26 July 2022

అమృత్‌సర్‌లోని మరచిపోయిన హుస్సేనీ బ్రాహ్మణులు మరియు ముహర్రం యొక్క చరిత్ర The Forgotten History of Hussaini Brahmins and Muharram in Amritsar

 

సెప్టెంబర్ 10, 2019న అమృత్‌సర్‌లోని మాతం . ఫోటో: నోనికా దత్తా

రచయిత: నోనికా దత్తా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చరిత్ర బోధిస్తున్నారు.

మూలం: http://www.thewire.in/ నోనికా దత్తా, సెప్టెంబర్ 30, 2019.

అమృత్‌సర్:

భారత ఉపఖండంలో అనేక సాంస్కృతిక పద్ధతులు మరియు ప్రదేశాలు మరగునపడ్డాయి. కొన్ని కథలు జ్ఞాపకం మరియు చరిత్ర క్రమంగా తొలగించబడుతున్నాయి.

పాత కాలం లో మొహర్రం మాసంలో, ఆషూరా రోజున, హుస్సేనీ బ్రాహ్మణులు (వారిని - దత్/దత్/దత్త బ్రాహ్మణులు అని కూడా పిలుస్తారు) - అమృత్‌సర్ నగరంలో తాజియా ఊరేగింపును నిర్వహిoచేవారు.  అమృతసర్  లో దేశ విభజనకు ముందు రోజులలో, హుస్సేనీ బ్రాహ్మణుల ప్రమేయం మరియు భాగస్వామ్యం లేకుండా తాజియా జూలూస్, ప్రారంభం కాదు.

1947కి ముందు, హుస్సేనీ బ్రాహ్మణుడు మరియు సుప్రసిద్ధ ఉర్దూ-పర్షియన్ కవి అయిన పద్మశ్రీ బ్రహ్మనాథ్ దత్తా 'ఖాసీర్' అమృత్‌సర్‌లోని కత్రా షేర్ సింగ్‌లోని ఫరీద్ చౌక్‌లో తాజియా ఊరేగింపును ప్రారంభించేవారు. ఈ ప్రాంతంలో ఒక ప్రముఖ షియా మసీదు ఉంది, ఇక్కడ నుండి తాజియాలు బయలు దేరతాయి  మరియు చారిత్రాత్మక ఫరీద్ చౌక్‌కు తీసుకురాబడతాయి.

పెద్ద ఊరేగింపు అప్పుడు కుచ్చేరి Kutchery సమీపంలోని ఇమాంబర మరియు కర్బలా మైదాన్ వైపు కదులుతుంది, ఇది అనేక ఇమాంబరాల నుండి వచ్చే ఊరేగింపులకు ఒక సమావేశ స్థానం. తాజియాల చివరి కలయిక చాలా ముఖ్యమైనది. ఇమామ్ హుస్సేన్ యొక్క జుల్జానా Zuljanah ఖననం చేయబడిందని చెప్పబడే ఘోడా పిర్ అని పిలువబడే కీలకమైన ప్రదేశానికి ఇది దగ్గరగా ఉందని నమ్ముతారు.

హుస్సేనీ బ్రాహ్మణులు: రెండు సంస్కృతుల మేళవింపు:

విభజనకు ముందు అమృత్‌సర్‌లో, హుస్సేనీ దత్ బ్రాహ్మణులు తాజియాలను నగరం గుండా ముందుకు తీసుకెళ్లడానికి తమ భుజం అందించిన తర్వాత మాత్రమే తజియా ఊరేగింపు ప్రారంభమవుతుంది. అక్కడి ప్రజలు దత్ సాహిబ్, మేమంతా ఎదురుచూస్తున్నాము. ఆప్ కంధా దోగే తబ్ తజియా ఉతేంగీ.అని అనేవారు.

చారిత్రాత్మకంగా "సగం హిందూ" మరియు "సగం ముస్లిం"గా పరిగణించబడే హుస్సేనీ బ్రాహ్మణులు సాంప్రదాయకంగా రెండు సంస్కృతులను మేళవించారు. వారిని తరచుగా షియా బ్రాహ్మణులు లేదా హుస్సేనీ బ్రాహ్మణులుగా సూచిస్తారు, "వా దత్ సుల్తాన్, హిందూ కా ధర్మం, ముస్సల్మాన్ కా ఇమాన్' వంటి పదబంధాలు; మరియు దత్ సుల్తాన్ నా హిందూ నా ముస్సల్మాన్అనేవి ఆనాటి జానపద కథలలో భాగమైనవి.

మహ్మద్ ముజీబ్, అనే ప్రముఖ చరిత్రకారుడు కథనం ప్రకారం "వారు [హుస్సేనీ బ్రాహ్మణులు] నిజంగా ఇస్లాంలోకి మారలేదు, కానీ హిందూ విశ్వాసానికి విరుద్ధంగా భావించని ఇస్లామిక్ విశ్వాసాలు మరియు అభ్యాసాలను స్వీకరించారు." దత్ బ్రాహ్మణ యువకుల “ముందన్ల mundans లో ఇమామ్ హుస్సేన్ పేరు పఠించబడేదని మరియు వివాహాలలో బడే (ఇమామ్ హుస్సేన్) పేరుతో హల్వా వండేవారని  కుటుంబ కథనాలు వెల్లడిస్తున్నాయి. 1947లో విభజన జరిగే వరకు, దత్తులను సాధారణంగా భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాల్లో సుల్తానులుగా పిలిచేవారు.

అమృతసర్ లో అషురా, సెప్టెంబర్ 10, 2019.  

హుస్సేనీ బ్రాహ్మణుల వంశ వృక్షం ఇరాక్‌లోని కుఫాలో చారిత్రాత్మకమైన కర్బలా యుద్ధం (క్రీ.శ. 680) సమయంలో మరియు తర్వాత బాలాఖ్, బోఖారా, సింధ్, కాందహార్, కాబూల్ మరియు పంజాబ్‌లో వారి నివాసాలను కవర్ చేస్తుంది. 17వ మరియు 18వ శతాబ్దాలలో వారు ఎక్కువగా గుజరాత్, సింధ్, పంజాబ్ మరియు వాయువ్య సరిహద్దులలో నివసించారు.

చాలా మంది హుస్సేనీ దత్ బ్రాహ్మణులు అమృత్‌సర్ నగరంలో తమ ప్రభావాన్ని విస్తరించారు. ఉదాహరణకు, మహారాజా రంజిత్ సింగ్ అమృతసర్ ప్రవేశానికి ముందు, ప్రముఖ దత్ భార్య “మై కర్మోన్ దత్తాని Mai Karmon Dattani” అమృత్‌సర్‌లోని కత్రా ఘనాయన్‌కు పాలకురాలుగా నియమించబడ్డారని చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి. “మై కర్మోన్ దత్తాని” అద్యక్షత వహించిన న్యాయస్థానo “మై కర్మున్ కి డియోహ్రీ” అని పిలువబడింది, తర్వాత అది అమృతసర్ నగరంలోని ప్రముఖ బజార్ (కర్మోన్ డియోరి అని పిలుస్తారు)గా మారింది. “మై కర్మోన్ దత్తాని” అమృత్‌సర్‌లో "జోన్ ఆఫ్ ఆర్క్"గా గుర్తుండిపోతుంది.

బ్రిటీష్ ఎంటమాలజిస్ట్ డెంజిల్ ఇబ్బెట్‌సన్ అభిప్రాయం లో దత్తుల పూర్వీకులు ఒకప్పుడు అరేబియాలో ఉండేవారని తెలుస్తుంది. వారు హజ్రత్ అలీ వారసులు మరియు అమీర్ ముయావియా కుమారుడు యాజిద్ సుల్తాన్ అనుచరుల మధ్య జరిగిన కర్బలా యుద్ధంలో పాల్గొన్నారు. వారు ప్రవక్త(స) యొక్క అమరవీరులైన మనవళ్లు,హసన్ మరియు హుస్సేన్‌ల స్నేహితులు. రాకుమారులు హసన్ మరియు హుస్సేన్‌లు యుద్దంలో అమరగతిని పొందినప్పుడు  దత్స్ యోధుడు రాహిబ్ మరియు అతని కొందరు అనుచరులు పర్షియా మరియు కాందహార్ ద్వారా భారతదేశానికి వచ్చారు. 

ప్రాచిన గాధల ప్రకారం అరేబియా నుండి తిరిగి వచ్చినప్పుడు, రహీబ్ దత్ తనతో పాటు కాశ్మీర్‌లోని హజ్రత్‌బాల్ మందిరంలో ఉంచబడిన ప్రవక్త(స) వెంట్రుకలను తీసుకువచ్చాడు 

1940ల చివర్లో అమృతసర్ లో ముహర్రం అనేది  ఇమామ్ హుస్సేన్ కోసం రహీబ్ దత్ కుమారులు చేసిన  త్యాగాన్ని స్మరించుకునే క్షణం. విభజన తరువాత హుస్సేనీ బ్రాహ్మణులు  పంజాబ్ యొక్క రెండు వైపులా ఉండిపోయారు.

పాకిస్తాన్ పంజాబ్‌లో, వారు ముస్లిమేతరులుగా చూడబడ్డారు, భారతీయ పంజాబ్‌లో వారు ముస్లింలకు సన్నిహితులుగా భావించబడ్డారు.

1947లో అమృత్‌సర్‌లో ముహర్రం ఊరేగింపు లేదు. కనీసం ఫరీద్ చౌక్‌లో కూడా జరగలేదు. సరిహద్దు నగరంగా అమృత్‌సర్ మారినప్పుడు  హుస్సేనీ దత్ బ్రాహ్మణులు పిడితులుగా మారారు. ఇమామ్ హుస్సేన్, కర్బలా మరియు ముహర్రమ్‌లతో దత్‌ల శాశ్వత సంబంధం ముప్పులో పడింది. కానీ అంతా కోల్పోలేదు. వారిలో కొందరు తమ హుస్సేనీ బ్రాహ్మణ వారసత్వాన్ని బహిరంగంగా చాటారు.

చాలా కాలం క్రితం, భారతీయ నటుడు సునీల్ దత్, లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ హాస్పిటల్‌కి  విరాళం ఇస్తున్నప్పుడు, కర్బలా పట్ల తన నిబద్ధతను రికార్డ్ చేసి ఇలా అన్నాడు:

"లాహోర్ కోసం, నా పెద్దల మాదిరిగానే, నా పూర్వీకులు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కోసం కర్బలాలో తమ ప్రాణాలను అర్పించినప్పుడు చేసినట్లే, నేను ప్రతి రక్తపు బొట్టును చిందిస్తాను మరియు ఏదైనా విరాళం ఇస్తాను."

సునీల్ దత్ అమృత్‌సర్ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంతో సన్నిహితంగా ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అమృత్‌సర్‌లో అషురా:

ఈ వ్యాస రచయిత  నోనికా దత్తా సెప్టెంబరు 10, 2019న అషూరా తెల్లవారుజామున అమృత్‌సర్‌కి చేరుకున్నారు. కత్రా షేర్ సింగ్‌లోని ఫరీద్ చౌక్‌లోని ఇమాంబరాన్ని సందర్శించడం మరియు హుస్సేనీ బ్రాహ్మణులు మరియు అమృత్‌సర్ మధ్య సంభందాలను కలిపే కొన్ని కీలకమైన ప్రదేశాలను కనుగొనే  ప్రయత్నం చేయడం ఉద్దేశం. ఇది గడ్డివాములో సూది కోసం వెతకడం లాంటిది.

అయినప్పటికీ, నగరం యొక్క బహుళ సంస్కృతి గురించి తెలిసిన స్థానికుల సహాయం తో రచయిత ఫరీద్ చౌక్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరంలోని లోహ్‌ఘర్‌లోని ఇమాంబర, అంజుమాన్-ఎ-యాద్గార్ హుస్సేన్ వద్దకు వెళ్ళారు. ప్రస్తుతం దీనిని కాశ్మీరీ ఇమాంబరా అని పిలుస్తారు, ఇది గాలి జైనాబ్ (ఇమామ్ హుస్సేన్ సోదరి పేరు పెట్టబడింది) గా  పిలవబడేది కాని ప్రస్తుతం దీని పేరు గాలి బద్రన్‌గా పేరు మార్చబడింది.

రజా మసీదు ఆవరణలో అబ్బుజీ అని పిలవబడే ఇమాంబరా యొక్క సంరక్షకుడు సయ్యద్ అబ్దుల్లా రిజ్వీ రచయితను   సాదరంగా స్వాగతించారు. ఈ కట్టడం దాదాపు 110 సంవత్సరాల నాటిదని, దీనిని సయ్యద్ నాథూ షా నిర్మించారని, 1947కి ముందు అమృత్‌సర్‌లోని స్థానిక షియా మరియు హుస్సేనీ బ్రాహ్మణ కుటుంబాలు దీనిని నిర్వహించేవని ఆయన చెప్పారు.

మస్జిద్ మజ్లిస్‌లో హుస్సేనీ బ్రాహ్మణుడిగా నన్ను అబ్బుజీ పరిచయం చేసారు. నా గొంతుపై కోత గుర్తు ఉందా అని అతను ఆరా తీశాడు (జానపద కథలలో, హుస్సేనీ బ్రాహ్మణులు ఇమామ్ హుస్సేన్ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసినందుకు చిహ్నంగా వారి గొంతుపై మందమైన గీతను కలిగి ఉంటారు). దత్ బ్రాహ్మణుల కథ మసీదు అసెంబ్లీ (మజ్లిస్)లో వినిపించబడినది. 

"రాహిబ్ తల్లి, ఇమామ్ హుస్సేన్ కోసం తన ఏడుగురు కుమారులను త్యాగం చేయమని సూచించింది. రహీబ్ తల్లి ఇమామ్ హుస్సేన్ చేత తన ఏడుగురు మగ పిల్లలకు  ఆశీర్వదం పొందినది.. మౌలా హుస్సేన్‌కు  కృతజ్ఞతగా, తన సొంత కుమారులను బలి ఇవ్వాలని ఆమె రహీబ్‌ను వేడుకుంది. అతను అలా చేసాడు. 

కొంతమంది స్థానికుల కధనం ప్రకారం  దురదృష్టవశాత్తూ, చాలామంది హుస్సేనీ బ్రాహ్మణులు ఢిల్లీ మరియు బొంబాయికి వలస వెళ్లిపోయారు. అబ్బుజీ ఇలా అన్నాడు, “ఇమామ్ హుస్సేన్ అంటే హక్ (హక్కులు) మరియు అమన్ (శాంతి). మేము ఈ సందేశాన్ని అమృత్‌సర్‌కు తెలియజేయాలనుకుంటున్నాము.

సెప్టెంబర్ 10, 2019న ఇమాంబర అమృత్‌సర్‌లో నాలుగు గోడల మధ్య ముహర్రం. ఫోటో: నోనికా దత్తా 

జూలూస్-ఎ-అషురా కోల్పోయిన కథనం

అబ్ కోయి జులూస్ నహీ నికల్తా. జూలూస్-ఎ-అషురా ఇమాంబరే కే అందర్ హీ హోతా హై. ముహర్రం యాహిం ఇమాంబర కీ చార్దివారి మే హోతా హై (ఇప్పుడు ఊరేగింపు లేదు. ముహర్రం ఇమాంబర నాలుగు గోడలకే పరిమితమైంది)అని అబ్బుజీ చెప్పాడు.

ఫరీద్ చౌక్‌లోని షియా మసీదును 1948-49లో నేలమట్టం చేశారు. దాదాపు వందకు పైగా ఉన్న ఇమాంబరాలను స్వాధీనం చేసుకున్నారు (కబ్జా) లేదా కూల్చివేశారు.

అబ్బుజీ ఇలా అంటున్నారు:

"ప్రభుత్వం కర్బలా మైదాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మొహర్రం ఊరేగింపు కోసం ఇటీవలి వరకు అత్యంత ప్రముఖమైన మార్గం ప్రసిద్ధ సిక్రీ బండా బజార్ నుండి ప్రస్తుత ఇమాంబరా వరకు; తజియా మరియు ఆలం చాలా మక్కువతో అక్కడికి తీసుకువస్తారు. ఇప్పుడు ఊరేగింపు లేదు: అబ్ హామ్ దర్వాజే దివార్ బంద్ కర్కే మాతం కర్తే హైం (ఇప్పుడు మేము తలుపులు మరియు గోడలను మూసివేసి సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తాము)."

హుస్సేనీ బ్రాహ్మణులు మరియు షియాల వలసతో “మాతం” పంజాబీ పరిమళాన్ని కోల్పోయిందని ఒక పంజాబీ ముస్లిం సంతాపకుడు ఫర్హత్ అన్నారు.

ఇమామ్ హుస్సేన్ యొక్క పవిత్ర పరిసరాలు మరియు ఘోడా పిర్, హుస్సేన్‌పురా, గాలీ జైనాబ్ మరియు యాద్‌గార్-ఎ-హుసేన్ ఇమాంబరా వంటి షియా విశ్వాసాలతో ముహర్రం అనుబంధించబడిన నగరం అమృతసర్ ఇప్పుడు వాటిని కోల్పోయింది.

ముహర్రం యొక్క ఉత్సవం మరియు తాజియాలను మోసుకెళ్ళడం ఒక చిన్న ఇమాంబరా యొక్క నాలుగు గోడలకు పరిమితం కావడం చూసి నేను(రచయిత) ఆశ్చర్యపోయాను. బహుశా, అమృతసర్ లో  హుస్సేనీ బ్రాహ్మణులు ఉండి ఉంటే, ఇది జరిగేది కాదు!

అమృత్‌సర్‌లోని హుస్సేనీ దత్ బ్రాహ్మణ పూర్వీకులు తమ ఏడుగురు కుమారులను ఇమామ్ హుస్సేన్ కోసం త్యాగం చేశారని విశ్వసించే సంఘం, ప్రపంచ పౌరులుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వచ్చింది. చాలా మంది తమ హుస్సేనీ బ్రాహ్మణ గుర్తింపును విస్మరించి, తమను తాము "బ్రాహ్మణులు"గా భావించడం ప్రారంభించారు.

 


No comments:

Post a Comment