22 July 2022

మహ్మద్ షకీల్ Mohammad Shakeel1927-2007 ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త

 


ముహమ్మద్  షకీల్ భారతదేశంలోని లక్నో నగరానికి చెందిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, ఉర్దూ నవలా రచయిత, ట్రేడ్ యూనియన్ కార్యకర్త మరియు కార్మిక న్యాయవాది.

ప్రసిద్ధ వైద్యుల అజీజీ కుటుంబంలో జన్మించిన ముహమ్మద్ షకీల్,  హకీమ్ అబ్దుల్ అజీజ్ మనవడు. ముహమ్మద్ షకీల్ రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.

1927 జూలై 21న లక్నో లో జన్మించిన షకీల్ తన యవ్వనంలో భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు  మరియు 14 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ వారిచే జైలులో నిర్భందించబడినాడు. 21 రోజుల తర్వాత విడుదలైనప్పటికీ, ఆవేశపూరిత ప్రసంగాలు చేసినందుకు సంవత్సరాల తరబడి అనేకసార్లు అరెస్టు చేయబడ్డాడు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత,మొహమ్మద్  షకీల్ ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరారు మరియు జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా మరియు ఆచార్య కృప్లానీలకు సహచరుడిగా ఉన్నారు. షకీల్ భార్య, బేగం అక్తర్ జెహాన్ స్వయంగా ప్రఖ్యాత విద్యావేత్త మరియు కాశ్మీరీ మొహల్లా బాలికల పాఠశాల ప్రిన్సిపాల్.

1960లో, షకీల్ మొదటి లక్నో మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు మరియు సామాజిక సేవ చేస్తూ  లక్నోలో నఖాస్ మరియు ప్రతాప్ మార్కెట్‌లను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినాడు..

మొహమ్మద్ షకీల్ ప్రజా సోషలిస్ట్ పార్టీ రద్దు తర్వాత, షకీల్ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు మరియు 1974–1979 వరకు యు.పి.అసెంబ్లీ కి లక్నో పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.

మొహమ్మద్ షకీల్ తన కెరీర్‌లో రైతులు మరియు ట్రేడ్ యూనియన్‌ల కోసం కార్మిక కేసులను వాదిస్తూనే ఉన్నాడు.మొహమ్మద్ షకీల్ భారతీయ ఖాద్య నిగమ్ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 1976లో, ఉత్తరప్రదేశ్‌లోని న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వ సహకార సంఘాలకు కాంట్రాక్టు కార్మికుల విధానం రద్దు చేయడంలో కీలకపాత్ర పోషించారు.

షకీల్ కవి, సాహిత్య కారుడు. ఉర్దూ కవిత్వం మరియు సాహిత్యంలో షకీల్ రచనలను “కితాబి దునియా” వారు ప్రచురించారు. 2011లో, లక్నోకు షకీల్ చేసిన అపారమైన కృషిని గుర్తిస్తూ, ఓల్డ్ సిటీలో షకీల్ పేరు మీద ఒక రహదారికి పేరు పెట్టారు.

షకీల్ కు 3గురు పిల్లలు కలరు. షకీల్ నివాసం అక్బరీ గేట్, లక్నోలో కలదు.

షకీల్ 24 డిసెంబర్ 2007న లక్నోలో మరణించారు. అతని సమాధి స్థలం లక్నో లో కలదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment