22 July 2022

అఖిల భారత కాంగ్రెస్ ఏర్పాటు మరియు స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిముల సహకారం Muslims and their contribution to the formation of Congress and freedom struggle

 




భారత స్వతంత్ర ఉద్యమ సమయం లో భారతదేశంలోని ప్రజలందరూ, మతాలతో సంబంధం లేకుండా భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి సంపూర్ణం గా సహకరించారు.

భారతదేశం బహుళత్వం లో ఏకత్వం  కలిగి ఉంది.  మన నాయకులు స్వాతంత్ర్య ఉద్యమ సమయం లో  భారతీయ ప్రజల, ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింల ఐక్యత యొక్క ప్రాముఖ్యతను గ్రహించారు. స్వాతంత్ర్య సమరయోధుల నినాదాలలో ఒకటి దీన్ ధరమ్ హమారా హజబ్, యే ఇసాయ్ (ఈ బ్రిటిష్ వారు) , కహాన్ సే ఆయ్ (ఇస్లాం మరియు హిందూయిజం మన మతాలు, ఈ బ్రిటిష్ వారు ఎక్కడ నుండి వచ్చారు)?

భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ముస్లింలు కూడా ఉత్సాహంగా స్పందించారు.

సర్ సయ్యద్ హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా పనిచేశారు  మరియు హిందువులు మరియు ముస్లింలను భారతదేశపు రెండు కళ్ళుగా అభివర్ణించారు.

బాంబే కోర్టు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బద్రుద్దీన్ త్యాబ్జీ వంటి ఇతరులు కాంగ్రెస్ ముంబై సెషన్‌లో 300 మంది ముస్లిం ప్రతినిధులతో కలిసి ఉత్సాహంగా చేరారు. బద్రుద్దీన్ త్యాబ్జీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు.

భారత ముస్లిం ప్రజలు ఏర్పాటును ఉత్సాహంగా స్వాగతించారు మరియు భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ ప్రయత్నాలన్నిటికీ సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

ముస్లింల నుండి భారత జాతీయ కాంగ్రెస్‌కు అత్యంత ఉత్సాహభరితమైన మద్దతు దేవబంద్ స్కూల్‌లోని ఆర్థడాక్స్ ఉలమా నుండి రావడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఉలమాలు పాల్గొని గొప్ప త్యాగాలు చేసారు మరియు వారిలో వందల మంది కాలాపాని అని పిలిచే అండమాన్-నికోబార్‌కు బహిష్కరించబడ్డారు మరియు చాలా మంది ఇటలీకి దక్షిణాన ఉన్న ద్వీపమైన మాల్టాకు బహిష్కరించబడ్డారు.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన తర్వాత, దారుల్ ఉలుమ్ దేవబంద్ వ్యవస్థాపకుడు, మౌలానా ఖాసిం అహ్మద్ నానోత్వి, స్వయంగా ప్రముఖ అలీమ్, ముస్లింలను భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాలని మరియు బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమివేయాలని కోరుతూ ఫత్వా జారీ చేశాడు. మౌలానా ఖాసిం అహ్మద్ నానోత్వి ఫత్వా జారీ చేయడమే కాకుండా అలాంటి వంద ఫత్వాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురించాడు మరియు స్వాతంత్ర్య సమరయోధుల సహాయం కోసం దానికి “నుస్రత్ అల్-అహ్రార్” అని పేరు పెట్టాడు. ఈ ఉలమాలు బహుజన నాయకులు మరియు విదేశీ పాలకులను భారత దేశం  నుండు తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు.

భారతదేశంలోని ఇతరులకు తిరుగుబాటు కోసం సందేశాలు పంపడం ద్వారా హిందువులు మరియు ముస్లింలు బ్రిటీషర్లను ఓడించడానికి పన్నిన రేష్మీ రుమాల్ కుట్ర (అనగా సిల్క్ రుమాల్  కుట్ర) లో మరొక ప్రముఖ అలీమ్ మౌలానా మహ్మదుల్ హసన్ పాల్గొన్నారు. మౌలానా మహ్మదుల్ హసన్‌తో పాటు అనేక ఇతర ఉలామాలు మరియు సాధారణ ముస్లింలు ఈ 'కుట్ర'లో పాల్గొన్నారు.

భారతదేశం యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం గొప్ప త్యాగాలు చేసిన మరొక గొప్ప మేధావి మరియు కవి మౌలానా హస్రత్ మోహనీ, ప్రముఖ ఉర్దూ కవి మరియు గొప్ప విప్లవకారుడు. 'స్వేచ్ఛ నా జన్మ హక్కు' అని నినాదాలు చేసిన బాలగంగాధర తిలక్‌కి మౌలానా గొప్ప అభిమాని. మౌలానా హస్రత్ మోహనీ 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకడు.

మౌలానా హస్రత్ మోహనీ కు భారత స్వతంత్ర ఉద్యమం లో అనేకసార్లు కఠిన కారాగార శిక్ష విధించబడింది.  మే నెలలో(మండు వేసవి లో ) ఒక మౌండ్ (40 కిలోలు) ముడి ధాన్యాలు రుబ్బడం వంటి కఠినమైన శిక్షలు విధించబడ్డాయి. కానీ మౌలానా ఎన్నడూ లొంగలేదు. భారతదేశం యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యం పట్ల మౌలానా వైఖరి దృడమైనది.భారత దేశ సంపూర్ణ స్వేచ్ఛ కోసం మౌలానా తిరుగులేని నిబద్ధత ప్రదర్శించాడు..

ఖిలాఫత్ ఉద్యమం లో లక్షలాది మంది ముస్లింలు పాలుపంచుకున్నారనేది వాస్తవం. అలీ బ్రదర్స్ అంటే మౌలానా మొహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ ఈ ఖిలాఫత్ ఉద్యమం యొక్క ప్రముఖ నాయకులు.. వారిద్దరూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. వారి తల్లి కూడా స్వాతంత్య్ర ఉద్యమానికి కృషి చేసింది. తన కుమారులు ముహమ్మద్ మరియు షౌకత్ అలీ జైలు నుండి బయటకు రావడానికి క్షమాపణలు చెప్పాలని ఆలోచిస్తున్నారనే పుకారు వారి తల్లి విన్నప్పుడు (అది పుకారు మాత్రమే) ఆమె, ఇలా అన్నారు. ఆ మే ఉన్కా దూద్ ముఆఫ్ నహిన్ కరుంగి) అంటే నేను చనిపోయే వరకు వారిని క్షమించను. మౌలానా ముహమ్మద్ అలీ తనను జెరూసలెంలో పాతిపెట్టు అని అన్నాడు, ఎందుకంటే అతను బానిస భారతదేశంలో చనిపోవాలని కోరుకోలేదు.

ఖిలాఫత్ ఉద్యమం సమయంలో కొంతమంది ముస్లింలు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడటానికి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు వలస వెళ్లడం ప్రారంభించారు. మౌలానా ఉబైదుల్లా సింధీ ఈ వలసల వెనుక ప్రధాన ప్రేరణ మరియు ఉబైదుల్లా సింధీ కాబోల్ లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. రాజా మహీంద్ర ప్రతాప్ నాయకత్వంలో రిపబ్లిక్ ఆఫ్ ఫ్రీ ఇండియా అధ్యక్షుడిగా, మౌలానా ఉబైదుల్లా సింధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రిటీష్ ఒత్తిడిలో ఆఫ్ఘనిస్తాన్ రాజు వారిని వెళ్ళగొట్టడం తో వేలాది మంది మరణించారు. భారతదేశ స్వాతంత్ర్యం పట్ల ముస్లిం ప్రజల ఉత్సాహం అలాంటిది.

స్వాతంత్ర్య ఉద్యమానికి మరో ఆకర్షణీయమైన వ్యక్తి మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ. ఇతను భారత దేశ  విభజనను వ్యతిరేకించాడు మరియు “ముత్తాహిదా ఖౌమియాత్ ఔర్ ఇస్లాం” అంటే మిశ్రమ జాతీయవాదం మరియు ఇస్లాం అనే పుస్తకాన్ని రాశాడు. అతను జిన్నా యొక్క రెండు దేశాల సిద్ధాంతాన్ని కూడా సవాలు చేశాడు మరియు రెండు దేశాల సిద్ధాంతానికి ఇస్లామిక్ అనుమతి లేదని దివ్య ఖురాన్ మరియు హదీసుల భోధనల  నుండి నిరూపించాడు. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి “జామియాత్ అల్-ఉలమా-ఎ-హింద్” అనువదించారు.

భారతదేశ స్వాతంత్ర్యం కోసం మౌలానా ఆజాద్ మరియు సర్హాదీ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చేసిన సేవలను ఎవరు మరచిపోగలరు. మౌలానా ఆజాద్ మరియు సర్హాదీ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇద్దరూ తుది శ్వాస విడిచే వరకు భారత స్వాతంత్య్రానికి కట్టుబడి ఉన్నారు. నెహ్రూ మరియు సర్దార్ పటేల్ వంటి నాయకులు దేశ విభజనను అంగీకరించినప్పటికీ, CWCలో దేశ విభజనతో ఎప్పుడూ రాజీపడని ఏకైక నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మాత్రమే. మౌలానా ఆజాద్ అత్యుత్తమమైన భారత నాయకులలో ఒకరు.

ఈ ముస్లిం నాయకులు మన స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మెరుగైన శ్రద్ధకు అర్హులు. హిందూ-ముస్లింల ఐక్యత జాతీయ సమైక్యత కు గొప్పగా ఉపయోగపడుతుంది.

 

No comments:

Post a Comment