మించారు.
పార్సీ కమ్యూనిటీ ప్రకారం, వారు నిజాం డొమినియన్ మరియు
బ్రిటిష్ వారి బొంబాయి ప్రెసిడెన్సీ మధ్య పత్తి వ్యాపారానికి మార్గదర్శకులుగా
పరిగణించబడ్డారు. 1830లో అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి
మహారాజా చందూలాల్ హైదరాబాద్ రాష్ట్రంలో బ్యాంకింగ్ సంస్థలను తెరవాలని వారిని
ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రెండేళ్లలోనే
‘పెస్టోంజీ విక్కాజీ’ సంస్థ హైదరాబాద్‌లో ప్రధాన
బ్యాంకింగ్ హౌస్‌గా మారింది. వారు సైనిక దళాలపై ఖర్చుతో సహా హైదరాబాద్ రాష్ట్ర
ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి డబ్బు ఇచ్చారు. పెస్టోంజీ విక్కాజీ సంస్థ ఇచ్చిన
అప్పు మొత్తాలను తీర్చేందుకు నిజాం రాజు బేరార్లు మరియు ఔరంగాబాద్‌ల ఆదాయాన్ని వారికి
తాకట్టు పెట్టే ఏర్పాటు చేశాడు.
వారు తమ
సేవలో ఒక చిన్న సాయుధ దళాన్ని కొనసాగించడానికి అనుమతించబడ్డారు మరియు ఔరంగాబాద్‌లోని
మింట్ కూడా వారికి అప్పగించబడింది. జాతీయ నాణేలపై వారి స్వంత అక్షరాలు మరియు
గుర్తులను ముద్రించడానికి కూడా వారు
అనుమతించబడ్డారు. ఔరంగాబాద్ టంకశాల వద్ద ఒక వెండి నాణెం వేయబడింది. ఇది విక్కాజీ తమ్ముడు పెస్టోంజీ మెహెర్జీ యొక్క ప్రారంభ
అక్షరాలను కలిగి ఉంది మరియు అతని పేరున దానిని నిజాం ప్రభుత్వం యొక్క పెస్టోన్‌షాహి సిక్కా అని
పిలుస్తారు
పెస్టోన్‌షాహి
సిక్కా అనేది ఇద్దరు పార్సీ సోదరులకు వారి స్వంత నాణేలను ముద్రించే హక్కును కలిగి
ఉండటంతో ప్రత్యేకమైనది గా భావించబడేది. .
ఇది నిజాంల పాలనలో అత్యంత విలువైన హక్కు
నాణేలలో
నిజాం యొక్క మొదటి అక్షరాలు ఉన్నాయి, అంటే నాసిర్-ఉద్-దౌలా కోసం పర్షియన్ అక్షరం నూన్ (N). తరువాత, నాణేలలో మెహర్జీ సోదరుల మొదటి
అక్షరాలు ఉన్నాయి. జాతీయ నాణేలపై దాని స్వంత మొదటి అక్షరాలు లేదా గుర్తులు
చెక్కబడి ఉండేందుకు ఏ ఇతర కుటుంబాన్ని నిజాం
అనుమతించలేదు. పెస్టోంజీ మెహెర్జీ అతను ముద్రించిన నాణేలపై ప్రసిద్ధ గుర్తు, 'ప్రకాశవంతమైన సూర్యుడు'ని ప్రవేశపెట్టాడు.
నాణెంపై ఈ
గుర్తు యొక్క స్థానం అలాగే సూర్యుని కిరణాల సంఖ్య నాణెం నుండి నాణానికి మారుతూ
ఉంటుంది.ఆరవ నిజాం మహబూబ్ అలీ పాషా (1869-1911) హయాంలో మాత్రమే మెషిన్ మింటింగ్ ప్రారంభమైంది.
1832 మరియు 1842 మధ్యకాలంలో ఔరంగాబాద్‌లోని మింట్‌లో
వెండి మరియు రాగి రెండింటిలో వివిధ విలువలతో కూడిన పెస్టోన్‌షాహి సిక్కాస్‌లో కోటికి
పైగా ప్రింట్ అయినవి.. అవి 20వ శతాబ్దం
ప్రారంభం వరకు చట్టబద్ధంగా ఉన్నాయి. కొన్ని అసలైన నాణేలు మాత్రమే ఇప్పుడు మిగిలి
ఉన్నాయి మరియు అత్యంత విలువైనవి. వాటిలో నాలుగు లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో
ప్రదర్శనకు ఉంచబడ్డాయి.
అగ్ని
దేవాలయం 175 సంవత్సరాలకు గుర్తుగా ఉత్సవాలు
సేథ్
విక్కాజీ - సేథ్ పెస్టోంజీ మెహెర్జి పార్సీ ఫైర్ టెంపుల్ దాని 175వ వార్షికోత్సవాన్ని జూలై 31న ఒక ఉత్సవం తో జరుపుకుంటుంది
ఈ ఉత్సవం కోసం హైదరాబాద్‌కు వచ్చే ప్రముఖుల జాబితాలో ముఖ్య
అతిథిగా జస్టిస్ షారుఖ్ J కథావల్లా (బాంబే హైకోర్టు రిటైర్డ్
జడ్జి), ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలి హెచ్
మేజర్ (రిటైర్డ్), మేజర్ జనరల్ సైరస్ కె పితవల్ల
(అశోక్ చక్ర), దిన్‌షా కె తంబోలీ (చైర్మన్, వరల్డ్ జొరాస్ట్రియన్ ట్రస్ట్), కెర్సీ కె దేబూ (నేషనల్ కమిషన్ ఆఫ్
మైనారిటీస్, గుజరాత్ వైస్ ఛైర్‌పర్సన్), బాచి కర్కారియా (సీనియర్ జర్నలిస్ట్
TOI), పిరూజ్ ఎ ఖంబట్టా (రస్నా ప్రైవేట్
లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్), మరియు జెరిక్ దస్తూర్ (న్యాయవాది)మొదలగు
ప్రముఖులు కలరు.
హైదరాబాద్‌లోని పార్సీలు (జోరాస్ట్రియన్లు):
హైదరాబాద్‌లో మొత్తం మూడు అగ్ని దేవాలయాలు
ఉన్నాయి. మూడవది అబిడ్స్‌లోని తిలక్ రోడ్‌లో ఉన్న బాయి మానెక్‌జీ నుస్సర్వాన్‌జీ
చెనోయ్ దార్-ఎ-మెహర్ (1904లో నిర్మించబడింది). అబిడ్స్‌లోని
అజియరీ, రవాణా సౌకర్యం లేని కారణంగా నగరం యొక్క
ఆ వైపు నివసించే పార్సీల కోసం ఇది నిర్మించబడింది.
జూలై 14, 2020 జొరాస్ట్రియన్ షహెన్‌షాయ్ క్యాలెండర్ ప్రకారం సికింద్రాబాద్‌లోని
ఖాన్ బహదూర్ ఎడుల్జీ సోహ్రాబ్జీ చెనోయ్ అంజుమన్ దార్-ఎ-మెహర్ శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకుంది. దీనిని సేథ్ జంషెడ్జీ ఎడుల్జీ
చెనోయ్ మరియు అతని సోదరులు తమ తండ్రి ఖాన్ బహదూర్ ఎడుల్జీ సోహ్రాబ్జీ చెనోయ్
జ్ఞాపకార్థం, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని చివరి
మరియు ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నిర్మించారు.
సంఖ్యాపరంగా ఈ రోజు కేవలం 1000 (430 కుటుంబాలు) మాత్రమే ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని పార్సీలు లేదా ఇరానియన్ జొరాస్ట్రియన్ కమ్యూనిటీలు
అసఫ్ జాహీ (లేదా నిజాం;
1724-1948) కాలం
నుండి నగర అభివృద్ధికి సహకరించారు. పార్సిల హైదరాబాద్ రాక 1803 (మూడో నిజాం సికిందర్ జా చక్రవర్తి
అయినప్పుడు) నాటిది.
జంట నగరాల్లోని ప్రముఖ కుటుంబాలలో
చెనోయ్ కుటుంబం ఒకటి. 1803లో, పెస్టోంజీ మానెక్‌జీ చెనోయ్ కుమారుడు
సోహ్రాబ్జీ పెస్టోంజీ చెనోయ్, మరో 14 మంది పార్సీ పెద్దమనుషులతో కలిసి జల్నా నుండి
హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. హైదరాబాద్ కంటింజెన్సీ (సైన్యం) పాత
కంటోన్మెంట్ జాల్నా నుండి సికింద్రాబాద్‌లోని బోలారమ్‌కు బదిలీ అయినప్పుడు చెనాయ్
కుటుంబం నగరానికి వచ్చింది.
పార్శి సంఘంలో అనేక ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా
ఉన్నారు. వారిలో PB చెనోయ్, నిజానికి బ్రిటిష్ ఇండియాలో (ఒస్మాన్ అలీ ఖాన్ కాలంలో) మొదటి భారతీయ
మింట్ మాస్టర్.
పార్సిలు-భారతదేశానికి వలస:
అరబ్ ఆక్రమణ కారణంగా పార్సీలు 1200 సంవత్సరాల క్రితం ఇరాన్ (పర్షియా)
నుండి భారతదేశానికి వలస వచ్చారు. వారు మొదట గుజరాత్ (సంజన్)లో స్థిరపడ్డారు మరియు
తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించారు. అబిడ్స్‌లోని బాయి మానెక్‌జీ
నుస్సర్వాన్‌జీ చెనోయ్ దార్-ఎ-మెహెర్ యొక్క ప్రధాన పూజారి ఎర్వాద్ మెహెర్నోష్
హెచ్. భరుచా ప్రకారం, జొరాస్ట్రియనిజంలో ప్రాథమిక నమ్మకం
ఏమిటంటే, ప్రతిదీ అహురా మజ్దాతో ప్రారంభమై దానితో
ముగుస్తుంది.
ఆశా చట్టం అంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన, మార్పులేని
మరియు రాజీలేని నీతి. ఇది సృష్టి యొక్క మొదటి మరియు ప్రధానమైన చట్టం. ఆశా, 'హుమత', 'హుక్త' మరియు
'హ్వర్ష్ట' అనే మూడు పదాలలో సంగ్రహించవచ్చు, అంటే
'మంచి ఆలోచనలు, మంచి మాటలు మరియు మంచి పనులు'అని అర్ధం.
అగ్ని దేవాలయం అనేది ఆరాధనా స్థలం, ఇక్కడ పార్సీలు సర్వోన్నత సృష్టికర్త
అహురా మజ్దాకు పూజలు చేస్తారు మరియు భూమిపై అహురా మజ్దా యొక్క సజీవ చిహ్నం అగ్ని.
అందుకే అగ్నిని పూజిస్తారు.
వ్యాస రచయిత:యూనస్ లసానియా Yunus Lasania
No comments:
Post a Comment