అరబ్బులు ముస్లింలుగా మారిన తొలి సంవత్సరాలలోనే ఇస్లాం
తమిళనాడుకు వచ్చింది. తమిళ నిర్మాణ లక్షణాలతో 7వ శతాబ్దంలో
నిర్మించిన “కీలకరై” జుమ్మా మసీదు తమిళనాడులోని అతి పురాతన మసీదులలో ఒకటి.
తిరుచ్చిలోని కొట్టాయ్ (కోట) రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న మసీదు కూడా క్రీ.శ.743 లోనే నిర్మించబడినది.
తిరుచిరాపల్లిలోని A.H. 116/134 క్రీ.శ. నాటి అరబిక్ శాసనం మరియు పాండ్య పాలకులు మసీదులకు ఇచ్చిన దానాల గురించిన
కాయల్‌పట్టణంలోని తొమ్మిదవ శతాబ్దపు శాసనాలు మొదలగునవి ఎనిమిదవ శతాబ్దం నుండి తమిళనాడులో ముస్లింల
ఉనికికి సంబంధించిన నిశ్చయాత్మక ఆధారాలు అని చెప్పవచ్చును..
తొలి ముస్లింలు తమిళనాడు తీరప్రాంత పట్టణాల్లో వ్యాపార శ్రేణులుగా ఏర్పడి పనిచేసేవారు..
వాటిని ‘అంజువన్నం’ అంటే సభ అని పిలిచేవారు. ముస్లింల వ్యాపార సంఘాలకు గుర్తుగా 'అంజువన్నం' అనే పేరు కొన్ని
రాగి పలకలు మరియు క్రీ.శ. 12-13 శతాబ్దాల నాటి శాసనాలలో
కనిపిస్తుంది. తిరునెల్వేలి జిల్లా, తెన్‌కాసిలో ఉన్న ఒక
పాత మసీదు 'అంజువన్నం పల్లివాసల్' అని పిలువబడుతుంది, ఇది 'అంజువన్నం' అనే పేరు ముస్లింలకు
ఆపాదించబడిందని నిరూపిస్తుంది.
తమిళనాడులోని ముస్లింల వర్గాలు:
తమిళనాడు ముస్లింలు స్థూలంగా మూడు
వర్గాలు. మొదటివారు అరబ్-తమిళ సంతతికి చెందిన ముస్లింలు, రెండవవారు ఇస్లామిక్ విశ్వాసంలోకి మారిన స్థానికులు మరియు మూడవవారు భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి తమిళనాడుకు వలస
వచ్చిన దకానీ Dakani ముస్లింలు.
1.అరబ్ పూర్వీకుల
ముస్లింలు Muslims of Arab Ancestry:
అరబ్-తమిళ పూర్వీకుల ముస్లింలు తమిళనాడులోని ముస్లింలలో ఒక ప్రత్యేక
వర్గాన్ని ఏర్పరుచుకున్న తమిళం మాట్లాడే
ప్రజలు. వారిలో ప్రముఖ సమూహాలు మరక్కాయర్లు, లబ్బాయిలు, రౌథర్లు, సోనక మాపిల్లలు, కాయలర్లు మరియు
తులుక్కర్లు Marakkayars, Labbais, Rowthers, Sonaka Mapillas, Kayalars, and Thulukkar.
1.మరక్కాయర్లు Marakkayars - మరక్కాయర్లు అరబ్ సంతతికి చెందిన
పడవ ప్రజలు. మరక్కాయర్లు 7వ శతాబ్దపు సముద్ర వర్తక సంఘం కు
చెందినవారు.. మరక్కాయర్లు ముత్యాలు, కెంపులు మరియు ఇతర
విలువైన రాళ్లతో వ్యాపారం చేసేవారు. మెజారిటీ మరకాయర్లు ప్రస్తుతం కీలకరై, కాయల్‌పట్నం మరియు
నాగూర్ వంటి తీర ప్రాంతాలలో నివసిస్తున్నారు. మరక్కాయర్లు ఇతర ముస్లిం వర్గాల కంటే
ఉన్నతమైన సామాజిక మరియు ఆర్థిక స్థితిలో ఉన్నారు. మరక్కాయర్లు కీలా, శ్రీలంక లేదా
ఆగ్నేయాసియా దేశాల్లోని వారి కమ్యూనిటీలో వివాహం చేసుకుంటారు. భారతదేశ 11వ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం
మరక్కాయర్ కుటుంబంలో జన్మించారు. క్రెసెంట్ కళాశాల మరియు ప్రస్తుత B. S. అబ్దుర్ రెహ్మాన్
విశ్వవిద్యాలయం స్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త అయిన B. S. అబ్దుర్ రెహ్మాన్, కూడా మరక్కాయర్
కమ్యూనిటీకి చెందినవారు.
2.లబ్బాయిలు Labbais - లబ్బాయిలు కూడా
అరబ్ వ్యాపారుల వారసులు. అరబ్ వ్యాపారులు తమతో పాటు కొంతమంది అరబ్బులను సహాయకులుగా
తీసుకువచ్చారు. అరబ్బు సహాయకులు తమ యజమానుల పిలుపులకు 'లబ్బైక్' అంటే "ఇక్కడ
ఉన్నాను" అనే పదంతో ప్రతిస్పందించేవారు. అందువల్ల ఈ ముస్లింలు మరియు వారి
సంతానం 'లబ్బాయిలు' అని పిలువబడింది. భారతీయ భార్యల ద్వారా అరబ్బు'లబ్బాయిలు’ కు
పుట్టిన పిల్లలను కూడా 'లబ్బాయిస్' అని పిలుస్తారు. లబ్బాయి అనే పదం ఇస్లాంలోకి మారిన హిందువులకు కూడా
వర్తిస్తుంది. 1881 జనాభా లెక్కల నివేదిక, “లబ్బాయిలు” మరక్కాయర్ల నుండి భిన్నంగా
ఉంటారు. వీరిని కోరమాండల్ మోప్లాస్ అని పిలుస్తారు. వీరు అరబ్ రక్తం మరియు
స్థానికంగా మారిన వారి స్వల్ప సమ్మేళనంతో ఉంటారు. లబ్బాయిలు పొదుపు, కృషి మరియు ఔత్సాహిక, ధనవంతులైన నావికులు
మరియు నిపుణులైన వ్యాపారులు. ప్రస్తుతం, తమిళనాడులో 'లబ్బాయిస్’
ముస్లిములకు విద్యా మరియు ఉద్యోగ రాయితీల
ప్రయోజనం కలదు
3.మాపిల్లలు-మలబార్‌లోని మలయాళం మాట్లాడే ప్రజలను తమిళనాడులో సోనక
మాపిల్లలు అని పిలుస్తారు. సోనక అనే పదం తమిళ ముస్లింల ప్రారంభ పేరు కూడా. ఈ పదం
ఇండో-అరబ్ సంతతికి చెందిన ముస్లింలను గుర్తించడానికి ఉపయోగించబడింది మరియు వారి పూర్వీకుల
అరబ్ భాగం యెమెన్. క్రీ.శ. 2వ శతాబ్దపు 'సంగం' సాహిత్యంలో పేర్కొన్న
సోనక పదం "యవన"గా రూపాంతరం చెందినది.
4.రౌథర్‌లు Rowthers- రౌథర్‌లు తమిళ - అరబ్ సంతతికి చెందిన మరొక సమూహం. వీరి మాతృభాష తమిళం. వారు ప్రధానంగా గుర్రపు
వ్యాపారంతో అనుసంధానించబడ్డారు లేదా గతంలో గుర్రపు శిక్షకులు లేదా అశ్వికదళ
సిబ్బంది. వీరిని "గుత్తిరై చెట్టిగల్" అంటే గుర్రపు వ్యాపారులు అని
కూడా పిలుస్తారు. రౌథర్‌లు తమిళనాడులో ప్రముఖమైన మరియు సంపన్నమైన ముస్లిం సమాజం. వారు
తంజావూరు, తిరువారూర్ మరియు నాగపట్నం జిల్లాలలో స్థిరపడ్డారు.
5.కాయలర్లు Kayalars - కయలర్లు అరబ్
సంతతికి చెందిన తమిళ ముస్లింలలో మరొక ప్రధాన సమూహం. వారు తమిళ ముస్లిం కమ్యూనిటీ
యొక్క అరబ్ వంశానికి చెందిన నాలుగు ప్రధాన ఉప సమూహాలను కలిగి ఉన్నారు.
6.తులుక్కర్ Thulukkar - తులుక్కర్ అని
పిలువబడే మరొక ముస్లిం సమూహం ఉంది. వీరు టర్కిష్ మూలానికి చెందిన ప్రజలు. తమిళ
సాహిత్యంలోని అనేక రచనలు ముస్లింలను తులుక్కర్ అని సూచిస్తాయి. ఈ పదాన్ని
సాధారణంగా ముస్లిమేతరులు తమిళనాడులోని ముస్లింలందరినీ సంబోధించడానికి ఉపయోగిస్తారు.
ఈ ముస్లిం సమూహాలన్నీ స్థానికులతో వివాహ సంబంధాల ద్వారా తమిళ సంస్కృతి
మరియు సమాజంతో ముడిపడి ఉన్నాయి మరియు ఈ సమూహాలలో ఎక్కువ మంది వ్యాపార వృత్తులను
కలిగి ప్రస్తుతం వ్యాపార వ్యక్తులుగా ఉన్నారు.
2.తమిళనాడులోని పస్మాంద ముస్లింలు:
ముస్లింలలో రెండవ వర్గo హిందూ OBC మరియు దళిత వర్గాల
నుండి మారినవారు. అరబ్ దేశాల నుండి వచ్చిన సూఫీ సాధువుల శాంతియుత బోధనల ద్వారా
శతాబ్దాలుగా ఈ మార్పిడులు జరిగాయి. ఇస్లామిక్ బోధకులు కులవృత్తితో
కొట్టుమిట్టాడుతున్న హిందూ సమాజంలోని అణగారిన వర్గాల వద్దకు వెళ్లి వారిని కుల
బానిసత్వం నుండి విముక్తి చేయడానికి వారిని ఇస్లాంలోకి మార్చారు. స్థానికంగా
మారినవారు సామాజిక నిర్మాణంలో అట్టడుగున ఉన్నారు. ఇస్లాంలోకి మారిన తర్వాత వారి
సామాజిక స్థితి మెరుగుపడినప్పటికీ, వారు ఆర్థికంగా
వెనుకబడి ఉన్నారు మరియు తమిళనాడులోని పస్మంద ముస్లిం సమాజం కిందకు వస్తారు. వారు
తమిళ ముస్లిం సమాజంలో ఒక ప్రత్యేక సమూహం మరియు వీరు ఆర్థిక ఉన్నతి పొందేందుకు సామాజిక
జోక్యం అవసరం. ఈ మతం మారిన ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ సమస్యను
ఎదుర్కొంటున్నారు. హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారిని 'వెనుకబడిన తరగతులు'గా పరిగణిస్తారు, కాని హిందూ మతం నుండి ముస్లింలుగా మారిన వారికి అలాంటి నిబంధనలు
లేవు.
3.తమిళనాడు దకిని ముస్లింలు Dakini Muslims of
Tamil Nadu:
తమిళనాడులోని ముస్లింలలో మూడవ వర్గం దకిని ముస్లిం సమాజం. ముస్లిం సమాజంలో
ఈ సమూహం కేవలం చిన్న మైనారిటీ అయినప్పటికీ దకిని ముస్లింలు ఒక ప్రత్యేక సంఘం.
తమిళనాడులోని ముస్లిం సమాజంలో వారు రాజకీయ ఉన్నత వర్గాన్ని ఏర్పరుచుకోవడం వల్ల
వారి ప్రాముఖ్యత ఏర్పడింది. దకిని ముస్లింలు తమిళం/హిందీ/ఉర్దూ మరియు ఇతర ప్రాంతీయ
భాషలు మాట్లాడగలరు. ఈ వర్గాల్లో అనేక సమూహాలు ఉన్నాయి, అవి సయ్యద్‌లు, షేక్‌లు, పఠాన్‌లు, మొఘలులు లేదా నవయాత్‌లు
(కొంకణి ముస్లింల ఉప సమూహం). దకానీ ముస్లింలలో ప్రముఖమైన సమూహాలలో ఒకటి 'పఠాన్‌లు' పష్టూన్ పూర్వీకుల
ముస్లింలు. "పఠాన్" అనే పదం కొన్నిసార్లు ఉత్తర భారతదేశం నుండి ఉర్దూ
మాట్లాడే ముస్లిం వలసదారులందరికీ వర్తిస్తుంది. వారు ఆర్ని, చాంజి మరియు జింజి
వంటి కోట కేంద్రాలలో మరియు ఆర్కాట్‌లో స్థిరపడ్డారు. ట్రిచీ మరియు మదురై వంటి
చిన్న కోట-మార్ట్ పట్టణాలు కూడా పఠాన్ స్థావరాలను కలిగి ఉన్నాయి. ఇది భారతీయ సాయుధ
దళాలలో తమిళ ముస్లింల పరివాహక ప్రాంతం catchment area.
తమిళనాడు ముస్లిం నేత కార్మికులు Muslim Weavers of
Tamil Nadu:
తమిళనాడులోని ముస్లిం నేత కార్మికులకు సంబంధించిన తొలి ఎపిగ్రాఫిక్
సాక్ష్యం 16వ శతాబ్దానికి చెందినది. ఇది ఈ దక్షిణ
రాష్ట్ర నేత పరిశ్రమలో ముస్లింల చురుకైన పాత్రను సూచిస్తుంది. 'పంచు కొట్టి' మరియు 'అచ్చు కట్టి' తమిళనాడులోని అతి
ముఖ్యమైన ముస్లిం నేత సంఘాలు. ఆధునిక త్రిచిరాపల్లి మరియు తంజావూరు జిల్లాల్లో
పంచు కొట్టి జనాభా ఎక్కువగా ఉంది. సేలం, నమక్కల్, తిరుచ్చి మరియు
తంజావూరు జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాలలో అచ్చు కట్టి జనసాంద్రత ఎక్కువగా ఉంది. ఈ
ప్రాంతాలు తమిళనాడు యొక్క వస్త్ర కేంద్రాలు మరియు తమిళ ముస్లింలు వస్త్ర
వ్యాపారంపై గణనీయమైన పట్టును కలిగి ఉన్నారు.
తమిళ ముస్లింలు సజాతీయ సమాజం కాదు:
తమిళ ముస్లింలు సజాతీయ సమాజం కాదు. ముస్లింలలోని ఈ మూడు విస్తృత వర్గాలు
సమూహాలు మరియు ఉప సమూహాల తో కూడి ఉన్నవి. బ్రిటీష్ పాలనలో, అధికారిక గెజిట్‌లలో
కొన్ని తమిళ ముస్లిం సమూహాలను సామాజిక తరగతులుగా పేర్కొనడం ప్రారంభించారు. తమిళ
ముస్లింలు వివిధ విభాగాలుగా విభజించబడ్డారు మరియు వారిలో వర్గ సోపానక్రమం ఉనికిలో ఉంది, ఇది కొంత కాలానికి
కుల-ఆధారిత క్రమానుగత విభజనగా మారింది. ప్రతి సమూహానికి వృత్తిపరమైన గుర్తింపు
ఉన్నప్పటికీ ఈ వృత్తిపరమైన సమూహాలు కులాల రూపంలోకి మారాయి మరియు ఒక కులం నుండి మరొక
కులం లోకి మారటం జరగదు..
అరబ్ పూర్వీకుల తమిళ ముస్లింల పెరుగుదలRise of Tamil Muslims of Arab
Ancestry
2వ శతాబ్దపు AD నాటి తమిళ సంగం సాహిత్యంలో తమిళం మాట్లాడే అరబ్-తమిళ పూర్వీకుల ముస్లింల
గురించి ప్రస్తావించబడింది. సంగం సాహిత్యంలో "యవన" అనే పదం గ్రీకులకు
ఉపయోగించబడలేదు కానీ యెమెన్ నుండి వచ్చిన ముస్లింల కోసం ఉపయోగించబడింది.
అరబ్-తమిళ వంశానికి చెందిన తమిళం మాట్లాడే ముస్లింలు 15వ శతాబ్దం వరకు
కోరమాండల్ తీరప్రాంతంలో సముద్ర వాణిజ్యంపై ఆధిపత్యం చెలాయించారు. వారు దాదాపు 15 వందల సంవత్సరాల
పాటు హిందూ మహాసముద్ర ప్రాంతానికి ప్రభువు మరియు యజమానులు.
చేర, చోళ మరియు పాండ్య పాలకులు వీరిని ఆదరించారు మరియు వారి ప్రార్థనా స్థలాల
కోసం భూములను దానం చేశారు. తమిళనాడు మరియు కేరళలోని స్థానిక హిందూ పాలకులు
అరబ్-ముస్లిం వ్యాపారులను తమ భూముల్లో స్థిరపడేలా ప్రోత్సహించారు. జామోరిన్ లేదా
కేరళలోని కోజికోడ్ (కాలికట్) రాజ్యం యొక్క వంశపారంపర్య చక్రవర్తి తమ నౌకలను
నిర్వహించడానికి తగినంత సంఖ్యలో అరబ్ ముస్లింలను పొందాలని ఒక శాసనాన్ని జారీ
చేశారు. అరబ్ వ్యాపారులు స్థానిక స్త్రీని వివాహం చేసుకోవచ్చని మరియు ఒకరి లేదా
అంతకంటే ఎక్కువ మంది మగ పిల్లలను ముస్లింలుగా పెంచవచ్చని ఒక ఉత్తర్వు జారీ చేశాడు.
అరబ్-తమిళం మాట్లాడే ముస్లిం వ్యాపారులు భారతదేశ అభివృద్దికి చాలా
తోడ్పడ్డారు. 14వ శతాబ్దపు అరబ్ రచయిత, ఇబ్న్ ఫద్బుల్లా ఉల్-ఒమారీ, భారతదేశ సముద్రాలు
ముత్యాలు మరియు చెట్లు పరిమళ ద్రవ్యాలు కలిగిన దేశం అని రాశారు! ఆంగ్ల రికార్డులు తమిళనాడు తీరంలో
ఉన్న ఓడరేవులను "మూర్ పోర్ట్స్" అని వర్ణించాయి, కడలూర్‌ను 'ఇస్లామాబాద్' అని మరియు పోర్టో
నోవో లేదా పరంగిపేటై Parangipettai ని "మహమ్మద్ బందర్" అని
పేర్కొన్నారు.
విదేశాల్లోని వేలాది రికార్డులు అరబ్-తమిళ ముస్లింల సముద్ర కార్యకలాపాల
గురించి తెలుపుతున్నాయి, అరబ్-తమిళ ముస్లింలు
నౌకానిర్మాణదారులు, నావికులు, నావికులు, వ్యాపారులు, ముత్యాల డైవర్లు, ముత్యాల వ్యాపారులు మరియు ఉప్పు తయారీదారులుగా చిత్రీకరించబడ్డారు.
తమిళనాడు తూర్పు తీరం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ అరబ్ తమిళ ముస్లింల చేతుల్లో
ఉంది మరియు ఈ ప్రజలే తమిళనాడు నుండి ఆగ్నేయాసియా దేశాలకు ఇస్లాం మరియు తమిళ భాషను
తీసుకెళ్లారు.
తమిళం - అరబిక్ లింక్ భాష- లిసాన్ అల్-అర్వి
అరబ్బులకు తమిళంతో సంభాషించడంలో సమస్య ఉంది. కాబట్టి తమిళనాడులో 'అరబు తమిళ' (లేదా లిసాన్ అల్-అర్వి) అనే లింక్ భాష అభివృద్ధి చేయబడింది. ఇది తమిళం స్వీకరించబడిన అరబిక్ లిపిలో వ్రాయబడి రెండు భాషలను సంశ్లేషణ చేసింది. తమిళనాడులోని అరబిక్ సెటిలర్లు అరబిక్ లిపి ద్వారా తమిళం నేర్చుకోవడానికి సహాయపడింది. ఈ భాష వారి వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఖాతాలను వ్రాయడంలో సహాయపడింది. ఈ లింక్ భాష ఫలితంగా అరబ్ ముస్లిం వ్యాపారులు మరియు స్థానిక తమిళులు ఇస్లాంలోకి మారారు. అర్వీ భాష మరియు సాహిత్యం ఇస్లామిక్ బోధనలు మరియు అభ్యాసానికి ఒక రకమైన వేదికను అందించాయి. ఎడ్గార్డ్ థర్స్టన్ మాటలలో, అరబ్-తమిళం అరబ్ పూర్వీకుల తమిళ ముస్లింల ప్రయోజనం కోసం అభివృద్ధి చేయబడిన భాష. నేటికీ అనేక మత పాఠశాలలు (మదరసాలు) తమ పాఠ్యాంశాల్లో భాగంగా ఆర్వీ భాషను బోధిస్తాయి. ‘సిమ్టస్ సిబియాన్’ (యువకులకు మార్గదర్శకం) వంటి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ తమిళనాడులోని పుస్తక దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆధునిక ప్రింటింగ్ ప్రెస్ రావడం ఆర్వీ భాష వ్యాప్తికి ముగింపు పలికింది.
అరబ్ పూర్వీకుల తమిళ ముస్లింల పతనం Fall of Tamil
Muslims of Arab Ancestry :
పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వంటి యూరోపియన్ వ్యాపారులు హిందూ మహాసముద్ర
ప్రాంతంలోకి వచ్చిన తర్వాత 15వ శతాబ్దంలో వర్తక వాణిజ్యంపై అరబ్
ముస్లిం గుత్తాధిపత్యం క్షీణించింది. యూరోపియన్ నావికుల నుండి గట్టి పోటీ మరియు
కొత్త షిప్పింగ్ సాంకేతికత మరియు ఆధునిక వాణిజ్య పద్ధతులను అవలంబించడానికి
ఇష్టపడకపోవటం వలన అరబ్ ముస్లిం వర్తక సంఘం యొక్క శక్తి క్షీణించింది.
మొదటగా పోర్చుగీస్ వారు వచ్చారు, తరువాత డచ్ వారు
ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయులు వచ్చారు. ఐరోపా వ్యాపారులు తమ సైనిక బలం మరియు రాజకీయ
పలుకుబడి ఆధారంగా గుత్తాధిపత్య వ్యవస్థను మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను
ప్రవేశపెట్టారు. స్థానిక పాలకులు, (హిందూ మరియు ముస్లిం ఇద్దరూ) సముద్ర
వాణిజ్యం పట్ల ఉదాసీనంగా ఉన్నారు. సముద్ర వాణిజ్య కార్యకలాపాలలో వారికి సమయం లేదా
ఆసక్తి లేదు. వాణిజ్య మార్గాలను అన్వేషించడానికి లేదా సముద్ర వాణిజ్యాన్ని
ఆరోగ్యకరమైన మార్గాల్లో వృద్ధి చేయడానికి వారు ఎటువంటి ప్రయత్నం చేయలేదు.
భారతీయ పాలకులు
స్థానిక ముస్లిం వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి బదులు పోర్చుగీసు వారికి అన్ని
సౌకర్యాలు కల్పించి వారిని తమ ఓడరేవులకు
ఆహ్వానించారు. భారత పాలకులు పోర్చుగీసు వారికి సుగంధ ద్రవ్యాలు,
బంగారం
మరియు వెండి వ్యాపారం చేయడానికి గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు. పోర్చుగీసువారు 1537
నాటికి అణగారిన హిందూ మత్స్యకార సమాజమైన పరవాస్‌ను క్రైస్తవ మతంలోకి మార్చారు. ఒకప్పుడు
ముత్యాల వ్యాపారం పూర్తిగా ముస్లింల చేతుల్లో ఉంది అది ఇప్పుడు పరవుల చేతుల్లోకి
వెళ్ళింది. తమిళ ముస్లింలు 1530
నాటికి గుర్రపు వ్యాపారంపై తమ గుత్తాధిపత్యాన్ని పోర్చుగీసు వారికీ కోల్పోయారు. .
బ్రిటిష్ వారు
తమిళనాడులోని కరైకుడి చెందిన హిందూ వ్యాపారుల సంఘం చెట్టియార్లకు మద్దతు ఇచ్చారు.
తమిళనాడు ముస్లిం వ్యాపారులను మరింత బలహీనపరిచేందుకు ఇది ఒక క్రమపద్ధతిలో
జరిగింది. చెట్టియార్లు బ్రిటీష్ వారి భారతీయ విజయానికి తమ డబ్బుతో మద్దతు
ఇచ్చారు. ఫలితంగా, కోరమాండల్ తీరం మరియు
ఆగ్నేయాసియాలో ఆర్థిక రంగంలో చెట్టియార్ల ఉనికి పెరిగింది,
తమిళ
ముస్లింల ఉనికి క్షీణించింది.
తమిళనాడులో ముస్లింల
ప్రస్తుత స్థితి:
తమిళనాడులో ముస్లిం
జనాభా 6
శాతం. ఉర్దూ ముస్లింలలో అత్యధికులు అంబూర్ మరియు వాణియంబాడి వంటి వేలూరు జిల్లాలలో
కేంద్రీకృతమై ఉన్నారు. ఉత్తర ఆర్కాట్ జిల్లా మరియు ప్రస్తుత వేలూరు జిల్లాలో,
ముస్లిములు సొంత తోలు టానరిస్ కలిగి తోలు
వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు.
ఉత్తర తమిళనాడు
ముస్లింలు మరియు రాష్ట్రంలోని దక్షిణాది ముస్లింల మధ్య స్పష్టమైన విభజన ఉంది.
దక్షిణాది జిల్లాల్లో రామనాథపురం, పుదుక్కోట్టై,
తిరునల్వేలి,
నాగపట్నం
పులికాట్,
కిలక్కరై,
కాయల్పట్టణం
మొదలైన జిల్లాలు మరియు ప్రాంతాలలో ముస్లింలు కేంద్రీకృతమై ఉన్నారు.
దక్షిణ తమిళనాడులోని
తమిళ ముస్లింలు పత్తి తయారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు మరియు ఈ జిల్లాల్లో కాటన్
స్పిన్నింగ్ మరియు వీవింగ్ వారి ప్రధాన వాణిజ్య
పద్ధతి. దక్షిణ తమిళనాడులోని నాగోర్, కాయల్‌పటానం,
కిలక్‌కరై
మరియు అదిరంపట్నం వంటి పట్టణాలు ముస్లిం సమాజంలో సంపద ఉత్పత్తికి కేంద్రాలుగా
మారాయి. ఈ ప్రదేశాలలో కొన్ని ఇస్లామిక్ బోధన మరియు అభ్యాస కేంద్రాలుగా కూడా
ఉద్భవించాయి.
తమిళ ముస్లింలు తమిళ
సంస్కృతి మరియు సమాజానికి తమ వంతు సహకారం అందించారు. వారి మర్యాదలు,
ఆచారాలు,
దుస్తులు,
ఆహారం
మరియు పండుగలు ఇస్లాం మరియు తమిళ భాష మరియు సంస్కృతిచే ప్రభావితమయ్యాయి. తమిళం
మరియు ఇస్లాం యొక్క నిజమైన సంశ్లేషణ/కలయిక తమిళనాడులో చూడవచ్చు.
విభిన్న జాతులు మరియు
మతాలు మరియు భాషల ప్రజలను సమానంగా గౌరవించే సమ్మిళిత సమాజానికి తమిళనాడు చాలా మంచి
ఉదాహరణ. మత సామరస్యం పరంగా, తమిళనాడు అనేది
భారతదేశంలోని ఒయాసిస్, ఇక్కడ బిన్న వర్గాల
మధ్య మత సహనం బోధించబడుతుంది మరియు మత సహనం నిజమైన అర్థంలో ఆచరించబడుతుంది.
No comments:
Post a Comment